Hindu temple vandalised
-
కెనడాలో టెంపుల్‌పై దాడి.. ఖలిస్తానీ నిరసన నిర్వాహకుడు అరెస్ట్
కెనడాలోని గ్రేటర్ టొరంటో ఏరియా (GTA)లో గత ఆదివారం హిందూ టెంపుల్‌పై జరిగిన దాడికి సంబంధించిన కేసులో ఖలిస్తానీ నిరసనల ప్రధాన నిర్వాహకుడు ఇందర్జీత్ గోసల్ పోలీసులు అరెస్టు చేశారు. బ్రాంప్టన్‌లోని హిందూ దేవాలయంపై హింసాత్మక దాడికి సంబంధించి శుక్రవారం అతన్ని అరెస్టు చేసి అభియోగాలు నమోదు చేసినట్లు పీల్ రీజినల్ పోలీసులు(PRP) వెల్లడించారు. నిందితుడు ఖలీస్తానీ వేర్పాటువాద గ్రూప్‌కు సంబంధించిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. అయితే.. అరెస్ట్ చేసిన అనంతరం అతన్ని షరతులపై విడుదల చేశామని తెలిపారు. బ్రాంప్టన్‌లోని అంటారియో కోర్ట్ ఆఫ్ జస్టిస్‌లో ముందస్తుగా పేర్కొన్న తేదీన హాజరుకావలసి ఉంటుందని అతనికి తెలియజేశారు. మరోవైపు.. టెంపుల్‌పై దాడి జరిగిన అనంతరం.. నవంబర్ 3, 4 తేదీల నుంచి చోటుచేసుకున్న సంఘటనలను పరిశీలించడానికి పోలీసులు.. ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు చేసి నిందితులను గుర్తించి అరెస్టు చేస్తామని పోలీసులు చెప్పారు. నవంబర్ 3న బ్రాంప్టన్‌లోని హిందూ సభ మందిర్‌పై జరిగిన దాడిపై ఇండో-కెనడియన్ సమాజం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఈ దాడిని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కెనడా అధ్యక్షుడు జస్టిస్ ట్రూడో, కెనడా ప్రతిపక్ష నాయకుడు పియరీ పోయిలీవ్రే తీవ్రంగా ఖండించిన విషయం తెలిసిందే.Glad that @PeelPolice has finally charged Khalistani extremist Inderjeet Gosal of Brampton for assault with a weapon. He was arrested yesterday but released on conditions. We urge @PeelPolice to also arrest / charge other accomplices of Gosal and their operators who are behind… pic.twitter.com/nBGKt4EjcT— VHP Canada (@vhpcanada) November 10, 2024ఎవరీ ఇందర్జీత్ గోసల్?ఇందర్జీత్ గోసల్‌కు సిక్కు ఫర్ జస్టిస్ (SFJ) జనరల్ కౌన్సెల్ గురుపత్వంత్ పన్నూకు లెఫ్టినెంట్‌గా గుర్తింపు ఉంది. గతేడాది జూన్ 18న బ్రిటీష్ కొలంబియాలోని సర్రేలో హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యకు గురైన తర్వాత ప్రజాభిప్రాయ సేకరణకు కెనడియన్ ఆర్గనైజర్‌గా నియమించబడ్డాడు. కెనడియన్ పోలీసుల ప్రకారం.. ఖలిస్థానీ గ్రూప్ పేరుతో హింసాత్మక కార్యకలాపాలకు పాల్పడుతున్న 13 మంది కెనడియన్లలో గోసల్ కూడా ఉన్నట్లు తెలిపారు.చదవండి: ఉక్రెయిన్, పశ్చిమాసియాపై ఏం చేస్తారు? -
ఆస్ట్రేలియాలో వరుసగా హిందూ టెంపుల్స్ ధ్వంసం.. వారి పనేనా?
ఆస్ట్రేలియాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. బ్రిస్బేన్‌లో ఉన్న హిందూ దేవాలయంపై దాడి జరిగింది. శ్రీలక్ష్మీ నారాయణ ఆలయంపై దాడి సందర్భంగా ఆలయం గోడలు ధ్వంసమయ్యాయి. కాగా, తాజా ఘటనతో రెండు నెలల కాలంలో ఆస్ట్రేలియాలో నాలుగు హిందూ దేవాలయాలపై దాడులు జరిగాయి. వివరాల ప్రకారం.. దక్షిణ బ్రిస్బేన్‌లోని బుర్‌బ్యాంక్ శివారులో ఉన్న శ్రీలక్ష్మీ నారాయణ ఆలయంపై గుర్తు తెలియని వ్యక్తులు శుక్రవారం రాత్రి సమయంలో దాడికి పాల్పడ్డారు. కాగా, భక్తులు శనివారం ఉదయం గుడి వెళ్లడంతో దాడి జరిగిన విషయం తెలిసిందే. దీంతో, ఈ విషయాన్ని ఆలయ అధ్యక్షుడి దృష్టికి తీసుకెళ్లారు. అయితే, ఖలిస్థాన్ అనుకూల వాదులే ఈ దాడికి దిగినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇంతకుముందు కూడా బ్రిస్బేన్‌లోని గాయత్రి మందిర్‌పై దాడి చేస్తామంటూ పాకిస్తాన్‌లోని లాహోర్‌కు చెందిన ఖలిస్థాన్ తీవ్రవాదుల నుంచి వార్నింగ్ ఫోన్ కాల్స్ వచ్చాయి. ఈ సందర్భంగా ఆలయ అధ్యక్షుడు సాతిందర్ శుక్లా ఈ ఘటనపై స్పందించారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ.. ఆలయ పూజారి, భక్తులు ఈ ఉదయం తనకు ఫోన్ చేసి ఆలయ ప్రహరీపై జరిగిన దాడి గురించి చెప్పారు. ఈ ఘటనపై పోలీసు అధికారులతో ఆలయ మేనేజ్మెంట్ కమిటీ సమావేశం తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తాము అని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా.. ఇటీవల కాలంలో ఆస్ట్రేలియాలో హిందూ ఆలయాలపై వరుస దాడుల నేపథ్యంలో హిందూ హ్యూమన్ రైట్స్ డైరెక్టర్ సారా ఎల్ గేట్స్ స్పందించారు. అక్కడ నివసించే హిందువులను భయపెట్టేందుకు సిక్స్ ఫర్ జస్టిస్ చేస్తున్న పద్దతిలోనే దాడులు జరుగుతున్నాయని అన్నారు. వీలైనంత తొందరగా ఈ దాడులకు కారణమైన వారిని పట్టుకోవాలన్నారు. -
హిందూ ఆలయాల విధ్వంసంపై భారత్ ఫైర్
మెల్బోర్న్: ఆస్ట్రేలియాలో స్వల్ప వ్యవధిలో హిందూ ఆలయాలపై జరిగిన దాడులపై భారత్ తీవ్రంగా స్పందించింది. ఈ నెల మొదట్లో మెల్బోర్న్లోని స్వామినారాయణ్ ఆలయం, విక్టోరియా కర్రమ్ డౌన్స్‌లోని చారిత్రాత్మక శ్రీ శివ విష్ణు ఆలయం, మెల్బోర్న్లోని ఇస్కాన్ టెంపుల్‌పై దాడుదలు జరిగాయి. ఆలయాల గోడలపై భారత్‌కు, హిందు మతానికి వ్యతిరేకంగా రాతలను రాశారు. ఈ నేపథ్యంలో ఘటనలు జరిగి రోజులు గడుస్తున్నా దుండగులను పట్టుకోలేకపోవడంపై.. భారత్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ మేరకు కాన్‌బెర్రాలోని భారత హై కమిషన్ గురువారం ఒక ప్రకటనను విడుదల చేసింది. హిందూ ఆలయాలపై జరిగిన దాడులు, సంఘవిద్రోహ శక్తుల్ని కీర్తిస్తూ గీసిన గ్రాఫిటీల వ్యవహారం ఆందోళనకరంగా ఉందని.. ఈ దాడులను ముమ్మాటికీ కఠినంగా శిక్షించదగినదని సదరు ప్రకటనలో భారత హై కమిషన్ పేర్కొంది. అంతేకాదు ఈ చర్య.. ఇండో-ఆస్ట్రేలియన్ కమ్యూనిటీల మధ్య విద్వేషం రగిల్చేలా ఉందని పేర్కొంది. ఖలీస్థానీ అనుకూల శక్తులు ఆస్ట్రేలియాలో తమ కార్యకలాపాలను ఉధృతం చేశాయని, సిక్క్స్ ఫర్ జస్టిస్ లాంటి నిషేధిత ఉగ్ర సంస్థలు, ఇతర విద్వేషపూరిత సంస్థలతో కలిసి కుట్రలు పన్నుతున్నాయని అక్కడి ప్రభుత్వాన్ని భారత్ వారించింది. ఇప్పటికే ఆలస్యం అయ్యిందన్న కోణంలో.. దాడికి పాల్పడినవాళ్లను గుర్తించి, తగ్గ కఠిన శిక్షలు విధించాలని.. తద్వారా మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కావనే ఆకాంక్ష వెలువరించింది భారత హై కమిషన్ ప్రకటన పేర్కొంది. ఇదిలా ఉంటే.. న్యూఢిల్లీలోని ఆస్ట్రేలియా హై కమిషన్ ఈ వ్యవహారంపై బదులిచ్చింది. ప్రస్తుతం విషయం దర్యాప్తులో ఉందని వెల్లడించింది. భారత్‌లాగే.. ఆస్ట్రేలియా కూడా బహుళ సంప్రదయాల దేశమని, హిందూ ఆలయాల విధ్వంసం తమనూ దిగ్భ్రాంతికి గురి చేసిందని భారత్‌లో ఆస్ట్రేలియా హై కమిషనర్ బ్యారీ ఓఫారెల్ తాజాగా ట్వీట్ కూడా చేశారు. -
Pakistan: పాకిస్తానీల అరాచకం.. ఆలయంలో విగ్రహాలు ధ్వంసం
Hindu Temple Vandalised in Karachi: దాయాది దేశం పాకిస్తాన్లో హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయి. ఇటీవల ఇండస్ నది సమీపంలో ఉన్న ఓ చరిత్రాత్మక ఆలయాన్ని పాకిస్తానీలు ధ్వంసం చేసిన ఘటన మరువకముందే మరో ఆలయం ధ్వంసమైంది. వివరాల ప్రకారం.. కరాచీలోని కోరాంగి ప్రాంతంలో ఉన్న శ్రీ మారి మాతా మందిరంలోని విగ్రహాన్ని కొందరు దుండగులు ధ్వంసం చేశారు. ఆలయంలోని విగ్రహాలను ధ్వంసం చేసి పరారయ్యారు. ఆరు నుంచి ఎనిమిది మంది దుండగులు బైక్స్‌పై వచ్చి ఈ దుశ్చర్యకు పాల్పడ్డారని స్థానికులు తెలిపారు. ఆలయ ధ్వంసం ఘటనతో స్థానిక హిందువుల్లో భయాందోళనలు చెలరేగినట్లు ఓ పత్రిక తెలిపింది. ఇక, ఆలయ ధ్వంసం ఘటన తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు ఆలయం వద్ద భద్రతను కట్టుదిట్టం చేసినట్టు తెలిపారు. ఇక, పరారీలో ఉన్న నిందితులపై కేసు నమోదు చేసినట్టు పోలీసులు వెల్లడించారు. మరోవైపు.. పాకిస్తాన్లో ఆలయాలపై దాడి జరగడం ఇది తొలిసారి కాదు. ఇదివరకు ఎన్నో చారిత్రాత్మక ఆలయాలపై దాడులు జరిగాయి. గతేడాది అక్టోబర్‌లో కోట్రీ ప్రాంతంలోని ఓ పురాతన ఆలయాన్ని ధ్వంసం చేశారు. Once again #MinoritiesTargeted in #Pakistan. ncident of vandalism against places of worship of the #Hindu community in #Pakistan, the statues of deities at Shri Mari Maata in #Karachi’s Korangi area is attacked.#AntiPakistanARY #BabarAzam𓃵 #DuaZehra #MandirVandalised #TeJran pic.twitter.com/YYSChPdFke — Anu Radha (@anu_financial) June 9, 2022 -
మతం పేరుతో హింసకు పాల్పడే వారిపై తక్షణమే చర్యలు
ఢాకా: దేశంలో మతాన్ని అడ్డుపెట్టుకుని హింసకు పాల్పడేవారిపై తక్షణం చర్యలు తీసుకోవాల్సిందిగా బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా మంగళ వారం హోం మంత్రిని ఆదేశించారు. సామాజిక మాధ్యమాల్లో వచ్చే ఏ విషయాన్నైనా నిజానిజాలు తెలుసుకోకుండా నమ్మవద్దని ప్రజలను ఆమె కోరారు. గత బుధవారం దుర్గాపూజల సంద ర్భంగా దైవదూషణ జరిగిందంటూ సామాజిక మాధ్యమాల్లో వచ్చిన పోస్టింగ్‌ల ప్రభావంతో హిందువుల ఆలయాలపై ప్రారంభమైన దాడులు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో మంగళవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ప్రధాని హసీనా పరిస్థితులను సమీక్షించారు. మతపరమైన హింసకు పాల్పడే వారిపై తక్షణం చర్యలు తీసుకోవాలని హోం మంత్రి అసదుజ్జమాన్ ఖాన్‌ను ఈ సందర్భంగా హసీనా ఆదేశించారు. కాగా, బంగ్లాదేశ్‌లో హిందువులపై కొనసాగుతున్న దాడులపై ప్రముఖ రచయిత్రి తస్లీమా నస్రీన్ ఆవేదన వ్యక్తం చేశారు. బంగ్లాదేశ్ జిహాదీస్తాన్గా మారిపోయిందని ఆమె మంగళవారం పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. -
హిందూ దేవాలయం ధ్వంసం
ఇస్లామాబాద్: పాకిస్తాన్‌లోని సింధ్ ప్రావిన్స్‌లో కొందరు గుర్తు తెలియని దుండగులు హిందూ దేవాలయాన్ని ధ్వంసం చేశారు. ఆలయంలోని విగ్రహాలను, పవిత్ర గ్రంథాలకు నిప్పంటించారు. ఈ ఘటనపై ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దుశ్చర్యకు పాల్పడిన వారిపై కఠిన చర్యలకు ఆదేశించారు. ఖైర్పూర్ జిల్లాలోని కుంబ్‌లో గత వారం ఈ ఘటన జరిగింది. అయితే పాక్ ప్రధాని ఇమ్రాన్ ట్విటర్ వేదికగా ఈ ఘటనపై స్పందించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రావిన్స్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇవి ఖురాన్‌కు పూర్తి వ్యతిరేకమైన చర్యలన్నారు. ఇప్పటికే ఆలయం ధ్వంసమైన కేసులో అక్కడి హిందూ సమాజం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత నిరసన ర్యాలీ కూడా నిర్వహించారు. హిందూ దేవాలయాల సంరక్షణ కోసం స్పెషల్ టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేయాలని పాకిస్తాన్ హిందూ కౌన్సిల్ అడ్వైజర్ రాజేష్ కుమార్ హర్దాసాని డిమాండ్ చేశారు. గుడిపై దాడి చేసిన వారి కోసం వెతుకుతున్నామని, ఇప్పటివరకు ఎవరినీ అరెస్టు చేయలేదని పోలీసులు తెలిపారు. 22 కోట్ల పాకిస్తాన్ జనాభాలో హిందువులు రెండు శాతం ఉన్నారు. అందులో ఈ సింధ్ ప్రావిన్స్‌లోనే ఎక్కువ మంది ఉన్నారు. -
అమెరికాలో మరో హిందూ దేవాలయంపై దాడి
వాషింగ్టన్: అమెరికాలో మరో హిందూ దేవాలయంపై దాడి జరిగింది. ఉత్తర టెక్సాస్ లోని ఓల్డ్ లేక్ హైల్యాండ్స్ లో కొలువై ఉన్న హిందూ దేవాలయంపై కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆ దుండగులు హిందూ దేవాలయంపై దాడి చేయడమే కాకుండా అసభ్యకరమైన ఫోటోలను అతికించారు. దీనిపై దేవాలయ బోర్డులో పని చేస్తున్న కృష్ణ సింగ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయం తమ దృష్టికి గత సోమవారం వచ్చినట్లు పేర్కొన్నారు. ఈ తరహా సంఘటన నిజంగా బాధాకరమని తెలిపారు. ఇది మొత్తం ఒక జాతినే అవమానపరిచే చర్యగా ఆయన అభివర్ణించారు. కాగా, ఆ దుండుగుల కోసం డల్లాస్ పోలీసులు, డిటెక్టివ్ ఏజెన్సీలతో కలిసి గాలింపు చర్యలు చేపట్టారు. గత మూడు నెలల్లో అమెరికాలో హిందూ దేవాలయాలపై దాడి జరగడం మూడోసారి. ఇదే తరహా ఘటన గడిచిన ఫిబ్రవరి నెలలో సియాటెల్ ప్రాంతంలోని దేవాలయం జరిగిన సంగతి తెలిసిందే. -
అమెరికాలో హిందూ ఆలయంపై దాడి
న్యూయార్క్ : అమెరికాలోని ఓ హిందు దేవాలయంపై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. సియాటెల్ ప్రాంతంలోని దేవాలయంపై దాడికి పాల్పడిన దుండగులు ఆలయం గోడపై అనుచిత వ్యాఖ్యలు రాశారు. ఆలయం గోడపై స్వస్తిక్ గుర్తు తో పాటు ' గెట్ అవుట్' అన్న రాతలు కనిపించాయి. గత రెండు దశాబ్దాలుగా అతి పెద్ద దేవాలయంగా వెలుగొందుతున్న దేవాలయంపై దాడి జరగడం సంచలనం సృష్టించింది. కాగా దేవాలయ బోర్డ్ ఛైర్మన్ నిత్య నిరంజన్ ఈ దాడిని ఖండిచారు. ఇటువంటి సంఘటన జరిగి ఉండాల్సింది కాదని, వెళ్లిపొమ్మని చెప్పడానికి వాళ్లెవరు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. శివరాత్రి పర్వదినం సందర్శంగా ఇలాంటి సంఘటన జరగడం దురదృష్టకరమన్నారు. రెండుదశాబ్దాలుగా ఈ దేవాలయం ఉందని, గతంలో ఇలాంటి రాతలను తాము గమనించినా ఎవరికీ ఫిర్యాదు చేయలేదని తెలిపారు. మరోవైపు ది హిందూ అమెరికన్ ఫౌండేషన్ కూడా ఈ దాడిని ఖండించింది. దీనిపై సమ్రగ దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేసింది.