Hindu Temple Vandalised in Karachi: దాయాది దేశం పాకిస్తాన్‌లో హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయి. ఇటీవల ఇండస్ నది సమీపంలో ఉన్న ఓ చరిత్రాత్మక ఆలయాన్ని పాకిస్తానీలు ధ్వంసం చేసిన ఘటన మరువకముందే మరో ఆలయం ధ్వంసమైంది.
వివరాల ప్రకారం.. కరాచీలోని కోరాంగి ప్రాంతంలో ఉన్న శ్రీ మారి మాతా మందిరంలోని విగ్రహాన్ని కొందరు దుండగులు ధ్వంసం చేశారు. ఆలయంలోని విగ్రహాలను ధ్వంసం చేసి పరారయ్యారు. ఆరు నుంచి ఎనిమిది మంది దుండగులు బైక్స్పై వచ్చి ఈ దుశ్చర్యకు పాల్పడ్డారని స్థానికులు తెలిపారు. ఆలయ ధ్వంసం ఘటనతో స్థానిక హిందువుల్లో భయాందోళనలు చెలరేగినట్లు ఓ పత్రిక తెలిపింది.
ఇక, ఆలయ ధ్వంసం ఘటన తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు ఆలయం వద్ద భద్రతను కట్టుదిట్టం చేసినట్టు తెలిపారు. ఇక, పరారీలో ఉన్న నిందితులపై కేసు నమోదు చేసినట్టు పోలీసులు వెల్లడించారు. మరోవైపు.. పాకిస్తాన్‌లో ఆలయాలపై దాడి జరగడం ఇది తొలిసారి కాదు. ఇదివరకు ఎన్నో చారిత్రాత్మక ఆలయాలపై దాడులు జరిగాయి. గతేడాది అక్టోబర్‌లో కోట్రీ ప్రాంతంలోని ఓ పురాతన ఆలయాన్ని ధ్వంసం చేశారు.
Once again #MinoritiesTargeted in #Pakistan. ncident of vandalism against places of worship of the #Hindu community in #Pakistan, the statues of deities at Shri Mari Maata in #Karachi’s Korangi area is attacked.#AntiPakistanARY #BabarAzam𓃵 #DuaZehra #MandirVandalised #TeJran pic.twitter.com/YYSChPdFke
— Anu Radha (@anu_financial) June 9, 2022
Comments
Please login to add a commentAdd a comment