ఢాకా: దేశంలో మతాన్ని అడ్డుపెట్టుకుని హింసకు పాల్పడేవారిపై తక్షణం చర్యలు తీసుకోవాల్సిందిగా బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా మంగళ వారం హోం మంత్రిని ఆదేశించారు. సామాజిక మాధ్యమాల్లో వచ్చే ఏ విషయాన్నైనా నిజానిజాలు తెలుసుకోకుండా నమ్మవద్దని ప్రజలను ఆమె కోరారు. గత బుధవారం దుర్గాపూజల సంద ర్భంగా దైవదూషణ జరిగిందంటూ సామాజిక మాధ్యమాల్లో వచ్చిన పోస్టింగ్‌ల ప్రభావంతో హిందువుల ఆలయాలపై ప్రారంభమైన దాడులు ఇప్పటికీ కొనసాగుతున్నాయి.
ఈ నేపథ్యంలో మంగళవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ప్రధాని హసీనా పరిస్థితులను సమీక్షించారు. మతపరమైన హింసకు పాల్పడే వారిపై తక్షణం చర్యలు తీసుకోవాలని హోం మంత్రి అసదుజ్జమాన్ ఖాన్‌ను ఈ సందర్భంగా హసీనా ఆదేశించారు. కాగా, బంగ్లాదేశ్‌లో హిందువులపై కొనసాగుతున్న దాడులపై ప్రముఖ రచయిత్రి తస్లీమా నస్రీన్ ఆవేదన వ్యక్తం చేశారు. బంగ్లాదేశ్ జిహాదీస్తాన్‌గా మారిపోయిందని ఆమె మంగళవారం పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment