అమెరికాలో హిందూ ఆలయంపై దాడి | A Hindu temple has been vandalised in america | Sakshi
Sakshi News home page

అమెరికాలో హిందూ ఆలయంపై దాడి

Published Tue, Feb 17 2015 11:56 AM | Last Updated on Fri, Aug 24 2018 7:24 PM

అమెరికాలో హిందూ ఆలయంపై దాడి - Sakshi

అమెరికాలో హిందూ ఆలయంపై దాడి

న్యూయార్క్ : అమెరికాలోని ఓ హిందు దేవాలయంపై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. సియాటెల్ ప్రాంతంలోని దేవాలయంపై దాడికి పాల్పడిన దుండగులు ఆలయం గోడపై అనుచిత వ్యాఖ్యలు రాశారు. ఆలయం గోడపై స్వస్తిక్ గుర్తు తో పాటు ' గెట్ అవుట్' అన్న రాతలు కనిపించాయి. గత రెండు దశాబ్దాలుగా అతి పెద్ద దేవాలయంగా వెలుగొందుతున్న దేవాలయంపై దాడి జరగడం  సంచలనం సృష్టించింది. 

కాగా దేవాలయ బోర్డ్  ఛైర్మన్ నిత్య నిరంజన్ ఈ దాడిని ఖండిచారు.  ఇటువంటి సంఘటన జరిగి ఉండాల్సింది కాదని, వెళ్లిపొమ్మని చెప్పడానికి వాళ్లెవరు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. శివరాత్రి  పర్వదినం సందర్శంగా ఇలాంటి సంఘటన జరగడం దురదృష్టకరమన్నారు. రెండుదశాబ్దాలుగా ఈ దేవాలయం ఉందని, గతంలో ఇలాంటి రాతలను తాము గమనించినా  ఎవరికీ ఫిర్యాదు చేయలేదని  తెలిపారు. మరోవైపు ది హిందూ అమెరికన్ ఫౌండేషన్ కూడా ఈ దాడిని ఖండించింది. దీనిపై సమ్రగ దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేసింది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement