
సాక్షి, హైదరాబాద్ : 2015 విశాఖ నకిలీ నోట్ల కేసులో ప్రధాన నిందితుడు మహ్మద్ అక్బర్ అలీని పోలీసులు అరెస్ట్ చేశారు. గత కొద్దికాలంగా అజ్ఞాతంలో ఉన్న అక్బర్‌ను ఎన్‌ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అస్సాంకు చెందిన మహ్మద్ అక్బర్ అలీ 2007లో బెంగళూరుకు వచ్చి స్థిరపడ్డాడు. పువ్వుల అమ్మే షాపులో పనిచేసుకునే అక్బర్! హకీమ్ అనే వ్యక్తి ద్వారా నకిలీ నోట్ల దందాలోకి దిగాడు. ఆ తర్వాత సొంతంగా ఒక గ్రూపును తయారుచేసుకుని దంగా చేసేవాడు.
2015 సంవత్సరంలో ఈ ముఠాకు చెందిన సద్దాం హశ్సేన్ అనే వ్యక్తి దొంగ నోట్లు తరలిస్తుండగా విశాఖపట్నంలో పట్టుబడ్డాడు. అతని వద్దనుంచి 5లక్షల నకిలీ నోట్లు స్వాధీనపరుచుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. దీంతో ఈ కేసులో అక్బర్ ప్రధాన నిందితుడని తేలింది. అయితే పోలీసులకు చిక్కకుండా తప్పించుకున్న అతడు అజ్ఞాతంలోకి వెళ్లాడు. అక్బర్ కోసం శ్రమించిన పోలీసులు అతని కదలికను పసిగట్టి పట్టుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment