‘కేఈని తక్షణమే పదవి నుంచి తొలగించాలి’ | ysrcp leaders comdemns cherukulapadu narayana reddy murder | Sakshi
Sakshi News home page

‘కేఈని తక్షణమే పదవి నుంచి తొలగించాలి’

Published Mon, May 22 2017 2:59 PM | Last Updated on Tue, Sep 5 2017 11:44 AM

ysrcp leaders comdemns cherukulapadu narayana reddy murder

విజయవాడ: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన  చెరకులపాడు నారాయణరెడ్డి హత్య ఘటనను వైఎస​ఆర్‌ సీపీ నేతలు వెలంపల్లి శ్రీనివాస్‌, పైలా సోమినాయుడు తీవ్రంగా ఖండించారు. వైఎస్‌ఆర్‌ సీపీ నేతలు సోమవారమిక్కడ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు మనవడి చేతికి బలపం ఇచ్చి టీడీపీ  రౌడీలకు కత్తులిచ్చారని ధ్వజమత్తారు. 132 జీవోలు జారీ చేసి టీడీపీ నేతలపై కేసులు ఎత్తేశారని అన్నారు.

నారాయణరెడ్డి హత్యకేసులో చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తిని ఏ-1 ముద్దాయిలుగా చేర్చాలని డిమాండ్‌ చేశారు. పూర్తిస్థాయిలో విచారణ జరగాలంటే కేఈని తక్షణమే పదవి నుంచి తొలగించాలన్నారు. కొంతమంది ఐపీఎస్‌ అధికారులు పచ్చ చొక్కాలు వేసుకుని పని చేస్తున్నారని, ప్రభుత్వాన్ని బర్తరఫ్‌ చేసి రాష్ట్రపతి పాలన విధిస్తే కానీ ఏపీలో హత్యాకాండ ఆగదని అన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement