paila sominayudu
-
భవానీ భక్తులపై కోవిడ్ ఎఫెక్ట్
సాక్షి, విజయవాడ: అమ్మవారి మాల ఎక్కడైతే స్వీకరిస్తారో అక్కడే దీక్ష విరమణ చేయాలని దుర్గగుడి ఈఓ సురేష్ బాబు భక్తులకు విజ్ఞప్తి చేశారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో నదీ స్నానానికి అనుమతి నిరాకరిస్తున్నట్లు తెలిపారు. కాగా కోవిడ్ నిబంధనల కారణంగా భవానీ దీక్షా విరమణకు వచ్చే భక్తులకు ఇంద్రకీలాద్రి కొండ చుట్టూ చేసే గిరి ప్రదక్షిణ బ్రేక్ పడింది. వైరస్ వ్యాప్తి కారణంగా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ఆలయ అధికారులు ప్రకటించారు. ఈ నేపథ్యంలో దుర్గగుడి చైర్మన్ పైలా సోమినాయుడు భవానీ దీక్షా విరమణ ఆన్లైన్ స్లాట్‌ను శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఈఓ సురేష్ బాబుతో కలిసి విలేకరులతో మాట్లాడిన ఆయన.. జనవరి 5 నుంచి 9 వరకు భవానీ దీక్షా విరమణకు పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. కోవిడ్ దృష్ట్యా భవానీ దీక్షకు వచ్చే భక్తులను రోజుకు పది వేల మందిని మాత్రమే అనుమతిస్తున్నామన్నారు. కొండ చుట్టూ గిరి ప్రదక్షణను రద్దు చేసినట్లు పేర్కొన్నారు. ‘‘దీక్షా విరమణ రోజుల్లో రోజుకు 9 వేల మందికి ఉచిత దర్శనం... 100 రూపాయల టిక్కెట్లు 1000 ఆన్లైన్లో అందుబాటులో ఉంచాం. ప్రతిభక్తుడు ఆన్లైన్లో స్లాట్ బుక్ చేసుకోవాల్సిందే. అమ్మవారి దర్శనానికి వచ్చే సమయంలో ఐడీ తప్పనిసరి. www.kanakadurgamma.org వెబ్సైట్లో టిక్కెట్లు పొందవచ్చు. దీక్షా విరమణ రోజుల్లో ఉదయం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు అమ్మవారి దర్శనం ఉంటుంది’’ అని స్పష్టం చేశారు. కాగా రేపు కార్తీక పౌర్ణమి సందర్భంగా అమ్మవారి ఆలయంలో కోటి దీపోత్సవ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో ఉదయం 6 గంటలకు ఆలయ సిబ్బందితో కలిసి ఆలయ అధికారులు అమ్మవారి గిరిప్రదక్షిణ చేయనున్నారు.(చదవండి: మూడు బ్యారేజీల నిర్మాణానికి త్వరలోనే టెండర్లు) -
‘ఆ మద్యానికి నాకు సంబంధం లేదు’
సాక్షి, విజయవాడ : దుర్గగుడి పాలకమండలి సభ్యురాలు చక్కా వెంకట నాగ వరలక్ష్మి కారులో మద్యం సీసాలు లభించడంతో జగ్గయ్యపేట పోలీసులు కేసు నమోదు చేసినట్లు పాలకమండలి ఛైర్మన్ పైలా సోమినాయుడు తెలిపారు. వరలక్ష్మికి చెందిన కారుకు దుర్గగుడి సభ్యురాలిగా నేమ్ బోర్డు ఉండటంతో నైతిక బాధ్యత వహించి ఆమె రాజీనామా చేశారని పేర్కొన్నారు. తన కారు డ్రైవరే ఈ ఘటనకు బాధ్యుడిని పేర్కొన్న వరలక్ష్మి పట్టుబడిన మద్యానికి తనకు సంబంధం లేదని అన్నారు. అయితే ఈ చర్యకు నైతిక బాధ్యత వహిస్తూ ఆమె రాజీనామా చేశారని పేర్కొన్నారు. దీనిపై చర్చించి వరలక్ష్మీ రాజీనామాను ఆమోదించినట్లు వెల్లడించారు. (‘ఆలయాలపై దాడులకు పాల్పడే వారిని వదలం’) ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం అవినీతికి ఆస్కారం లేకుండా పనిచేస్తోందని ఆయన తెలిపారు. ప్రభుత్వానికి చెడ్డపేరు రాకుండా, అమ్మవారి దేవస్థానం ప్రతిష్టను దెబ్బతీసేలా బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న వారు వ్యవహరించాల్సి ఉందని సూచించారు. ఈ కేసులో నిజానిజాలు తేలేంత వరకు దుర్గగుడి బాధ్యతలకు దూరంగా ఉంటానని వరలక్ష్మి తీసుకున్న నిర్ణయాన్ని ఆహ్వానిస్తున్నామన్నారు. (‘దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు.. 9 రోజులే’) -
‘ఆ స్థాయి మహేష్‌కు లేదు’
సాక్షి, విజయవాడ: మంత్రి వెలంపల్లి శ్రీనివాస్‌పై జనసేన నేత పోతిన మహేష్ చేసిన వ్యాఖ్యల్ని ఖండిస్తున్నామని దుర్గగుడి చైర్మన్ పైలా సోమినాయుడు, వైఎస్సార్సీపీ నేత కొనకళ్ల విద్యాధరరావు అన్నారు. దేవాలయాలు పునర్నిర్మాణం చేయలేదన్న మహేష్ వ్యాఖ్యల్లో అర్థం లేదని తోసిపుచ్చారు. టీడీపీ ప్రభుత్వం పుష్కరాలను అడ్డు పెట్టుకుని అనేక దోపిడీలకు పాల్పడిందని విమర్శించారు. టీడీపీ హయాంలో దేవాలయాలు కూల్చివేస్తుంటే బాబుతో దోస్తీ చేసిన పవన్ ఎందుకు నోరు మెదపలేదని ప్రశ్నించారు. చంద్రబాబు చేసిన తప్పులను ఈ ప్రభుత్వం సరిచేస్తోందని హితవు పలికారు. పైలా సోమినాయుడు, కొనకళ్ల విద్యాధరరావు శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ‘జిల్లాలోని దేవాలయాలకు ఏడాది కాలంలో రూ.15 కోట్లు ఇచ్చిన ఘనత వెలంపల్లికే దక్కుతుంది. అవగాన లేకుండా పోతిన మహేష్ మాట్లాడడం తగదు. శివస్వామిని విమర్శించే స్థాయి మహేష్ కు లేదు. కరోనా సమయంలో ప్రజలందరికీ కూరగాయలు, నిత్యావసరాలు పంపిణీ చేసిన వ్యక్తి వెలంపల్లి. వైఎస్సార్సీపీ నేతల వల్ల కరోనా వ్యాప్తి చెందుతుందని అసత్య ప్రేలాపనలు చేస్తున్నారు. గత టీడీపీ హయాంలో కూల్చివేసిన ఆలయాలను తిరిగి పునర్నిర్మాణం చేపట్టేందుకు సన్నాహాలు చేస్తున్నాం. ఆధారాలుంటే విమర్శలు చేయాలి తప్ప అవాకులు చవాకులు పేలితే సహించేది లేదు’అని వారు పేర్కొన్నారు. -
‘కేఈని తక్షణమే పదవి నుంచి తొలగించాలి’
విజయవాడ: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన చెరకులపాడు నారాయణరెడ్డి హత్య ఘటనను వైఎసఆర్ సీపీ నేతలు వెలంపల్లి శ్రీనివాస్, పైలా సోమినాయుడు తీవ్రంగా ఖండించారు. వైఎస్ఆర్ సీపీ నేతలు సోమవారమిక్కడ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు మనవడి చేతికి బలపం ఇచ్చి టీడీపీ రౌడీలకు కత్తులిచ్చారని ధ్వజమత్తారు. 132 జీవోలు జారీ చేసి టీడీపీ నేతలపై కేసులు ఎత్తేశారని అన్నారు. నారాయణరెడ్డి హత్యకేసులో చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తిని ఏ-1 ముద్దాయిలుగా చేర్చాలని డిమాండ్ చేశారు. పూర్తిస్థాయిలో విచారణ జరగాలంటే కేఈని తక్షణమే పదవి నుంచి తొలగించాలన్నారు. కొంతమంది ఐపీఎస్ అధికారులు పచ్చ చొక్కాలు వేసుకుని పని చేస్తున్నారని, ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసి రాష్ట్రపతి పాలన విధిస్తే కానీ ఏపీలో హత్యాకాండ ఆగదని అన్నారు.