సాక్షి, విజయవాడ : దుర్గగుడి పాలకమండలి సభ్యురాలు చక్కా వెంకట నాగ వరలక్ష్మి కారులో మద్యం సీసాలు లభించడంతో జగ్గయ్యపేట పోలీసులు కేసు నమోదు చేసినట్లు పాలకమండలి ఛైర్మన్ పైలా సోమినాయుడు తెలిపారు. వరలక్ష్మికి చెందిన కారుకు దుర్గగుడి సభ్యురాలిగా నేమ్ బోర్డు ఉండటంతో నైతిక బాధ్యత వహించి ఆమె రాజీనామా చేశారని పేర్కొన్నారు. తన కారు డ్రైవరే ఈ ఘటనకు బాధ్యుడిని పేర్కొన్న వరలక్ష్మి పట్టుబడిన మద్యానికి తనకు సంబంధం లేదని అన్నారు. అయితే ఈ చర్యకు నైతిక బాధ్యత వహిస్తూ ఆమె రాజీనామా చేశారని పేర్కొన్నారు. దీనిపై చర్చించి వరలక్ష్మీ రాజీనామాను ఆమోదించినట్లు వెల్లడించారు. (‘ఆలయాలపై దాడులకు పాల్పడే వారిని వదలం’)
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం అవినీతికి ఆస్కారం లేకుండా పనిచేస్తోందని ఆయన తెలిపారు. ప్రభుత్వానికి చెడ్డపేరు రాకుండా, అమ్మవారి దేవస్థానం ప్రతిష్టను దెబ్బతీసేలా బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న వారు వ్యవహరించాల్సి ఉందని సూచించారు. ఈ కేసులో నిజానిజాలు తేలేంత వరకు దుర్గగుడి బాధ్యతలకు దూరంగా ఉంటానని వరలక్ష్మి తీసుకున్న నిర్ణయాన్ని ఆహ్వానిస్తున్నామన్నారు. (‘దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు.. 9 రోజులే’)
Comments
Please login to add a commentAdd a comment