wine bottles
-
తోపుడు బండిలో 92 విస్కీ క్వార్టర్ బాటిల్స్
హైదరాబాద్: రోడ్డుపై వ్యాపారం చేస్తున్న ఓ మహిళకు చెందిన తోపుడు బండిలో 92 విస్కీ క్వార్టర్ బాటిళ్లు స్వాధీనం చేసుకున్న సంఘటన గురువారం గచ్చిబౌలి (Gachibowli) పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. జేవీజీహిల్స్‌లో ఫుట్‌పాత్‌పై ఉన్న డబ్బాలో మద్యం అమ్మకాలు జరుగుతున్నట్లు స్థానికులు శేరిలింగంపల్లి (Serilingampally) సర్కిల్ ఉప వైద్యాధికారి శ్రీకాంత్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో అక్కడికి వెళ్లిన ఆయన తనిఖీలు చేయగా 10 క్వార్టర్ బాటిల్స్ లభించాయి. వాటిని ధ్వంసం చేసి డబ్బాను తొలగించారు. రాజరాజేశ్వరీ కాలనీలోనూ ఇదే తరహాలో ఉదయం నుంచి మద్యం విక్రయాలు జరుగుతున్నట్లు సమాచారం అందడంతో సిబ్బందితో అక్కడికి వెళ్లిన ఆయన సోదా చేయగా, తోపుడు బండిలో ఏకంగా వివిధ కంపెనీలకు చెందిన 92 క్వార్టర్ బాటిళ్లు గుర్తించి నివ్వెరపోయారు. అంతే కాకుండా పక్కనే ఉన్న గుడిసెలో పలువురు మద్యం సేవిస్తున్నట్లు గుర్తించి డయల్ 100 (Dial 100), గచ్చిబౌలి పోలీసులకు సమాచారం అందించారు. మద్యం విక్రయిస్తున్న మహిళతో పాటు మద్యం బాటిళ్లను పోలీసులకు అప్పగించారు. బెల్ట్ షాప్ నిర్వహిస్తున్న మహిళపై కేసు నమోదు చేసినట్లు ఇన్స్పెక్టర్ హబీబుల్లాఖాన్ తెలిపారు. గత కొన్ని నెలలుగా ఉదయం 6 గంటల నుంచే మద్యం అమ్మకాలు జరుగుతుండటంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని స్థానికులు పేర్కొన్నారు.చదవండి: ఆ అవయవాన్ని పునః సృష్టించారు..! -
టానిక్ మోసాలు.. 100 కోట్ల ట్యాక్స్ ఎగవేత!
హైదరాబాద్, సాక్షి: నగరంతో పాటు శివారుల్లో టానిక్ వైన్ మార్ట్ పేరిట జరిగిన భారీ అక్రమాలు బయటపడుతున్నాయి. సులువుగా అనుమతులు పొందడం మొదలు.. నిబంధనలకు విరుద్ధంగా విక్రయాలు జరపడం, ట్యాక్సులు ఎగ్గొట్టడం దాకా.. ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఈ క్రమంలో వంద కోట్ల రూపాయల ట్యాక్స్ ఎగ్గొట్టినట్లు తేలగా.. ఇందుకు గత ప్రభుత్వ హయాంలోని కొందరు అధికారులు పూర్తి సహకారం అందించినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఎలైట్ లిక్కర్ మార్ట్ కోసం పర్మినెంట్ లైసెన్స్‌ను 2016లో ప్రత్యేక జీవో 271ను పేరిట జారీ చేసింది గత ప్రభుత్వం. ఈ జీవో ప్రకారం ప్రతీ ఐదు సంవత్సరాలకు ఒకసారి రెన్యువల్ చేసుకునే వెసులుబాటు కల్పించారు. అలాగే.. మొదటి మూడు సంవత్సరాలు లిక్కర్ అదనపు అమ్మకాలపై ఎలాంటి ప్రివిలేజ్ ఫీజ్ చెల్లిచకుండా వెసులుబాటు కల్పించారు. ఇదిలా ఉంటే.. ఎలైట్ వైన్ షాపు కోసం 2016లో ప్రభుత్వం నోటిఫికేషన్ ఇస్తే.. టానిక్ బేవరేజెస్ మాత్రమే టెండర్ కోట్ చేసింది. దీంతో.. టానిక్ కు ఎలైట్ వైన్ షాప్ పర్మినెంట్ అనుమతి సులువైంది. అయితే.. తెలంగాణ లో ఒక్క ఎలైట్ ఔట్ లెట్‌కు మాత్రమే అనుమతి ఇవ్వగా.. హైదరాబాదు, నగర శివారుల్లో మరో 10 ఎలైట్ వైన్ షాపులను ‘Q By టానిక్’ పేరుతో నిర్వహిస్తూ వస్తోంది. నిబంధనల ప్రకారం.. ఎలైట్ వైన్స్ లైసెన్స్ ట్రాన్స్‌ఫర్‌కు అవకాశమే లేకపోవడం గమనార్హం. ఇక.. ఈ లైనెస్స్ ప్రకారం లిక్కర్‌ను బాటిల్స్‌గా మాత్రమే విక్రయించాలి. లూజ్ వైన్‌కు అనుమతి లేదు. ఇతర పానీయాలు ,ఆహార పదార్ధాల అమ్మకానికి వీలులేదు. అయితే ఈ వ్యవహారం మొత్తంలో సాధారణ మద్యం లైసెన్స్ అనుమతులు తీసుకుని విదేశీ మద్యం అమ్మకాలు జరపడం ఇక్కడ కొసమెరుపు. రీటైల్‌గా ఫారెన్ లిక్కర్ తోపాటు ప్రీమియం ఇండియన్ లిక్కర్ అమ్మడానికి టానిక్కు వెసలుబాటు కల్పించారు. ఇక.. టానిక్ వైన్ మార్టులో పని చేసే ఉద్యోగుల పేరిట లైసెన్సులు తీసుకున్నారు. అంతేకాదు.. ఈ ఫ్రాచైజీల్లో బడా బాబుల పిల్లల పెట్టుబడులు పెట్టారు. గత ప్రభుత్వ అనుమతులతోనే ఈ తతంగం అంతా నడిచినట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌తో పాటు శివారులో వైన్ మార్టులు ఏర్పాటు చేసింది టానిక్. ఇందుకు ఓ ఐఏఎస్ అధికారితో పాటు మరో ఇద్దరు ఉన్నతాధికారులు సహకరించినట్లు ఎక్సైజ్ శాఖ గుర్తించింది. గచ్చిబౌలి, బోడుప్పల్, మాదాపూర్‌లో ఏర్పాటైన టానిక్ మార్టులో ఈ ముగ్గురు అధికారుల ప్రమేయం ఉన్నట్లు తేలింది. అలాగే సీఎంవో మాజీ అధికారి ఒకరి పాత్రపైనా అధికారులు ఆరా తీస్తున్నారు. ఇవన్నీ ఒక ఎత్తయితే.. టానిక్ షాపులకు ఎక్సైజ్ శాఖ షాకిచ్చింది. ప్రత్యేక జీవోతో అర్ధరాత్రి 2 గంటల దాకా లిక్కర్ అమ్ముకునే వెసులుబాటును తొలగించింది. రెగ్యులర్ లిక్కర్ దుకాణాల మాదిరే రాత్రి 11 గం. వరకే అమ్ముకోవాలని సూచిస్తూ ఆదేశాలు జారీ చేసింది. పన్నుల ఎగవేతపై ప్రాథమిక నిర్ధారణకు వచ్చాకే ఈ నిర్ణయం ప్రకటించింది. ఇక.. పూర్తిస్థాయి తనిఖీల అనంతరం చర్యలు తీసుకోవాలని ఎక్సైజ్ శాఖ భావిస్తోంది. -
బడిలోనే బార్.. ఆ టీచరమ్మ రూటే వేరు
తుమకూరు (బెంగళూరు): గురువు అంటే దేవునితో సమానం, కానీ ఓ మహిళా ఉపాధ్యాయురాలు పాఠశాలనే బార్గా మార్చుకుంది. మద్యం తాగుతూ మత్తులో నానా యాగీ చేస్తూ ఆ వృత్తికే మచ్చ తెచ్చేలా ప్రవర్తించింది. ఈ సంఘటన విద్యాకేంద్రంగా ప్రసిద్ధి చెందిన తుమకూరు జిల్లాలో జరిగింది. వివరాలు.. తుమకూరు తాలూకాలోని చిక్కసారంగిలోఉన్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో గంగలక్ష్మమ్మ అనే ఉపాధ్యాయురాలు గత 25 ఏళ్లుగా ఇక్కడే పనిచేస్తోంది. గత 5 సంవత్సరాల నుంచి ఆమె మద్యానికి బానిస అయ్యింది. ఈ మత్తులో నానా హంగామా చేస్తోంది. టేబుల్లో మద్యం సీసాలు ఈ విషయమై గ్రామస్తులు, బాలల తల్లిదండ్రులు ఆమెకు అనేకసార్లు మందలించినా తీరుమారలేదు. దీంతో బీఈఓకు ఫిర్యాదు చేయడంతో గురువారం వచ్చి విచారించారు. ఉపాధ్యాయురాలి టేబుల్లో మద్యం సీసాలు ఉన్నాయని విద్యార్థులు తెలిపారు. వాటిని తీయాలని బీఈఓ ఆదేశించడంతో ఆమె టేబుల్‌కు తాళం వేసి భీష్మించుకుంది. బీఈఓ, తల్లిదండ్రులు కలిసి టేబుల్‌ను బయటికి తీసుకొని వచ్చి తాళం పగలగొట్టి చూసి ఒక బాటిల్, రెండు ఖాళీ సీసాలు ఉన్నాయి. ఇంతలో నేను ఆత్మహత్యా చేసుకుంటానంటూ ఉపాధ్యాయురాలు కేకలు వేయగా పోలీసులు ఆమెను అడ్డుకున్నారు. మద్యం సీసాలను సీజ్‌చేశారు. చదవండి: (ట్రూ లవ్ నెవర్ ఎండ్స్.. నేనూ నీ దగ్గరకే వస్తున్నా..) -
రూ.13 కోట్లు విలువైన ‘వైన్’ చోరీ.. మెక్సికన్ బ్యూటీ క్వీన్ జంట అరెస్ట్!
మాడ్రిడ్: అత్యంత విలువైన పాతకాలపు వైన్ బాటిళ్ల చోరీని తొమ్మిది నెలల తర్వాత ఛేదించారు పోలీసులు. 1.7 మిలియన్ డాలర్లు(సుమారు రూ.13.57 కోట్లు) విలువైన ప్రఖ్యాత వైన్ బాటిళ్ల చోరీ కేసులో మాజీ మెక్సికన్ బ్యూటీ క్వీన్, రోమానియా డచ్ వ్యక్తిని పోలీసులు క్రోయేషియాలో అరెస్ట్ చేశారు. ఈ విలువైన మద్యం బాటిళ్లు 9 నెలల క్రితం స్పెయిన్‌లో మాయమయ్యాయి. దొంగలను పట్టుకునేందుకు యూరప్ మొత్తం జల్లెడపట్టినట్లు చెప్పారు పోలీసులు. ఈ మేరకు ఓ ప్రకటన చేసింది స్పెయిన్ జాతీయ పోలీసు విభాగం. ‘2021, అక్టోబర్ 21న పశ్చిమ నగరం కేసర్స్లో 1.65 మిలియన్ యూరోలు విలువ కలిగిన 45 వైన్ బాటిళ్లు చోరీకి గురయ్యాయి. అందులో 19వ శతాబ్దానికి చెందిన ఓ ప్రత్యేకమైన బాటిల్ సైతం ఉంది. దాని విలువ 3.10 లక్షల యూరోలు. వాటిని ప్రముఖ హోటల్ రెస్టారెంట్ ఈఐ అట్రియోలోని సెల్లార్ నుంచి పక్కా ప్రణాళికతో ఎత్తుకెళ్లారు.’ అని తెలిపారు. పోలీసుల ప్రకటన ప్రకారం.. స్పానిష్ డైలీ ఈఐ పైస్‌కు చెందిన 29 ఏళ్ల మెక్సికన్ యువతి.. అట్రియోలోని వెయిటర్స్‌ను రూమ్ సర్వీస్ అంటూ దారి మళ్లించింది. ఆ సమయంలోనే ఆమెతో ఉన్న 47 ఏళ్ల వ్యక్తి వైన్ బాటిళ్లు ఉన్న సెల్లార్లోకి వెళ్లాడు. తన వద్ద ఉన్న మాస్టర్ కీతో బాక్సులను తెరిచి మూడు బ్యాగుల్లో నింపాడు. వాటిని టవల్స్‌లో చుట్టారు. ఆ మరుసటి రోజు ఉదయం 5.30 గంటల ప్రాంతంలో బ్యాగులతో సెక్యూరిటీని తప్పించుకుని హోటల్ నుంచి వెళ్లిపోయారు. హోటల్లోని సీసీటీవీ కెమెరాలో ఆ దృశ్యాలు నమోదయ్యాయి. ప్రాథమికంగా ఓ గ్యాంగ్ పక్కా ప్రణాళికతో చేసినట్లు పోలీసులు భావించారు. ఈ చోరీ జరగక ముందు ఇరువురు మూడు సార్లు అట్రియో హోటల్‌కి వచ్చారు. అందరిలాగే వారికి సైతం వైన్ బాటిళ్లు ఉన్న సెల్లార్‌ను చూపించారు హోటల్ సిబ్బంది. చోరీకి గురైన వాటిలో 200 ఏళ్ల నాటి బాటిల్.. చోరీకి గురైన వాటిలో 1806 నాటికి చెందిన ప్రతిష్టాత్మకమైన ఫ్రెంచ్ బోర్డియాక్స్ యక్వెమ్ బాటిల్ ఉంది. దాని విలువ భారీగా ఉంటుందని ఎల్ అట్రియో సహ యజమాని సొమెలియర్ జోస్ పోలో చెప్పారు.‘ఆ బాటిల్ నా వ్యక్తిగత చరిత్రలో భాగం. ఆ బాటిల్ అట్రియో, కేసర్స్, ఇక్కడి ప్రజలు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న వైన్ ప్రేమికుల చరిత్రలో ఒకటి.’ అని పోలో పేర్కొన్నారు. చోరీ చేసిన తర్వాత కొద్ది రోజుల్లోనే దొంగలిద్దరు స్పెయిన్ దాటి వెళ్లారు. నెలల తరబడి వారికోసం యూరప్ మొత్తం గాలింపు చేపట్టారు పోలీసులు. ఇటీవలే మొంటెనెగ్రో నుంచి సరిహద్దు దాటేందుకు ప్రయత్నించగా పట్టుబడ్డారు. వారిని పట్టుకునేందుకు నెదర్లాండ్స్, క్రొయేషియా, రొమానియా పోలీసులతో పాటు ఇంటర్‌పోల్ సాయం కూడా తీసుకున్నారు. వారిని అరెస్ట్ చేసినప్పటికీ చోరీకి గురైన వైన్ మాత్రం తిరిగి స్వాధీనం చేసుకోలేదు. ఇదీ చదవండి: బాప్రే!.. ఆ జంట దొంగలించిన వైన్ బాటిల్స్ ఖరీదు రూ.3 కోట్లా! -
రూ.3.14 కోట్ల మద్యం బాటిళ్లు ధ్వంసం.. రోడ్డు రోలర్‌తో తొక్కించి
సాక్షి, నెల్లూరు: మద్యం అక్రమరవాణా, అనధికార విక్రయాలను పూర్తిస్థాయిలో కట్టడి చేయడమే లక్ష్యంగా సెబ్, పోలీసు అధికారులు దాడులు చేశారు. మూడు సంవత్సరాల్లో రూ.3.14 కోట్ల అక్రమ మద్యాన్ని స్వా«దీనం చేసుకుని వందలాది మందిని కటకటాల వెనక్కి పంపారు. వరుస దాడులతో అక్రమ రవాణా తగ్గుముఖం పడుతోంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి మద్యం అక్రమ రవాణా, అనధికార విక్రయాలు, చట్టవ్యతిరేక కార్యకలాపాలను కట్టడి చేసేందుకు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోను ఏర్పాటు చేసింది. జిల్లా పోలీçసు బాస్‌ల పర్యవేక్షణలో సెబ్ అధికారులు, స్థానిక పోలీసులు పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నారు. ప్రజల భాగస్వామ్యంతో నిఘా వ్యవస్థను పటిష్టం చేశారు. అక్రమ రవాణాకు అనుకూలంగా ఉండే ప్రాంతాల్లో కాపు కాసి దాడులు చేస్తున్నారు. కార్లు, బస్సులు, కంటైనర్లు, ఇతర వాహనాల్లో తరలిస్తున్న పొరుగు మద్యంతోపాటు డ్యూటీ పెయిడ్ లిక్కర్‌ను స్వా«దీనం చేసుకుని నిందితులను కటకటాల వెనక్కి పంపుతున్నారు. పక్కాగా.. మూడేళ్ల కాలంలో జిల్లా వ్యాప్తంగా సెబ్, పోలీసులు 2,744 కేసులు నమోదు చేసి (ఎన్డీపీఎల్, డీపీఎల్) రూ 3,14,37,980 విలువ చేసే 74,547 మద్యం బాటిళ్ల (15,719 లీటర్ల)ను స్వా«దీనం చేసుకున్నారు. ఎస్పీ సీహెచ్ విజయారావు పర్యవేక్షణలో సెబ్ జాయింట్ డైరెక్టర్ కె.శ్రీలక్ష్మి పూర్తిస్థాయిలో అక్రమ మద్యం కట్టడికి చర్యలు తీసుకున్నారు. సరిహద్దు ప్రాంతాల్లో నిఘాను పెంచి వాహన తనిఖీలు నిర్వహిస్తున్నారు. పాత నేరస్తులను బైండోవర్ చేయడంతోపాటు పదేపదే నేరాలకు పాల్పడే వారిపై పీడీ యాక్ట్‌లు ప్రయోగిస్తున్నారు. వరుస దాడులు, సెబ్, పోలీసు అధికారుల చర్యలతో అక్రమార్కుల వెన్నులో వణుకు మొదలవడంతోపాటు అక్రమ రవాణా, అనధికార విక్రయాలు తగ్గుముఖం పట్టాయి. మాకివ్వండి సారూ.. పట్టుబడిన మద్యంను ధ్వంసం చేసేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు. ఎస్పీ సీహెచ్ విజయారావు పర్యవేక్షణలో సెబ్ అధికారులు మంగళవారం కొత్తూరు టాస్‌్కఫోర్స్ కార్యాలయ ప్రాంగణంలో మద్యం బాటిళ్లను రోడ్డురోలర్లతో తొక్కించారు. దీంతో ఆ ప్రాంతమంతా మద్య ప్రవాహంతో నిండిపోయింది. మద్యం బాటిళ్లను చేస్తున్నారన్న ధ్వంసం చేస్తున్నారన్న విషయం తెలుసుకున్న స్థానికులు, మందుబాబులు పెద్దఎత్తున ఘటనా స్థలానికి చేరుకున్నారు. రోడ్డురోలర్లతో తొక్కించే బదులుగా తమకివ్వండి సారూ.. కొందరు అక్కడ విధుల్లో ఉన్న సెబ్, పోలీసు సిబ్బందిని బతిమిలాడారు. వారు నిరాకరించడంతో వెళ్లిపోయారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
బీరు బాటిల్లో సిరంజి
సాక్షి, కుషాయిగూడ(హైదరాబాద్): కాప్రాలోని ఓ బార్ కు వెళ్లి ఓ వ్యక్తి బీరు ఆర్డర్ చేశాడు. బేరర్ బీరు తీసుకొచ్చి ఓపెన్ చేసి ఆ వ్యక్తి ముందు పెట్టారు. బీరు తాగుతున్న వ్యక్తికి నోటిలో ఏదో తగిలినట్లు అనిపించింది. వెంటనే తేరుకొని చూడగా బీరు బాటిల్లో సిరంజిని చూసి కంగు తిన్నా డు. ఇదేమిటని బార్ నిర్వాహకులను నిలదీసి కుషాయిగూడ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సోమవారం రాత్రి మహాంకాళి బార్లో చోటు చేసుకున్న ఈ సంఘటన మంగళవారం వెలుగులోకి వచ్చింది. -
బాప్రే!.. ఆ జంట దొంగలించిన వైన్ బాటిల్స్ ఖరీదు రూ.3 కోట్లా!
స్పెయిన్: మాములుగా ఇళ్లను చోరి చేస్తే బంగారం, డబ్బు ఇంత పోయింది అంటూ బెంబేలెత్తిపోతాం . కానీ ఏ రెస్టారెంట్లలోనో లేక షాపుల్లోనో చోరికి జరిగితే లక్షల్లో నష్టం జరిగే అవకాశం ఉంటుంది. కానీ ఓ రెస్టారెంట్లో ఓ జంట ఏకంగా కోట్లు ఖరీదు చేసే వైన్ బాటిల్స్‌ని చోరీ చేశారటా. అసలు ఎక్కడ ఎవరా ఆ జంటా అనుకుంటున్నారా. (చదవండి: లక్కీ హ్యండ్! 20 లాటరీ టికెట్లు.. 20 సార్లూ అదృష్టం!) అసలు విషయంలోకెళ్లితే....సౌత్వెస్టర్ స్పెయిన్‌లోని ఒక స్పానిష్ రెస్టారెంట్లో ఓ జంట సుమారు రూ.3 కోట్లు విలువ చేసే 45 వైన్ బాటిళ్లను దొంగిలించినట్లు ఆ రెస్టారెంట్ అధికారులు అనుమానిస్తున్నారు. అయితే ఆ వైన్ బాటిళ్లు అత్యంత అరుదుగా లభించే 215 ఏళ్ల నాటివి. అంతేకాదు వాటి ఖరీదు దాదాపు 4 లక్షల డాలర్లు(రూ.3 కోట్లు). ఆ హోటల్ యజామానుల్లో ఒకరైన జోస్ పోల్ మాట్లాడుతూ.... ఆజంట ఇంగ్లీష్ అనర్గళంగా మాట్లాడగలరు. ఆ రోజు ఆ జంట మా హోటల్లో భోజనం చేస్తూ తమకు మరింత భోజనం కావాలంటూ హోటల్ ఫ్రంట్ డెస్క్‌ని అడిగారు. దీంతో ఆ రోజు హోటల్ సిబ్బంది వారికి ఆహారం వడ్డించడంలో నిమగ్నమైపోయారు. అయితే ఆ సమయంలో ఆ జంటలో ఒకరు హోటల్ సెల్లారులోకి వెళ్లారు. సెల్లారులో 40 వేలకు పైన అత్యంత అరుదుగా లభించే ఖరీదైన వైన్ బాటిల్స్ ఉన్నాయి. అంతేకాదు వారు దొంగలించిన బాటిల్స్‌ని మార్కెట్లో మార్చలేరు పైగా వాటిన్నింటికి భీమా ఉంది" అన్నారు. ఈ మేరకు కాసెరెస్లోని జాతీయ పోలీసు ప్రతినిధి వైన్ బాటిల్స్ చోరి గురించి దర్యాప్తు చేస్తున్నామని అన్నారు. (చదవండి: హౌరా బ్రిడ్జ్ పై జౌరా అనిపించే డ్యాన్స్) -
మద్యం దుకాణంలో ఎలుకల రచ్చ.. 12 వైన్ బాటిళ్లు తాగేశాయ్!
ఇంట్లో ఎలుకలు ప్రవేశించాయంటే అవి చేసే గోల అంతా ఇంతా కాదు.. వంటలు, బియ్యం.. ఇలా అన్నిట్లో నేనున్నానంటూ చేయి పెట్టి చిందర వందర చేస్తాయి. అంతేగాక ఎంతో ఇష్టంగా కొనుకున్న కొనుకున్న దుస్తులను సైతం దేనికి పనికిరాకుండా చింపి నాశనం చేస్తాయి. ఏ ఇంట్లోనైనా ఎలుకలు ఒంటరిగా ఉండవు. తమతోపాటూ...పెద్ద ఫ్యామిలీని వెంట తెస్తాయి. వాటిని ఇంట్లో నుంచి తరిమేయడం ఓ సవాలు లాంటిది. అప్పటి వరకు ప్రశాంతత ఉండదు. అయితే ఇటీవల ఎలుకల నోటికి కొత్త రుచి కావాల్సి వచ్చిందేమో. వైన్ షాప్‌లోకి దూరి ఏకంగా 12 వైన్ బాటిళ్లను ఎలుకలు ఖాళీ చేశాయి. ఈ విచిత్ర ఘటన తమిళనాడులో నీలగిరి జిల్లాలో వెలుగులోకి వచ్చింది. గుడలూర్ సమీపంలోని కదంపూజాలో ప్రభుత్వం నడుపుతున్న టాస్మాక్ మద్యం దుకాణాన్ని లాక్డౌన్ కారణంగా మూసివేశారు. తాజాగా కోవిడ్ తగ్గుముఖం పట్టడం వల్ల ప్రభుత్వం ఆంక్షలను సడలించడంతో మద్యం షాపులను ఓపెన్ చేశారు. ఈ క్రమంలో సోమవారం వైన్ షాప్ తెరిచి చూసేసరికి 12 ఖాళీ వైన్ బాటిళ్లు ఒపెన్ చేసి ఉండటంతో తమిళనాడు ఎక్సైజ్ సిబ్బంది షాక్ తిన్నారు. బాటిళ్ల మూతలపై ఎలుకలు కొరికిన ఆనవాళ్లు ఉండంటంతోపాటు.. అందులోని వైన్ ఖాళీ అయ్యింది. ఈ 12 మద్యం సీసాల మూతలను ఎలుకలే కొరికినట్టు ఎక్సైజ్ శాఖ అధికారులు గుర్తించారు. సిబ్బంది సమాచారం మేరకు టాస్మాక్ సీనియర్ అధికారులు దర్యాప్తు చేసి.. ఎలుకలే ఈ పని చేశాయని నిర్దారించారు. లాక్డౌన్ వల్ల చాలాకాలం ఈ మద్యం దుకాణం మూసివేయడంతో షాపులో ఎలుకలు తిరగడం ప్రారంభించాయని, బాటిళ్ల మూతలను కొరికి ఎలుకలు మద్యం తాగేశాయని తమిళనాడు ఎక్సైజ్ శాఖ సీనియర్ అధికారి అన్నారు. ఎలుకలు ఖాళీ చేసినవైన్ విలువ 1500 ఉంటుందని తెలిపారు. కేవలం వైన్ బాటిల్స్‌నే టార్గెట్ చేశాయని, బీర్ లేదా మిగతా మద్యం సీసాలను అసలు ముట్టుకోలేదన్నారు. ఇక ఈ విషయం తెలుసుకున్న నెటిజనులు.. ఎలుకల్లో కూడా మందుబాబులు ఉన్నారని, ఏమాత్రం కిక్కుఏక్కిందో అంటూ ఫన్నీ కామెంట్ చేస్తున్నారు. -
ఒక్క వైన్ బాటిల్‌కు రూ.7 కోట్లు, ఎందుకంత ధర?
లండన్: సాధారణంగా మద్యం ధర తయారు చేసే కంపెనీ, అది తాగితే ఎక్కే కిక్కు వంటి అంశాలను తీసుకొని వాటి రేటుని ఖరారు చేస్తారు. ఈ క్రమంలో కొన్ని మద్యం బాటిల్ వందలకే దొరికితే , మరి కొన్ని వేల రూపాయలకు లభిస్తుంది. అదే విదేశి సరుకు కావాలంటే లక్షలు కూడా వెచ్చించాల్సి ఉంటుంది. వీటన్నింటిని తలదన్నే విధంగా ఓ మద్యం బాటిల్ విలువ కోట్ల రూపాయల్లో ఉంటుందని అంచనా వేస్తున్నారు. అంత ధర ఎందుకో? ఎందుకంటే అది అంతరిక్షంలో పులియబెట్టిన వైన్. దాని ధర కూడా అందనంత ఎత్తులో ఉంటుంది మరి. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో ఏడాదికిపైగా గడిపిన ఒక ఫ్రెంచ్ వైన్ బాటిల్‌ను క్రిస్టీస్ సంస్థ వేలానికి పెట్టింది. ఇది 10 లక్షల డాలర్లు (దాదాపు రూ.7.37 కోట్లు) పలకొచ్చని వారు భావిస్తున్నారు. ఈ సీసా పేరు ‘పెట్రస్ 2000’. 2019 నవంబరులో అంతరిక్షంలోకి పంపిన 12 వైన్ సీసాల్లో ఇది ఒకటి. భూమికి వెలుపల సేద్యానికి అవకాశాలపై పరిశోధనలో భాగంగా ప్రైవేటు అంకుర పరిశ్రమ ‘స్పేస్ కార్గో అన్లిమిటెడ్’ వీటిని అక్కడికి పంపింది. 14 నెలల తర్వాత వాటిని భూమికి రప్పించింది. ఫ్రాన్స్‌లోని బోర్డోలో ఉన్న ఇన్స్టిట్యూట్ ఫర్ వైన్ అండ్ వైన్ రీసెర్చ్‌లో పరిశోధకులు ఈ బాటిల్ పై రుచి పరీక్షలు కూడా నిర్వహించారు. భూమిపై అంతేకాలం పాటు పులియబెట్టిన వైన్‌తో దీన్ని పోల్చి చూడగా రుచిలో రెండింటి మధ్య వైరుధ్యం ఉందని చెప్పారు. రోదసిలోకి వెళ్లొచ్చిన పానీయం మృదువుగా, సువాసనభరితంగా ఉందన్నారు. అంతరిక్షంలో కొన్నాళ్లు ప్రత్యేక వాతావరణంలో ఉన్న ఈ వైన్ ‘పరిపక్వానికి’ వచ్చిందని క్రిస్టీస్ వైన్ అండ్ స్పిరిట్స్ విభాగం డైరెక్టర్ టిమ్ టిప్‌ట్రీ తెలిపారు. ప్రస్తుతం ఈ సీసా ధర పెరిగిపోయిందని చెప్తున్నారు. ( చదవండి: ఈ ఫోటో ఖరీదు రూ.3.7 కోట్లు.. ఎందుకింత రేటు ) -
‘ఆ మద్యానికి నాకు సంబంధం లేదు’
సాక్షి, విజయవాడ : దుర్గగుడి పాలకమండలి సభ్యురాలు చక్కా వెంకట నాగ వరలక్ష్మి కారులో మద్యం సీసాలు లభించడంతో జగ్గయ్యపేట పోలీసులు కేసు నమోదు చేసినట్లు పాలకమండలి ఛైర్మన్ పైలా సోమినాయుడు తెలిపారు. వరలక్ష్మికి చెందిన కారుకు దుర్గగుడి సభ్యురాలిగా నేమ్ బోర్డు ఉండటంతో నైతిక బాధ్యత వహించి ఆమె రాజీనామా చేశారని పేర్కొన్నారు. తన కారు డ్రైవరే ఈ ఘటనకు బాధ్యుడిని పేర్కొన్న వరలక్ష్మి పట్టుబడిన మద్యానికి తనకు సంబంధం లేదని అన్నారు. అయితే ఈ చర్యకు నైతిక బాధ్యత వహిస్తూ ఆమె రాజీనామా చేశారని పేర్కొన్నారు. దీనిపై చర్చించి వరలక్ష్మీ రాజీనామాను ఆమోదించినట్లు వెల్లడించారు. (‘ఆలయాలపై దాడులకు పాల్పడే వారిని వదలం’) ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం అవినీతికి ఆస్కారం లేకుండా పనిచేస్తోందని ఆయన తెలిపారు. ప్రభుత్వానికి చెడ్డపేరు రాకుండా, అమ్మవారి దేవస్థానం ప్రతిష్టను దెబ్బతీసేలా బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న వారు వ్యవహరించాల్సి ఉందని సూచించారు. ఈ కేసులో నిజానిజాలు తేలేంత వరకు దుర్గగుడి బాధ్యతలకు దూరంగా ఉంటానని వరలక్ష్మి తీసుకున్న నిర్ణయాన్ని ఆహ్వానిస్తున్నామన్నారు. (‘దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు.. 9 రోజులే’) -
మద్యం బాటిళ్లలో బొద్దింకలు
సాక్షి, చెన్నై : టాస్మాక్ మద్యం దుకాణాలకు దిగుమతి చేసే మద్యం బాటిల్లో బొద్దింకలు, చీమలు ఉంటున్నట్లు టాస్మాక్ షాపు ఉద్యోగులు ఫిర్యాదు చేస్తున్నారు. కరోనా వైరస్‌తో ఫ్యాక్టరీలలో 50 శాతం మంది ఉద్యోగులు పనిచేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. మద్యం ఫ్యాక్టరీలలో ఉత్పత్తి విభాగంలో పనిచేసే ఉద్యోగుల కొరత కారణంగా మద్యం బాటిళ్లను శుభ్రపరిచే పనులు, వాటి పర్యవేక్షణలో నిర్లక్ష్యం ఏర్పడినట్లు సమాచారం. కొన్ని రోజులుగా టాస్మాక్ దుకాణాలకు దిగుమతిచేసే మద్యం బాటిళ్లలో బొద్దింకలు, చీమలతో పాటు ఫంగస్ ఉంటున్నట్లు దుకాణాల ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. (ప్రేమకు లాక్డౌన్ అడ్డంకి.. ఆపై ప్రియురాలి హత్య.. ) దీనిపై కొందరు ఉద్యోగులు మాట్లాడుతూ మద్యం ఉత్పత్తి ఫ్యాక్టరీలలో ప్రొడక్షన్ విభాగంలో ఆటోమేటిక్ యంత్రాలతో బ్లెండింగ్ పూర్తి చేసుకుని లేబుళ్లు అతికించడానికి ఒక నిమి షానికి ముందు 240 బాటిళ్లను 8 మంది ఉద్యోగులు చెక్ చేస్తారని, అందులో ఏమైనా ఉంటే బాటిళ్లను తొలగిస్తారని తెలిపారు. ఉద్యోగుల కొరత కారణంగా మద్యం బాటిళ్లను సక్రమంగా పరిశీలించడం లేదని, ప్రస్తుతం టాస్మాక్ దుకాణాలకు దిగుమతి చేసే మద్యం బాటిళ్లలో ఈ విధంగా క్రిమి కీటకాదులు ఉంటున్నట్లు తెలిపారు -
బడియా.. బారా?!
నారాయణపేట/ మాగనూర్ (మక్తల్): అక్కడ పొద్దున ఆ పాఠశాల గేట్లు తెరిస్తే చాలు మద్యం ఖాళీ బాటిళ్లు దర్శనమిస్తున్నాయి. వాటిని తొలగించడం విద్యార్థులు.. ఉపాధ్యాయులకు వంతైంది. ఉదయం శుభ్రంగా ఉంటే రాత్రి మాత్రం మందుబాబులకు అడ్డాగా మారింది. మద్యం తాగి ఖాళీ బాటిళ్లను పడేసిపోతున్నారు. ఈ విషయమై అధికారులు, ప్రజాప్రతినిధులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఉపాధ్యాయులు, విద్యార్థులు వాపోతున్నారు. ఇదీ నారాయణపేట జిల్లాలోని మాగనూర్ జెడ్పీహెచ్ఎస్ పరిస్థితి. ఈ పాఠశాలకు ప్రహరీ, గేటు ఉన్నా వాచ్‌మన్‌ను మాత్రం నియమించలేదు. అలాగే ప్రహరీ ఎత్తు తక్కువగా ఉండటంతో గోడ దూకి రాత్రివేళ మందుబాబులు ఇక్కడికి వచ్చి తమ పని కానిచ్చేస్తున్నారు. పక్కనే మద్యం విక్రయాలు బడి అంటేనే ఓ పవిత్రమైన స్థలం.. అలాంటిది మందుబాబులు తమను ఎవరూ ఏమీ చేయలేరని అనుకుంటున్నారేమో మరి.. ఈ పాఠశాల ఆవరణలో తాగుడు.. మద్యం బాటిళ్లను పడేసుడు.. అంతే! ఖాళీ బాటిళ్లను ఎత్తేసి ఉపాధ్యాయులు, విద్యార్థులు రోజురోజుకూ విసుగు చెందుతున్నారు. గ్రామంలోని బెల్ట్ షాపులపై ఎక్సైజ్ అధికారులు దాడులు చేస్తున్నా.. వారి కంట పడకుండా ఇలా చీకటి దాందా కొనసాగిస్తున్నట్టు తెలుస్తోంది. మాగనూరులోని ఓ వ్యక్తి గుడి దారిలో బెల్ట్ దుకాణం నిర్వహిస్తున్నాడు.. అతనే ఈ పాఠశాల పక్కన ఉన్న తన స్వగృహంలో రాత్రివేళ మద్యం విక్రయిస్తున్నాడు. దీనిపై విద్యార్థి సంఘాలు, గ్రామ యువకులు పలుసార్లు ఆందోళనలు చేపట్టినా అధికారులు, పాలకుల్లో మాత్రం చలనం రావడం లేదు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి బాధ్యులపై చర్య తీసుకోవాలని విద్యార్థులు, ఉపాధ్యాయులు కోరుతున్నారు. మా దృష్టికి రాలేదు మాగనూర్‌లో బెల్ట్ దుకణాలు పెట్టి మద్యం విక్రయిస్తున్నట్లు మాకు ఎలాంటి సమాచారం లేదు. దీనిపై ఎవరూ ఫిర్యాదు చేయలేదు. అలాంటిది మా దృష్టికి వస్తే చట్టారీర్యా చర్యలు తీసుకుంటాం. – నాగేందర్, ఎక్సైజ్ సీఐ, నారాయణపేట -
వైన్ వార్ : మచ్చకనిపిస్తే అంతే...
-
సిండి ‘కేటుగాళ్లు’!
సాక్షి, మెదక్: జిల్లాలో మద్యం వ్యాపారులది ఆడిందే ఆట.. పాడిందే పాటగా మారింది. సిండికేటుగా మారి అధిక ధరలతో విక్రయిస్తున్నా.. బెల్ట్ షాపులకు అక్రమంగా మద్యాన్ని తరలిస్తున్నా.. కృత్రిమ కొరత సృష్టించి బీర్లను వైన్స్ షాపుల నుంచి బార్లకు తరలించి అమ్మకాలు చేస్తున్నా.. వారిని అడిగే నాథుడే కరువయ్యాడు. వాటన్నింటినీ నియంత్రించాల్సిన ఎక్సైజ్ అధికారులు ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తుండడంపై అనుమానాలతోపాటు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ధనార్జనే ధ్యేయంగా మద్యం వ్యాపారులు కుమ్మక్కయ్యారు. సిండికేట్‌గా మారి అధిక ధరలతో విక్రయాలు చేస్తూ మద్యం ప్రియుల జేబులను కొల్లగొడుతున్నారు. అవినీతికి అలవాటు పడ్డ పలువురు ఎక్సైజ్ శాఖ అధికారులకు డబ్బుల ఎర చూపి.. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. డిమాండ్ ఉన్న బీర్లకు సంబంధించి మార్కెట్లో కృత్రిమ కొరత సృష్టించి అక్రమంగా బార్లకు తరలిస్తున్నారు. ఇదేక్రమంలో వైన్స్ దుకాణాల్లో మార్జిన్ ఎక్కువ వచ్చే.. డిమాండ్ లేని బీర్లను మద్యం ప్రియులకు అంటగట్టి సొమ్ము చేసుకుంటున్నారు. అయినా.. ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు చోద్యం చూస్తుండడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పలు వైన్స్లలో అదనంగా వసూళ్లు జిల్లాలోని కొల్చారం మండలంలో ఉన్న చిన్నఘణపూర్‌లో ఒక మద్యం డిపో ఉంది. ఇక్కడి నుంచి మెదక్, సంగారెడ్డి జిల్లాలకు మద్యం సరఫరా అవుతుంది. ఈ డిపో పరిధిలోని రెండు జిల్లాల్లో మొత్తం 99 వైన్స్ దుకాణాలు, 8 బార్లు ఉన్నాయి. ఇందులో మెదక్ జిల్లాకు సంబంధించి 37 వైన్స్ షాపులు, రెండు బార్లు ఉన్నట్లు అధికారిక రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. మెదక్, నర్సాపూర్, తూప్రాన్.. ఇలా ప్రాంతాల వారీగా మద్యం వ్యాపారులు పలువురు సిండికేట్‌గా మారి ఒక్కో బీరు, వైన్, బ్రాందీ, విస్కీ సీసాపై ఎమ్మార్పీ కంటే రూ.5 నుంచి రూ.10 వరకు అదనంగా వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లాలో 1,200కు పైగా ఉన్న బెల్ట్‌షాపులతోపాటు పలు దాబాలకు కూడా అనధికారికంగా మద్యం సరఫరా చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. పట్టణంలో రాత్రి 9.30 గంటలకే మూత మెదక్ పట్టణంలో ఐదు వైన్స్ షాపులు.. రెండు బార్లు ఉన్నాయి. వైన్స్ షాపులు ఉదయం పది నుంచి రాత్రి పది గంటల వరకు తెరిచి ఉండాలి. నిర్వాహకులు ఇటీవల రాత్రి 9 నుంచి 9.30 గంటల మధ్యనే క్లోజ్ చేస్తున్నారు. ఈ క్రమంలో మద్యం ప్రియులు తప్పనిసరి పరిస్థితుల్లో బార్లకు వెళ్లక తప్పడం లేదు. బార్ల నిర్వాహకులు ఒక్కో బీర్‌కు అదనంగా రూ.30 వరకు వసూలు చేస్తుండడంతో మద్యం ప్రియుల జేబులు ఖాళీ అవుతున్నాయి. రెండు వైన్స్, రెండు బార్ షాపులు ఒక్కరివే కావడంతో.. మెదక్ పట్టణంలోని ఓ వ్యక్తి రెండు వైన్స్ షాపులను దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఆ వ్యక్తికి ఇదే ప్రాంతంలో రెండు బార్ షాపులు ఉన్నాయి. బార్ షాపుల్లో అయితే బీరుకు అదనంగా రూ.30 వరకు సమకూరుతుండడం.. స్నాక్స్ ఇతరత్రా వాటికి బిల్లు కూడా వస్తుండడంతో సదరు వ్యక్తి నిర్దేశిత సమయం కంటే వైన్స్ షాపులను గంట, అరగంట ముందే బంద్ చేస్తున్నట్లు సమాచారం. రాత్రి ముందుగానే వైన్స్ దుకాణాలను బంద్ చేస్తే.. మద్యం ప్రియులు తప్పనిసరి పరిస్థితుల్లో బార్ షాపులకు వెళ్తారని ప్లాన్ వేసిన సదరు వ్యక్తి ఇతర వైన్స్ నిర్వాహకులతో కలిసి సిండికేట్ అయినట్లు మద్యం ప్రియుల ద్వారా తెలిసింది. వైన్స్‌లో మార్జిన్ బీర్ల అమ్మకాలకే మొగ్గు ఎండాకాలం బీర్ల కొరత పేరిట సదరు వైన్స్ దుకాణాల నిర్వాహకుడు కొత్త ఎత్తుగడకు తెరలేపాడు. ఎక్కువ మార్జిన్ వచ్చే డిమాండ్ లేని బీర్లను మద్యం ప్రియులకు అంటగడుతున్నారు. ఇదే సమయంలో ఎక్కువ డిమాండ్ ఉన్న బీర్లను తన బార్ షాపులకు తరలిస్తున్నట్లు సమాచారం. రాత్రి పది గంటలకు మూసివేయాల్సిన వైన్స్ షాపులను తొందరగా బంద్ చేసి.. మద్యం ప్రియులు బార్ షాపులకు వెళ్లేలా చూస్తూ సొమ్ము చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. పట్టించుకోని ఎక్సైజ్ అధికారులు వైన్స్‌లు నిర్దేశిత సమయం కంటే ముందుగానే బంద్ చేస్తున్నా.. పలు వైన్స్ దుకాణాల్లో ఎమ్మార్పీ కంటే అదనంగా వసూలు చేస్తున్నా ఎక్సైజ్ అధికారులు గానీ.. పోలీసులు గానీ పట్టించుకోకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నెలనెలా పలువురు అధికారులు, సిబ్బందికి మామూళ్లు అందుతుండడంతో వారు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. చర్యలు తీసుకుంటాం ఎమ్మార్పీకి మించి విక్రయిస్తున్నారని ఫిర్యాదులు అందడంతో నర్సాపూర్ ప్రాంతంలో పలు షాపులపై కేసులు నమోదు చేశాం. మెదక్ టౌన్ పరిధిలో నిర్దేశిత సమయం కంటే వైన్స్‌లను ముందుగానే బంద్ చేస్తున్నట్లు మా దృష్టికి రాలేదు. పరిశీలించి చర్యలు తీసుకుంటాం. – శ్రీనివాస్‌రెడ్డి, ఎక్సైజ్ సూపరింటెండెంట్ బార్‌కు వెళ్తే జేబు గుల్ల ఇటీవల ఓ ప్రాంతానికి టూర్ వెళ్లి వచ్చాను. ఫ్రెండ్స్ పార్టీ అంటే.. వారితో కలిసి మెదక్ పట్టణంలోని వైన్స్ షాపునకు వచ్చా. రాత్రి తొమ్మిదిన్నర కూడా కాలేదు. వైన్స్ షాప్ బంద్ ఉంది. ఇంకో దుకాణానికి వెళ్లా. అదీ మూసి ఉంది. ఇలా అన్ని వైన్స్ షాపులు మూసి ఉండడంతో తప్పనిసరి పరిస్థితిలో బార్‌కు వెళ్లాల్సి వచ్చింది. బిల్లు చూస్తే గుండె పోటు వచ్చినట్లయింది. జేబు గుల్ల అయింది. వైన్స్‌లో తీసుకుంటే సగం పైసలు కూడా కావు. – సురేష్, మెదక్ -
మద్యం బాటిల్లో ఫంగస్
పశ్చిమగోదావరి, తణుకు టౌన్: ఫంగస్‌తో నిండిన మద్యం బాటిల్ శనివారం రాత్రి మద్యం ప్రియులను ఆందోళనకు గురి చేసింది. తణుకు పట్టణానికి చెందిన ఒక వ్యక్తి తణుకు సొసైటీ రోడ్డులోని ఒక మద్యం షాపులో శనివారం రాత్రి ఓల్డ్ ఎడ్‌మరల్ క్వార్టర్ బాటిల్స్ రెండు కొనుగోలు చేశాడు. వెంటనే ఒక బాటిల్ ఓపెన్ చేసి సేవించారు. రెండో బాటిల్ ఓపెన్ చేసే సమయంలో పరిశీలించగా పూర్తిగా బూజు పట్టి ఉండడం గమనించి షాపు నిర్వాహకుల దృష్టికి తీసుకెళ్లాడు. అయినా ఫలితం లేదు. ఈ విషయాన్ని ఎక్సైజ్ శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్టు పేర్కొన్నారు. ఈ విషయమై తణుకు ఎక్సైజ్ సీఐ యు. సుబ్బారావును వివరణ కోరగా మద్యం బాట్లింగ్ చేసే సమయంలో ఏర్పడే లోపాల కారణంగా ఇలాంటి సమస్యలు వస్తాయని పేర్కొన్నారు. -
సీఎం క్యాంపాఫీస్ ఇలా.. మద్యం సీసాల మధ్య!!
-
నోట్ల ఎర.. మద్యం మాయ!
‘రానున్న ఎన్నికల్లో ఓడిపోతే కోల్పోయేది అధికారమే కాదు.. ఏకంగా పార్టీయే పూర్తిగా తుడిచిపెట్టుకుపోతుంది.. అందుకే ఏం చేస్తారో తెలీదు. ఎంతకైనా తెగించండి.. డబ్బు వెదజల్లండి. మద్యం ఏరులై పారించండి.. ప్రతి ఒక్కరినీ మేనేజ్ చేయండి. ఎలాగైనా గెలుపు కావాలి. అంతే..’ ఇదీ టీడీపీ అధినేత చంద్రబాబు, కార్పొరేట్ లాబీకి చేసిన ఎన్నికల మంత్రోపదేశం. దీంతో రంగంలోకి దిగిన కార్పొరేట్ మాయగాళ్లు జిల్లా టీడీపీని పూర్తిగా తమ ఆధిపత్యంలోకి తీసుకున్నారు. డబ్బు మూటలు దించుతున్నారు. మద్యం బాటిళ్లను కుమ్మరిస్తున్నారు. సామాజిక వర్గాల ప్రతినిధులు, ద్వితీయశ్రేణి నేతలకు నోట్ల ఎర వేస్తున్నారు. ఇంత జరుగుతున్నా అధికార యంత్రాంగం పట్టించుకోకపోవటం విస్మయం కలిగిస్తోంది. సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి ఖాయమని దాదాపు తేలిపోవడంతో టీడీపీ పూర్తిగా బరి తెగిస్తోంది. ఎన్నికలకు మరెన్నో రోజులు లేని సమయంలో తన అసలు రూపాన్ని బయటపెడుతోంది. డివిజన్ల వారీ గా నియోజకవర్గాలను తనకు సన్నిహితులైన కార్పొరేట్ లాబీకి చంద్రబాబు దత్తత ఇచ్చేశారు. పార్టీ ఎంపీలు సుజనా చౌదరి, సీఎం రమేష్, నామా నాగేశ్వరరావుల ఆధీనంలోని కార్పొరేట్ లాబీ జిల్లా పార్టీని తన గుప్పిట్లోకి తీసుకుంది. క్షేత్ర స్థాయిలోకి దూసుకుపోతోంది. ‘మీరు ప్రచారం చేసుకోండి. అసలు విషయమంతా మేం చూసుకుంటాం’అని అభ్యర్థులకు తేల్చి చెప్పేసింది. ఇందులోభాగంగా ఇప్పటికే డివిజన్లవారీగా బాధ్యులను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. టెక్కలి డివిజన్ బాధ్యతలను నామా నాగేశ్వరరావుకు చెందిన గ్రానైట్ సంస్థకు అప్పగించారు. ఈ సంస్థ కాకరాపల్లి థర్మల్ ప్లాంట్ యాజమాన్యంతో కలసి టీడీపీ ఆర్థిక వ్యవహారాల బాధ్యత చేపట్టింది. జిల్లా లో గ్రానైట్ వ్యాపారం చేస్తున్న ఆ సంస్థ తమ వ్యాపార కార్యకలాపాల పేరిట డబ్బు మూటలు దించుతోంది. ఒడిశాలో ఎన్నికలు ముగియడంతో అక్కడ నుంచి ఆర్థిక వ్యవహారాలను ఆపరేట్ చేస్తోంది. టెక్కలి నియోజకవర్గంలోని ఓ ప్రధాన సామాజిక వర్గానికి చెందిన ఎంపిక చేసిన ద్వితీయ శ్రేణి నేతలతో చర్చలు చేపట్టింది. టీడీపీకి మద్దతిస్తే భారీ నజరానాలు ఇస్తామని ప్రకటించింది. కింజరాపు అచ్చెన్నాయుడు సమక్షంలోనే ఈ చర్చలు సాగాయి. ఎందుకంటే ఆ సామాజిక వర్గం అచ్చెన్నను తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. కాబట్టి ఆ సామాజిక వర్గానికి చెందిన ఎంపిక చేసుకున్న నేతలను డబ్బుతో కొనేయాలన్నది టీడీపీ కార్పొరేట్ లాబీ పన్నాగం. అదేవిధంగా పలాస నియోజకవర్గంలో టీడీపీని వ్యతిరేకిస్తున్న ఓ ప్రధాన సామాజికవర్గంతోపాటు మత్స్యకార గ్రామాలపై నోట్ల వల విసిరింది. ఈ మేరకు ఇప్పటికే డబ్బు మూటలతో టీడీపీ ప్రతినిధులు మత్స్యకార గ్రామపెద్దలను కలుస్తూ హడావుడి చేస్తున్నారు. మత్స్యకార గ్రామాలపై మద్యం వల కూడా విసిరారు. భారీ ఎత్తున మద్యం సీసాలను గ్రామాల్లోకి పంపి హల్ చల్ చేస్తున్నారు. కానీ రెండు నియోజకవర్గాల్లోనూ టీడీపీ ప్రలోభాలకు ఆయా వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. తమ గ్రామాల్లోకి వస్తే అంతు చూస్తామని మత్స్యకార పెద్దలు హెచ్చరించడంతో టీడీపీ ప్రతినిధులు తోకముడిచి జారుకున్నారు.శ్రీకాకుళం డివిజన్లో టీడీపీ అభ్యర్థుల తరపున డబ్బు పంపిణీ బాధ్యతను ఎంపీ సీఎం రమేష్‌కు చెందిన సంస్థకు అప్పగించినట్లు సమాచారం. శ్రీకాకుళం పట్టణం, గార మండలాల్లో ఆ సంస్థ ప్రతినిధులు ఇప్పటికే రాత్రివేళల్లో ప్రధాన సామాజిక వర్గాల పెద్దలను కలుస్తూ మంతనాలు సాగిస్తున్నారు. 100, 150 ఓట్లు ఉన్న చోటామోటా నేతలకు కూడా భారీగా ఎర వేస్తున్నారు. శ్రీకాకుళం గుజరాతీపేటలోని నాలుగు వార్డుల్లో కాస్తో కూస్తో పట్టున్న ఓ నేతకు భారీ మొత్తాన్నే ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. ఆయన టీడీపీ ఎంపీ అభ్యర్థికి సహకరించనని ఇటీవల తేల్చిచెప్పారు. దాంతో ఆయన్ని ప్రసన్నం చేసుకునేందుకు కార్పొరేట్ లాబీ పెద్ద మొత్తాన్నే ఎరవేసింది. గార మండలంలోని తీరప్రాంత గ్రామాల్లో కూడా టీడీపీ నోట్ల కట్టలు దించుతోందని సమాచారం. ఆమదాలవలస నియోజకవర్గంలో గ్రామాలవారీగా టార్గెట్లు నిర్ణయించి నోట్ల కట్టలు దించుతున్నారు. ఇక నరసన్నపేట నియోజకవర్గం కోసం ఎంతైనా ఖర్చు చేయాలని టీడీపీ ఎంపీ అభ్యర్థి కింజరాపు రామ్మోహన్నాయుడు పట్టుదలగా ఉన్నారు. కాంగ్రెస్ ద్వితీయశ్రేణి నేతలను మేనేజ్ చేసేందుకు ఆయన భారీ ఆఫర్లే ఇస్తున్నారని తెలిసింది. తాను నేరుగా రంగంలోకి దిగకుండా కార్పొరేట్ లాబీ ప్రతినిధులను ఆ నేతల వద్దకు పంపుతున్నారు. అధికారుల తీరుపై అనుమానాలు టీడీపీ కార్పొరేట్ లాబీ యథేచ్ఛగా నోట్ల పందేరానికి బరితెగించినా అధికార యంత్రాంగం కనీస స్థాయిలో స్పందించడం లేదు. టెక్కలిలో డబ్బు మూటలు దించారన్న విషయం బహిరంగ రహస్యమే. అయినప్పటికీ ఆ పార్టీ నేతల వాహనాలనుగానీ, ఇళ్లనుగానీ పోలీసులు ఇంతవరకు తనిఖీ చేయనే లేదు. మత్స్యకార గ్రామాల్లో టీడీపీ ప్రతినిధులు డబ్బు మూటలతో తిరుగుతున్నా స్పందనే లేదు. అధికార యంత్రాంగం టీడీపీ పట్ల ఇంత ఉదాసీనంగా ఎందుకు వ్యవహరిస్తోందన్నది సందేహాస్పదంగా మారింది. -
తీస్తున్న కొద్దీ మద్యం
అలమండ(జామి), న్యూస్‌లైన్ : వెతుకుతున్నకొద్దీ మద్యం బాటిళ్లు పుట్టుకొస్తూనే ఉన్నాయి. మండలంలోని అలమండ విజయసీతారామరాజు చెరువు గర్భంలో సుమారు 1500గోవా మద్యం బాటిళ్లను గజ ఈతగాళ్లు, ఎక్సైజ్ సిబ్బంది గురువారం వెలికి తీసిన విషయం విదితమే. శుక్రవారం కూడా ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీధర్, అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ కె.వెంకటరామిరెడ్డి ఆధ్వర్యంలో గజ ఈతగాళ్లు చెరువులో గాలింపు చర్యలు చేపట్టారు. శుక్రవారం మరో 150 మద్యం బాటిళ్లు లభ్యమయ్యాయి. మొత్తం 1,650 బాటిళ్లు బయటపడినట్లు అసిస్టెంట్ సూపరింటెండెంట్ కె.వెంకటరామిరెడ్డి తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు చెప్పారు. చేపల పెంపకం కోసం చెరువును లీజుకు తీసుకున్న వ్యక్తిపైన, మరికొంతమందిపైన కేసులు నమోదు చేస్తున్నట్లు వివరించారు. గతంలో ఈ కేసులో నిందితులుగా ఉన్న ఆరుగురు వ్యక్తులను కూడా విచారణ జరుపుతున్నామని తెలిపారు. రాజానవానిపాలెంలో.. వ్యవసాయ బావిలో... కొత్తవలస : మండలంలోని కొత్తవలస మేజర్ పంచాయతీ శివారు రాజానవానిపాలెంలో ఎం.అప్పలనాయుడుకు చెందిన మామిడితోటలో గోవా మద్యం ఉన్నట్లు స్థానిక ఎక్సైజ్ పోలీసులు శుక్రవారం గుర్తించారు. ఈ ప్రాంతంలోని వ్యవసాయ బావిలో మద్యం సీసాలు ఉన్నాయని, కొంతమంది అప్పుడప్పుడు వీటిని తీసుకుని తాగుతున్నారని ఆ నోటా ఈ నోటా వినిపించడంతో ఎక్సైజ్ పోలీసులు రంగంలోకి దిగారు. ఈ బావిలో సుమారు పది అడుగుల లోతు మేరకు నీరు ఉంది. ముందుగా ఎస్.కోట ఎక్సైజ్ కానిస్టేబుల్ జైరామ్‌నాయుడు బావిలో దిగి మద్యం బాటిళ్లు ఉన్నట్లు గుర్తించారు. తొలుత ఆయన ఆరు మద్యం సీసాలను బయటకు తీశారు. దీంతో రెండు కిరోసిన్ ఇంజిన్లు రప్పించి నీరు పైకి తోడించారు. బాటిళ్లకు ఉన్న పై కప్పు రంగును బట్టి, అలమండ చెరువులో దొరికిన మద్యం.. ఈ మద్యం ఒక్కటేనని ఎక్సైజ్ పోలీసులు నిర్ధారణకు వచ్చారు. శుక్రవారం రాత్రి 8 గంటల వరకూ బావిలోఉన్న నీటిని తోడారు. ఇంకా నీరు ఉండడంతో అప్పటికి విరమించుకున్నారు. శనివారం ఉదయం మళ్లీ ప్రారంభించనున్నారు. అలాగే మండలంలోని చినమన్నిపాలెం సమీపంలో ఉన్న చెరువులో కూడా ఇటువంటి మద్యం బాటిళ్లు ఉన్నట్లు పుకార్లు వినిపిస్తున్నాయి. సమీపంలో ఉన్న చెరువుల గట్టు వద్ద ఖాళీ మద్యం బాటిళ్లు గుట్టలుగుట్టలుగా పడి ఉండడం ఈ అనుమానాలకు మరింత ఊతమిస్తోంది. విజయనగరం ఎక్సైజ్ సూపరింటెండెంట్ పి.శ్రీధర్, ఏఈఎస్ కె.వెంకటరామిరెడ్డి, కొత్తవలస ఎక్సైజ్ సీఐ రాఘవయ్య, టాస్కుఫోర్స్ సూపరింటెండెంట్ ఆచారి, ఎన్ఫోర్స్మెంట్ సీఐ శ్రీధర్, ఫ్లయింగ్ స్క్వాడ్ ఏఎస్సై సయ్యద్ జియాఉద్దీన్, వీఆర్వో రాధాకృష్ణ ఆధ్వర్యంలో గాలింపు చర్యలు చేపడుతున్నారు.