
ఫంగస్‌తో ఉన్న మద్యం బాటిల్
పశ్చిమగోదావరి, తణుకు టౌన్: ఫంగస్‌తో నిండిన మద్యం బాటిల్ శనివారం రాత్రి మద్యం ప్రియులను ఆందోళనకు గురి చేసింది. తణుకు పట్టణానికి చెందిన ఒక వ్యక్తి తణుకు సొసైటీ రోడ్డులోని ఒక మద్యం షాపులో శనివారం రాత్రి ఓల్డ్ ఎడ్మరల్ క్వార్టర్ బాటిల్స్ రెండు కొనుగోలు చేశాడు. వెంటనే ఒక బాటిల్ ఓపెన్ చేసి సేవించారు. రెండో బాటిల్ ఓపెన్ చేసే సమయంలో పరిశీలించగా పూర్తిగా బూజు పట్టి ఉండడం గమనించి షాపు నిర్వాహకుల దృష్టికి తీసుకెళ్లాడు. అయినా ఫలితం లేదు. ఈ విషయాన్ని ఎక్సైజ్ శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్టు పేర్కొన్నారు. ఈ విషయమై తణుకు ఎక్సైజ్ సీఐ యు. సుబ్బారావును వివరణ కోరగా మద్యం బాట్లింగ్ చేసే సమయంలో ఏర్పడే లోపాల కారణంగా ఇలాంటి సమస్యలు వస్తాయని పేర్కొన్నారు.