
ఆంధ్రజ్యోతికి బాగా అలవాటైపోయింది..
కర్నూలు : ఆంధ్రజ్యోతి దినపత్రికపై వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఐజయ్య తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గిరిజన ఎమ్మెల్యేలను వైఎస్ జగన్ అవమానించారనడం అవాస్తవమని ఆయన గురువారమిక్కడ అన్నారు. మేం వేసిన రోడ్లపై నడుస్తూ, మేం ఇచ్చిన పెన్షన్లు తీసుకుంటూ, మాకు ఓటు వేయరా అని ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడినప్పుడు ఎల్లో మీడియా ఎందుకు స్పందించలేదని ఐజయ్య సూటిగా ప్రశ్నించారు. తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌పై బురద చల్లడం ఆంధ్రజ్యోతికి బాగా అలవాటైందని ఆయన ధ్వజమెత్తారు. బీరు హెల్దీ డ్రింక్ అని మంత్రి జవహర్ మాట్లాడినా...ఎల్లో మీడియా ఎందుకు పట్టించుకోలేదని గుర్తు చేశారు.
కాగా రాష్ట్రపతి అభ్యర్థి రామ్‌నాథ్ కోవింద్ పరిచయ కార్యక్రమంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దళిత, గిరిజన ఎమ్మెల్యేలపై ఆగ్రహం ప్రదర్శించారంటూ ఆంధ్రజ్యోతి పత్రికలో బుధవారం ఓ కథనం ప్రచురించిన విషయం తెలిసిందే.