పర్యావరణ పరిరక్షణ కోసం మౌంట్ ఎవరెస్టుకు సైకిల్ యాత్ర చేపట్టిన పాణ్యంకు చెందిన బీటెక్ విద్యార్థి శ్రీకాంత్‌కు ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి ఆర్థిక చేయూతనిచ్చారు.
సైక్లిస్ట్‌కు ఆర్థిక చేయూత
May 26 2017 11:57 PM | Updated on Oct 30 2018 4:29 PM
కల్లూరు: పర్యావరణ పరిరక్షణ కోసం మౌంట్ ఎవరెస్టుకు సైకిల్ యాత్ర చేపట్టిన పాణ్యంకు చెందిన బీటెక్ విద్యార్థి శ్రీకాంత్‌కు ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి ఆర్థిక చేయూతనిచ్చారు. సైక్లిస్ట్ శ్రీకాంత్ శుక్రవారం కర్నూలు నగరంలోని గౌరు దంపతులను వారి స్వగృహంలో కలిశారు. ఈ మేరకు వారు శ్రీకాంత్‌ను అభినందించి రూ 10 వేలు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ 21 రోజులపాటు జరిగే సైకిల్ యాత్రను ఈ నెల 31వ తేదీన ప్రారంభించి జూన్ 20వ తేదీన మౌంట్ ఎవరెస్టు బేస్ క్యాంపు వద్ద ముగించనున్నానని తెలిపారు. ప్రతి ఒక్కరు శారీరకంగా మానసికంగా ఫిట్‌నెస్ ఉండేందుకు యోగా, ఫిట్‌నెస్ వ్యాయామం చేయాలన్నారు. సైకిల్ వాడకాన్ని పెంచి పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించాలని విజ్ఞప్తి చేశారు.
Advertisement
Advertisement