వైఎస్సార్ కుటుంబానికి విశేష స్పందన
వైఎస్సార్ కుటుంబానికి విశేష స్పందన
Published Wed, Sep 13 2017 11:22 PM | Last Updated on Tue, Oct 30 2018 4:29 PM
- పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి
– మూడోరోజు ఆరు నియోజకవర్గాల్లో కొనసాగిన కార్యక్రమం
–1,480 మందికి పార్టీ సభ్యత్వం
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు) : వైఎస్సార్ కుటుంబం కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఏ గ్రామంలో చూసినా ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకుంటున్నారని చెప్పారు. ముఖ్యంగా మహిళలు, యువకులు, రైతులు, వృద్ధులు సైతం తమ పార్టీవైపు ఆకర్షితులవుతున్నట్లు తెలిపారు. పాణ్యం నియోజకవర్గంలోని కల్లూరు అర్బన్‌లో జరిగిన వైఎస్సార్ కుటుంబం కార్యక్రమంలో ఆమె పాల్గొని ప్రసంగించారు. కాగా, మూడో రోజైన బుధవారం జిల్లాలోని ఆరు నియోజకవర్గాల్లో వైఎస్సార్ కుటుంబం కార్యక్రమం కొనసాగింది.
పాణ్యం, ఆలూరు, పత్తికొండ, బనగానపల్లె, డోన్, కోడుమూరు నియోజకవర్గాల్లోని వివిధ మండలాల్లో బూత్ కమిటీ సభ్యులు ఇళ్లిళ్లూ తిరిగి 1,300 మందికి పార్టీ సభ్యత్వం ఇప్పించారు. ఆలూరు నియోజకవర్గంలోని ఆలూరు మండలం ముసానపల్లెలో 25 మందికి, హాలహర్విలో 24 మందికి కలిపి మొత్తం 49 మందికి, బనగానిపల్లె నియోజకవర్గంలోని బనగానిపల్లె, కొలిమిగుండ్ల, అవుకు మండలాల్లో మొత్తం 320 మందికి, పాణ్యం నియోజకవర్గంలోని కల్లూరు అర్బన్‌లో 49 మంది, రూరల్‌లో 84 మంది.. మొత్తం 133 మందికి, కోడుమూరులో 20 మందికి, డోన్ పట్టణంలోని ఐదో వార్డులో 110 మంది, అవులదొడ్డిలో 78 మంది, ప్యాపిలిలో 150 మంది, బేతంచెర్లలో 280 మంది కలిపి నియోజకవ్గంలో మొత్తం 618, పత్తికొండ నియోజకవర్గంలోని పత్తికొండ మండలంలో 92, మద్దికెరలో 33, తుగ్గలి 120, కృష్ణగిరి 75, వెల్దుర్తి 30 మంది.. మొత్తం 340 మందికి పార్టీ సభ్యత్వం ఇచ్చారు.
Advertisement