gowru venkata reddy
-
బాబు ప్రోత్సాహంతోనే శిల్పాపై హత్యాయత్నం
►రౌడీషీటర్‌కు గన్ లైసెన్స్ ఎలా ఇచ్చారు? ►అభిరుచి మధును తక్షణమే అరెస్టు చేయాలి ►వైఎస్సార్సీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి కర్నూలు (ఓల్డ్‌సిటీ): ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రోత్సాహంతోనే నంద్యాలలో శిల్పా చక్రపాణిరెడ్డిపై కాల్పులు జరిగాయని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి ఆరోపించారు. ఈ మేరకు ఆయన గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. పోలింగ్ ముగిసిన కొన్ని గంటల వ్యవధిలోనే దాడి జరగడం దారుణమని పేర్కొన్నారు. అసలు నంద్యాలలో ఎన్నికల కోడ్ ఏమైందని అధికారులను ప్రశ్నించారు. ఓ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన చక్రపాణిరెడ్డిపై కాల్పులు జరిపి హతమార్చేందుకు ప్రయత్నించడం అత్యంత దారుణమైన సంఘటనగా పేర్కొన్నారు. అసలు రౌడీషీటర్‌కు గన్ లైసెన్స్ ఎలా ఇచ్చారని, కోడ్ అమలులో ఉండగానే తుపాకీతో కాల్పులు జరపడానికి అవకాశం కల్పించిందెవరని ప్రశ్నించారు. టీడీపీ రౌడీషీటర్ నడిరోడ్డుపై కత్తులతో స్వైరవిహారం చేస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారని నిలదీశారు. ఎన్నికల నిబంధనలు టీడీపీకి వర్తించవా? ముఖ్యమంత్రి చంద్రబాబు ఏదైనా జీవో ఇచ్చారేమో చూపాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రే ఫ్యాక్షనిజాన్ని పెంచి పోషిస్తున్నారని ఆరోపించారు. టీడీపీ రౌడీషీటర్ అభిరుచి మధును తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. -
ప్రాణాలకు ముప్పుందని ఆయన ముందే చెప్పినా..!
కర్నూలు: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, పత్తికొండ ఇంచార్జ్ చెరుకులపాడు నారాయణరెడ్డి దారుణహత్యకు గురవడంపై గౌరు వెంకటరెడ్డి, ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డిలు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఫ్యాక్షన్హత్యపై గౌరు చరితా రెడ్డి మాట్లాడుతూ.. 'నేను నంద్యాలలో వేరే పెళ్లిలో ఉన్నాను. నారాయణరెడ్డి హత్య విషయం వినగానే దిగ్భ్రాతి చెందాను. దివంగత నేత వైఎస్ఆర్ సీఎంగా ఉన్నప్పుడు ఫ్యాక్షన్ హత్యలు పూర్తిగా ఆగిపోయాయి. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని మళ్లీ ప్రోత్సహిస్తున్నారు. తన ప్రాణాలకు ముప్పు ఉందని నారాయణరెడ్డి ఎన్నోసార్లు బహిరంగంగానే చెప్పారు. కానీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వల్లే ఈ దారుణం చోటుచేసుకుంది. గతంలో పరిస్థితులు మళ్లీ తలెత్తడంతో వైఎస్ఆర్సీపీ నేతలను ఆందోళనకు గురిచేస్తుంది' అన్నారు. వైఎస్ఆర్సీపీ నేత గౌరు వెంకటరెడ్డి మట్లాడుతూ.. 'మొన్న ఆళ్లగడ్డలో మా పార్టీ కార్యకర్తలను చంపేశారు. ఇప్పుడు ఏకంగా పార్టీ కీలక నేతలను హత్యచేస్తున్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఫ్యాక్షన్ హత్యలు పెరుగుతున్నాయి. టీడీపీ సర్కార్ పోలీసులను వారి కనుసన్నల్లో పెట్టుకుంటుంటే.. పోలీసులు ఏ విధంగానూ ప్రతిపక్ష పార్టీ నేతలు, కార్యకర్తలకు, ప్రజలకు న్యాయం చేయలేకపోతున్నారు. వారి ప్రాణాలకు రక్షణ కల్పించలేకపోతున్నారు. అందుకు ఈ దారుణ ఘటనే నిదర్శనమని చెప్పవచ్చు. పశ్చిమగోదావరి జిల్లాలో టీడీపీ ఎమ్మెల్యే ఆరమిల్లి రాధాకృష్ణ తన ఇంటికి పిలిపించి మరీ ఇరగవరం ఎస్ఐ, రైటర్లను నిర్బంధించారని గుర్తుచేశారు. అధికార పార్టీ నేతలే తమ ఇష్టరీతిన నడుచుకుంటే పోలీసుశాఖ మాత్రం ఏం చేస్తుందన్నారు. పార్టీతో సంబంధంలేకుండా వ్యక్తిని గౌరవించే నేత ఆయన. పార్టీని ఎన్నో రకాలుగా అభివృద్ధి చేసిన వ్యక్తిని ప్రత్యర్థులు హత్య చేయడం దురదృష్టకరమని' వ్యాఖ్యానించారు. బాంబులు, కత్తులతో ప్రత్యర్థులు చేసిన దాడిలో పత్తికొండ ఇంచార్జ్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న చెరుకులపాడు నారాయణ రెడ్డితో పాటు ఆయన అనుచరుడు సాంబశివుడు దారుణహత్యకు గురైన విషయం తెలిసిందే. పెళ్లికి వెళ్లి తిరిగొస్తుండగా కృష్ణగిరి మండలం రామకృష్ణాపురం వద్ద ఈ దారుణం చోటు చేసుకుంది. -
కాంగ్రెస్ విధానాల్ని ఎండగట్టండి: గౌరు
కర్నూలు : వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో సమైక్యాంధ్ర ఉద్యమాన్ని గ్రామస్థాయి వరకూ తీసుకు వెళతామని కర్నూలు జిల్లా వైఎస్ఆర్ సీపీ కన్వీనర్ గౌరు వెంకటరెడ్డి అన్నారు. సోమవారం ఆయన పాణ్యం నియోజకవర్గ ప్రజలు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గౌరు వెంకటరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రాన్ని ముక్కలు చేసి ప్రజల జీవితాలతో చలగటం ఆడుతున్న కాంగ్రెస్ పార్టీ విధానాలను ఎండగడుతూ ప్రజల్లోకి వెళ్లాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. సమైక్యాంధ్ర ఉద్యమానికి అండగా నిలిచిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్సేనని ప్రజలకు ఇది అర్థం అయ్యేలా చెప్పి ఉద్యమాన్ని ఉధృతం చేయాలన్నారు. వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచిన సర్పంచులతో దీక్షలు చేయనున్నట్లు ఆయన తెలిపారు.