బొలెరో వాహనం బోల్తా..యువకుడి మృతి | one dies in bolero accident | Sakshi
Sakshi News home page

బొలెరో వాహనం బోల్తా..యువకుడి మృతి

Nov 9 2016 12:43 AM | Updated on Sep 4 2017 7:33 PM

పట్టణ సమీపంలోని బైపాస్‌రోడ్డులో బొలెరో వాహనం బోల్తా పడి అజయ్‌కుమార్‌(20) అనే యువకుడు మంగళవారం మృతి చెందాడు.

కళ్యాణదుర్గం రూరల్ : పట్టణ సమీపంలోని బైపాస్‌రోడ్డులో బొలెరో వాహనం బోల్తా పడి అజయ్‌కుమార్‌(20) అనే యువకుడు మంగళవారం మృతి చెందాడు. వివరాల్లోకెళ్తే.. పట్టణానికి చెందిన బోర్లు రామన్న కుమారుడు హర్షవర్ధన్, అజయ్‌కుమార్‌తో పాటు మరో నలుగురు కంబదూరు బైపాసు రోడ్డు నుంచి మల్లాపురం గ్రామం వైపు వెళ్తుండగా బొలెరో వాహనం టైర్లు పగలడంతో అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో అందులో ఉన్న అజయ్‌కుమార్‌ అక్కడికక్కడే మృతి చెందగా హర్షవర్ధన్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఇది గమనించిన స్థానికులు క్షతగాత్రులను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు  దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ శంకర్‌రెడ్డి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement