![Two People Died In Road Accident At Alluri District Paderu - Sakshi](/styles/webp/s3/article_images/2024/04/4/Road-Accident-At-Alluri-District-Paderu.jpg.webp?itok=XdGkKJPw)
సాక్షి, పాడేరు: అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. పాడేరు ఘాట్‌రోడ్డులో ఓ బొలేరో వాహనం లోయలోకి దూసుకెళ్లిన ప్రమాదంలో ఇద్దరు మృతిచెందగా మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు.
ఈ ఘటనకు సంబంధించిన వివరాల ప్రకారం.. పాడేరు ఘాట్ రోడ్ ఏసుప్రభు కార్నర్ సమీప మలుపులో బుధవారం రాత్రి సమయంలో ఓ బొలెరో వాహనం లోయలోకి దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో వాహనంలో ప్రయాణిస్తున్న ఇద్దరు మృతిచెందగా 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇక, వీరంతా ఒడిశాకి చెందిన వలస కూలీలుగా గుర్తించారు. మృతిచెందిన వారిలో ఒక బాలిక కూడా ఉంది.
ప్రమాదం జరిగిన సమయంలో బొలేరో వాహనంలో 30 మంది ఉన్నట్టు సమాచారం. ప్రమాద సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడిన వారిని అంబులెన్స్‌లో స్థానిక ఆసుపత్రికి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment