paderu ghat road
-
అల్లూరి జిల్లా: ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి
సాక్షి, పాడేరు: అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. పాడేరు ఘాట్‌రోడ్డులో ఓ బొలేరో వాహనం లోయలోకి దూసుకెళ్లిన ప్రమాదంలో ఇద్దరు మృతిచెందగా మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాల ప్రకారం.. పాడేరు ఘాట్ రోడ్ ఏసుప్రభు కార్నర్ సమీప మలుపులో బుధవారం రాత్రి సమయంలో ఓ బొలెరో వాహనం లోయలోకి దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో వాహనంలో ప్రయాణిస్తున్న ఇద్దరు మృతిచెందగా 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇక, వీరంతా ఒడిశాకి చెందిన వలస కూలీలుగా గుర్తించారు. మృతిచెందిన వారిలో ఒక బాలిక కూడా ఉంది. ప్రమాదం జరిగిన సమయంలో బొలేరో వాహనంలో 30 మంది ఉన్నట్టు సమాచారం. ప్రమాద సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడిన వారిని అంబులెన్స్‌లో స్థానిక ఆసుపత్రికి తరలించారు. -
పాడేరు ఘాట్ రోడ్డులో విరిగిపడ్డ కొండచరియలు
పాడేరు ఘాట్‌రోడ్డులో వంతమామిడి సమీపంలో కొండచరియలు విరిగిపడ్డాయి. బండరాళ్లతో పాటు పెద్ద చెట్టుకూడా రోడ్డుకు అడ్డంగా పడటంతో ఆ మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. మూడు రోజుల నుంచి భారీగా వర్షాలు పడటంతో ప్రయాణికులతో పాటు ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. -
150 కేజీల గంజాయి స్వాధీనం: ఇద్దరు అరెస్ట్
విశాఖపట్నం : విశాఖపట్నం జిల్లా పాడేరు ఘాట్ రోడ్డులో గురువారం పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా అక్రమంగా తరలిస్తున్న 150 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందుకు సంబంధించి... ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. వారిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పాడేరు ఘాట్‌రోడ్డులో రాకపోకలకు విఘాతం
పాడేరు: విశాఖ జిల్లా పాడేరు ఘాట్‌రోడ్డులో పాడేరు - వడ్డాది ప్రధాన రహదారిపై వంట్లమామిడి వద్ద ఓ భారీ వృక్షం కూలిపోయింది. గురువారం తెల్లవారుజామున వచ్చిన భారీ గాలివానతో ఈ ఘటన చోటు చేసుకోగా ఆ మార్గంలో రెండు గంటలకు పైగా వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. పోలీసులు రంగంలోకి దిగి కూలిన వృక్షాన్ని తొలగించారు.