హైదరాబాద్‌లో పట్టుకున్న ప్రత్యేక బృందం
నిజామాబాద్‌కు తరలింపు
కొనసాగుతున్న విచారణ
ఖలీల్‌వాడి: ఖాతాదారుల నుంచి డబ్బులు కాజేసిన బ్యాంక్ మేనేజర్ అజయ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. నగరంలోని పెద్దబజార్ యూనియన్ బ్యాంకులో ఖాతాదారులను మచ్చిక చేసుకొని వారి రుణాలను, డబ్బులను తీసుకొని బ్యాంక్ మేనేజర్ పరారైన విషయం తెలిసిందే. కేసులో బ్యాంక్ మేనేజర్‌పై ఇప్పటి వరకు 26 మంది నాలుగో టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీస్‌శాఖ మూడు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టింది.
ఒక పోలీసు బృందం హైదరాబాద్‌లో నాలుగు రోజులుగా మకాం వేసి మేనేజర్ అజయ్ ఆచూకీకి కోసం వాకబు చేశారు. దీంతోపాటు సాంకేతిక రంగాన్ని ఆధారం చేసుకొని కుటుంబ సభ్యులకు సంబంధించిన వివరాల ద్వారా అజయ్ ఎక్కడ ఉన్నారనే దానిపై ఆరా తీశారు. పక్కా సమాచారం మేరకు ఆదివారం హైదరాబాద్‌లో బ్యాంక్ మేనేజర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. శనివారం రాత్రే అదుపులోకి తీసుకుని బ్యాంకులో ఖాతాదారులకు సంబంధించిన లావాదేవీలపై విచారణ చేపట్టినట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment