ఢిల్లీ : భారత రక్షణ శాఖలో కరోనా కలకలం రేగింది. గత కొన్ని రోజులుగా అనారోగ్యంగా ఉన్న రక్షణశాఖ కార్యదర్శి అజయ్‌కుమార్‌కు మంగళవారం నిర్వహించిన పరీక్షలో కోవిడ్ ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో వెంటనే ఆయనను క్వారంటైన్ చేసిన అధికారులు మొత్తం కార్యాలయాన్ని శానిటైజేషన్ చేయించారు. ఆయన పనిచేస్తున్న రైసినా హిల్స్‌లోని సౌత్ బ్లాక్‌లోని మిగతా 35 మంది ఉద్యోగులను కూడా హోం క్వారంటైన్ చేశారు. ముందు జాగ్రత్త చర్యగా రాజ్‌నాథ్ సింగ్ బుధవారం కార్యాలయానికి హాజరు కాలేదు. గత కొన్ని రోజులుగా అజయ్ కుమార్.. రక్షణ శాఖ అధికారులు ఎవరెవరిని కలిశారనన్న దానిపై ఆరా తీస్తున్నారు. కేంద్ర రక్షణమంత్రి, కార్యదర్శి, ఆర్మీ చీఫ్, నేవీ చీఫ్ కార్యాలయాలు సౌత్ బ్లాక్‌లోని మొదటి అంతస్తులో ఉన్నాయి. దీంతో మొత్తం కార్యాలయాలను శుభ్రం చేయించి ఉద్యోగులను తదుపరి ఆదేశాలు వచ్చే వరకు హోం క్వారంటైన్‌లో ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. (గుజరాత్ ఫ్యాక్టరీలో ప్రమాదం..)
ఇక దేశ వ్యాప్తంగా కరోనా విజృంభిస్తోంది. వరుసగా నాలుగో రోజు కూడా 8వేలకు పైగానే కొత్త కేసులు వెలుగుచూస్తున్నాయి. లాక్‌డౌన్ 4.0లో కేంద్రం భారీ సడలింపులు ఇచ్చిన నేపథ్యంలో పక్షం రోజుల్లోనే అత్యధిక కేసులు నమోదయ్యాయి. దీంతో భారత్‌లో కరోనా కేసుల సంఖ్య రెండు లక్షలు దాటింది. ప్రపంచంలోనే కరోనా ప్రభావానికి గురైన దేశాల్లో ప్రస్తుతం మన దేశం 7వ స్థానంలో ఉంది. అంతకంతకూ పెరుగుతున్న కేసులతో అతి త్వరలోనే భారత్ అమెరికా సరసన చేరిపోయినా ఆశ్చర్యపోనవసరం లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. (ఢిల్లీలో మరోసారి భూప్రకంపనలు )
Comments
Please login to add a commentAdd a comment