అనుష్క సన్నిహితులకు ఆహ్వానాలు..! | Ajay Kumar invites close relatives to daughter Anushka wedding viral | Sakshi
Sakshi News home page

అనుష్క సన్నిహితులకు ఆహ్వానాలు..!

Dec 8 2017 5:24 PM | Updated on Dec 8 2017 5:24 PM

Ajay Kumar invites close relatives to daughter Anushka wedding viral - Sakshi

న్యూఢిల్లీ : టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ నటి అనుష్క శర్మల వివాహం త్వరలో జరగనుందని విస్తృత ప్రచారం జరుగుతోంది. ఓ వైపు లంకతో టెస్ట్ సిరీస్ తర్వాత కోహ్లీ విశ్రాంతి తీసుకోవడం ఇందుకు ఊతమిస్తోంది. విరుష్క (విరాట్-అనుష్క) జోడీ వివాహం ఈ నెల 12న ఇటలీలో కొందరు సన్నిహితుల మధ్య నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తవుతున్నట్లు రిపోర్టులు వస్తున్నాయి. ఈ సమయంలో మరో అప్‌డేట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

నటి అనుష్క తరపున కొందరు సన్నిహితులకు ఆహ్వాన పత్రికలు అందినట్లు తెలుస్తోంది. కూతురి వివాహానికి తప్పకుండా హాజరుకావాలంటూ బంధువులు, తమ ఇంటి చుట్టుపక్కల ఇళ్లల్లో ఉండే ఫ్యామిలీ ఫ్రెండ్స్‌ను అనుష్క తండ్రి అజయ్ కుమార్ శర్మ స్వయంగా ఆహ్వానించారట. అయితే ఈ విషయాన్ని బయట ఎవరికీ లీక్ చేయోద్దని, ఈ విషయం ఆనోటా ఈనోటా పాకి ప్రచారమైతే పెళ్లి వేడుకకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయని అనుష్క తండ్రి ఆందోళన చెందుతున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. లంకతో వన్డే సిరీస్‌ నేపథ్యంలో టీమిండియా క్రికెటర్లు కోహ్లీ పెళ్లికి హాజరుకారని సమాచారం. వచ్చే వారం ఆ ఈవెంట్‌పై స్పష్టత వచ్చే అవకాశాలున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement