లఖీంపూర్‌ఖేరి: కేంద్రమంత్రి అజయ్‌కుమార్ మిశ్రాను పదవి నుంచి తొలగింపు, పంటలకు కనీస మద్దతు ధర కల్పన తదితర డిమాండ్లతో యూపీలోని లఖీంపూర్‌ఖేరిలో రైతులు చేపట్టిన ఆందోళన అధికారుల హామీతో శనివారం ముగిసింది. తదుపరి కార్యాచరణపై సెప్టెంబర్ 6వ తేదీన సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్‌కేఎం) ఢిల్లీలో భేటీ అవుతుందని రైతు నేత రాకేశ్ తికాయత్ తెలిపారు.
శనివారం మధ్యాహ్నం లఖీంపూర్‌ఖేరిలో రాజాపూర్ మండి సమితి వద్ద రైతు ధర్నా ప్రాంతానికి చేరుకున్న జిల్లా మేజిస్ట్రేట్ మహేంద్ర బహదూర్ సింగ్‌కు రైతులు డిమాండ్లను వివరించారు. ఈ డిమాండ్లపై చర్చించేందుకు సెప్టెంబర్ 6వ తేదీన ప్రభుత్వం ఒక సమావేశం ఏర్పాటు చేస్తుందని మేజిస్ట్రేట్ వారికి హామీ ఇచ్చారు. దీంతో, 75 గంటలుగా కొనసాగుతున్నఅంతకుముందు రైతులు తలపెట్టిన ర్యాలీని కూడా అధికారుల హామీతో విరమించుకున్నారు. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి లఖీంపూర్‌ఖేరి లోక్‌సభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గత ఏడాది అక్టోబర్‌లో ఇక్కడ జరిగిన హింసాత్మక ఘటనల్లో నలుగురు రైతులు సహా 8 మంది మృతికి మంత్రి కుమారుడు ఆశిష్‌పై ఆరోపణలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment