minimum support prices
-
ఆరు పంటలకు ‘మద్దతు’
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా రైతన్నలకు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్ర సర్కారు తీపి కబురు అందించింది. 2025–26 మార్కెటింగ్ సీజన్‌కు గాను ఆరు పంటలకు కనీస మద్దతు ధర(ఎంఎస్పీ) పెంచుతూ కేంద్ర మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. అలాగే ఉద్యోగులకు కరువు భత్యాన్ని(డీఏ) మరో 3 శాతం పెంచింది. దీంతో మొత్తం డీఏ 53 శాతానికి చేరుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఆర్థిక వ్యవహారాలపై కేంద్ర కేబినెట్ బుధవారం సమావేశమైంది. ఈ భేటీలో తీసుకున్న నిర్ణయాలను కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి మంత్రి అశ్వినీ వైష్ణవ్ మీడియాకు వెల్లడించారు. గోధుమలు, ఆవాలు, మైసూరు పప్పు, శనగలు, పొద్దుతిరుగుడు గింజలు, బార్లీ పంటలకు మద్దతు ధర పెంచినట్లు తెలిపారు. రబీ పంట సీజన్‌కు సంబం«ధించి నాన్–యూరియా ఎరువులకు రూ.24,475 కోట్ల రాయితీ ఇస్తున్నట్లు వివరించారు. రైతుల ఆదాయం పెంచడమే ధ్యేయంగా ‘పీఎం అన్నదాత ఆయ్ సంరక్షణ్ అభియాన్’కు రూ.35 వేల కోట్లు ఇచ్చేందుకు అంగీకారం తెలిపినట్లు వివరించారు. పంటలకు కనీస మద్దతు ధర పెంపునకు త్వరలో జరగబోయే పలు రాష్ట్రాల అసెబ్లీ ఎన్నికలకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టంచేశారు. నరేంద్ర మోదీ పాలనలో రైతుల జీవితాల్లో గణనీయమైన మార్పులు వచ్చాయని చెప్పారు. మోదీ ప్రభుత్వం పట్ల రైతన్నలు సానుకూలంగా ఉన్నారని వివరించారు. రూ.2,642 కోట్లతో చేపట్టనున్న వారణాసి–పండిత్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ(డీడీయూ) మల్టీ–ట్రాకింగ్ పాజెక్టుకు కేబినెట్ ఆమోదముద్ర వేసినట్లు అశ్వినీ వైష్ణవ్ చెప్పారు. ఈ ప్రాజెక్టులో భాగంగా వారణాసిలో గంగా నదిపై రైల్ కమ్ రోడ్ బ్రిడ్జి నిర్మించనున్నట్లు తెలిపారు. రైతుల ఆదాయం పెంచడమే లక్ష్యంగా ఆరు రకాల రబీ పంటలకు కనీస మద్దతు ధర పెంచినట్లు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చెప్పారు. ఈ మేరకు ఆయన ఎక్స్‌లో పోస్టు చేశారు. కనీస మద్దతు ధర పెంచినందుకు ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలియజేశారు. రైతాంగం సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. ఉద్యోగులకు, పెన్షనర్లకు దీపావళి కానుక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు ప్రభుత్వం దీపావళి కానుక ప్రకటించింది. వారికి కరువు భత్యం 3 శాతం పెంచుతూ కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ఈ పెంపు ఈ ఏడాది జూలై 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తుందన్నారు. దీనికారణంగా కేంద్ర ఖజానాపై రూ.9,448 కోట్ల భారం పడనుందని వెల్లడించారు. డీఏ పెంపుతో దాదాపు కోటి మందికిపైగా ఉద్యోగులు, పెన్షనర్లు ప్రయోజనం పొందుతారని చెప్పారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు ఈ ఏడాది మార్చి నెలలో జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో డీఏ 4 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది జనవరి 1 నుంచి ఇది అమల్లోకి వచి్చంది. ప్రస్తుతం దేశంలో 49.18 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 64.89 లక్షల మంది పెన్షనర్లు ఉన్నారు. -
6న ఎస్కేఎం తదుపరి భేటీ
లఖీంపూర్‌ఖేరి: కేంద్రమంత్రి అజయ్‌కుమార్ మిశ్రాను పదవి నుంచి తొలగింపు, పంటలకు కనీస మద్దతు ధర కల్పన తదితర డిమాండ్లతో యూపీలోని లఖీంపూర్‌ఖేరిలో రైతులు చేపట్టిన ఆందోళన అధికారుల హామీతో శనివారం ముగిసింది. తదుపరి కార్యాచరణపై సెప్టెంబర్ 6వ తేదీన సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్కేఎం) ఢిల్లీలో భేటీ అవుతుందని రైతు నేత రాకేశ్ తికాయత్ తెలిపారు. శనివారం మధ్యాహ్నం లఖీంపూర్‌ఖేరిలో రాజాపూర్ మండి సమితి వద్ద రైతు ధర్నా ప్రాంతానికి చేరుకున్న జిల్లా మేజిస్ట్రేట్ మహేంద్ర బహదూర్ సింగ్‌కు రైతులు డిమాండ్లను వివరించారు. ఈ డిమాండ్లపై చర్చించేందుకు సెప్టెంబర్ 6వ తేదీన ప్రభుత్వం ఒక సమావేశం ఏర్పాటు చేస్తుందని మేజిస్ట్రేట్ వారికి హామీ ఇచ్చారు. దీంతో, 75 గంటలుగా కొనసాగుతున్నఅంతకుముందు రైతులు తలపెట్టిన ర్యాలీని కూడా అధికారుల హామీతో విరమించుకున్నారు. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి లఖీంపూర్‌ఖేరి లోక్‌సభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గత ఏడాది అక్టోబర్‌లో ఇక్కడ జరిగిన హింసాత్మక ఘటనల్లో నలుగురు రైతులు సహా 8 మంది మృతికి మంత్రి కుమారుడు ఆశిష్‌పై ఆరోపణలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. -
రైతులకు గుడ్ న్యూస్.. కనీస మద్దతు ధర పెంచిన కేంద్రం
సాక్షి, న్యూఢిల్లీ: తొలకరి పలకరిస్తున్న వేళ అన్నదాతకు కేంద్రం శుభవార్త తెలిపింది. ఖరీఫ్ సీజన్ ఆంరభమవుతున్న తరుణంలో 2022–23 సీజన్‌కు వరి సహా 14 రకాల పంటల మద్దతు ధరలను పెంచింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ భేటీలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. వరి సాధారణ, గ్రేడ్–ఏ రకాలపై మద్దతు ధరను రూ.100 పెంచారు. సాధారణ రకం క్వింటాల్ రూ.1,940 ఉండగా తాజా నిర్ణయంతో రూ. 2,040కు పెరగనుంది. గ్రేడ్–ఏ రకం రూ.1,960 నుంచి రూ.2,060కు పెరగనుంది. రైతులకు మరింత ఆర్థ్ధిక ప్రోత్సాహమిచ్చేందుకు వరి విస్తీర్ణాన్ని పెంచేలా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. పప్పుధాన్యాలు..నూనె గింజల సాగుకు ప్రోత్సాహమిచ్చేలా... కొన్నేళ్లుగా నూనెగింజలు, పప్పుధాన్యాల ధరలు దేశీయంగా అనూహ్యంగా పెరగడం, దిగుమతులపై ఎక్కువగా ఆధారపడుతున్న నేపథ్యంలో దిద్దుబాటు చర్యలు తీసుకుంది. వంట నూనెల దిగుమతిని తగ్గించేందుకు, దేశీయంగా నూనె గింజల దిగుబడిని పెంచేలా రైతులను ప్రోత్సహించేందుకు వాటి మద్దతు ధరలను గణనీయంగా పెంచింది. నువ్వుల మద్దతు ధర గరిష్టంగా రూ.523, సోయాబీన్ రూ.350, సన్‌ఫ్లవర్ రూ.300, వేరుశనగ రూ.300 పెరిగాయి. పెసర ధర రూ.480, కంది, మినప రూ.300 పెరిగాయి. జాతీయ సగటు ఉత్పత్తి వ్యయానికి ఒకటిన్నర రెట్లుండేలా మద్దతు ధరను నిర్ణయించినట్టు కేంద్రం ప్రకటించింది. తాజా పెంపుతో ఎనిమిది పంటలకు మద్దతు ధర ఉత్పత్తి వ్యయం కంటే ఒకటిన్నర రెట్లు ఎక్కువగా ఉంటుందని కేంద్ర సమాచార, ప్రసార మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. పప్పుధాన్యాలు, నూనెగింజల సాగును మరింతగా ప్రోత్సహించడం, డిమాండ్–సరఫరా అసమతుల్యతను సరిచేయడానికి మద్దతు ధరలను పెంచామన్నారు. రైతుల ఆదాయాన్ని పెంచేందుకు, వ్యవసాయ రంగ సమగ్రాభివృధ్ధికి మోదీ ప్రభుత్వం ఎనిమిదేళ్లలో అనేక కార్యక్రమాలు చేపట్టిందన్నారు. కేబినెట్ ఇతర నిర్ణయాలు భారత్–యూఏఈ మధ్య పరిశ్రమలు, అధునాతన పరిజ్ఞానాల్లో సహకారానికి అవగాహన ఒప్పంద ప్రతిపాదనను కేబినెట్ ఆమోదించింది. 10 సమాచార ఉపగ్రహాలను అంతరిక్ష శాఖ అధీనంలోని ఎన్ఎస్ఐఎల్కు బదిలీ చేసే ప్రతిపాదనను కూడా ఆమోదించింది. వాతావరణ మార్పులపై సంయుక్త పరిశోధన కోసం ఏరిస్, జపాన్‌కు చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్ ఒప్పందానికీ ఆమోదముద్ర వేసింది. -
ప్రతి రైతుకూ ‘మద్దతు’
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రతి రైతన్నకూ కచ్చితంగా ఎంఎస్పీ (కనీస మద్దతు ధర) దక్కేలా చూడటం, ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేయడం ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. ఈ దిశగా వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాలు, అధికారులు కృషి చేయాలని సూచించారు. పంటల కొనుగోళ్లలో ఆర్బీకేలు క్రియాశీల పాత్ర పోషించాలన్నారు. ధాన్యం కొనుగోలు చేసిన 21 రోజుల్లోగా రైతులకు చెల్లింపులు జరగాలని నిర్దేశించారు. రైతన్నలపై రవాణా వ్యయం, గోనె సంచుల కొనుగోలు, హమాలీ ఖర్చుల భారం పడకూడదని ఆదేశించారు. పంటల కొనుగోళ్లకు సంబంధించి సమస్యలపై ఫిర్యాదుల కోసం ప్రత్యేకంగా ఫోన్ నంబర్ ఉండాలని, పంటల కొనుగోలు బాధ్యతను ఆర్బీకేల్లో ఐదుగురు సిబ్బందికి అప్పగించాలని సూచించారు. ధాన్యం, ఇతర పంటల కొనుగోళ్లపై ముఖ్యమంత్రి జగన్ సోమవారం తన క్యాంపు కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ధాన్యం, ఇతర పంటల కొనుగోళ్లపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహిస్తున్న సీఎం వైఎస్ జగన్ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా.. రైతులకు సేవలందించడంలో అలసత్వం వహించరాదు. సమాచార లోపం ఉండకూడదు. తరచూ రైతులతో మాట్లాడాలి. రంగు మారిన, తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు గతంలో ఎవరూ ముందుకొచ్చిన దాఖలాలు లేవు. చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ఇప్పుడు ఆ ధాన్యాన్ని కూడా కొనుగోలు చేసి రైతన్నలకు గరిష్టంగా వీలైనంత మేర ప్రయోజనం కల్పిస్తున్నాం. వారికి భరోసా కల్పిస్తున్నాం. ధాన్యం కొనుగోళ్లలో మిల్లర్ల పాత్ర ఉండకూడదు. కొనుగోలు తర్వాతే మిల్లర్ల పాత్ర ఉండాలి. ధాన్యం నాణ్యత పరిశీలనలో రైతులు మోసాలకు గురి కారాదు. విదేశాలకు నేరుగా ప్రభుత్వం నుంచే ఎగుమతులు చేసేలా చర్యలు చేపట్టాలి. దీనివల్ల రైతులకు మేలు జరుగుతుంది. ఆర్బీకేలో ఐదుగురు సిబ్బందిదే బాధ్యత.. ధాన్యం, పంటల కొనుగోలు కోసం ప్రతి ఆర్బీకేలో కనీసం ఐదుగురు సిబ్బంది ఉండాలి. టెక్నికల్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్‌తోపాటు ఇతర సిబ్బంది ముగ్గురు తప్పనిసరిగా ఉండాలి. ప్రతి ఆర్బీకేలో కేటగిరీతో సంబంధం లేకుండా ఐదుగురు సిబ్బంది ఉండాలి. రైతుల దగ్గరకు వెళ్లి మాట్లాడి కొనుగోలుకు సంబంధించి అవసరమైన బాధ్యతలన్నీ వారే నిర్వర్తించాలి. గోనె సంచులు, రవాణా వాహనాలు, హమాలీలను ఈ ఐదుగురు సిబ్బందే ఏర్పాటు చేయాలి. వాటికోసం రైతులు ఇబ్బందులు పడే పరిస్థితి ఉండకూడదు. ఆ భారం రైతులపై పడకుండా చర్యలు తీసుకోవాలి. కృష్ణా జిల్లా గొల్లపూడిలోని రైతు భరోసా కేంద్రం వద్ద ధాన్యం ఆరబోస్తున్న మహిళ నిశితంగా పరిశీలించి క్షేత్రస్థాయి పర్యటనలు.. ధాన్యం కొనుగోలు చేసిన 21 రోజుల్లోగా చెల్లింపులు జరిపి రైతులకు డబ్బులు అందేలా చర్యలు తీసుకోవాలి. దీనిపై అధికారులు ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి. చెల్లింపులు ఆలస్యం కాకుండా చూడాలి. అన్ని కొనుగోలు కేంద్రాలు తెరిచారా? లేదా? అనే అంశంపై దృష్టి పెట్టండి. ప్రతి కొనుగోలు కేంద్రం వద్ద సరిపడా సిబ్బంది ఉన్నారో లేదో పరిశీలించండి. కొనుగోలు ప్రక్రియ జరుగుతున్న తీరును నిశితంగా గమనించండి. వీటన్నిటిపై వచ్చే మూడు నాలుగు రోజులు దృష్టి పెట్టండి. తర్వాత క్షేత్రస్థాయి పర్యటనలు జరిపి మీ దృష్టికి వచ్చిన సమస్యలను పరిష్కరిస్తూ ముందుకు వెళ్లాలి. సీసీఆర్సీ కార్డ్స్‌పై మరింత అవగాహన కౌలు రైతులకు సీసీఆర్సీ (క్రాప్ కల్టివేటర్ రైట్స్ కార్డ్) కార్డుల జారీపై అవగాహన కల్పించాలి. సీసీఆర్సీ కార్డుల వల్ల భూ యజమానుల హక్కులకు ఎలాంటి భంగం వాటిల్లదన్న విషయాన్ని చెప్పాలి. ప్రత్యామ్నాయ పంటలకు ప్రత్యేక బోనస్ రైతులు ప్రత్యామ్నాయ పంటలను సాగు చేసేలా అవగాహన పెంపొందించండి. అలా పంటలు పండించే వారికి ప్రత్యేక బోనస్ ఇచ్చే అంశాన్ని అధికారులు పరిశీలించాలి. ప్రత్యామ్నాయ పంటల సాగుపై కార్యాచరణ సిద్ధం చేయండి. వాటి కొనుగోలు బాధ్యతను కూడా ప్రభుత్వమే చేపడుతుందన్న విషయాన్ని తెలియచేయాలి. రైతులకు మంచి ఆదాయం కల్పించే దిశగా చర్యలు తీసుకోవాలి. సగటున 42,237 టన్నుల కొనుగోలు రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు రోజుకు సగటున 42,237 మెట్రిక్ టన్నులకు చేరినట్లు అధికారులు తెలిపారు. రానున్న రోజుల్లో మరింత ఉధృతంగా కొనుగోళ్లు జరుగుతాయని చెప్పారు. సమీక్షలో మంత్రులు కన్నబాబు, కొడాలి నాని, సీఎస్ సమీర్‌శర్మ, వ్యవసాయశాఖ స్పెషల్ సీఎస్ పూనం మాలకొండయ్య, మార్కెటింగ్, సహకార శాఖ ముఖ్య కార్యదర్శి వై.మధుసూధనరెడ్డి, సివిల్ సఫ్లైస్ కమిషనర్ ఎం.గిరిజాశంకర్, వ్యవసాయశాఖ కమిషనర్ హెచ్.అరుణ్‌కుమార్, అగ్రికల్చర్, మార్కెటింగ్ శాఖ కమిషనర్ పీఎస్ ప్రద్యుమ్న, సివిల్ సఫ్లైస్ డైరెక్టర్ ఎస్.డిల్లీరావు, సివిల్ సఫ్లైస్ ఎండీ జి.వీరపాండ్యన్ తదితరులు పాల్గొన్నారు. ఫిర్యాదుల కోసం ఫోన్ నంబర్ పంటల కొనుగోలు సంబంధిత సమస్యలపై ఫిర్యాదులు, విజ్ఞాపనల కోసం ప్రతి ఆర్బీకేలో నంబర్ ఏర్పాటు చేయాలి. ఆ నంబర్‌కు వచ్చే ఫిర్యాదులను సీరియస్‌గా తీసుకోవాలి. క్షేత్రస్థాయి పర్యటనలు జరిపి రైతులు చెప్పే సమస్యలను వినాలి. దీనివల్ల సమస్య తీవ్రత తెలియడంతోపాటు పరిష్కార మార్గాలు లభిస్తాయి. రైతులతో అధికారులు నిరంతరం సంప్రదించాలి. జేసీల నుంచి కూడా పంటల కొనుగోలుపై ఫీడ్ బ్యాక్ తీసుకోవాలి. -
రైతన్నకు 100 % ‘మద్దతు’
సాక్షి, అమరావతి: రైతులకు కనీస మద్దతు ధర లభించేలా చూసేందుకే ధాన్యం కొనుగోళ్లలో మిల్లర్ల పాత్రను తొలగించామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. గతంలో ఎవరూ ఇలా చేయలేదన్నారు. కలెక్టర్లు, జేసీలు రైతులకు ఎంఎస్పీ దక్కేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. స్పందనలో భాగంగా ఉన్నతాధికారులతో మంగళవారం తన క్యాంపు కార్యాలయం నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ధాన్యం కొనుగోళ్లు, వ్యవసాయ రంగంలో మౌలిక సదుపాయాలు, ప్రాసెసింగ్ యూనిట్లపై ముఖ్యమంత్రి జగన్ పలు సూచనలు చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రైతులు దోపిడీకి గురి కారాదు అన్నదాతల కష్టాలను దృష్టిలో ఉంచుకుని తడిసిన, రంగు మారిన ధాన్యాన్నీ కూడా కొనుగోలు చేశామని, గతంలో ఎప్పుడూ లేనివిధంగా రైతులను ఆదుకున్నామని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. ఎంఎస్పీకి ఒక్క పైసా కూడా తగ్గకుండా రైతులకు ధర అందాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ దోపిడీకి గురి కారాదని స్పష్టం చేశారు. రైతులకు మంచి ధర అందించాలన్న తపనతో ముందుకు సాగాలని నిర్దేశించారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియలో కేవలం రైతుల పేర్లను నమోదు చేయడంతో సరిపెట్టకూడదని, అక్కడితో బాధ్యత పూర్తైందని భావించరాదని స్పష్టం చేశారు. కొనుగోళ్లపై రోజువారీ సమీక్ష రోజువారీగా కొనుగోలు కేంద్రాలు, కొనుగోళ్లపై కలెక్టర్లు సమీక్ష చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ధాన్యం కొనుగోలులో అవసరమైన కూలీలను కూడా ఆర్బీకేల పరిధిలో సమీకరించుకోవాలని, ప్రక్రియను ఎప్పటికప్పుడు మెరుగుపరుచుకోవాలని సూచించారు. రైతుల నుంచి నిరంతరం ఫీడ్ బ్యాక్ తీసుకుంటూ ఎప్పటికప్పుడు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. రైతులకు ఎంఎస్పీ దక్కడం, దోపిడీకి గురి కాకుండా చూడటం, కొనుగోళ్ల ప్రక్రియలో మిల్లర్ల పాత్రను నివారించడం మన ముందున్న లక్ష్యాలని స్పష్టం చేశారు. పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాలు వ్యవసాయ రంగంలో పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నామని ముఖ్యమంత్రి జగన్ గుర్తు చేశారు. ‘ప్రతి గ్రామ సచివాలయం పరిధిలో ఆర్బీకేలను తెచ్చి విత్తనం నుంచి కొనుగోళ్ల వరకూ సేవలు అందిస్తున్నాం. పంటల ధరలపై పర్యవేక్షణకు సీఎం యాప్‌ను తెచ్చాం. 1,100 మల్టీ పర్పస్ గోడౌన్లు, ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేస్తున్నాం. వీటిపై కలెక్టర్లు దృష్టి సారించాలి. గోడౌన్ల నిర్మాణానికి వెంటనే చర్యలు తీసుకోవాలి’ అని ముఖ్యమంత్రి జగన్ సూచించారు. నెలాఖరు కల్లా భూముల గుర్తింపు ‘పార్లమెంట్ నియోజకవర్గాల స్థాయిలో ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తున్నాం. 26 చోట్ల వీటిని నెలకొల్పుతున్నాం. అవసరాలను బట్టి వీటికి భూములు గుర్తించి అప్పగించే ప్రక్రియ నెలాఖరు కల్లా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలి’ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. -
మద్దతు ధరకు చట్టబద్ధత
న్యూఢిల్లీ: వివాదాస్పద వ్యవసాయ చట్టాలను కేంద్రం వెనక్కి తీసుకునేలా చేసిన రైతన్నలు ఇక కనీస మద్దతు ధర కోసం పోరుబాట పట్టనున్నారు. కనీస మద్దతు ధరకు కేంద్రం చట్టబద్ధత కల్పించేంతవరరు ఉద్యమాన్ని కొనసాగించడానికి వ్యూహాలు రచిస్తున్నారు. భవిష్యత్ కార్యాచరణపై చర్చించేందుకు ఢిల్లీలో ఆదివారం సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) సమావేశమైంది. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఉత్తరప్రదేశ్‌లో బలప్రదర్శన చేయాలని నిర్ణయానికొచ్చింది. సోమవారం లక్నోలో మహాపంచాయత్ కార్యక్రమాన్ని నిర్వహించి, కేంద్రానికి రైతుల బలమేంటో మరోసారి చూపిస్తామని రైతు సంఘం నాయకుడు రాకేశ్ తికాయత్ చెప్పారు. ‘‘వ్యవసాయ రంగంలో ఎన్ని సంస్కరణలు తీసుకువచ్చినా రైతన్నల కష్టాలు తీరవు. కనీస మద్దతు ధరకి చట్టబద్ధత కల్పించడమే అతి పెద్ద సంస్కరణ’’ అని అన్నారు. పార్లమెంట్లో వ్యవసాయ చట్టాల ఉపసంహరణతో పాటు తాము చేస్తున్న డిమాండ్లన్నీ కేంద్రం నెరవేర్చేవరకు వెనుకడుగు వేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. కనీస మద్దతు ధరపై చట్టం చేసేవరకు ఉద్యమం కొనసాగేలా కార్యాచరణ రూపొందించనున్నారు. ఇందుకోసం మరోసారి ఈ నెల 27న సమావేశం కావాలని నిర్ణయించారు. రైతు సంఘాలు ఆరు డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం ముందు ఉంచాయి. వీటిపై తమతో కేంద్ర ప్రభుత్వం చర్చలు ప్రారంభించేదాకా ఆందోళన కొనసాగిస్తామని తేల్చిచెప్పాయి. 29న పార్లమెంట్ వరకూ ర్యాలీ తమ డిమాండ్ల సాధన కోసం కేంద్రంపై ఒత్తిడి పెంచే కార్యక్రమాలను రైతులు ముమ్మరం చేయనున్నారు. సోమవారం లక్నోలో కిసాన్ పంచాయత్‌తో పాటు ఈ నెల 26న ఢిల్లీలో అన్ని సరిహద్దుల్లో మోహరిస్తామని, పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యే రోజు అంటే ఈ నెల 29న పార్లమెంట్ వరకు ర్యాలీ నిర్వహిస్తామని రైతు సంఘం నేత బల్బీర్ సింగ్ రాజేవాలే వెల్లడించారు. 24న కేంద్ర కేబినెట్ సమావేశం న్యూఢిల్లీ: వ్యవసాయ చట్టాలను రద్దు చేయడానికి అవసరమైన అధికార ప్రక్రియను త్వరితంగా పూర్తి చేయడానికి కేంద్ర ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తోంది. ఈ నెల 24న (బుధవారం) కేంద్ర మంత్రిమండలి సమావేశమయ్యే అవకాశాలున్నాయని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఈ సమావేశంలో మూడు వివాదాస్పద వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవడానికి కేబినెట్ తీర్మానాన్ని ఆమోదించనుంది. వచ్చే పార్లమెంటు సమావేశాల్లోనే వ్యవసాయ చట్టాల రద్దు చేస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించిన విషయం తెలిసింది. ఈ నెల 29 నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఆ సమావేశాల కంటే ముందుగానే కేబినెట్ సమావేశమై చట్టాల రద్దుపై చర్చించి దానికి అవసరమైన తీర్మానాన్ని ఆమోదిస్తుంది. ఆపై ఉపసంహరణ బిల్లుకు తుదిరూపమిస్తారు. ప్రధాని మోదీకి బహిరంగ లేఖ సంయుక్త కిసాన్ మోర్చా ఆదివారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి బహిరంగ లేఖ రాసింది. ఎంఎస్పీకి చట్టబద్ధతతోపాటు మొత్తం ఆరు డిమాండ్లపై రైతులతో తక్షణమే చర్చలు ప్రారంభించాలని పేర్కొంది. అప్పటిదాకా పోరాటం కొనసాగుతుందని తేల్చిచెప్పింది. మూడు సాగు చట్టాలను రద్దు చేస్తామని ప్రకటించినందుకు కృతజ్ఞతలు తెలియజేసింది. ‘‘11 రౌండ్ల చర్చల తర్వాత ద్వైపాక్షిక పరిష్కార మార్గం కనుగొనడం కంటే మీరు(ప్రధాని మోదీ) ఏకపక్ష తీర్మానానికే మొగ్గుచూపారు’’ అని లేఖలో ప్రస్తావించింది. రైతు సంఘాల ఆరు డిమాండ్లు ► పంటలకు కనీస మద్దతు ధరకు(ఎంఎస్పీ) చట్టబద్ధత కల్పించాలి. ► గత ఏడాది కాలంగా జరిగిన ఆందోళనల్లో ప్రాణాలు కోల్పోయిన 700 మందికి పైగా రైతు కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాలి. ► రైతులపై నమోదు చేసిన కేసులన్నీ ఉపసంహరించుకోవాలి. ► పోరాటంలో రైతుల ప్రాణత్యాగాలకు గుర్తుగా ఒక స్మారక స్తూపం నిర్మించాలి. ► పెండింగ్‌లో ఉన్న వ్యవసాయ విద్యుత్ బిల్లులను మాఫీ చేయాలి. ప్రతిపాదిత విద్యుత్ సవరణ బిల్లు–2020/21 ముసాయిదాను వెనక్కి తీసుకోవాలి. ‘‘దేశ రాజధాని ప్రాంతం, పరిసర ప్రాంతాల్లో వాయు నాణ్యత నిర్వహణ కమిషన్ చట్టం–2021’ లో రైతులపై జరిమాన విధించే అంశాలను తొలగించాలి. హా లఖీమీపూర్ ఖేరి ఘటనకు సంబంధించి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రాను పదవి నుంచి తొలగించి, అరెస్టు చేయాలి. -
ప్రతి పంటకూ మద్దతు ధర కల్పిస్తున్నాం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పండిన ప్రతి పంటకూ మార్కెటింగ్ సౌకర్యం కల్పించి ప్రతి రైతుకూ మద్దతు ధర వచ్చేలా చూస్తున్నామని వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య చెప్పారు. ఈ ఏడాది మామిడి సీజన్లో 27 కిసాన్ రైళ్ల ద్వారా 16 వేల మెట్రిక్ టన్నుల మామిడిని ఎగుమతి చేసి రైతులకు మద్దతు ధర కల్పించినట్టు వెల్లడించారు. తాడేపల్లిలోని విపత్తుల నిర్వహణ శాఖ కార్యాలయంలో ఉద్యాన శాఖ కమిషనర్ శ్రీధర్‌తో కలిసి శనివారం మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. మామిడి కిలోకు సరాసరి ధర రూ.12కు తగ్గకుండా చూస్తున్నామని హామీ ఇచ్చారు. అంతకంటే తక్కువ ధరకు కొనుగోలు చేస్తే ప్రాసెసింగ్ యూనిట్లపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఉద్యాన శాఖ కమిషనర్ ప్రతి వారం చిత్తూరు వెళ్లి పరిస్థితిని సమీక్షిస్తున్నారని, కలెక్టర్ కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారని చెప్పారు. తప్పుడు ప్రచారంతో మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీయొద్దు కొందరు మామిడిపై తప్పుడు ప్రచారంతో మార్కెట్లో సెంటిమెంట్‌ను దెబ్బతీస్తున్నారని మాలకొండయ్య ఆవేదన వ్యక్తం చేశారు. మామిడి రైతుల్లో అనవసర భయాందోళనలు సృష్టించవద్దని అందరినీ కోరుతున్నామన్నారు. దుష్ప్రచారం చేస్తే పరువు నష్టం దావా వేస్తామని హెచ్చరించారు. మామిడి రైతులకు సరైన ధర రాదు అనే భయాన్ని కల్పించవద్దని కోరారు. ధరల స్థిరీకరణపై ప్రతి రోజూ సమీక్షించి అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. కోవిడ్ రెండో దశ మొదలైనప్పటి నుంచి ఉద్యాన రైతులు పంట ఉత్పత్తుల్ని అమ్ముకోవడానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో అనేక చర్యలు తీసుకున్నామని వివరించారు. రాష్ట్రంలోని ఉద్యాన రంగంలో ఉన్న 256 ఎఫ్‌పీవో (రైతు సంఘాలు)లను వ్యాపారులు, మార్కెట్లతో అనుసంధానం చేసినట్టు తెలిపారు. ఏపీకి ప్రధాన మార్కెట్లయిన ఢిల్లీ, ముంబై, చెన్నైలోని కమిషనర్లు, మార్కెటింగ్ సెక్రటరీలు, పోలీసులతో మాట్లాడి రవాణా, ఎగుమతులకు కావాల్సిన ఏర్పాట్లు చేశామని చెప్పారు. మామిడి తోటలన్నీ రైతు భరోసా కేంద్రాల ద్వారా ఈ–క్రాప్‌లో నమోదయ్యాయని, ఆ డేటాను బట్టి అక్కడి వ్యవసాయ, ఉద్యాన సహాయకులకు ఏం చేయాలో చెప్పామన్నారు. కరోనా విపత్తు వల్ల పంట కోత సమయాల్లో కర్ఫ్యూ అమల్లో ఉన్నా రైతులు పండించిన పంటలను మార్కెట్‌కి తరలించేలా పకడ్బందీ చర్యలు తీసుకున్నామని వివరించారు. పండ్ల రవాణాకు ఎప్పుడు ఇబ్బంది లేకుండా చూశామని చెప్పారు. చిత్తూరు జిల్లాలో ఇంకా 30 శాతం మామిడి పంట జూలై చివరి నాటికి వస్తుందని తెలిపారు. 2 వేల గోడౌన్లకు 8న సీఎం శంకుస్థాపన వైఎస్సార్ రైతు దినోత్సవం సందర్భంగా జూలై 8వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా 2 వేల గోడౌన్లు నిర్మాణానికి సీఎం జగన్ శంకుస్ధాపన చేస్తున్నారని మాలకొండయ్య తెలిపారు. దశలవారీగా రానున్న ఏడాది కాలంలో ప్రతి మేజర్ పంచాయతీలో ఒక గోడౌన్, ప్రతి ఆర్బీకేలో 500 మెట్రిక్ టన్నుల గోడౌన్ నిర్మాణాం చేపట్టాలన్నది సీఎం ఆలోచన అని తెలిపారు. వెయ్యి మెట్రిక్ టన్నుల గోడౌన్స్ నిర్మాణానికి కూడా ప్లాన్ చేస్తున్నామని, వీటివల్ల రైతులు వారి ఉత్పత్తులను అక్కడే నిల్వ చేసుకోవచ్చన్నారు. ఉద్యాన పంటల కోసం ప్రతి ఆర్బీకేలో కోల్డ్ స్టోరేజీ ప్లాంట్ల ఏర్పాటుకు సీఎం నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. దీనికి సంబంధించి టెండర్ల ప్రక్రియతో పాటు అన్ని పనులు పూర్తయ్యాయన్నారు. ప్రతి జిల్లాలో పుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల నిర్మాణానికి సీఎం జగన్ ఆదేశాలతో ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని, నూజివీడులో మ్యాంగో ప్రాసెసింగ్ యూనిట్, తూర్పుగోదావరిలో కొబ్బరి ప్రాసెసింగ్ యూనిట్ నిర్మాణానికి సన్నాహాలు చేస్తున్నామని వివరించారు. అలా 25 చోట్ల ఫల ఉత్పత్తులకు సంబంధించి సుమారు రూ.2,500 కోట్లతో సెకండరీ ప్రాసెసింగ్ యూనిట్ల నిర్మాణం చేపడుతున్నట్టు చెప్పారు. సాగు విస్తీర్ణం పెరిగింది ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాల వల్ల రాష్ట్రంలో ఉద్యాన పంటల సాగు విస్తీర్ణం పెరిగిందని మాలకొండయ్య తెలిపారు. మార్కెట్లో ఉద్యాన శాఖ మార్కెట్ జోక్యం వల్ల రైతులకు భరోసా లభించిందన్నారు. దీనివల్ల ఏడాది కాలంలోనే రైతులు ఇతర పంటల నుంచి సుమారు 65 వేల హెక్టార్లలో ఉద్యానవన పంటల వైపు మళ్లారని తెలిపారు. ఉద్యాన శాఖలో కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెస్తున్నామని, డ్రోన్ల ద్వారా ఎరువులు స్ప్రే చేసే వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఇతర పంటలకూ మంచి ధరలు రాష్ట్రంలోని రైతులు పండించిన ఇతర పంటలకూ మంచి ధరలు లభించేలా ప్రభుత్వం చేపట్టిన చర్యలు సత్ఫలితాలిచ్చాయని మాలకొండయ్య పేర్కొన్నారు. క్వింటాల్ పసుపునకు రూ.6,850, మిరపకు రూ.7 వేలు, బత్తాయికి రూ.1,450, ఉల్లికి రూ.750, అరటికి రూ.800, చిరు ధాన్యాలకు రూ.2,500 ధర కల్పించామన్నారు. వరి పంట కాకుండా ఇతర పంటలకు మద్దతు ధర కల్పించేందుకు ఇప్పటివరకూ రూ.6 వేల కోట్లను ప్రభుత్వం ఖర్చు చేసిందని చెప్పారు. కేంద్రం కనీస మద్దతు ధరలు (ఎంఎస్పీ) ప్రకటించని పంటలకు సైతం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశాల మేరకు శ్రేణీకృత మద్దతు ధర (గ్రేడెడ్ ఎంఎస్పీ)లను ప్రభుత్వం ప్రకటించిందని తెలిపారు. వేరుశనగ ఏ గ్రేడ్‌కు కేంద్రం ఎంఎస్పీ ప్రకటిస్తుందని, బి గ్రేడ్ పండించిన రైతులకునా ధర లభించదన్నారు. అందుకే రాష్ట్ర ప్రభుత్వం గ్రేడెడ్ ఎంఎస్పీ ప్రకటించారు. పొగాకు బోర్డు గుంటూరులో ఉన్నా కోవిడ్ సమయంలో వాళ్లు ఏమీ చేయలేకపోయారని, సీఎం ఆదేశాలతో మార్కెటింగ్ శాఖ జోక్యం చేసుకుని రైతులకు మంచి ధర వచ్చేటట్టు చేయగలిగిందని గుర్తు చేశారు. -
పసుపు ధర పైపైకి
సాక్షి, అమరావతి: మూడేళ్ల తర్వాత పసుపు ధర పైపైకి ఎగబాకుతోంది. ఇప్పటికే క్వింటాల్ రూ.7,900 వరకు పలుకుతున్న పసుపు మరో నెలలో రూ.10 వేల మార్క్‌ను అందుకునే అవకాశాలు కనిపిస్తుండటంతో రైతులు సంతోషిస్తున్నారు. పసుపు సాగులోనే కాదు.. ఉత్పత్తిలో కూడా ప్రపంచంలో 70–75 శాతం మనదేశంలోనే జరుగుతుంది. పసుపు మన రాష్ట్రంతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణల్లో ఎక్కువగా సాగవుతుంది. మన రాష్ట్రంలో 30,518 హెక్టార్లలో సాలెం, దుగ్గిరాల, మైదుకూరు రకాల పసుపు సాగవుతుండగా దుగ్గిరాల, నంద్యాల, కడప మార్కెట్ల ద్వారా అమ్మకాలు జరుగుతాయి. ఖరీఫ్‌లో ఏటా జూన్–జూలైలో పంట వేస్తారు. మరుసటి ఏడాది మార్చి నాలుగో వారం నుంచి పంట మార్కెట్లోకి వస్తుంది. రాష్ట్రంలో పండే పసుపులో 50 శాతం రాష్ట్ర పరిధిలోను, 20 శాతం పొరుగు రాష్ట్రాల్లోను వినియోగమవుతుండగా, 30 శాతం వరకు ముంబై, కోల్‌కతాల మీదుగా బంగ్లాదేశ్, సౌదీ, దుబాయ్ వంటి దేశాలకు ఎగుమతవుతుంది. ఉత్తరాది రాష్ట్రాల వ్యాపారులు కూడా మన మార్కెట్లకు వచ్చి పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తుంటారు. గతేడాది మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు కేంద్రం కనీస మద్దతు ధర (ఎమ్మెస్పీ)లు ప్రకటించే పంటల జాబితాలో లేని పసుపునకు తొలిసారిగా గతేడాది రాష్ట్ర ప్రభుత్వమే ఎమ్మెస్పీ ప్రకటించింది. దానికంటే మార్కెట్లో ధర తక్కువగా ఉండడంతో మార్కెట్లో జోక్యం చేసుకుని కొనుగోలు పథకం (మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్) ద్వారా పెద్ద ఎత్తున సేకరించి పసుపు రైతుకు అండగా నిలిచింది. 2019–20లో 26,878 మంది రైతుల నుంచి క్వింటాల్ కనీస మద్దతు ధర రూ.6,850 చొప్పున రూ.342.75 కోట్ల విలువైన 50,035 మెట్రిక్ టన్నుల పసుపును మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు చేసింది. ఇలా సేకరించిన పసుపులో ఇప్పటివరకు 17,678 మెట్రిక్ టన్నులను క్వింటాల్ రూ.4,500 నుంచి రూ.4,991 చొప్పున వేలంలో విక్రయించింది. మరో 32,357 మెట్రిక్ టన్నుల పసుపును వేలం వేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం రేటు భారీగా పెరగడంతో ఆ మేరకు మార్క్‌ఫెడ్‌కు అదనపు ఆదాయం సమకూరే అవకాశాలు కనిపిస్తున్నాయి. నెలరోజుల్లో రూ.3 వేలు పెరుగుదల 2019–20 సీజన్లో 3.8 లక్షల టన్నుల దిగుబడి రాగా, గతేడాది ఖరీఫ్ సీజన్లో కురిసిన వర్షాల ప్రభావం వల్ల 2020–21లో 3,66,218 మెట్రిక్ టన్నుల దిగుబడి వచ్చింది. మూడేళ్లుగా మార్కెట్లో క్వింటాల్ రూ.4,500 నుంచి రూ.5 వేల మధ్యలో ఉన్న ధర ఈ ఏడాది ఊహించని రీతిలో పెరుగుతోంది. మన రాష్ట్రంలో ఇప్పటికే రూ.7,,500 నుంచి రూ.7,900 వరకు పలుకుతోంది. పంట పూర్తిగా మార్కెట్ కొచ్చే సమయానికి ఈ ధర రూ.10 వేల మార్క్‌ను దాటే అవకాశాలు లేకపోలేదని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. కరోనా నేపథ్యంలో వినియోగం పెరగడంతో మార్కెట్లో పసుపునకు డిమాండ్ ఏర్పడింది. రేటు పెరుగుతోంది మూడేళ్ల తర్వాత పసుపునకు మంచిరేటొస్తోంది. ఇప్పటికే క్వింటాల్ రూ.7,900 దాటింది. ఇది మరింత పెరిగే అవకాశాలు లేకపోలేదు. ఫ్యూచర్ ట్రేడింగ్స్ కంపెనీ వాళ్లు పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తున్నారు. ధర పెరుగుదల రైతులకే కాదు.. వ్యాపారులకు కూడా మంచిది. – శ్రీనివాస్, పసుపు వ్యాపారి, దుగ్గిరాల ధర మరింత పెరిగే అవకాశం గడిచిన మూడేళ్లుగా మార్కెట్లో ధర లేదు. అందుకే మార్క్‌ఫెడ్ మార్కెట్లో జోక్యం చేసుకుని కొనుగోలు చేసింది. గతేడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా క్వింటాల్ ఎమ్మెస్పీ రూ.6,850గా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ ధర కంటే తక్కువగా ఏ ఒక్కరూ అమ్ముకోవద్దు. ధర మరింత పెరిగే అవకాశం ఉంది. – పీఎస్ ప్రద్యుమ్న, ఎండీ, మార్క్‌ఫెడ్ -
ఎమ్ఎస్పీకి చట్టబద్ధతే పరిష్కారం
నాటి కాంగ్రెస్ పాలకులు స్వార్థంకొద్దీ ప్రవేశపెట్టిన రాజ్యాంగ వ్యతిరేక ఎమర్జెన్సీకి దీటుగా మరొక ‘ఎమర్జెన్సీ’ రావొచ్చునని బీజేపీ అగ్రనాయకుడు అడ్వాణీ, ప్రధాని మోదీ అధికారంలోకి వచ్చిన కొద్ది మాసాలకే ప్రకటించడంతో అడ్వాణీయే సైడ్‌లైన్ కావలసి వచ్చింది. ఇక ఇప్పుడు ‘కరోనా’ మహమ్మారి ముసుగులో అసలు పార్లమెంట్‌ని కాస్తా ‘రబ్బరు స్టాంప్’ హోదా కిందికి పాలకులు మార్చారు. సెలెక్ట్ కమిటీలకు, న్యాయ వ్యవస్థకు తగిన విలువ లేకుండా పోయింది. ఒక్కమాటలో చెప్పాలంటే దేశ పౌర జీవనాన్ని పౌరుల ఎరుకలో లేని అజ్ఞాత శక్తులు శాసించే దశ ప్రవేశించింది. ఈ దుర్దశ చివరికి అంతర్జాతీయ స్థాయికి పాకి చిన్న వయస్సులోనే పెద్దబుద్ధితో ప్రవేశించిన పర్యావరణ, పౌర చైతన్యమూర్తులయిన ధన్‌బర్గ్, దిశా రవిలను కూడా చుట్టుముట్టింది. అందుకే ‘భారతదేశమా..! ఎటు నీ ప్రయాణం ఇంతకూ’ అని మరొక్కసారి ప్రశ్నించుకోవలసి వస్తోంది. ‘‘మన దేశంలో ఇటీవల కాలంలో నిర్దేశిత కీలక రాజ్యాంగ విలువలు కాస్తా ఊడ్చుకుపోతున్నాయి. రాజ్యాంగ విలువలకు ప్రాణప్రదమైన సెక్యులరిజం (లౌకిక విధానం) అన్న పదమే ప్రభుత్వ పదజాలం నుంచి దాదాపుగా కనుమరుగై పోయింది. ఈ పదం నిజ స్వభావాన్ని, దాని ఆంతరంగిక శక్తిని రాజకీయ, సామాజిక శక్తులు గుర్తించలేకనో లేదా గుర్తించినా పాటించడంలో విఫలం కావడం వల్లనో సెక్యులరిజాన్ని భ్రష్టు పట్టించారు. ఇందుకు మారుగా సెక్యులర్ రాజ్యాంగానికి విరుద్ధమైన భావాలనూ, ఆచారాలను పోషిస్తూ వచ్చారు’. – భారత మాజీ ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ (న్యాయచరిత్ర: బై మెనీ ఎ హ్యాపీ యాక్సిడెంట్) ‘‘ఇటీవల ప్రభుత్వ చర్యలు దేశంలో పత్రికా రచనా వ్యవస్థపైనేగాక యావత్తు సమాచార వ్యవస్థనే దెబ్బతీసేవిగా ఉన్నాయి. క్రమంగా ఇది ప్రజాస్వామ్యం కనుమరుగై పోవడమే’’ – పన్నీర్ సెల్వన్ ‘హిందు’ రీడర్స్ ఎడిటర్ (15.2.21) భారత్ సెక్యులర్ రాజ్యాంగ వ్యవస్థ పరిరక్షణ కోసం తపన పడుతున్న బాధ్యతాయుత స్థానాల్లో ఉన్న ఇరువురు మేధావులు 74 ఏళ్ల స్వాతంత్య్రం తరువాత నేడు ఆందోళనతో వెలిబుచ్చుతున్న పై అభిప్రాయాలు మనకు ఏం సందేశం ఇస్తున్నాయి? వారు ప్రకటిస్తున్న ఆందోళనకు తాజా ప్రతిరూపమే– గత వంద రోజులుగా భారత రాష్ట్రాలలో యావత్తు రైతాంగ ప్రజలూ.. బడా పెట్టుబడిదారులకు రైతాంగ మౌలిక ప్రయోజనాలనే తాకట్టుపెట్టేందుకు అనుకూలంగా కేంద్ర ప్రభుత్వం రూపొందించిన మూడు చట్టాలను ప్రతిఘటిస్తూ ఈ రోజుకీ జరుపుతున్న మహోద్యమం. దేశీయంగా రాష్ట్రాలలోనేగాక, ప్రపంచవ్యాప్తంగా కూడా పర్యావరణ శాస్త్రవేత్తలు, వ్యవసాయ సంస్కరణలు రైతాంగ ప్రయోజనాలకు నష్టదాయకంగా ఉండరాదని భావించే వ్యవసాయ శాస్త్రవేత్తలు, ప్రసిద్ధ పర్యావరణ పరిరక్షణ ఉద్యమ కార్యకర్తలు.. ఇప్పటికి సుమారు రెండు వందలమంది రైతాంగ సత్యాగ్రహ కార్యకర్తల బలిదానానికి నిరసనగా తమవంతుగా సంఘీభావం వ్యక్తం చేశారు. అయినా కూడా గత సంవత్సరం సెప్టెంబర్ నెలలో తాను తీసుకొచ్చిన మూడు రైతాంగ వ్యతిరేక చట్టాలను ఉపసంహరించుకోవడానికి కేంద్రం ఎందుకు భీష్మిస్తోంది? రైతాంగం తాము పండించిన పంట లకు నిర్ణయించే కనీస ధరకు చట్టరూపేణా భద్రత కల్పించమని కోరింది. సరిగ్గా ఈ దేశ ‘స్వయంపోషక ఆర్థిక వ్యవస్థ’ బతికి బట్ట కట్టడానికి ఆదరువుగా ఉన్న రైతాంగం కోరుతున్న ఈ కనీస కోర్కెను ప్రభుత్వం ఎందుకు నిరాకరిస్తున్నట్టు? ‘కనీస ధర’కు మేం వ్యతిరేకం కాదని ఒకవైపు ప్రకటిస్తున్న పాలకులు దానికి చట్టబద్ధత కల్పించ డాన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? కనీస మద్దతు ధరను ‘చట్టం’గా ప్రకటించకుండా పాలకుల చేతుల్ని అడ్డుకునేదెవరో, అడ్డుకుంటున్న దెవరో? స్వాతంత్య్రానికి ముందే (1933లో) పండిట్ జవహర్లాల్ నెహ్రూ రాబోయే పరిణామాలను ఊహించి ఇలా హెచ్చరించాడు: ‘‘ప్రత్యేక హక్కులను, స్వార్థ ప్రయోజనాలనూ అనుభవిస్తున్న ఏ ప్రత్యేక సంపన్న వర్గమూ, గ్రూపులూ తమ హక్కులను తాముగా స్వచ్ఛందంగా వదులుకున్నట్లు చరిత్రకు దాఖలా లేదు. సాంఘికంగా మార్పులు రావాలంటే ఒత్తిడి, అవసరాన్ని బట్టి బలప్రయోగమూ తప్పనిసరిగా అవసరం. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించడమంటే అర్థం.. ఈ స్వార్థ ప్రయోజనాలకు భరత వాక్యం పలకడమే. విదేశీ ప్రభుత్వ పాలన తొలగి దాని స్థానంలో స్వదేశీ ప్రభుత్వం ఏర్పడినప్పటికీ ఈ స్వార్థపర వర్గాల ప్రయోజనాలను ముట్టకుండా అలాగే అట్టిపెడితే ఇక అది నామమాత్ర స్వాతంత్య్రం కూడా కాదు.’’ సరిగ్గా 89 ఏళ్ల నాటి ఈ అంచనాకు వీసమెత్తు తేడా లేకుండా మధ్య మధ్యలో ‘ఉదారం’గా ఉన్నట్టు నాటకమాడినా తరువాత స్వాతంత్య్రానంతరం క్రమంగా అటు కాంగ్రెస్ ప్రభుత్వమూ, ఆ తరువాత వచ్చిన బీజేపీ–ఆరెస్సెస్ పాలనా యంత్రాంగమూ అను సరిస్తూ వచ్చిందీ, వస్తున్నదీ–వీసమెత్తు తేడా లేకుండా బడా పెట్టు బడిదారీ శక్తుల మౌలిక ప్రయోజనాల రక్షణ కోసమే. అందులో భాగంగానే రైతాంగం కోరుతున్న ‘పంటల కనీస ధరకు చట్టరీత్యా’ గ్యారంటీ ఇవ్వబోమన్నది కేంద్ర ప్రభుత్వం. మరొకమాటగా కుండ బద్దలుకొట్టినట్టు చెప్పాలంటే–వెనకనుంచి ‘తోలుబొమ్మ’ ఆట ఆడించే బడా వ్యాపార వర్గాలు లేకపోతే బీజేపీ పాలకుల చేతులను కట్టిపడవేస్తున్న వాళ్లెవరు? నిజానికి బీజేపీ పాలకుల ప్రయోజనాల రక్షణ కోసమే కాంట్రాక్టు లేదా కార్పొరేట్ వ్యవసాయ పద్ధతుల్ని ప్రవేశపెట్టించగోరారు. రైతాంగం అందుకు వ్యతిరేకించి ‘ససేమిరా’ అని ప్రాణ త్యాగాలకు సిద్ధమైనప్పుడు మాత్రమే ‘లాలూచీ బేరం’గా– ‘మాకు కార్పొరేట్ వ్యవసాయం పెట్టాలన్న ఉద్దేశం లేదు, మాకు ఆ రంగంతో సంబంధం లేద’ని నరేంద్ర మోదీ ప్రభుత్వం పత్రికా ప్రకటనలు ఎందుకు ఇవ్వవలసి వచ్చిందో ఆ రహస్యం ప్రభుత్వానికి తెలియాలి, ఆదానీ అంబానీలకు కూడా తెలియాలి. స్వాతంత్య్రం వచ్చిన తొలి ఘడియల్లోనే టాటా–బిర్లాలు ఏకమై దేశీయ బడా పెట్టుబడిదారీ వర్గం జాయింట్‌గా జాతీయ పథకం రచించింది. దాని పేరే ప్రసిద్ధ బొంబాయి (బాంబే) ప్లాన్. దాని లక్ష్యం స్థూలంగానూ, సూక్ష్మంగానూ కూడా భారతదేశంలో పక్కా పెట్టుబడి దారీ వ్యవస్థ స్థాపనకు నాంది పలకడమే! అంటే నాడే దేశానికి దశా–దిశా నిర్దేశించిన పక్కా ప్రణాళిక అది. ఆ తరువాత ఎవరెన్ని కబుర్లు చెప్పినా కాంగ్రెస్ (తర్వాత కాంగ్రెస్–యూపీఏ), ఆ పిమ్మట బీజేపీ (ఆరెస్సెస్–ఎన్డీఏ) సంకీర్ణ ప్రభుత్వాలు అనుసరించింది కూడా ఆచరణలో... నాటకంలో ‘విదూషకుల’ పాత్రేనని మాత్రం మనం మరచి పోరాదు. ఇటీవల కాలంలో భారతీయ జనతా పార్టీకి చెందిన పాలకులు తొలి అయిదేళ్లలోనూ ప్రవేశపెట్టిన జీఎస్టీ పన్నుల విధానం– రాజ్యాం గవిహితమైన రాష్ట్రాల ఫెడరల్ హక్కుల్ని పూర్తిగా హరించివేస్తూ వచ్చింది. క్రమంగా సెక్యులర్ రాజ్యాంగానికి అడుగడుగునా ఉల్లంఘ నలు ఎదురయ్యాయి, 1975–77 నాటి కాంగ్రెస్ పాలకులు స్వార్థం కొద్దీ ప్రవేశపెట్టిన రాజ్యాంగ వ్యతిరేక ఎమర్జెన్సీకి దీటుగా మరొక ‘ఎమర్జెన్సీ’ రావొచ్చునని బీజేపీ అగ్రనాయకుడు అడ్వాణీ, ప్రధాని మోదీ అధికారంలోకి వచ్చిన కొద్ది మాసాలకే ప్రకటించడంతో తర్వాత అడ్వాణీ తానే సైడ్‌లైన్ కావలసి వచ్చింది. ఇక ఇప్పుడు ‘కరోనా’ మహమ్మారి ముసుగులో అసలు పార్లమెంట్‌ను కాస్తా ‘రబ్బరు స్టాంప్’ హోదా కిందికి మన పాలకులు మార్చారు. సెలెక్ట్ కమిటీలకు, న్యాయ వ్యవస్థకు ఇప్పుడు తగిన విలువ లేకుండా పోయింది. ఒక్క మాటలో చెప్పాలంటే దేశ పౌర జీవనాన్ని పౌరుల ఎరుకలో లేని అజ్ఞాత శక్తులు శాసించే దశ ప్రవేశించింది. ఈ దుర్దశ చివరికి అంతర్జాతీయ స్థాయికి పాకి చిన్న వయస్సులోనే పెద్దబుద్ధితో ప్రవేశించిన పర్యావరణ, పౌర చైతన్యమూర్తులయిన ధన్‌బర్గ్, దిశా రవిలను కూడా చుట్టుముట్టింది. అందుకే ‘భారతదేశమా..! ఎటు నీ ప్రయాణం ఇంతకూ?’ అని మరొక్కసారి ప్రశ్నించుకోవలసి వస్తోంది. సామెత ఎందుకు పుట్టిందోగానీ– ‘పాలకుడు ప్రజా సేవలో నీతి తప్పితే, నేల సారం తప్పుతుందట!’ ‘ప్రజాస్వామ్యం’ పేరు చాటున ప్రస్తుత భారత రాజకీయాల్లో ఎన్నితంతులు? ఎన్ని డ్రామాలు? అనుభవానికి ప్రత్యక్ష సాక్షులుండరు గదా!! ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
దిగుబడి పెరిగినా తగ్గిన ఆదాయం
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో కరోనా వైరస్ మహమ్మారి కారణంగా పలు రంగాలు కునారిల్లిపోయి ఆర్థిక పరిస్థితి దెబ్బతిన్నప్పటికీ వ్యవసాయ రంగం నిలదొక్కుకోవడమే కాకుండా వ్యవసాయ దిగుబడులు గణనీయంగా పెరగడం విశేషం. ఈ ఏడాది జాతీయ స్థూల ఉత్పత్తి (జీడీపీ)లో వ్యవసాయం 3.4 శాతం అభివద్ధి చెందింది. వ్యవసాయ రంగంపై కరోనా ప్రభావం ప్రత్యక్షంగా లేకపోవడం, ఈ ఏడాది వర్షాలు సమద్ధిగా కురవడం, రబీ, ఖరీఫ్ పంటలకు రిజర్వాయర్లలో నీళ్లు పుష్కలంగా ఉండడం పంటల దిగుబడికి ఎంతో కలసి వచ్చింది. కరోనా కాటుకు వలస కార్మికులు ఇళ్లకు తిరగి రావడం, జీవనోపాధికోసం వారు కూడా వ్యవసాయ కూలీలుగా మారిపోవడం కూడా రైతులకు కలసి వచ్చిందని జాతీయ వ్యవసాయ ఆర్థిక వేత్త, ఇందిరాగాంధీ అభివద్ధి, పరిశోధన సంస్థలో అసోసియేట్ ప్రొఫెసర్‌గా పని చేస్తోన్న సుధా నారాయణన్ తెలిపారు. కరోనా కారణంగా వ్యవసాయ పెట్టుబడులు భారీగా పెరగడం, పంట దిగుబడులకు ఆశించిన ధరలు లభించ లేదని ఆమె చెప్పారు. ఈసారి కూడా చాలా చోట్ల గిట్టుబాటు ధరలు లేక టన్నుల కొద్ది టమోటా రోడ్ల పాలయింది. కేంద్రం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా మూడు వారాల క్రితం రోడ్డెక్కిన రైతులు ఇంకా రోడ్లపైనే ఉన్నారు. 2022 నాటికి వ్యవసాయ ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని కేంద్రం హామీ ఇచ్చిందని, ఇప్పుడేమో కొత్త చట్టాలతో చిన్న కారు, సన్నకారు రైతుల నోటి కాడ కూడును కొట్టేస్తుందని రైతు నాయకులు ఆరోపిస్తున్నారు. రెండు హెక్టార్లకంటే తక్కువ భూమి కలిగిన చిన్నకారు రైతులే ప్రతి పది మందిలో ఎనమిది మంది ఉన్నారు. దేశం మొత్తం వర్క్‌ఫోర్స్‌లో 44.2 శాతం మంది ఒక్క వ్యవసాయ రంగంలోనే పని చేస్తున్నారు. ఈ ఏడాది దేశంలో 88 శాతం మంది రైతులు తమ పంటలను గిట్టుబాటు ధరలకు అమ్మలేక పోయారు. 37 శాతం రైతులు అసలు పంటలే వేయలేకపోయారు. 15 శాతం మంది రైతులు తమ ఉత్పత్తులను మార్కెట్ యార్డులకు కూడా తరలించలేక వదిలేశారు. ఈ పరిస్థితుల్లో రైతులను ఆదుకునేందుకు ప్రధాని మోదీ ‘పీఎం–కిసాన్ స్కీమ్‌ను తీసుకొచ్చారు. దేశంలో 14 కోట్ల మంది రైతులుండగా కేవలం ఆ స్కీమ్ 8 కోట్లకు మాత్రమే పరిమితమవుతోందని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కొత్త వ్యవసాయ చట్టాల గురించి లోతుగా అధ్యయనం చేసే స్థితిలో కూడా రైతులు లేరు -
కనీస మద్దతు ధర : చిదంబరం ఫైర్
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్రం కొత్తగా ఆమోదించిన నూతన వ్యవసాయ బిల్లులపై విపక్ష పార్టీల నిరసన కొనసాగుతున్న తరుణంలో కేంద్ర మాజీ ఆర్థికమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు చిదంబరం కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రధానంగా కనీస మద్దతు ధర(ఎంఎస్పీ) పై ఆయన తన దాడిని ఎక్కుపెట్టారు. ప్రభుత్వం వద్ద ప్రైవేటు వాణిజ్యానికి సంబంధించిన డేటా అందుబాటులో లేనప్పుడు రైతులకు కనీస మద్దతు ధర ఎలా ఇస్తారని ప్రశ్నించారు. భారతదేశం అంతటా ప్రతిరోజూ వేలాది గ్రామాల్లో మిలియన్ల ప్రైవేటు లావాదేవీలు జరుగుతాయి. ఏ రైతు ఏ వ్యాపారికి ఏ ఉత్పత్తులను అమ్మారో ప్రభుత్వానికి ఎలా తెలుస్తుందని వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్‌ను ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఎలా ప్రణాళికలు వేస్తోందని చిదంబరం ట్వీట్ చేశారు. (రాజ్యసభ రగడ : విపక్ష ఎంపీల సస్పెన్షన్) రైతుకు చెల్లించే ధర మద్దతు ధరకంటే చాలా తక్కువగా ఉంటోందని చిదంబరం ఆరోపించారు. రైతుల పంటకు మద్దతు ధర కల్పిస్తామంటూ చెబుతున్న కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి ఇప్పటివరకు ఆ పని ఎందుకు చేయలేదని నిలదీశారు. దీన్ని గుడ్డిగా నమ్మేందుకు రైతులు మూర్ఖులు అని మంత్రి ప్రభుత్వం భావిస్తోందా అని మండిపడ్డారు. దీంతో పాటు సమాజంలోని వివిధ వర్గాల ప్రజలకు మోదీ సర్కార్ ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిన వైనంపై ఆయన విరుచుకుపడ్డారు. ప్రధానంగా ప్రతి భారతీయుడి ఖాతాలో15 లక్షలు రూపాయలు వేస్తామన్న హామీని మోదీ ప్రభుత్వం నెరవేర్చిందా? రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేశారాట? ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాల వాగ్దానం సంగతి ఏమిటని చిదంబరం ప్రశ్నించారు. కాగా, వ్యవసాయానికి సంబంధించిన ఫార్మర్స్ ప్రొడ్యూస్ ట్రేడ్ అండ్ కామర్స్ బిల్లు, ఫార్మర్స్ అగ్రిమెంట్ ఆన్ ప్రైస్ అస్యూరెన్స్ అండ్ ఫార్మార్స్ సర్వీసు బిల్లులకు ఇప్పటికే లోక్‌సభ ఆమోదం తెలుపగా, ఆదివారం రాజ్యసభ కూడా ఆమోదించింది. రాష్ట్రపతి సంతకంతో ఈ బిల్లులు అమలులోకి రానున్నాయి. కొత్త వ్యవసాయ బిల్లులంటూ రాజకీయ రగడ నడుస్తోంది. కార్పొరేట్లకు కొమ్ముకాసేందుకే ప్రభుత్వం ఈ బిల్లులను తీసుకొచ్చిందని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. దీనిపై దేశవ్యాప్తంగా రైతులు నిరసనలు చేస్తున్న సంగతి తెలిసిందే. The Modi government should stop lying to the farmers and making false promises. The promise of guaranteeing MSP in private transactions is like the promise to deposit Rs 15 lakh in the bank account of every Indian — P. Chidambaram (@PChidambaram_IN) September 21, 2020 -
సాగు ఖర్చుకు దూరంగా ‘మద్దతు’
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం సోమవారం వివిధ పంటలకు పెంచిన కనీస మద్దతు ధరలు రాష్ట్ర ప్రభుత్వం కోరిన మేర పెరగలేదు. జాతీయ వ్యవసాయ వ్యయ, ధరల కమిషన్ (సీఏసీపీ)కు రాష్ట్ర వ్యవసాయశాఖ ఈ ఏడాది జనవరిలో సమర్పించిన సాగు వ్యయాల ప్రకారం క్వింటా వరి పండించాలంటే రైతుకు రూ. 2,529 ఖర్చవుతోంది. ఇందుకు తగిన విధంగా స్వామినాథన్ కమిటీ సిఫార్సుల ప్రకారం సాగు ఖర్చుకు 50 శాతం అదనంగా కలిపి క్వింటాకు రూ. 3,794 మద్దతు ధర ఇవ్వాలని తెలంగాణ కోరింది. ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా పలుమార్లు ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ వరి, మొక్కజొన్నలకు క్వింటాకు కనీసం రూ. 2 వేలపైనే మద్దతు ధర ఇవ్వాలని కేంద్రంపై ఒత్తిడి చేశారు. కానీ వాటి ఎంఎస్పీ అంత మొత్తంలో పెరగలేదు. అలాగే పత్తి లాంగ్ స్టాపిల్కు క్వింటా పండించేందుకు రూ. 10,043, క్వింటా కంది పండించేందుకు రూ. 8,084 చొప్పున ఖర్చవుతోందని, వాటికి 50 శాతం అదనంగా ఎంఎస్పీ ఇస్తేనే రైతుకు సాగు లాభసాటిగా ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం నివేదించింది. అయినా కేంద్రం ఆ మేరకు పెంచలేదు. పెరుగుదల 10 శాతం లోపే.. కేంద్రం ప్రకటించిన కనీస మద్దతు ధరల పెంపు అన్ని పంటలకు 10 శాతం లోపే ఉంది. ఇంత తక్కువ పెంచి రైతులకు ప్రతి పంటకు 50 శాతం ఎక్కువ ఆదాయం తిరిగి వస్తుందని చెబుతున్నారు. ఇదెలా సాధ్యం? కనీస మద్దతు ధరలను రాష్ట్రాలవారీగా, స్థానిక ఉత్పత్తి ఖర్చు మేరకు నిర్ధారించాలి. కనీస మద్దతు ధరల్లో చూపే పంట ఖర్చుకు, బ్యాంకులు తయారు చేసుకొనే స్కేల్ ఆఫ్ ఫైనాన్స్‌కు మధ్య భారీ తేడా ఉంది. – నర్సింహారెడ్డి, జాతీయ వ్యవసాయ నిపుణుడు -
రాష్ట్రాలకే అవకాశం ఇవ్వాలి
సాక్షి, న్యూఢిల్లీ: కనీస మద్దతు ధర నిర్ణయించే అవకాశం రాష్ట్రాలకే ఇవ్వాలని తెలంగాణ వ్యవసాయ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. గురువారం న్యూఢిల్లీలో జరిగిన 91వ కేంద్ర వ్యవసాయ పరిశోధనా సంస్థ (ఐసీఏఆర్) పాలకమండలి సమావేశానికి హాజరై ఆయన ప్రసంగించారు. 2022 వరకు రైతుల ఆదాయం రెండింతలు చేయాలంటే ఈ దిశగా కేంద్రం నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఆయా రాష్ట్రాల్లో ఉండే భౌగోళిక పరిస్థితుల నేపథ్యంలో ఉత్పత్తి వ్యయంలో మార్పులుంటాయని, అందువల్ల రాష్ట్రాలకే కనీస మద్దతు ధర నిర్ణయించే అధికారం ఇవ్వాలని కోరారు. ఆరేళ్లలో ప్రభుత్వం తీసుకున్న వ్యవసాయ అనుకూల చర్యల ద్వారా ప్రస్తుత అంచనాల ప్రకారం ఈ ఏడాది గతేడాదికన్నా 40.8% పెరుగుదలతో ఆహార ధాన్యాల ఉత్పత్తి 130 లక్షల మెట్రిక్ టన్నులకు చేరుకోనుందని వివరించారు. -
వరికి రెండింతలు..పత్తికి మూడింతలు
సాక్షి, హైదరాబాద్: స్వామినాథన్ సిఫార్సుల ప్రకారం కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)లు ఉండాలని, ఆ మేరకు ప్రస్తుత ఎంఎస్పీని వచ్చే ఖరీఫ్ నాటికి సవరించాలని కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. సాగు ఖర్చుకు మరో 50 శాతం అదనంగా కలిపి ఎంఎస్పీ ఇవ్వాలని కేంద్ర వ్యవసాయ వ్యయ, ధరల (సీఏసీపీ) కమిషన్‌కు ప్రతిపాదించింది. ఆ ప్రకారం వరికి ప్రస్తుత ఎంఎస్పీకి రెండింతలు, పత్తికి దాదాపు మూడింతలు పెంచాలని వ్యవసాయ శాఖ నివేదించింది. అందులో ఖరీఫ్‌లో వివిధ పంటలకు ఎంతెంత ఖర్చు అవుతుందో వివరించింది. పంటల వారీగా విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, పంట కోత, రవాణా, కూలీ, రైతు కుటుంబ శ్రమకు ప్రతిఫలం అన్నీ కలిపి ఎంత ఖర్చు అవుతుందో సవివరంగా కేంద్రానికి నివేదించింది. ఒక వ్యాపారి తన వస్తువును అమ్ముకునేటప్పుడు ధర ఎలా నిర్ణయిస్తారో, ఆ ప్రకారమే పెట్టిన పెట్టుబడి, దానికి అయ్యే వడ్డీలను లెక్కలోకి తీసుకొని సాగు ఖర్చును నిర్ధారించారు. ఏటా ఇలాగే శాస్త్రీయంగా సాగు ఖర్చు, ఎంఎస్పీ ఎలా ఉండాలో తెలంగాణ వ్యవసాయ శాఖ ఇస్తూనే ఉంది. కానీ కేంద్రం తన పద్ధతిలో తాను ఎంఎస్పీని నిర్ధారిస్తూ పోతోందని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. ఎకరా వరి సాగు ఖర్చు రూ. 35 వేల పైనే.. సాధారణ వరి రకం పండించేందుకు నారుమడి సిద్ధం చేయడం మొదలు విత్తనాలు, నాట్లు, ఎరువులు, కలుపుతీత, పంట కోత, కూలీల ఖర్చు, కుటుంబ సభ్యుల శ్రమ మొత్తం కలుపుకుంటే ఎకరానికి రూ.35,156 ఖర్చు అవుతున్నట్లు లెక్కగట్టింది. చివరకు క్వింటా వరి పండించాలంటే రూ.2,529 ఖర్చు అవుతుందని నిర్ధారించింది. స్వామినాథన్ కమిటీ సిఫార్సుల ప్రకారం సాగు ఖర్చుకు 50 శాతం అదనంగా కలిపి ఎంఎస్పీ రూ.3,794 ఇవ్వాలని కోరింది. ప్రస్తుతం వరి ఎంఎస్పీ రూ.1,815 ఉండగా, రెట్టింపునకు మించి పెంచాలని కోరింది. 2020–21 ఖరీఫ్‌లో ఈ మేరకు పెంచాలని విజ్ఞప్తి చేసింది. ఇక పత్తి పండించాలంటే క్వింటా లుకు రూ.10,043 ఖర్చు అవుతుందని వ్యవసాయ శాఖ లెక్కగట్టింది. 2019–20 ఆర్థిక సంవత్సరంలో పత్తి క్వింటాలుకు ఎంఎస్పీ రూ.5,550 కాగా, సాగు ఖర్చును లెక్కలోకి తీసుకొని స్వామినాథన్ ఫార్ములా ప్రకారం ఎంఎస్పీ రూ.15,064 ఇవ్వాలని వ్యవసాయ శాఖ సీఏసీపీని కోరింది. అలాగే మొక్కజొన్న క్వింటా పండించేందుకు రూ.2,172 ఖర్చు అవుతుందని నిర్ధారించారు. ఆ ప్రకారం ఎంఎస్పీ రూ.3,258 వేలు ఇవ్వాలని ప్రతిపాదించారు. వేరుశనగ క్వింటా పండించేందుకు రూ.5,282 ఖర్చు అవుతుండగా, ఎంఎస్పీ రూ.7,924 ఇవ్వాలని కోరారు. క్వింటా కందులు పండించేందుకు రూ.8,084 వ్యయం అవుతుండగా మద్దతు ధర రూ.12,126 కోరారు. క్వింటా సోయాబీన్ ఉత్పత్తికి రూ.4,694 ఖర్చు అవుతుండగా, ఎంఎస్పీ రూ.7,041కు పెంచాలని సీఏసీపీని సర్కారు కోరింది. -
బత్తాయి, అరటికి సర్కార్ ‘మద్దతు’
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గణనీయమైన విస్తీర్ణంలో సాగు చేసే రెండు ప్రధాన పంటలు.. అరటి, బత్తాయి (స్వీట్ ఆరెంజెస్)లకు సేకరణ ధరను ప్రకటిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల ప్రకటించిన పసుపు సేకరణ ధరను కూడా పెంచింది. కేంద్ర ప్రభుత్వం కనీస మద్దతు ధరలు (ఎంఎస్పీ) ప్రకటించే పంటల్లో అరటి, బత్తాయి లేవు. రాష్ట్రంలో ప్రస్తుతం 88,029 హెక్టార్లలో బత్తాయి, 69,894 హెక్టార్లలో అరటి (టిష్యూ కల్చర్) రకం, 43,101 హెక్టార్లలో అరటి (స్థానిక) రకం సాగవుతోంది. కొంత కాలంగా ధరల విషయంలో రైతులు ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో వైఎస్ జగన్ ప్రభుత్వం ఈ రెండు పంటలకు సేకరణ ధరలు ప్రకటించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా అధికారులు గత కొన్నేళ్ల మార్కెట్ రేటును ప్రాతిపదికగా తీసుకుని సగటు ఆధారంగా అరటికి క్వింటాల్‌కు రూ.800, బత్తాయి క్వింటాల్‌కు రూ.1,400గా సేకరణ ధరలను నిర్ణయించారు. పసుపు ధరను క్వింటాల్‌కు రూ.6,850గా ప్రకటించారు. ఇందుకు స్థిరీకరణ నిధిని ఉపయోగించుకుంటుంది. -
‘రబీ’కి కేంద్రం మద్దతు
సాక్షి, న్యూఢిల్లీ: రబీ పంటల కనీస మద్దతు ధరలను పెంచుతూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ బుధవారం ఈ మేరకు నిర్ణయించింది. సమావేశంలో తీసుకున్న పలు కీలక నిర్ణయాలను కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ మీడియాకు వెల్లడించారు. రబీ పంటలైన గోధుమలు, శనగలు, బార్లీ, మసూర్ పప్పు, ఆవాలు, కుసుమల మద్దతు ధరలను పెంచింది. 2020–21కి గాను గోధుమల కనీస మద్దతు ధరను క్వింటాల్‌కు రూ.1,925గా నిర్ణయించింది. గత సీజన్లో ఇది రూ.1.840గా ఉండగా.. ఈసారి రూ.85 పెంచింది. బార్లీ కనీస మద్దతు ధరను క్వింటాల్‌కు రూ.85 మేర పెంచుతూ రూ.1,525గా నిర్దేశించింది. గత సీజన్లో ఇది రూ.1,440గా ఉండేది. శనగలకు క్వింటాల్‌కు రూ.255 చొప్పున పెంచుతూ రూ.4,875గా నిర్ణయించింది. మసూర్ (కేసరి) పప్పు క్వింటాల్ ధర రూ.4,800గా నిర్ణయించింది. గత సీజన్లో ఇది రూ.4,475 ఉండగా ఈసారి రూ.325 పెంచింది. ఆవాలు క్వింటాలు ధర గత సీజన్లో రూ.4,200 ఉండగా.. ఈసారి రూ.255 పెంచింది. ప్రస్తుత సీజన్లో క్వింటాల్ ఆవాలు కనీస మద్దతు ధర రూ.4,425గా నిర్ణయించింది. కుసుమ పంటకు క్వింటాల్‌కు రూ.275 పెంచుతూ రూ.5,215గా నిర్దేశించింది. గత సీజన్లో కుసుమ ధర క్వింటాల్‌కు రూ.4,945గా ఉంది. చైనా సరిహద్దుకు కొత్త సైనికులు ! దాదాపు 18 ఏళ్ల తర్వాత ఇండో–టిబెటన్ బార్డర్ పోలీసు కేడర్‌ను కేంద్ర కేబినెట్ సమీక్షించింది. ఈ సమీక్షలో పలువురికి పదోన్నతులు దక్కనున్నాయి. దీంతో పాటు గ్రూప్ ఏ సాధారణ విధుల కేడర్, నాన్ జనరల్ విధుల విభాగంలో కొత్తగా 3 వేల ఉద్యోగాలను భర్తీ చేసే అవకాశం ఉంది. ఐటీబీపీ 58వ రైజింగ్ డే సందర్భంగా ఈ సమీక్ష చేపట్టారు. గతంలో చివరగా 2001లో సమీక్ష చేపట్టారని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవడేకర్ అన్నారు. వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) వెంట భద్రతను పటిష్టం చేసే దిశగా కేంద్రం ఈ చర్యలు చేపట్టింది. కొత్త ఉద్యోగాలు వచ్చే సంవత్సరం ఈ సమయానికల్లా భర్తీ చేసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఢిల్లీలో 50 లక్షల మందికి లబ్ధి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ముందు కేంద్ర కేబినెట్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీలోని 1797 అనధికార కాలనీల్లో నివసిస్తున్న వారికి యాజమాన్య హక్కులు ఇవ్వాలని కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుం దని జవదేకర్ చెప్పారు. అనధికార కాలనీల క్రమబద్ధీకరణ నిర్ణయం వల్ల దాదాపు 50 లక్షల మందికి లబ్ధి కలగనుంది. రాబోయే పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో దీనికి సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు కేంద్ర మంత్రి హరదీప్ సింగ్ పూరి వెల్లడించారు. ఢిల్లీలోని అనధికార కాలనీల క్రమబద్ధీకరణ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తెలిపారు. క్రమబద్ధీకరణ ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని కోరారు. -
‘రైతుబంధు’ ఒక్కటే సరిపోదు
తెలంగాణ ప్రభుత్వం 2018–19 నుండి రైతులకు ఎకరానికి రూ. 4 వేలు పెట్టుబడి రాయి తీలు రైతుబంధు పేరుతో అమలు చేస్తున్నది. వానా కాలం 4 వేలు, వేసంగి 4 వేలు ప్రతి ఎకరాకు ఇస్తారు. వాస్తవ భూమి హక్కు కలిగి, పట్టా పాస్ పుస్తకం ఉన్న వారికి మాత్రమే ఈ రాయితీ వర్తిస్తుంది. రాష్ట్ర స్థాయి కమిటీ, జిల్లా స్థాయి కమిటీలు ఈ నిర్వహణా బాధ్యతలు చూస్తాయి. రెవెన్యూ శాఖ నిర్వహించిన సర్వేలో 71.25 లక్షల మంది రైతులు ఉన్నట్లు తేలింది. కానీ, ఇందులో చాలా మందికి భూముల పై పట్టా హక్కులు లేవు. మొత్తం రాష్ట్రంలో ప్రభుత్వం పరిశీలించిన భూమి 2.56 కోట్ల ఎకరాలు కాగా ఇందులో 2.38 కోట్ల ఎకరాలు ఎలాంటి సమస్యలు లేకుండా క్లియర్‌గా ఉన్నాయి. ఇందులో సాగుభూమి 1.43 కోట్ల ఎకరాలు ఉన్నది. 1.43 కోట్ల ఎకరాలకు రుణ రాయితీ యివ్వడానికి 2018–19 బడ్జెట్లో వ్యవసాయ బడ్జెట్ కింద రూ. 12,733 కోట్లు కేటాయించారు. ఈ రాయితీ లేక ముందు 65 వేల కోట్లు కేటాయించారు. 2014 నుండి 2017 మార్చి నాటికి రైతుల రుణమాఫీ కింద రూ.16,630 కోట్లు కేటాయించి రైతుల ఖాతాలలో జమ చేశారు. 2018– 19లో కేటాయించిన వ్యవసాయ బడ్జెట్లో రూ.8,9 81 కోట్లు కేటాయించారు. వాస్తవానికి పాస్ బుక్కులు ఉన్న వారి లెక్కలు తీస్తే 57,24,115 మంది రైతులు ఉన్నారు. భూములు ఉండి పాస్ పుస్తకాలు లేని వారు 14.01 లక్షల మంది ఉన్నట్లు ప్రభుత్వ గణాంకాలే చెప్తున్నాయి. వీరికి పాస్ పుస్తకాలు ఇస్తామని, వారి భూ సమస్యలు పరిష్కరిస్తామని, వీరిని పార్ట్–2లో చేర్చారు. ఎన్నికలు రావడంతో పార్ట్–2 జాబితాలోని రైతుల సమస్యలు పరిష్కారానికి నోచుకోలేదు. పాస్ పుస్తకాలున్న 57,24,115 మందికి రూ. 5,618.51 కోట్లు వానా కాలం రాయితీ కింద పంపిణీ చేశారు. వేసంగి రాయితీ కొంత మేరకు రైతుల ఖాతాలో జమచేయడంతో ఎన్నికల కమిషన్ అభ్యంతరం తెలిపిన కార ణంగా నిలిపివేశారు. రుణాలు రద్దు చేసినా, పెట్టుబడి రాయితీ యిచ్చినా రైతుల ఆత్మహత్యలు సాగుతూనే ఉన్నాయి. రూ. 34 లక్షల అప్పు కాగానే పేద రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. దీనికి ప్రధానంగా ప్రైవేటు రుణ భారమే కారణం. ప్రస్తుతం రాష్ట్రంలో రూ. 20 వేల కోట్లు ప్రైవేటు రుణాలున్నాయి. 36 శాతం నుండి 50 శాతం వడ్డీ వసూలు చేస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో రుణమాఫీ చేసినప్పటికీ నేటికీ రూ. 37 వేల కోట్ల రుణాలలో రైతులు కూరుకుపోయి ఉన్నారు. రైతు పెట్టుబడి రాయితీ కొంత లాభించినా పూర్తిగా సమస్యలు పరిష్కరించలేదు. కొంత మంది వాస్తవ సాగుదారులు కాని వారికి వేల కోట్ల లబ్ధి కలిగింది. భూములు సాగు చేసినా, సాగుచేయకున్నా ప్రస్తుతం ప్రభు త్వం పాస్ పుస్తకాలున్న వారికి రాయితీలిస్తున్నారు. రియల్ ఎస్టేట్ కింద భూములు కొనుగోలు చేసినవారికి కూడా రాయితీలు ఇస్తున్నారు. గ్రామ, జిల్లా, రాష్ట్ర స్థాయి సమన్వయ కమిటీలు ఈ విషయాన్ని లోతుగా అధ్యయనం చేసే అవకాశాలున్నప్పటికీ వారు పెద్దగా పట్టించుకోవడం లేదు. నేడు రైతుల ఉత్పత్తులకు ఉత్పత్తి ధర రావడం లేదు. ప్రధాన మంత్రి మోదీ ప్రకటించిన కనీస మద్దతు ధరలు కూడా ఉత్పత్తి ఖర్చులపై 50 శాతాన్ని కలిపి నిర్ణయించినవి కావు. ఉపకరణాల ఖర్చు, కుటుంబ ఖర్చులు మాత్రమే లెక్కలోకి తీసుకొని ఆ మొత్తానికి 50 శాతం కలిపి ధర ప్రకటించారు. ఆ విధంగా ధాన్యానికి క్వింటాలుకు రూ. 1166లు వ్యయం కాగా దానికి 50 శాతం కలిపి క్వింటాల్‌కు రూ. 1770 రూపాయలు ధర నిర్ణయించారు. వాస్తవానికి క్వింటాల్ వ్యయం రాష్ట్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారం రూ. 2000లు అవుతుంది. 50 శాతం కలిపి రూ. 3 వేలుగా ధర నిర్ణయించాలి. భూమిపై కౌలు, వడ్డీ, యంత్రాల అరుగుదల తదితర అంశాల వ్యయాన్ని పరిగణలోకి తీసుకోవాలి. అందువల్ల ప్రధాని నిర్ణయించిన ధర ఉత్పత్తి వ్యయంపై 50 శాతానికి తక్కువగా ఉన్నది. ప్రధాని ప్రకటించిన ధరలు కూడా అమలు కావడం లేదు. క్వింటాల్‌కు రూ.1300–1400 లు మాత్రమే మార్కెట్లో వ్యాపారులు చెల్లిస్తున్నారు. ప్రధాని ప్రకటించిన ధరలు రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయాలని కేంద్రం చెబుతున్నది. కేంద్రం ప్రకటించింది కాబట్టి మార్కెట్లో వచ్చే లోటును కేంద్రమే రాష్ట్రాలకు ఇవ్వాలని రాష్ట్రాలు చెప్తున్నాయి. ధరల అమలు బాధ్యతను ఏ ప్రభుత్వం తీసుకోకపోవడం వల్ల రైతులు తక్కువ ధరలకు అమ్ముకుంటున్నారు. ఈ విధంగా నష్టపోయిన రైతుకు ఎకరా రూ. 4 వేల రైతుబంధు రాయితీ కొంత ఉపశమనం కలిగించవచ్చునేమో కానీ, ధరల సమస్యను పరిష్కరించదు. సారంపల్లి మల్లారెడ్డి వ్యాసకర్త అఖిల భారత కిసాన్ సభ ఉపాధ్యక్షులు, 94900 98666 -
రైతు చుట్టూ చీకట్లు తొలగేనా?
వ్యవసాయ రుణమాఫీలు ఆర్థిక అవసరంగా ఉంటూ, వాటికోసం రాష్ట్ర ప్రభుత్వాలు తగినన్ని వనరులను వెతకాల్సి ఉంటున్న నేపథ్యంలో, ప్రత్యక్ష నగదు మద్ధతును వ్యవ సాయ సంక్షోభానికి శాశ్వత పరిష్కారంగా చూడకూడదు. తక్షణ ఉపశమన చర్యలను చేపడుతూనే, వ్యవసాయ రంగానికి పలు గట్టి సంస్కరణలను అమలు చేయడం ఎంతైనా అవసరం. అందుకే ఈ 2019 సంవత్సరం వ్యవసాయ సంస్కరణల సంవత్సరంగా మారుతుందని ఆశిద్దాం. చిన్న, పెద్ద వ్యాపారాల్ని సులభతరం చేసే అవకాశా లను కల్పించడానికి ప్రభుత్వాలు 7,000 రకాల చర్యలు చేపడుతున్నప్పుడు, వ్యవసాయాన్ని సులభతరం చేసేందుకు చిన్న మొత్తాన్ని కేటాయించడం తప్పెలా అవుతుంది? ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా జిల్లాకు చెందిన బంగాళాదుంపలు పండించే రైతు ప్రదీప్ శర్మ వరు సగా నాలుగేళ్లు నష్టాలను ఎదుర్కొన్నారు. ఈ సంవత్సరం 10 ఎకరాల్లో బంగాళా దుంపల సాగు చేసిన ఈయన 19,000 కేజీల దిగుబడిని మండీకి తీసుకు వచ్చారు. కానీ పంటను మొత్తంగా అమ్మిన తర్వాత రూ. 490ల లాభం మాత్రమే దక్కింది. ఆ రైతు ఆగ్రహంతో తనకు వచ్చిన లాభాన్ని ప్రధానికి పంపుతూ తన సమస్యలను అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నట్లు చెప్పారు. అంతకు కొన్ని రోజుల ముందు మధ్యప్రదేశ్ రైతు భేరూలాల్ మాలవీయ తీవ్ర మైన మనస్తాపానికి గురై చనిపోయారు. మండసార్ మార్కెట్లోకి తాను తీసుకువచ్చిన 27,000 కిలోల ఉల్లిపాయలకు కేవలం రూ. 10 వేల ధర పలకడమే కారణం. మీడియాలో వస్తున్న ఇలాంటి విషాదకరమైన వార్తలతో కొంత కాలంగా రైతుల దుస్థితి గురించిన సమాచారం పతాక శీర్షికల్లో చోటు చేసుకుంటోంది. సంవత్సరాలుగా నష్టాలు చవిచూస్తుండటంతో, రైతులు వాస్తవంగానే అప్పులు తీసుకుని బతుకుతున్నారు. ప్రభుత్వ, ప్రభుత్వేతర వనరుల నుంచి వీరు రుణాలు పొందుతున్నారు. 2016 సెప్టెంబర్ నాటికి, దేశంలో వ్యవసాయ రుణాల మొత్తం రూ. 12.60 లక్షల కోట్లకు చేరుకుంది. 17 రాష్ట్రాల్లో అంటే సగం దేశంలో రైతుల ఆదాయం సగటున కేవలం రూ. 20,000గా ఉన్న పరిస్థితితో ఈ భారీ రుణాలను పోల్చి చూస్తే రైతు జీవితంలో నిస్సహాయత అర్థమవుతుంది. రైతుల బాధలను పరిష్కరించడానికి వ్యవసాయ రుణాల మాఫీ సరైన సమాధానం అవుతుందా అనే అంశంపై ప్రస్తుతం సాగుతున్న చర్చ నేపథ్యంలో భయంకరమైన వ్యవసాయ దుస్థితిని ఊహించుకోండి. రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ఆర్థిక భారాన్ని ఎలా భరిస్తాయి? ఇటీవలే ముగి సిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే మధ్యప్రదేశ్, రాజ స్తాన్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో ఎంపికైన కొత్త ముఖ్యమంత్రులు వ్యవసాయ రుణాల మాఫీని ప్రకటించిన వేగాన్ని పరిశీలిస్తే వారి చర్య వెనుక ఉన్న రాజకీయ కొలమానం కంటే ఆర్థికంగా అది చెల్లుబాటవుతుందా అనే ప్రశ్న కలుగుతోంది. పైగా, ఈ రుణమాఫీకి అవసరమైన డబ్బు ఎక్క డినుంచి వస్తుందనేది పెద్ద ప్రశ్నగా మారింది. ఇది ఇంతటితో ముగియడం లేదు. రైతులకు ప్రత్యక్ష నగదు ప్రోత్సాహకాన్ని కల్పిస్తూ సంవత్సరానికి రూ. 8,000ల (ఇప్పుడు దీన్ని రూ. 10,000కు పెంచారు) నిర్దిష్ట మొత్తాన్ని అందించే విశిష్టపథకం రైతుబంధును తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన తర్వాత, దేశంలోని పలు రాష్ట్రాలు వరుసగా అదేవిధమైన లేక మెరుగుపర్చిన రూపంలో రైతులకు ఆర్థిక ప్రోత్సాహకాలను ప్రకటిస్తూ వస్తున్నాయి. మొదటగా, కర్ణాటకలో మునుపటి కాంగ్రెస్ ప్రభుత్వం మెట్ట భూములున్న రైతులకు హెక్టారుకు రూ. 5,000ల ప్యాకేజీని ప్రతిపాదించింది. హిందీ ప్రాబల్య ప్రాంతంలో ఇటీవలి ఎన్నికల్లో అధికార బీజేపీ కుప్పగూలిన నేపథ్యంలో తమకు అధికారమిస్తే వ్యవసాయ రుణాలను రద్దుచేస్తామంటూ కాంగ్రెస్, బీజేపీ చేస్తున్న వాగ్దానాలతో భీతిల్లిన కారణం కావచ్చు.. ఒడిశాలో రానున్న అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రైతులను బుజ్జగించే ప్రయత్నంలో భాగంగా నవీన్ పట్నాయక్ ప్రభుత్వం రైతులకు ఆర్థిక ప్యాకేజీని ప్రకటించింది. అయితే రుణమాఫీకి బదులుగా రైతుకు సహాయ పథకం పేరిట మూడేళ్లపాటు రూ. 10,180 కోట్ల ప్యాకేజీని ఒడిశా ప్రభుత్వం భూ యజమానులకు, కౌలురైతులకు, భూమి లేని కూలీలకు ప్రకటించింది. దీంతో ఒడిశాలో 57 లక్షల వ్యవసాయ కుటుం బాలకు మేలు చేకూరనుంది. ఇక జార్ఖండ్ ప్రభుత్వం కూడా అయిదు ఎకరాల లోపు భూమి ఉన్న 22.76 లక్షలమంది సన్న, చిన్న కారు రైతులకు సంవత్సరానికి రూ.5,000ల ఆర్థిక సహాయం అందించినున్నట్లు శరవేగంగా ప్రకటిం చింది. ఇక హరియాణా ప్రభుత్వం రైతులకు పెన్షన్ పథకం ప్రకటిం చగా, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం తానేం తక్కువ తినలేదన్నట్లుగా కృషిక్ బంధు పథకంతో ముందుకొచ్చింది. దీంట్లో భాగంగా ఆ రాష్ట్రంలోని ప్రతి రైతూ సంవత్సరానికి ఎకరాకు రూ. 10,000ల నగదు ప్రోత్సాహకం లభించనుంది. దీంతోపాటు 18 నుంచి 60 ఏళ్ల లోపు వయసున్న ప్రతి రైతుకూ రూ.2 లక్షల మేరకు జీవిత భీమాను మమత ప్రభుత్వం ప్రకటించింది. ఈ బీమా ప్రీమియం కూడా రాష్ట్ర ప్రభుత్వమే భరించనుంది. ఈ వరుస రుణమాఫీలను పరిశీలిద్దాం. ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం రైతు రుణమాఫీని ప్రకటించాక, తొలి దశలో 3.5 లక్షల రైతుల బ్యాంకు ఖాతాలలోకి రూ. 1,248 కోట్లను ఇప్పటికే బదలాయించారు. అంటే ప్రతి రైతుకూ గరిష్టంగా రూ. 2 లక్షలవరకు రుణమాఫీ చేశారు. పంజా బ్లో పురోగతి మందగించినప్పటికీ, కోఆపరేటివ్, వాణిజ్యబ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను చెల్లించలేకపోయిన 4.14 లక్షలమంది చిన్న, సన్నకారు రైతులకు దాదాపు రూ.3,500 కోట్ల రుణాలను మాఫీ చేశారు. దేశవ్యాప్తంగా చూస్తే కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఆంద్రప్రదేశ్, రాజస్తాన్, తెలంగాణ, పంజాబ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, తమిళనాడు రాష్ట్రాల ప్రభుత్వాలు మొత్తం మీద రూ. 2.3 లక్షల కోట్ల మేరకు రైతురుణాలను మాఫీ చేస్తున్నట్లు ప్రకటించాయి. దీంతో 3.4 కోట్ల వ్యవసాయ కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది. వీటిని కార్పొరేట్ సంస్థల రుణమాఫీలతో పోల్చి చూద్దాం. మన దేశంలోని డబ్బును ఎవరు దారి మళ్లిస్తున్నారో ఇది మనకు తేల్చి చెబు తుంది. భారతీయ రిజర్వ్ బ్యాంకు ప్రకారం, 2014 ఏప్రిల్ నుంచి 2018 ఏప్రిల్ వరకు నాలుగేళ్ల కాలంలో రూ.3.16 లక్షల కోట్ల కార్పొరేట్ రుణాలను రద్దు చేయగా, దానిలో రూ. 32,693 కోట్లను మాత్రమే రాబ ట్టుకున్నారు. పబ్లిక్ సెక్టార్ అండర్ టేకింగ్‌లను మినహాయిస్తే, 528 మంది కార్పొరేట్ రుణగ్రహీతల వద్ద రూ. 6.28 లక్షల కోట్ల నిరర్ధక ఆస్తులు నమోదయ్యాయి. వీరిలో 95 మంది ఒక్కొక్కరు వెయ్యి కోట్ల రూపాయలను చెల్లించాల్సి ఉంది. అయితే అతి కొద్దిమంది కార్పొరేట్ రుణ గ్రహీతలకు ఇంత భారీ స్థాయిలో రుణమాఫీ చేయడంలోని ఆర్థిక అరాచకత్వ గురించి ఏ ఒక్కరూ అడిగిన పాపాన పోలేదు. కానీ అదే సమయంలో వ్యవసాయ రుణమాఫీలపై తీవ్రమైన చర్చలు, వాదోపవా దాలకు మాత్రం అందరూ సిద్ధపడిపోవడం గమనార్హం. ఈలోగా, నికర నిరర్ధక ఆస్తులు 2017–18 ఆర్థిక సంవత్సరంలో 11.2 శాతానికి మరింతగా పెరిగి రూ. 10.39 లక్షల కోట్లకు చేరుకు న్నాయి. అయితే ప్రభుత్వం గొప్పగా ప్రచారం చేసుకుంటున్న ఇన్సా ల్వెన్సీ అండ్ బ్యాంకింగ్ కోడ్ (ఐబీసీ), సర్ఫేసీ యాక్ట్ ద్వారా కేవలం రూ. 40,400 కోట్లను మాత్రమే ప్రభుత్వం స్వాధీనపర్చుకుంది. దేశీ యంగా నికర నిరర్ధక ఆస్తులు ఇంత భారీగా పెరిగిపోవడానికి గత పదేళ్లుగా పరిశ్రమకు కల్పించిన రూ. 18.60 లక్షల కోట్ల ఆర్థిక ఉద్దీపనే కారణం. 2008–09 సంవత్సరంలో ప్రపంచ ఆర్థిక పతనం సమయంలో భారతీయ పరిశ్రమలకు 1.86 లక్షల కోట్ల మేరకు ఆర్థిక ఉద్దీపన ప్యాకే జీని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ తరహా ప్యాకేజీ నేటికీ కొనసా గుతోండటం గమనార్హం. ఒక్కమాటలో చెప్పాలంటే ప్రతి సంవత్సరం పారిశ్రామికరంగం ప్రత్యక్ష నగదు ప్రోత్సాహకాన్ని పొందుతూనే ఉంది. వ్యవసాయ రుణ మాఫీల కంటే తక్కువ మొత్తంలో దేశంలోని రైతులందరికీ ప్రత్యక్షంగా తలొక రూ. 4,000 ప్రత్యక్ష నగదు సహా యాన్ని అందించే అవకాశం గురించి కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు సూచనలు వస్తున్నాయి. ఈ ప్రత్యక్ష నగదు ప్రోత్సాహకం వల్ల కేంద్రంపై మరొక 2 లక్షల కోట్ల రూపాయల భారం పడుతుంది. ఈ మొత్తం చూడ్డానికి కాస్త పెద్ద మొత్తంగానే కనిపించవచ్చు కానీ సంవత్సరానికి రైతుకు నాలుగు వేల రూపాయల నగదు సహాయం అంటే నెలకు వారికి దక్కేది రూ. 340 మాత్రమే. అంటే ఏ ట్రెండీ కాఫీ షాపులో అయినా మనం రెండు కప్పుల కాఫీ లేక టీ తాగినదాంతో సమానం. నిస్సహా యస్థితిలో ఉన్న రైతాంగానికి నెలకు రూ. 340ల సహాయం చేయడం ఆర్థికపరంగా సరైన చర్య అనుకుంటే దేశంలో ఆదాయాల మధ్య అస మానతకు ఇంతకు మించిన ఉదాహరణ ఉండదు గాక ఉండదు. వ్యవసాయ రుణమాఫీలు ఆర్థిక అవసరంగా ఉంటూ, వాటికోసం రాష్ట్ర ప్రభుత్వాలు తగినన్ని వనరులను వెతకాల్సి ఉంటున్న నేపథ్యంలో, ప్రత్యక్ష నగదు మద్ధతును వ్యవసాయ సంక్షోభానికి శాశ్వత పరిష్కా రంగా చూడకూడదు. తక్షణ ఉపశమన చర్యలను చేపడుతూనే, వ్యవ సాయ రంగానికి పలు గట్టి సంస్కరణలను అమలు చేయడం ఎంతైనా అవసరం. అందుకే ఈ 2019 సంవత్సరం వ్యవసాయ సంస్కరణల సంవత్సరంగా మారుతుందని ఆశిద్దాం. చిన్న, పెద్ద తరహా వ్యాపా రాన్ని సులభతరం చేసే అవకాశాలను కల్పించడానికి ప్రభుత్వాలు 7,000 రకాల చర్యలు చేపడుతున్నప్పుడు, వ్యవసాయాన్ని సులభతరం చేసే అవకాశాలను కల్పించడానికి చిన్న మొత్తాన్ని కేటాయించడం తప్పెలా అవుతుందో నాకు చిన్న కారణం కూడా కనిపించడం లేదు. అయినా వ్యవసాయం దేశీయ జనాభాలో 52 శాతానికి సంబంధించి నది. ‘సబ్కా సాత్, సబ్కా వికాస్’ నిజంగా సిద్ధించాలంటే ఇది మాత్రమే సరైన ఆర్థిక చికిత్స అవుతుంది. దేవిందర్‌శర్మ వ్యాసకర్త వ్యవసాయ నిపుణులు ఈ–మెయిల్ :hunger55@gmail.com -
స్వామినాధన్ కమిటీ సిఫార్సులను అమలు చేయాలి
-
కేసీఆర్ చేసిన పని.. బాబు ఎందుకు చేయలేదు
సాక్షి, విజయవాడ : మద్దతు ధర ప్రకటనలో రైతుకు అన్యాయం జరిగిందని వైఎస్సార్సీపీ రైతు విభాగం అధ్యక్షుడు ఎంవీఎస్ నాగిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. కేంద్రంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. గత ఎన్నికల మ్యానిఫెస్టోలో చంద్రబాబు నాయుడు రైతుల కోసం స్వామినాథన్ కమిటీ సిఫారసులు అమలు చేస్తామని చెప్పిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. మద్దతు ధరల విషయంలో రైతులు సంతోషంగా ఉన్నారని చెబుతున్న బీజేపీ నేతల మాటల్లో వాస్తవం లేదన్నారు. వరికి నామమాత్రంగా మద్దతు ధర పెరిగిందని విమర్శించారు. ఎన్డీఏ ప్రభుత్వం నాలుగేళ్లలో ముష్టివేసినట్లు ధరలు పెంచితే, చంద్రబాబు ఒక్కసారి కూడా నోరు మెదపలేదని నాగిరెడ్డి మండిపడ్డారు. రైతుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి లేఖలు రాసిందని, కానీ చంద్రబాబు ఒక్కసారైనా రాశారా అని నిలదీశారు. స్వామినాథన్ కమిటీ సిఫార్సులు అమలు చేయడం సాధ్యం కాదని కేంద్రం సుప్రీంకోర్టులో పిటీషన్ వేస్తే చంద్రబాబు ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. ఎన్నికల ఏడాదని బీజేపీ ఇప్పుడు మద్దతు ధరలు పెంచి హడావిడి చేస్తోందని విమర్శించారు. ధాన్యానికి క్వింటాలుకి రూ. 2000 కనీసం ఉంటేనే రైతులు మనుగడ సాగిస్తారని తెలిపారు. సాగులో లేని పంటలకు ధర పెంచి అత్యధిక సాగు జరిగే పంటలకు మాత్రం నామమాత్రంగా పెంచారని విమర్శించారు. మద్దతు ధర లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, మోడీ చంద్రబాబు ఎవరైనా సరే వారిని వెంటనే ఆదుకునే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ రంగం పూర్తి సంక్షోభంలో కూరుకుపోయిందన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను మోసం చేయొద్దని, పెంచిన మద్దతు ధరలకు అనుగుణంగా యంత్రాంగాన్ని పెంచాలని డిమాండ్ చేశారు. వ్యవసాయంపై రైతు నాయకుడిగా తాను సీఎంతో చర్చకు సిద్ధమని అన్నారు. రైతులకు వైఎస్సార్ అందించిన సేవలను రైతులు ఇప్పటికీ గుర్తు చేసుకుంటారని చెప్పారు. దివంగత నేత వైఎస్సార్ హయాంలో వ్యవసాయం పండుగలా ఉండేదన్నారు. ఉచిత విద్యుత్ నుంచి మొదలు పెడితే రుణమాఫీ, మద్దతు ధరల వరకూ రైతు బాంధువుడిగా నిలిచారని నాగిరెడ్డి గుర్తుచేశారు. -
పరాజయం తెచ్చిన ప్యాకేజీలు!
ఉత్తరప్రదేశ్‌లో చెరకు విస్తారంగా పండించే ప్రాంతంలోని కైరానా ఉప ఎన్నికలో బీజేపీ ఓడిపోయిన వారం రోజులకే కొత్త ప్యాకేజీ ప్రకటించారు. వ్యవసాయ అర్థశాస్త్రానికి బదులు రాజకీయాలే చెరకు లేదా చక్కెర విధానాలను శాసిస్తున్నాయి. 2014లో బీజేపీకి ఓటేసిన చెరకు రైతులే ఆగ్రహంతో ఉప ఎన్నికలో ఓడించారు. ఓటమి చవిచూసిన వెంటనే బీజేపీ హడావుడిగా మిత్రపక్షాలను దువ్వి బుజ్జగించే ప్రయత్నాలు ప్రారంభించింది. చక్కెర పరిశ్రమ కోసం రూ.7,000 కోట్ల ప్యాకేజీని మోదీ ప్రభుత్వం కిందటివారం ప్రకటించడం కూడా ఎన్నికల ప్యాకేజీల్లో భాగమే. ఉప ఎన్నికల్లో వరుస పరాజయాలు నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని భయాందోళనలోకి నెట్టాయి. వర్తమాన ఘటనలకు స్పందనగా బీజేపీ సర్కారు తన కార్యాచరణను రూపొందించడం విశేషం. చక్కెర పరిశ్రమ కోసం రూ.7,000 కోట్ల ప్యాకేజీని మోదీ ప్రభుత్వం కింద టివారం ప్రకటించింది. ఈ సాయం సమస్యను పరి ష్కరిస్తుందా, కనీసం వాయిదా వేస్తుందా? అంటే జవాబు లేదనే చెప్పాలి. పంచదారతో సమస్య ఏమంటే, ఇండియాలో మాదిరిగానే ప్రపంచంలోనూ దీని ఉత్పత్తి చాలా ఎక్కువ. ప్రభుత్వం ఆదేశించనట్టు చెరకు రైతులకు చక్కెర మిల్లులు కనీస మద్దతు ధర చెల్లిస్తే వాటికి ఖర్చులు కూడా గిట్టవు. రైతులకు ‘మరింత గిట్టుబాటు’ ధరలు దక్కాలని సర్కారు కోరుకుంటే ముందు చక్కెర దిగుమతులు నిషేధిం చాలి. ప్రభుత్వం ఆ పని చేసింది కూడా. అయినా, మిల్లులకు చక్కెర ధరలు ‘గిట్టుబాటు’ కాకుంటే ప్రభుత్వం చక్కెరకు గరిష్ట చిల్లర ధర(ఎమార్పీ) నిర్ణయించాల్సి ఉంటుంది. ఇది గత కాలపు లైసెన్స్– కోటా పద్ధతి అవశేషంగా కనిపిస్తుంది. 2019 లో ఓటేసే 80 శాతం ప్రజలకు ఇంతకు ముందు చెప్పిన 1960 నాటి ధర నిర్ణయ విధానంగాని, పనికిమాలిన రాజకీయాలుగాని అర్ధం కావు. దేశంలో చెరకు పండించే రైతుల సంఖ్య రోజు రోజుకు పెరుగు తోంది. అవసరానికి మించి చక్కెర ఉత్పత్తి అవు తోంది. ప్రపంచ మార్కెట్లో ప్రస్తుత ధరలను బట్టి చూస్తే దేశం నుంచి పంచదార ఎగుమతి చేయలేం. అయితే, చెరకు పంట వేయకుండా రైతులకు ప్రోత్సా హకాలు ఇస్తే మంచిది. ముఖ్యంగా నీటి కొరత ఉన్న మహారాష్ట్రలో రైతులకు చెరకు సాగు చెడు అలవా టుగా మారి, పర్యావరణ సంక్షోభానికి దారితీస్తున్న నేపథ్యంలో అక్కడ రైతులకు చెరకు వేయవద్దని నచ్చజెప్పాలి. రైతులు చెరకుకు బదులు పళ్ల తోటలు పెంచితే ఎంతో బాగుపడతారు. ఇలాంటి సాగు మార్పు కోసం రూ.20,000 కోట్లు ఖర్చు చేస్తే మెరు గైన ఫలితాలు వస్తాయి. కాని, చెరకు సాగు తగ్గించి, పళ్ల తోటల పెంపకం ప్రారంభిస్తే ఎన్నికలు జరిగే 2019 మే నాటికి రైతులకు లాభాలు కనిపించవు. అందుకే చెరకు పంట విషయంలో విధానాలేవీ తక్ష ణమే మారవు. మితిమీరిన చెరకు దిగుబడి కొన సాగక తప్పదు. కైరానా ఉప ఎన్నిక తెచ్చిన మార్పు ఉత్తరప్రదేశ్‌లో చెరకు విస్తారంగా పండించే ప్రాంతం లోని కైరానా ఉప ఎన్నికలో బీజేపీ ఓడిపోయిన వారం రోజులకే కొత్త ప్యాకేజీ ప్రకటించారు. వ్యవ సాయ అర్థశాస్త్రానికి బదులు రాజకీయాలే చెరకు లేదా చక్కెర విధానాలను శాసిస్తున్నాయి. 2014లో బీజేపీకి ఓటేసిన చెరకు రైతులే ఆగ్రహంతో ఉప ఎన్నికలో ఓడించారు. తాము ఘర్షణ పడిన ముస్లిం లతో కలసి రైతులు తమను ఓడించారనే విషయం బీజేపీకి అర్థమైంది. రైతులకు వచ్చిన కోపం ముస్లిం లతో ఉన్న కలహాన్ని మర్చిపోయేలా చేసింది. అయితే, ఓటర్లను రెండు మత వర్గాలుగా చీల్చి ఉప ఎన్నికలో లబ్ధిపొందడానికి యూపీ సీఎం యోగీ ఆది త్యనాథ్ చేసిన చౌకబారు ఎత్తుగడ ఫలించలేదు. ఎప్పుడో మరణించిన పాకిస్తాన్ స్థాపకుడు జిన్నా పేరు ఉచ్చరిస్తూ హిందుల ఓట్లను రాబట్టడానికి చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. బీజేపీ నేతలు జిన్నా పేరు చెప్పి రైతులను లొంగదీయాలని చూస్తే, ప్రతిపక్షం గన్నా(హిందీలో చెరకు) పేరుతో రైతులను ఆకట్టుకుంది. చివరికి ఓటమి చవిచూసిన వెంటనే బీజేపీ హడావుడిగా మిత్రపక్షాలను దువ్వి బుజ్జగించే ప్రయత్నాలు ప్రారంభించింది. కైరానాలో ఓడిపో యిన మరుసటి రోజే పంజాబ్‌లో మిత్రపక్షమైన శిరో మణి అకాలీదళ్ ఎప్పటి నుంచి చేస్తున్న డిమాండ్‌ను ఆమోదించింది. అదేమంటే– సిక్కు గురుద్వారాల్లో సమూహిక భోజనాలకు (లంగర్లు) వాడే ఆహార పదార్థాలపై జీఎస్టీని కేంద్రసర్కారు రద్దు చేసింది. అలాగే, శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే, బీజేపీ జాతీ యాధ్యక్షుడు అమిత్‌షా మధ్య శత్రుత్వమే ఉందనే విషయం తెలిసిందే. మహారాష్ట్రలో సంకీర్ణ భాగస్వా మిని బుజ్జగించడానికి అదే వారం అమిత్‌షా, తను ఎంపికచేసిన సీఎంను వెంటపెట్టుకుని ఉద్ధవ్ ఇంటికి వెళ్లారు. తండ్రి బాల్ ఠాక్రే తెలివితేటలు పుణికి పుచ్చుకున్న ఉద్ధవ్ బీజేపీ నేతలకు కొత్త గుణపాఠం చెప్పారు. రాష్ట్రప్రభుత్వాన్ని నడిపే ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ను ఉద్ధవ్ బయటే వేచి ఉండేలా చేశారు. సీఎం ఇంతటి అవమానం ఎందుకు భరిం చాలి? మెజారిటీతో మరుగున పడిన సంకీర్ణధర్మం నాలుగేళ్ల క్రితం బీజేపీకి మిత్రపక్షాలపై ఆధారపడా ల్సిన అవసరం లేకుండా పూర్తి మెజారిటీ దక్కింది. సంకీర్ణ ధర్మం పాటిస్తానని బీజేపీ చెప్పినాగాని అధికారం, జనాదరణ ఈ తరంలో ఎవరికీ లేనం తగా ప్రధానికి ఉండడంతో ఆయన ముందు మిత్ర పక్షాలన్నీ సాగిలపడ్డాయి. పరిస్థితి గమనించిన ‘వాతావరణ నిపుణుడు’ బిహార్ సీఎం నితీశ్‌కుమార్ లౌకిక కూటమిని వదలి అవినీతి వ్యతిరేక పంథాతో బీజేపీ శిబిరంలో చేరారు. ఇప్పుడేమో ఆయన బిహా ర్లో ఎన్డీఏ అంటే స్థానిక ఎన్డీఏ అనే రీతిలో మాట్లా డుతున్నారు. మగ్గురు ఎంపీలున్న చిన్న బీహార్ పార్టీ ఆరెలెస్వీ నేత, కేంద్ర మంత్రి అయిన ఉపేంద్ర కుశ్వాహా పట్నాలో జరిగిన ఎన్డీఏ విందుకు హాజరు కాకుండా బీజేపీ నేతలకు పరోక్షంగా హెచ్చరించారు. ‘మీకు మెజారిటీ ఉన్నా మీరు బలహీనపడ్డారు. కాబట్టి మేం గట్టిగానే బేరమాడతామనే విషయం గుర్తించండి,’ అనేది ఈ మిత్రపక్షాల సందేశంగా కని పిస్తోంది. ఉత్తరప్రదేశ్‌లో కొద్ది నెలల క్రితం బీజేపీకి కంచుకోటలని భావించిన గోరఖ్‌పూర్, ఫూల్పూర్ లోక్‌సభ ఉప ఎన్నికల్లో పాలకపక్షం ఓడిపోయిన ప్పుడే మోదీ సర్కారు వేగానికి మొదటి దెబ్బతగి లింది. బీజేపీని ఎన్నికల్లో ఓడించడం సాధ్యమయ్యే పనేననే సూచనలు అందరికీ కనిపించాయి. అప్పటి నుంచి బీజేపీ కంగారుతో అనేక తప్పులు చేసింది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో అవినీతిపై యుద్ధం ప్రక టించిన ఈ పార్టీ కర్ణాటకలో బళ్లారి సోదరులతో చేతులు కలిపింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోతామనే భయమే బీజేపీతో ఈ పని చేయించింది. వాస్తవానికి కర్ణాటకలో శాసనసభ ఎన్నికల నాటికి నరేంద్రమో దీకి ప్రజల్లో మంచి ఆదరణ ఉంది. బీజేపీకి సాధా రణ మెజారిటీ సాధించిపెట్టే స్థాయిలో మోదీకి జనా కర ్షణ శక్తి ఉంది. అయితే, బళ్లారి సోదరుల రంగ ప్రవేశంతో ఓటర్లలో అనుమానాలు రేకెత్తాయి. ఫలి తంగా, వారు తమ పలుకుబడితో 15 సీట్లు బీజేపీ ఖాతాలో పడేలా చేస్తారని అంచనావేయగా, చివరికి కమలం పార్టీకి మూడు సీట్లే లభించాయి. దీంతో 2019 ఎన్నికల్లో బీజేపీ అవినీతికి వ్యతిరేకంగా ప్రచారం చేసే అవకాశం కోల్పోయింది. కేంద్ర వ్యవ సాయ మంత్రిగా నియమించిన బీజేపీ నేతకు ఆ పదవి ఆయన తెలివితేటల వల్ల రాలేదు. ఫలితంగా, నాలుగేళ్లలో దేశ వ్యవసాయ రంగంలో వృద్ధి రేటు యూపీఏ పదేళ్ల అభివృద్ధితో పోల్చితే దాదాపు సగా నికి పడిపోయింది. యూపీఏ హయాంలో 3.7 వార్షిక సగటు వృద్ధిరేటు ఉన్నాగాని అప్పుడు కూడా వ్యవ సాయంలో సంక్షోభం కొనసాగింది. వ్యవసాయశాఖ కొత్త తరహా సేంద్రియ ఎరువును రైతులకు అంద జేస్తోంది. మనమంతా ‘మాత’గా పిలిచే దేశవాళీ ఆవు పేడలో మాత్రమే లభించే మంచి బాక్టీ రియా(సూక్ష్మజీవులు)తో ఈ ఎరువు రూపొందించి కేంద్ర వ్యవసాయశాఖ నామమాత్రపు ధరకు రైతు లకు సరఫరా చేస్తోంది. ఈ రకమైన వినూత్న ఎరు వులు ఉపయోగించి 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేయడం సాధ్యమా? అంటే, అనుమానమే. చెరకు లేదా చక్కెర సమస్య హఠాత్తుగా ఊడిపడినది కాదు. గత నాలుగేళ్లుగా నానుతూ ఇప్పటికి ముదిరి పోయింది. ఇంతకు ముందే ఈ సమస్యను గుర్తించి, పరిష్కరించే తీరిక పాలకులకు లేకపోయింది. రెండోది.. పెద్దగా విలువ లేని కొత్త ముఖ్యమంత్రుల నిర్లక్ష్యపూరితమైన ఎంపిక. వీరిలో ప్రతిఒక్కరూ ఇప్పుడు తమను తాము నిరూపించుకోవల్సి ఉంది. తమ తమ రాష్ట్రాలలో అన్ని స్థానాల్లోనూ ప్రజామోదాన్ని గెల్చుకున్న ఈ ముగ్గురు ముఖ్యమంత్రులు ఒకప్పుడు పూర్తి నిర్లక్ష్యానికి గురైనవారే. ఇక మూడో అంశం ఏదంటే, పరమ అహంభావపూరిత వైఖరితో మిత్రపక్షాలతో వ్యవహరించినందుకు అది చెల్లిస్తున్న మూల్యం. ఈ తరం రాజకీయనేతలు పూర్తి మెజారిటీతో పాలన సాగించే అనుభవాన్ని కోల్పోయారని మనకు బాగా తెలుసు. ప్రజలు రాజకీయాల్లో ఎందుకు చేరుతున్నారనే కారణానికి సంబంధించిన వాస్తవాన్ని బీజీపే ఇప్పుడైనా నమ్రతతో అంగీకరించాలి. అధికార కుమ్ములాటలో తమకూ వాటా కావాలని అందరూ కోరుకుంటున్నారు. మిత్రపక్షాలకు ఎలాంటి మంత్రిపదవులనూ బీజేపీ ఇవ్వలేదు. అకాలీలు బీజేపీకి చాలా విశ్వసనీయమైన మిత్రపక్షం. ఆ పార్టీలోని పాలకకుటుంబానికి చెందిన ఒక కోడలికి మాత్రమే మంత్రివర్గంలో కేబినెట్ ర్యాంక్ కల్పించారు. అది కూడా ఫుడ్ ప్రాసెసింగ్ శాఖను కట్టబెట్టారు. ఆమె స్వరాష్ట్రంలో ఆమెను చట్నీ, జామ్ మురబ్బాలు వడ్డించే మంత్రిగా పేరుపడింది. శివసైనికుడైన అనంత్ గీతే పోర్ట్ ఫోలియో మీకు తెలుసా? ఏ మిత్రపక్షానికీ తమ స్వంత విశ్వాసంతో పాలించగలిగే అవకాశం దక్కలేదు. బీజేపీ సంకీర్ణ ప్రభుత్వాన్ని నడుపుతోంది కానీ ఆ పార్టీ మాత్రమే పాలనా పగ్గాలను గుప్పిట్లో పెట్టుకుంది. దాని చర్యలే దాని ఫలితాలను నేడు నిర్దేశిస్తున్నాయంటే ఆశ్చర్యపడాల్సిన పనిలేదు. ఈ పరిస్థితులలో పరిణిత రాజకీయ పార్టీలాగా కాకుండా శైశవదశలో మరో అతిపెద్ద విజయాన్ని సాధించడానికి అది కృషి చేస్తున్నట్లు కనిపిస్తోంది. శేఖర్ గుప్తా వ్యాసకర్త దప్రింట్ చైర్మన్, ఎడిటర్–ఇన్–చీఫ్ twitter@shekargupta -
కదంతొక్కిన రైతన్న
ముంబై: అన్నదాతలు ఆదివారం ముంబై నగరాన్ని ముంచెత్తారు. డిమాండ్ల సాధన కోసం దాదాపు 50 వేల మంది మహారాష్ట్ర రైతులు ముంబైలో అడుగుపెట్టారు. వారంతా సోమవారం అసెంబ్లీని ముట్టడించనున్నారు. రైతు సమస్యలు తీర్చాలంటూ మహారాష్ట్రలోని వివిధ జిల్లాల నుంచి వేలాది మంది కర్షకులు పాదయాత్రగా వచ్చారు. ఎండలు మండిపోతున్నా, అరికాళ్లు బొబ్బలెక్కుతున్నా లెక్కచేయకుండా దీక్షతో ఆరు రోజులపాటు 180 కిలో మీటర్లు నడిచిన వారంతా ముంబైలోని కేజే సోమయ మైదానానికి చేరుకున్నారు. ఆ తర్వాత వారు అర్ధరాత్రి ఆజాద్ మైదానానికి బయల్దేరారు. మహారాష్ట్ర మంత్రి గిరీశ్ మహాజన్ వీరికి ముంబై శివార్లలో స్వాగతం పలికారు. మంగళవారం నాసిక్‌లో యాత్ర ప్రారంభమైంది. ప్రభుత్వం ముందుగా ప్రకటించినట్లుగా రైతు రుణాలను మాఫీ చేయడం, పెట్టుబడికి అయిన ఖర్చు కన్నా కనీసం 50 శాతం ఎక్కువగా కనీస మద్దతు ధర ఉండేలా చూడడం, ఎంఎస్ స్వామినాథన్ కమిటీ సిఫారసులను అమలు చేయడం, అకాల వర్షాలు, తెగుళ్ల కారణంగా పంట నష్టపోయిన వారిని ఆదుకోవడం, ఆదివాసీలు సాగు చేస్తున్న భూములను వారి పేర్లన రిజిస్టర్ చేయడం తదితరాలు రైతుల డిమాండ్లలో ప్రధానమైనవి. రైతు సమస్యల పరిష్కారానికి ఆరుగురు సభ్యులతో ఇప్పటికే మంత్రివర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేశామనీ, ఆ సంఘం రైతులతో చర్చలు జరుపుతుందని సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ చెప్పారు. కమ్యూనిస్టుల అనుబంధ అఖిల భారత కిసాన్ సభ (ఏఐకేఎస్) రైతుల పోరాటానికి నేతృత్వం వహిస్తోంది. ఎవరికీ ఇబ్బంది లేకుండా, శాంతియుతంగా తాము నిరసన తెలుపుతామని ఏఐకేఎస్ తెలిపింది. -
పంటల కనీస మద్దతు ధర సూత్రమిదే!
న్యూఢిల్లీ: పంటలకు కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) నిర్ణయించటంలో అనుసరించనున్న సూత్రాన్ని ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ వెల్లడించారు. బడ్జెట్లో 2019 ఖరీఫ్ సీజన్లో పంట ఉత్పత్తి వ్యయానికి ఒకటిన్నర రెట్ల మద్దతు ధర ఇవ్వాలని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. ‘వాస్తవ ఉత్పత్తి వ్యయం, రైతు కుటుంబసభ్యుల శ్రమ వ్యయాన్ని కలపగా వచ్చిన మొత్తానికి 50 శాతం అదనంగా చేర్చి మద్దతు ధరగా నిర్ణయించాం’ అని జైట్లీ వెల్లడించారు. మద్దతు ధరపై అనుసరించిన విధానాన్ని వెల్లడించాలంటూ.. విపక్షాలు, వ్యవసాయ నిపుణులు డిమాండ్ చేసిన నేపథ్యంలో బడ్జెట్‌పై చర్చ సందర్భంగా రాజ్యసభలో శుక్రవారం జైట్లీ ఈ ప్రకటన చేశారు. ప్రభుత్వం రైతుల వద్దనుంచి గోధుమ, వరి పంటలనే (రేషన్ షాపుల ద్వారా సబ్సిడీపై అందించేందుకు) సేకరిస్తున్నప్పటికీ.. 23 వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధర నిర్ణయించింది. ప్రభుత్వం కనీస మద్దతు ధర నిర్ణయించినప్పటికీ.. రైతులకు చేరటం లేదని జైట్లీ అంగీకరించారు. ‘రైతులకు ఎంఎస్పీ చేరాలనే లక్ష్యంతోనే బడ్జెట్లో ప్రతిపాదనలిచ్చాం. అన్ని పంటలకు ఒకే విధానాన్ని పరిగణనలోకి తీసుకున్నాం. సాగుకు అయిన వ్యయం (విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహారక మందులు, నీటిపారుదల ఖర్చులు, చెల్లించిన కూలీలు.. ఇతరత్రా), రైతు కుటుంబసభ్యుల శ్రమకు విలువకట్టిన మొత్తాన్ని కలుపుకుని దీనికి ఒకటిన్నర రెట్ల మద్దతు ధర నిర్ణయించాం’ అని జైట్లీ వెల్లడించారు. భయంకరమైన డాక్టర్ చేతుల్లో.. యూపీఏ హయాంలో భారత ఆర్థిక వ్యవస్థ పదేళ్లపాటు ‘భయంకరమైన డాక్టర్’ చేతిలో ఉందని జైట్లీ పేర్కొన్నారు. ప్రపంచంలోనే అత్యంత భయంకరమైన ఐదు ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా భారత్‌ను చేర్చారని మాజీ ఆర్థిక మంత్రి చిదంబరంపై తీవ్ర విమర్శలు చేశారు. నిర్మాణాత్మక సంస్కరణల కారణంగా 2014 నుంచి భారత ఆర్థిక వ్యవస్థ గాడిలో పడిందని జైట్లీ పేర్కొన్నారు. యూపీఏ హయాంలో జీడీపీ వృద్ధి, ద్రవ్యోల్బణం, ద్రవ్యలోటు, కరెంట్ అకౌంట్ డెఫిసిట్‌లను సభకు వెల్లడించారు. ప్రస్తుత వివరాలను సభ్యులు అర్థం చేసుకోవాలన్నారు. కాగా, కేంద్ర బడ్జెట్ ప్రజలను మోసం చేసేదిగా ఉందని.. తృణమూల్, ఎస్పీ, సీపీఐ, ఎన్సీపీ, ఆప్ సభ్యులు మండిపడ్డారు. ఫేకూ ఫెడరలిజం (అవాస్తవ సమాఖ్య వ్యవస్థ), అహంకారాన్ని ఎన్డీయే ప్రదర్శిస్తోందని విమర్శించారు. పార్లమెంటు వాయిదా తీవ్రమైన నిరసనలు, సభ్యుల ఆందోళనల మధ్య పార్లమెంటు ఉభయసభలు మర్చి 5కు వాయిదా పడ్డాయి. శుక్రవారం లోక్‌సభ ప్రారంభం కాగానే.. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాపై వైఎస్సార్సీపీ సభ్యులు వెల్‌లోకి దూసుకెళ్లి నినాదాలు చేశారు. అటు రాఫెల్ యుద్ధవిమానాల కొనుగోలు వివరాలు వెల్లడించాలంటూ కాంగ్రెస్ ఎంపీలు కూడా వెల్‌లోకి దూసుకెళ్లటంతో తీవ్ర గందరగోళం నెలకొంది. నిరసనల మధ్యే కాసేపు సభను నడిపించిన స్పీకర్ సుమిత్ర మహాజన్.. కొద్దిసేపటి తర్వాత మార్చి 5కు సభను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో పార్లమెంటు బడ్జెట్ సమావేశాల తొలి అర్ధభాగం ముగిసింది. రాజ్యసభలోనూ బడ్జెట్‌పై చర్చ జరగకుండా ఏపీ ఎంపీలు అడ్డుకున్నారు. వెల్‌లోనే బైఠాయించారు. అయితే ఏపీ ఎంపీలను బయటకు పంపి బడ్జెట్‌పై చర్చ, జీరో అవర్‌ను నిర్వహించాలని తృణమూల్, కాంగ్రెస్ ఎంపీలు రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడును కోరారు. అయినా నిరసనలు ఆగకపోవటంతో వెంకయ్య సభను రెండుసార్లు వాయిదా వేశారు. బడ్జెట్‌పై చర్చ జరిగాక రాజ్యసభ మార్చి ఐదో తేదీకి వాయిదా పడింది. సీఏసీపీ సూచనల ప్రకారమే! ప్రస్తుతం వ్యవసాయ ఖర్చులు, ధరల కమిషన్ (సీఏసీపీ) సిఫారసుల ఆధారంగా ప్రభుత్వం ఎంఎస్పీని నిర్ణయిస్తుంది. ఈ సంస్థ మూడు సూత్రాలను ప్రభుత్వానికి సూచించింది. ఏ2 (విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహారక మందులు, కూలీలు, ఇంధనం, నీటిపారుదల తదితర ఖర్చులు కలుపుకుని), ఏ2+ఎఫ్ఎల్ (ఏ2కు పంట ఉత్పత్తిలో పనిచేసినందుకు గానూ రైతు కుటుంబీకుల శ్రమను కలుపుకోవాలి), సీ2 (పై రెండు కలుపుకుని, పంటకోసం తన ఆస్తులు, బంగారం మొదలైనవి తాకట్టుపెట్టి తెచ్చిన మొత్తానికి వడ్డీ కలుపుకుని) అని మూడు వేర్వేరు విధానాలను ప్రతిపాదించింది. 2006లో వ్యవసాయ శాస్త్రవేత్త ఎమ్మెస్ స్వామినాథన్ నేతృత్వంలోని జాతీయ వ్యవసాయ కమిషన్ కూడా పంట వ్యయానికి (ఏ2+ఎఫ్ఎల్) 50 శాతం ఎక్కువ మద్దతు ధర సిఫారసు చేసిన సంగతి తెలిసిందే. 2014 సార్వత్రిక ఎన్నికల సమయంలో బీజేపీ కూడా పంట ఉత్పత్తి వ్యయానికి 50 శాతం అధిక మద్దతు ధర చెల్లిస్తామని మేనిఫెస్టోలో పేర్కొంది. -
గోధుమ, పప్పుధాన్యాల మద్దతు ధర పెంపు
సాక్షి,న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం రైతులకు స్వల్ప ఊరట కల్పించింది.ధరల పెంపును అరికట్టి దిగుబడులను ప్రోత్సహించేందుకు గోధుమ, పప్పుధాన్యాల కనీస మద్దతు ధర(ఎంఎస్పీ)ను పెంచింది. గోధుమలకు కనీసమద్ధతు ధరను క్వింటాల్‌కు రూ 110 చొప్పున రూ 1735 రూపాయలకు పెంచింది. పప్పుధాన్యాల ధరలను క్వింటాల్‌కు రూ 200 మేర పెంచింది.ప్రధాని నరేంద్ర మోదీ అథ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ రబీ పంటలకు మద్దతు ధరలను ఆమోదించింది. ఇక పప్పుధాన్యాల సాగును ప్రోత్సహించేందుకు మద్దతు ధరను క్వింటాల్‌కు రూ 4150 నుంచి రూ 4200కు పెంచారు. ఆయిల్‌సీడ్స్, ఇతర విత్తనోత్పత్తుల మద్దతు ధరలను కూడా పెంచినట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. వ్యవసాయ ఖర్చులు, ధరల కమిషన్ సిఫార్సులకు అనుగుణంగా కేంద్రం కనీస మద్దతు ధరలను పెంచిందని తెలిపాయి. దేశంలో ఈ నెలలో సాగయ్యే ప్రధాన రబీ పంట గోధుమ వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి మార్కెట్‌కు వస్తుంది. -
అష్టకష్టాలు పడుతున్నాం.. మాకేదీ ‘ఫిట్మెంట్’!
రాజమండ్రి : ‘రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అధ్వానంగా ఉన్నా ప్రభుత్వోద్యోగులకు 43 శాతం ఫిట్మెంట్ ఇచ్చారు. ఆర్టీసీ నష్టాల్లో ఉన్నా అంతే ఫిట్మెంట్ ఇచ్చారు. అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకునే దుస్థితి దాపురించినా వ్యవసాయ ఉత్పత్తుల కనీస మద్దతు ధరలపై మాకు ‘ఫిట్మెంట్’ (బోనస్) ఎందుకు ఇవ్వరు?’అని రైతులు ప్రశ్నిస్తున్నారు. కనీస మద్దతు ధర పెంచకపోవడం, ఉన్న మద్దతు ధరకన్నా తగ్గించి మిల్లర్లు ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడం వల్ల తాము నష్టపోతున్నామని వాపోతున్నారు. శుక్రవారం జిల్లా పర్యటనకు వస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని కోరుతున్నారు. ప్రభుత్వోద్యోగులకు, ఆర్టీసీ సిబ్బందికి మెరుగైన ఫిట్మెంట్ ఇచ్చినట్టే తమ పంటలకు సైతం లాభసాటి ధర కల్పించాలని రైతులు కోరుతున్నారు. జిల్లాలో ఈ ఏడాది రబీలో సుమారు 15 లక్షల టన్నుల దిగుబడి వచ్చింది. అయితే కోతల సమయంలో వర్షాలు పడడం, యంత్రాలతో కోయించడం వల్ల ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు అమ్ముకోలేక దళారులను ఆశ్రయించాల్సి వస్తోంది. ఇదే అదనుగా వారు బస్తా (75 కేజీలు) రూ.1,050 ఉండగా, కేవలం రూ.850కు కొంటున్నారు. దీని వల్ల పంట పండినా నష్టపోవాల్సి రావడం రైతులను ఆవేదనకు గురి చేస్తోంది. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం స్పందించడం లేదు. తాను అధికారంలోకి వస్తే రైతులకు లాభసాటి ధర కల్పిస్తానన్న బాబు ఇప్పుడు నోరు మెదపడం లేదు. కేంద్రం లాభసాటి మద్దతు ధర ప్రకటించకున్నా రాష్ట్ర ప్రభుత్వం ధాన్యానికి బోనస్ ప్రకటించే అవకాశముంది. ఈ విషయాన్ని కూడా బాబు ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. కనీసం ఇప్పుడున్న మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు చేయించేందుకు తీసుకున్న చర్యలు కూడా లేవు. కొనుగోలు కేంద్రాల్లో 17 శాతం తేమ మించకూడదన్న నిబంధననూ సడలించ లేదు. దీని వల్ల రైతులు ధాన్యాన్ని బయట వ్యక్తులకు అమ్ముకోవాల్సి వస్తోంది. ఇటీవల కమిషన్ ఫర్ అగ్రికల్చర్ కాస్ట్ అండ్ ప్రైస్ (సీఏసీపీ) వరికి రూ.50 మద్దతు ధర పెంచాలని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖకు సిఫార్సు చేసినా ఇప్పటి వరకు అనుమతి రాలేదు. కనీసం ఈ పెంపును అమలు చేసినా ఎంతోకొంత మేలనుకుంటుంటే రైతులు వారివద్దనున్న ధాన్యాన్ని అరుునకాడికి అమ్ముకున్నాక తప్ప కేంద్రం అనుమతి ఇచ్చేలా లేదు. అప్పటి నష్టానికి పరిహారాలు ఇంకెప్పటికో? ముఖ్యంగా పెట్టుబడి రాయితీ (ఇన్పుట్ సబ్సిడీ) ఊసే లేకుండా పోయింది. జిల్లాలో ఇప్పటికీ 20 శాతం మంది రైతులకు నీలం పరిహారం అందలేదు. సుమారు రూ.110 కోట్ల హెలెన్ తుపాను పరిహారం ఊసేలేదు. రుణమాఫీ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. జిల్లాలో ఇంకా 30 శాతం మంది రైతులు కాకినాడలోని రుణమాఫీ దరఖాస్తులు స్వీకరించే కేంద్రం వద్ద పడిగాపులు పడుతున్నారు. ఇన్ని సమస్యలు ఎదుర్కొంటున్న తమకు సైతం ఉద్యోగులకు ఫిట్మెంట్ ఇచ్చిన తరహాలో మద్దతు ధర పెంచి, ఇతర రాయితీలు కల్పించాలని అన్నదాతలు కోరుతున్నారు.