
సాక్షి,న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం రైతులకు స్వల్ప ఊరట కల్పించింది.ధరల పెంపును అరికట్టి దిగుబడులను ప్రోత్సహించేందుకు గోధుమ, పప్పుధాన్యాల కనీస మద్దతు ధర(ఎంఎస్‌పీ)ను పెంచింది. గోధుమలకు కనీసమద్ధతు ధరను క్వింటాల్‌కు రూ 110 చొప్పున రూ 1735 రూపాయలకు పెంచింది. పప్పుధాన్యాల ధరలను క్వింటాల్‌కు రూ 200 మేర పెంచింది.ప్రధాని నరేంద్ర మోదీ అథ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ రబీ పంటలకు మద్దతు ధరలను ఆమోదించింది.
ఇక పప్పుధాన్యాల సాగును ప్రోత్సహించేందుకు మద్దతు ధరను క్వింటాల్‌కు రూ 4150 నుంచి రూ 4200కు పెంచారు. ఆయిల్‌సీడ్స్, ఇతర విత్తనోత్పత్తుల మద్దతు ధరలను కూడా పెంచినట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. వ్యవసాయ ఖర్చులు, ధరల కమిషన్ సిఫార్సులకు అనుగుణంగా కేంద్రం కనీస మద్దతు ధరలను పెంచిందని తెలిపాయి. దేశంలో ఈ నెలలో సాగయ్యే ప్రధాన రబీ పంట గోధుమ వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి మార్కెట్‌కు వస్తుంది.