భారత అంధుల క్రికెట్‌ సారథి అజయ్‌ | Ajay is the Indian cricket captain | Sakshi
Sakshi News home page

భారత అంధుల క్రికెట్‌ సారథి అజయ్‌

Published Tue, Dec 5 2017 12:45 AM | Last Updated on Tue, Dec 5 2017 12:45 AM

Ajay is the Indian cricket captain - Sakshi

ముంబై: ఆంధ్రప్రదేశ్‌ క్రికెటర్‌ అజయ్‌ కుమార్‌ రెడ్డి భారత అంధుల క్రికెట్‌ జట్టు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఇతని సారథ్యంలోని భారత జట్టు అంధుల వన్డే ప్రపంచకప్‌లో తలపడుతుంది. ఈ టోర్నీ వచ్చే నెల 7 నుంచి 21 వరకు పాకిస్తాన్, దుబాయ్‌ వేదికల్లో జరుగుతుంది. ఎంపికైన జట్టుకు ఈనెల 6 నుంచి వచ్చేనెల 4 వరకు బెంగళూరులో శిబిరాన్ని ఏర్పాటు చేశారు. అక్కడి నుంచే జట్టు 5న పాక్‌కు బయల్దేరనుంది. 17 మంది సభ్యులున్న భారత జట్టులో కెప్టెన్‌ సహా నలుగురు ఏపీ ఆటగాళ్లు ప్రేమ్‌ కుమార్, వెంకటేశ్వర్‌ రావు, దుర్గారావులకు చోటు దక్కింది. తెలంగాణ నుంచి మహేందర్‌ వైష్ణవ్‌ ఉన్నాడు. అజయ్‌ సారథ్యంలోనే ఈ ఏడాది ఫిబ్రవరిలో భారత జట్టు టి20 ప్రపంచకప్‌ను సొంతం చేసుకుంది.  

జట్టు: అజయ్‌ (కెప్టెన్‌), ప్రేమ్‌ కుమార్, వెంకటేశ్వర్‌ రావు, దుర్గారావు (ఏపీ), జాఫర్, పంకజ్‌ భుయ్‌ (ఒడిశా), నరేశ్‌భాయ్‌ తుందా, గణేష్‌భాయ్‌ ముహుద్కర్, అనిల్‌ భాయ్‌ గరియా (గుజరాత్‌), వైష్ణవ్‌ (తెలంగాణ), సోను గోల్కర్‌ (మధ్యప్రదేశ్‌), బసప్పా వాద్గల్, ప్రకాశ్, సునీల్‌ రమేశ్‌ (కర్ణాటక), సురజిత్‌ ఘర (బెంగాల్‌), దీపక్‌ మలిక్, రామ్‌బీర్‌ (హరియాణా).  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement