సాక్షి, బెంగళూరు : ప్రేమను నిరాకరించడమే కాకుండా, పోలీసులకు ఫిర్యాదు చేసిందని కక్షతో ఎయిర్‌హోస్టెస్ చెవి కత్తిరించిన రౌడీషీటర్‌ను యశవంతపుర, కొడిగేహళ్లి పోలీసులు సంయుక్తంగా దాడి చేసి అరెస్ట్ చేశారు. జాలహళ్లి పోలీస్‌స్టేషన్‌లో రౌడీ షీటర్‌గా ఉన్న అజయ్ కుమార్ అలియాస్ జాకీని శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు.
చదవండి: (ప్రేమించలేదని ఎయిర్‌హోస్టెస్ చెవి కట్ చేశాడు)
మొదట చైన్ దోపిడీ
గత నెలలో ఎయిర్‌హోస్టెస్, కుటుంబసభ్యులు యశవంతపుర పరిధిలో కారులో వెళుతుండగా రౌడీషీటర్ అజయ్‌కుమార్ అలియాస్ జాకీ అడ్డుకుని బెదిరించి దాడి చేశాడు. బంగారు చైన్ లాక్కెళ్లాడు. ఈ ఘటనపై భాదితులు యశవంతపుర పోలీస్‌స్టేషన్‌లో అజయ్‌కుమార్ పై ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దీంతో అతడు అగ్రహోదగ్రుడయ్యాడు. ఈ నెల 12 తేదీ సాయంత్రం 4.30 సమయంలో ఎయిర్‌హోస్టెస్ విధులు ముగించుకుని ఇంటికి క్యాబ్‌లో బయలుదేరింది.
హెబ్బాల లైప్ ఓవర్ సిగ్నల్ వద్ద క్యాబ్ నిలపడంతో పొంచి ఉన్న అజయ్‌కుమార్ లోనికి చొరబడి తనను ప్రేమించాలంటూ ఆమెతో గొడవకు దిగాడు. కత్తితో ఆమె చెవిని కట్ చేసి అక్కడ నుంచి ఉడాయించాడు. ఈ ఘటనపై బాధితురాలు కొడిగేహల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ కేసును తీవ్రంగా పరిగణించిన యశవంతపుర, కొడిగేహళ్లి పోలీసులు ఉమ్మడిగా గాలింపు చర్యలు చేపట్టి దుండగున్ని పట్టుకున్నారు. ప్రస్తుతం యశవంతపుర పోలీసులు అతడిని విచారిస్తున్నారు. మరోవైపు బాధిత ఎయిర్‌హోస్టెస్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.
Comments
Please login to add a commentAdd a comment