హొసూరు పారిశ్రామికవాడలో మూడు రోజుల క్రితం జరిగిన బెంగళూరు రౌడీషీటర్ విజయ్‌కుమార్ హత్య కేసులో తొమ్మిది మంది నిందితులను హొసూరు పోలీసులు గురువారం రాత్రి బెంగళూరులో అరెస్టు చేశారు. వారిని శుక్రవారం హొసూరు జేఎం(2)కోర్టులో హాజరు పరిచారు. కోర్టు నిందితులకు 15 రోజులు రిమాండ్ విధించడంతో వారిని సేలం జైలుకు తరలించారు. హత్యకు వాడిన మారణాయుధాలు, కారును పోలీసులు కోర్టులో అప్పగించారు. విజయ్‌కుమార్ హత్య కేసులో ముఖ్య నిందితుడైన మడివాళకు చెందిన బాబు(44), మడివాళ మారుతీ నగర్‌కు చెందిన శ్రీలాల్‌ప్రసాద్(38), అదే ప్రాంతానికి చెందిన అరుణ్‌కుమార్ (23)సునీల్‌గౌడ(26), చేతన్(22), విశ్వనాథ్ (33) మునిరాజు (39), నరేంద్ర(21), సతీష్‌రెడ్డి(22)లను పోలీసులు అరెస్టు చేశారు. ఆర్థిక లావాదేవీలు, పాత కక్షల కారణంగా విజయ్‌కుమార్ పాత స్నేహితులు బాబు తదితరులు అతనిని హత్య చేశారని పోలీసులు తెలిపారు. పరారీలో ఉన్న మరో ముగ్గురు నిందితుల కోసం గాలిస్తున్నామని కృష్ణగిరి జిల్లా ఎస్పీ కణ్ణమ్మాళ్ తెలిపారు.
దర్యాప్తులో వెలుగు చూసిన ఆసక్తికరమైన విషయాలు
విజయ్‌కుమార్ హత్య కేసు దర్యాప్తులో ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూశాయి. విజయ్‌కుమార్‌ను కుట్టి అనే తిరుమారన్ హత్య చేసి ఉంటాడని పోలీసులు తొలుత భావించారు. వియజ్‌కుమార్‌ను హత్య చేసింది కుట్టి కాదని, గతంలో వియజ్‌కుమార్‌తో తిరిగిన అతని పాత స్నేహితులు మడివాళకు చెందిన బాబు, అతని వర్గీయులు హత్యచేసినట్లు విచారణలో తెలియడంతో సిప్‌కాట్ పోలీసులు మడివాళకు చెందిన బాబును, అదుపులోకి తీసుకుని విచారించారు. ఏడాది క్రితం వీరిద్దరి మధ్య ఆర్థిక లావాదేవీల కారణంగా మనస్పర్ధలు ఏర్పడి, ఒకరిపై ఒకరు దాడి చేసుకుని ఇద్దరు విడిపోయారని పోలీసులు తెలిపారు.
అనంతరం బాబుపై విజయ్‌కుమార్ దాడి చేసి అతని కాలు విరిచాడని పోలీసుల విచారణలో తెలిసింది. తనపై దాడి చేసిన విజయ్‌కుమార్‌ను మట్టుపెట్టాలని భావించి బాబు అతనిని హత్య చేసేందుకు పథకం పన్నాడు. మూడు రోజుల క్రితం బెంగళూరు రెసిడెన్సీ రోడ్డుకు విజయ్‌కుమార్ వస్తున్నాడని పసిగట్టిన బాబు వర్గీయులు అతనిని హత్యచేసేందుకు సిద్ధమయ్యారు. విజయ్‌కుమార్ రెసిడెన్సీ రోడ్డులో జరిగిన ఆడియో విడుదల కార్యక్రమం ముగించుకుని తన యనోవా కారులో వస్తుండగా, హొసూరు -బెంగళూరు జాతీయరహదారిలో సిప్‌కాట్ వద్ద విజయ్‌కుమార్ కారును అడ్డగించి అతని కళ్లలో కారంచల్లి వేటకొడవళ్లతో హత్య చేసి పరారయ్యారు.
స్నేహితులే చంపేశారు
Published Sat, Jun 28 2014 8:56 AM | Last Updated on Mon, Jul 30 2018 9:16 PM
Advertisement
Advertisement