close friends
-
ఫేస్బుక్ కొత్త యాప్, ‘థ్రెడ్స్’ చూశారా!
ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం తన ప్రత్యర్థి స్పాప్చాట్తో సోషల్ మీడియా సమరానికి సై అంది. తన ఫోటో-షేరింగ్ ప్లాట్‌ఫామ్ ఇన్స్టాగ్రామ్ కోసం ప్రత్యేక కెమెరా-ఫస్ట్ మెసేజింగ్ యాప్ "థ్రెడ్స్" ను లాంచ్ చేసింది. ఈ మేరకు ఫేస్బుక్ గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది. థ్రెడ్స్ ద్వారా, వినియోగదారులు తమ సన్నిహితులతో ఇన్‌స్టాగ్రామ్‌లో స్టేటస్, షేర్ లొకేషన్, బ్యాటరీ స్టేటస్‌ను అప్లోడ్ చేసుకోవచ్చని ఫేస్బుక్ ఒక బ్లాగ్ పోస్ట్‌లో తెలిపింది. సన్నిహితులకోసం ప్రత్యేకంగా ఈ యాప్ తీసుకొచ్చినట్టు తెలిపింది. ఫేస్బుక్ దాని వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆదాయాన్ని ఆర్జిస్తున్న ఇన్‌స్టాగ్రామ్‌పై దృష్టి సారించింది, ఎందుకంటే దాని ప్రధాన వేదిక గోప్యత , తప్పుడు సమాచారం లేదా నకిలీ వార్తల వ్యాప్తికి సంబంధించి నియంత్రకుల నుండి పరిశీలనలో ఉన్న నేపథ్యంలో కొత్త అప్డేట్స్ ఇస్తోంది. ఈ నేపథ్యంలో థ్రెడ్స్ పేరుతో కొత్త యాప్‌ను తీసుకొచ్చింది. యాపిల్, గూగుల్-బ్యాక్డ్ ఆండ్రాయిడ్ సాఫ్ట్వేర్ ద్వారా నడిచే స్మార్ట్ఫోన్లలో ప్రపంచవ్యాప్తంగా దీన్ని ఆవిష్కరించింది. ఫేస్బుక్ డేటా లీక్ సృష్టిస్తున్న వివాదం నేపథ్యంలోఈ యాప్ చాలా సురక్షితమైందని ఫేస్బుక్ హామీ ఇచ్చింది. థ్రెడ్స్ ఒక స్వతంత యాప్. ఇతర మెసేజ్ యాప్‌ల మాదిరిగానే వినియోగదారులు ఫోటోలు, వీడియోలు, సందేశాలు, స్టోరీస్‌ను షేర్ చేసుకోవచ్చు. విజువల్ మెసేజింగ్ స్టైల్లో ఫోటోలు లేదా వీడియోలను సులభంగా భాగస్వామ్యం చేస్తుంది. అలాగే తమ పోస్ట్‌లో ఎవరు చూడవచ్చో, చూడకూడదో "క్లోజ్ ఫ్రెండ్స్" ఫీచర్ ద్వారా నియత్రించుకోవచ్చు. ఇందుకోసం ప్రత్యేకమైన ఇన్‌బాక్స్ , నోటిఫికేషన్లు ఉంటాయి. డైరెక్టుగా కెమెరాతో ఒపెన్ అయ్యి షార్ట్కట్స్తో కేవలం రెండే రెండు క్లిక్స్ తాము అనుకున్న కంటెంట్‌ను యాడ్ చేయొచ్చు. అలాగే వాట్సాప్ మాదిరిగానే స్టేటస్ ఫీచర్ కూడా ఉంది. -
తమిళనాడులో ముగిసిన ఐటీ సోదాలు
సాక్షి, చెన్నై: అన్నాడీఎంకే బహిష్కృత నాయకురాలు శశికళతో పాటు ఆమె సన్నిహితులు, కుటుంబ సభ్యులే లక్ష్యంగా ఈ నెల 9న ప్రారంభమైన ఐటీ దాడులు సోమవారం సాయంత్రం ముగిశాయి. వరుసగా ఐదో రోజూ ఐటీ అధికారులు శశికళ అన్న కుమారుడు వివేక్, ఆయన సోదరి కృష్ణప్రియ నివాసాలతో పాటు జయ టీవీ, నమదు ఎంజీఆర్ పత్రిక, జాస్ సినిమాస్, మిడాస్ స్పిరిట్స్ అండ్ లిక్కర్స్ తదితర సంస్థల కార్యాలయాలతో పాటు మరో 8 చోట్ల సోదాలు నిర్వహించారు. ఈ దాడుల్లో శశికళ కుటుంబీకులు, వ్యాపార భాగస్వాములు దాదాపు రూ. 1,403 కోట్ల మేర పన్నును ఎగవేసినట్లు గుర్తించామని ఐటీ ఉన్నతాధికారి తెలిపారు. సోదాలు పూర్తవడంతో 355 మందికి సమన్లు జారీచేసేందుకు ఐటీ వర్గాలు సిద్ధమయ్యాయి. -
మృత్యువులోనూ వీడని బంధం
లింగాల : వారు ముగ్గురూ ఒకే పాలిటెక్నిక్ కళాశాలలో చదివారు... అప్పటి నుంచి ప్రాణ స్నేహితులుగా మారారు... ఉద్యోగాలు వచ్చి స్థిరపడ్డా సెలవు వచ్చిందంటే చాలు కలసే వారు.. ఈ క్రమంలో కారులో వెళ్తున్న ముగ్గురు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు.. వారిలో ఇద్దరు మృతి చెందారు... మరొకరు గాయాల పాలయ్యారు... మృతులిద్దరిదీ ఒకే గ్రామం... మృత్యువూ వారి స్నేహ బంధాన్ని విడదీయలేక పోయింది. లింగాల మండలం చిన్నకుడాల బస్టాండు సమీపంలోని మయూరి పైపుల ఫ్యాక్టరీ దగ్గరలో ఉన్న ఊట బావిలోకి టాటా ఇండికా కారు ఆదివారం రాత్రి 10.30 గంటల ప్రాంతంలో దూసుకెళ్లింది. ఈ ఘటనలో లింగాల మండల కేంద్రానికి చెందిన కొమ్మా శివమోహన్‌రెడ్డి(25), కేశంరెడ్డి చంద్రమహేశ్వరరెడ్డి(25) అనే ప్రాణ స్నేహితులు అక్కడికక్కడే మృతి చెందారు. జోగిరెడ్డి రవితేజేశ్వరరెడ్డి అనే యువకుడు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. పోలీసులు, బాధితులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. కొమ్మా మహేశ్వరరెడ్డి, అంకాలమ్మ కుమారుడు శివమోహన్‌రెడ్డి.. కేశంరెడ్డి చెన్నకృష్ణారెడ్డి, లక్ష్మీనారాయణమ్మ కుమారుడు చంద్ర మహేశ్వరరెడ్డి.. జోగిరెడ్డి భాస్కర్‌రెడ్డి, ఘనేశ్వరమ్మ కుమారుడు రవితేజేశ్వరరెడ్డి పులివెందుల పాల్టెక్నిక్ కళాశాలలో చదివేటప్పుటి నుంచి ప్రాణ స్నేహితులు. శివమోహన్‌రెడ్డి యూసీఐఎల్‌లో కాంట్రాక్టు కార్మికునిగా పని చేస్తుండే వాడు. చంద్ర మహేశ్వరరెడ్డి ఒక డ్రిప్ కంపెనీలో పని చేస్తుండే వాడు. రవితేజేశ్వరరెడ్డి తాడిపత్రిలోని పెన్నా సిమెంటు ఫ్యాక్టరీలో పని చేస్తున్నాడు. రవితేజేశ్వరరెడ్డి స్వగ్రామం అనంతపురం జిల్లా యల్లనూరు మండలం వెన్నపూసపల్లె. ఆ యువకుడు తాత గారి గ్రామమైన లింగాలలోనే ఎక్కువగా ఉంటాడు. ఇక్కడ నుంచే పాలిటెక్నిక్ కళాశాలకు వెళ్లి చదివాడు. వీరు వేర్వేరు పనులు చేస్తున్నా ఆదివారం వచ్చే సరికి కలసేవారు. కలసి భోజనం చేయంది ఉండే వారు కాదు. ఆదివారం సాయంత్రం 7 గంటల ప్రాంతంలో ఓ ఇండిక కారులో పులివెందులకు వెళ్లారు. అక్కడ పనులను ముగించుకొని తిరిగి వస్తుండగా మార్గంమధ్యలో 10.30 గంటల ప్రాంతంలో ఏమి జరిగిందో ఎవరికీ తెలియదు. రోడ్డుకు ఎడమ వైపున వస్తున్న కారు ఒక్కసారిగా కుడి పక్కకు మళ్లి సుమారు 50 మీటర్ల దూరం దూసుకెళ్లి అక్కడ ఉన్న ఊట బావి అవతల గట్టుకు ఢీకొట్టి.. బావి లోపల 20 అడుగుల లోతులో ఉన్న గట్టుపై బోల్తా పడింది. అక్కడే ఉన్న వేప చెట్టు కారు బావిలోకి పడకుండా నియంత్రించింది. ఈ ఘటనలో కారు నడుపుతున్న మహేశ్వరరెడ్డి, ముందు భాగాన కూర్చొన్న శివమోహన్‌రెడ్డి అక్కడికక్కడే మృతి చెందారు. రవితేజేశ్వరరెడ్డి కారు వెనుక భాగంలో జారి బావిలో పడ్డాడు. దీంతో యువకుడికి స్వల్ప గాయాలయ్యాయి. సోమవారం ఉదయం 7.30 గంటల ప్రాంతంలో చిన్నకుడాల గ్రామానికి చెందిన రైతులు పొలం పనులకు వచ్చి ఈ విషయాన్ని గుర్తించి బావిలో ఉన్న యువకుడి కేకలు విని వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వెంటనే రవితేజేశ్వరరెడ్డిని బయటకు లాగి ఆసుపత్రికి తరలించారు. తర్వాత భారీ పొక్లెయిన్‌తో బావి గట్టుపై ఉన్న కారును వెలికితీసి శివమోహన్‌రెడ్డి, చంద్రమోహన్‌రెడ్డి భౌతిక కాయాలను వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం పులివెందుల ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన వైఎస్ వివేకా.. : రోడ్డు ప్రమాదంలో యువకులు మృతి చెందారన్న విషయం తెలుసుకున్న వైఎస్ఆర్సీపీ సీజీసీ సభ్యుడు వైఎస్ వివేకానందరెడ్డి హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఘటనపై ఆయన తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. శివమోహన్‌రెడ్డి తండ్రి మహేశ్వరరెడ్డిని, చంద్రమహేశ్వరరెడ్డి తండ్రి చెన్నాకృష్ణారెడ్డిని ఓదార్చి «ధైర్యాన్నిచ్చారు. కార్యక్రమంలో పులివెందుల వైఎస్ఆర్సీపీ నాయకులు వైఎస్ భాస్కర్‌రెడ్డి, ఎంపీపీ పి.వి.సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు. అతి వేగమే ప్రమాదానికి కారణం.. : కారును అతివేగంగా నడపడం వల్లే ప్రమాదానికి గురైందని సీఐ రామకృష్ణుడు, ఎస్ఐ మల్లికార్జునరెడ్డి అన్నారు. వారు ఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదానికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో విషాధచాయలు.. : గ్రామంలో ఇద్దరు ప్రాణ స్నేహితులు మృతి చెందడంతో విషాధ చాయలు అలుముకున్నాయి. వీరి కుటుంబాలలో ఒక్కొక్కరికి ఒక మగ పిల్లవాడే ఉండటం, వారు మృతి చెందడంతో గ్రామ ప్రజలను కలిచివేసింది. అందులోనూ ఉగాది పండుగ నేపథ్యంలో ఈ సంఘటన చోటు చేసుకోవడంతో గ్రామస్తులు దుఃఖ సాగరంలో మునిగారు. ఒకే చోట ఖననం.. : రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన శివమోహన్‌రెడ్డి, చంద్రమహేశ్వరరెడ్డిలను లింగాల శ్మశాన వాటికలో పక్కపక్కనే ఖననం చేశారు. శోకసంద్రంలో కుటుంబ సభ్యులు : ఒక్కగానొక్క కుమారుడు అని ఆ కుటుంబాలు అల్లారు ముద్దగా పెంచుకున్నాయి. వారు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు బోరున విలపించారు. వారి ఆక్రందనలు చూపరులను సైతం కన్నీటి పర్యంతం చేశాయి. 27పీఎల్‌వీడీ502–15050002 :– గాయపడ్డ రవితేజేశ్వరరెడ్డి 27పీఎల్‌వీడీ502బి–15050002 :– మహేశ్వరరెడ్డిని ఓదార్చుతున్న వైఎస్ వివేకా 27పీఎల్‌వీడీ502ఇ–15050002 :– నుజ్జు నుజ్జుయిన కారు -
‘క్లోజ్ ఫ్రెండ్స్’ మూవీ స్టిల్స్
-
ఫ్రెండ్ ప్రపోజ్ చేసింది...
దాదాపు 20 ఏళ్ల క్రితం లాస్ఏంజెలెస్లో బాలాజీ నేను కలిశాం. నిజం చెప్పాలంటే ప్రారంభంలో ఒకరంటే ఒకరికి ఏ మాత్రం ఆసక్తి లేదు. అయితే మా ఇద్దరికీ తెలిసిన ఒక స్నేహితురాలు మేం ఇద్దరం ఒకరికొకరు బాగా నప్పుతాం అంటూ వచ్చేది. ఆమె దాదాపు ఏడాది పాటు మాతోనే ఉంది. అదే సమయంలో ఇద్దరం క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యాం. ఆరేళ్ల డేటింగ్ తర్వాత 14 ఏళ్ల క్రితం పెళ్లి చేసుకున్నాం. బాలాజీ.. మంచి మనసున్న వాడు.. బాలాజీ చాలా గ్రౌండ్ టు ఎర్త్ టైప్. నిజాయితీగా అందరికీ సాయం చేయడాన్ని ఇష్టపడతాడు. ఇతరుల్లో మంచిని మాత్రమే చూస్తాడు. నా నవ్వుతో ప్రేమలో పడ్డానంటాడు తరచుగా. నేను చిన్నప్పటి నుంచి స్వతహాగా అందరితో, అన్ని సంస్కృతులతో భాగం అయిపోయే తత్వం కలదాన్ని కావడంతో.. అందరూ నాతో ఓపెన్‌గా ఉంటారు. నాకు కాస్త షార్ట్ టెంపర్. దాన్ని కూడా తను ప్రేమిస్తాడు. తరచుగా నాకు కావాలని చిరు కోపం తెప్పిస్తూ ఉడికిస్తుంటాడు. అప్పుడీ పెళ్లిళ్లు అసాధారణమే... ఇంటర్ రేషియల్ మ్యారేజెస్‌కు అమెరికన్ పేరెంట్స్ కొంత అనుకూలంగా ఉంటారు. మా సొంత కమ్యూనిటీ వ్యక్తిని నేను పెళ్లి చేసుకుంటానంటే మా కుటుంబం మరింత ఆనందిస్తుందనేది నిజమైనా, బాలాజీని కూడా అంతే ఇదిగా తొలి నుంచీ అభిమానించి అంగీకరించారు. అయితే బాలాజీ కుటుంబం మాత్రం ప్రారంభంలో అంగీకరించడానికి ఇబ్బంది పడ్డారు. పద్నాలుగేళ్ల క్రితం ఇండియాలో ఇలాంటి పెళ్లి అరుదైన విషయమే కదా. అయితే కాలక్రమంలో ఇది మారుతూ వచ్చింది. కొన్నాళ్లయ్యాక మా రెండు ఫ్యామిలీలు బాగా క్లోజ్ అయిపోయాయి. కొన్ని కొన్ని సార్లు ఆచార వ్యవహారాల పరంగా విబేధాలు రావా..? అంటే తప్పకుండా వస్తాయి. అయితే అదృష్టవశాత్తూ మాకు పరస్పరం సంస్కృతీ సంప్రదాయాల పట్ల పూర్తి గౌరవభావం ఉంది. అత్తామామయ్యల కోసం ఏమైనా చేసేంత గౌరవం పెంచుకున్నాను. అలాగే నా భర్త కూడా నా పేరెంట్స్, ఫ్యామిలీ పట్ల ప్రేమగా ఉంటారు. నా పెళ్లి సమయంలో మా కౌబోయ్ డాడీ..‘మా అమ్మాయి కౌబాయ్‌ని చేసుకోకపోయినా.. కనీసం ఒక ఇండియన్ని చేసుకుంది’ అని నవ్వుతూ అన్నారు. నేనే ఇండియాకి తీసుకొచ్చా... మేం ఇండియాలో ఏడున్నరేళ్లుగా ఉంటున్నాం. మిగిలిన మిక్స్డ్ నేషనల్ కపుల్స్‌కి భిన్నంగా నేను నా భర్తని ఇండియాకి తిరిగి వచ్చేలా చేశానని గర్వంగా చెప్పగలను. అమెరికాలో ఉండగా మేం చాలా సార్లు ఇండియా గురించి మాట్లాడుకునేవాళ్లం. మా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడే ఇండియాకు వెళ్లిపోవడం సరైనదని ఆయనకి చెప్పాను. అయితే నేను ఆ మాట బలంగా అంటున్నానని బాలాజీ మొదట్లో అనుకునేవారు కాదు. ‘నిజంగానే అంటున్నావా?’ అని అడిగేవారు. ఇండియాలో నా భర్త బంధువుల గురించి, సంస్కృతుల గురించి తెలుసుకోవడం గొప్పగా అనిపించింది. మా పిల్లలకు ఇక్కడి దేవుళ్ల దీవెనలు అందుతున్నాయి. వెస్ట్రన్లోనూ విలువలున్నాయి... ఇక్కడ నేను అబ్జర్వ్ చేసింది ఏమిటంటే.. భారతీయ పురుషులకు పాశ్చాత్య దేశ మహిళల మీద కొంచెం తేలిక అభిప్రాయం ఉంది. అది మార్చుకోవాలని నా విన్నపం. పాశ్చాత్య మహిళలు నైతిక విలువలు లేనివారుగా భావించడం చూశాను. ఇది బహుశా సినిమాలు, టీవీల ప్రభావం కావచ్చు ఇది. సెక్స్ వంటి అంశాల్లో మాకు మీకు-మాకు కొన్ని వ్యత్యాసాలు, అభిప్రాయ బేధాలు ఉండవచ్చు. అయితే పాశ్చాత్య మహిళల్లో అత్యధికులు తమ మీదే కాదు ఇతరుల మీద కూడా అత్యంత గౌరవభావం కలిగి ఉంటారు. వ్యక్తిగతాలను పూర్తిగా గౌరవిస్తారు. వెస్ట్రన్ ప్రపంచం కూడా అత్యంత బలమైన కుటుంబ విలువలు కలిగి ఉంటుంది. అక్కడ పిల్లలు పెద్దలకు చాలా గౌరవం ఇస్తారు. అలాగే పిల్లల అభిప్రాయాలకు పెద్దలూ విలువిస్తారు. ఏదేమైనా, నేను, పిల్లలు ఇక్కడ చాలా హ్యాపీగా ఉన్నాం. ఈ అద్భుతమైన దేశం మా హృదయాల్లో నిండిపోయింది. మనం నిజంగా చాలా అదృష్టవంతులం అని నా పిల్లలతో అంటుంటాను. ఎందుకంటే మాకు రెండు హోమ్ కంట్రీస్ ఉన్నాయి. ఇదంతా బాలాజీతో నా పెళ్లి వల్లే సాధ్యమైంది. అందుకే థ్యాంక్స్ టు బాలాజీ. థ్యాంక్యూ వెరీమచ్ టూ ఇండియా. - లిసా, అమెరికా -
మా నాన్న బంగారం..
నేను నాన్న కూచిని అంటోంది బాలీవుడ్ నటి సోనమ్‌కపూర్. తామిద్దం క్లోజ్ ఫ్రెండ్స్‌లా ఉంటామంటోంది. తన తండ్రి అనిల్‌కపూర్‌తో అన్ని సంగతులు షేర్ చేసుకుంటానని చెబుతోంది. కెరీర్ విషయాలే కాదు లవ్ మ్యాటర్స్ కూడా దాపరికం లేకుండా నాన్నతో చెప్పేస్తానని తెలిపింది. ‘ నేను చెప్పిన సీక్రెట్స్ అన్నీ నాన్న మనసులోనే దాచుకుంటాడు. కనీసం అమ్మ దగ్గర కూడా ఓపెన్ చేయడు’ అని అంటున్న ఈ అమ్మడు.. అందుకే మా నాన్న బంగారం అని కితాబిచ్చింది. -
సమస్యలతో పోరు
నందు, మధునందన్, అభిషేక్ మహర్షి, మధురిమ ముఖ్య తారలుగా రూపొందుతోన్న చిత్రం ‘క్లోజ్‌ఫ్రెండ్స్’. అరుణ్ పవార్ దర్శకుడు. కుమార్ అన్నంరెడ్డి నిర్మాత. మారుతి టీమ్ వర్క్స్, సినిమా లవర్స్ పతాకంపై తెరకెక్కుతోన్న ఈ చిత్రం ప్రచార గీతాన్ని మారుతి చేతుల మీదుగా ఇటీవల హైదరాబాద్‌లో విడుదల చేశారు. ‘‘మలయాళ చిత్రానికి ఇది రీమేక్. తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా మార్పులు చేశాం. అరుణ్ సినిమాను బాగా హ్యాండిల్ చేశాడు. అన్ని కార్యక్రమాలనూ పూర్తి చేసి డిసెంబర్లో సినిమాను విడుదల చేస్తాం’’ అని మారుతి తెలిపారు. అనుకోని పరిస్థితుల్లో కొన్ని సమస్యల్లో ఇరుక్కున్న ప్రాణమిత్రులు... ఆ సమస్యలతో పోరు సాగించి, ఎలా బయటపడ్డారనేది ప్రధానాంశమనీ, పూర్తి వినోదాత్మకంగా ఈ సినిమా ఉంటుందని దర్శకుడు చెప్పారు. తన కెరీర్లోనే ఇదొక ప్రత్యేకమైన చిత్రమని నందు అన్నారు. ఇంకా యూనిట్ సభ్యులు మాట్లాడారు. -
‘క్లోజ్ ఫ్రెండ్స్’స్టిల్స్
-
‘క్లోజ్ ఫ్రెండ్స్’ ప్రమోషనల్ సాంగ్ విడుదల
-
పుష్కరకాలానికి...
కరీంనగర్ క్రైం : ప్రాణస్నేహితులే కలిసి హత్యచేసిన విషయం పన్నెండేళ్లకు వెలుగుచూసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేయకపోవడంతో ఇన్నేళ్లుగా హంతకుడు తప్పిం చుకు తిరగుతున్నాడు. పెండింగ్‌లో ఉన్న కేసు విషయమై విచారిస్తుండగా ఈ హత్యా వివరాలు వెల్లడించాడు. నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి మండలం చౌట్పల్లికి చెందిన మాసం సాయ న్న అలియాస్ సాయిరెడ్డిపై చాలాకాలంగా మోర్తాడ్ పోలీస్‌స్టేషన్‌లో ఓ వారెంటు పెండింగ్‌లో ఉంది. హైదారాబాద్‌లోని లాలాపేటలో ఉంటున్న సాయన్నను ఈనెల 25న మోర్తాడ్ పోలీసులు అరెస్టు చేశారు. వారెంట్ విషయమై విచారిస్తుండగా స్నేహితుల సాయంతో 2002లో సాయన్నను హతమార్చిన విషయాన్ని ఒప్పుకున్నాడు. దీంతో వారు వెల్పూర్ పోలీసులతోపా టు మృతదేహం లభించిన కరీంనగర్ రూరల్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. మాసం సాయన్నతోపాటు హత్య చేసేందుకు సాయపడ్డ నగేశ్, గంగడుపై కేసు పెట్టారు. ఈ ఇద్దరిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపినట్లు పోలీసులు తెలిపారు. హత్య జరిగిందిలా.. వెల్పూర్ మండలం పడిగల్‌కు చెందిన మేకల వ్యాపారి కట్టాల సాయన్న(45), మాసం సాయన్న, నగేశ్, గంగడు మిత్రులు. 2002 నవంబర్ చివరివారంలో కలిసి మద్యం తాగారు. కట్టాల సాయన్న, మాసం సాయన్నల మధ్య మాట మాట పెరిగి దాడి చేసుకున్నా రు. కట్టాల సాయన్నను మిత్రులందరూ కలిసి హత్య చేసి, ఎస్సారెస్పీ కాలువలో పడేశారు. 14 రోజుల తర్వాత మృతదేహం కుళ్లిపోయి కరీంనగర్ మండ లం కొత్తపల్లి వద్ద బయటపడింది. దీంతో హత్య జరిగిన విషయం వెలుగులోకి రాలేదు. బయటకు వెళ్తున్నానని చెప్పొచ్చిన కట్టాల సాయన్న రెండు రోజులైన కనిపించకపోవడంతో అతని సోదరులు డిసెంబర్ 1న వెల్పూ ర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, మిస్సింగ్ కేసుగా నమోదు చేశారు. అదే సంవత్సరం డిసెంబర్ 14న కొత్తపల్లి ప్రాంతంలోని ఎస్సారె స్పీ కాలువలో సాయన్న మృతదేహం లభించిం ది. దీంతో కరీంనగర్ పోలీసులు ఆత్మహత్యగా కే సు ఫైల్ చేసి మూసివేశారు. దీంతో సాయన్న ప్రమాదవశాత్తుగా చనిపోయాడని అందరూ భావించారు. కానీ స్నేహితులే చంపారనే విషయం ఆలస్యంగా వెలుగుచూసింది. -
వైకల్యం కన్నా... స్నేహం మిన్న
దేవరకద్ర రూరల్ : ఈ ఫొటోలో కనిపిస్తున్న వారు... ఇద్దరూ ప్రాణ స్నేహితులు... ఇందులో ఒకరికి కళ్లులేవు. మరొకరికి బుద్ధిమాంధ్యం ఉంది. ఎప్పుడూ కలిసిమెలసి ఉండే వీరు స్నేహితుల దినోత్సవమైన ఆదివారం దేవరకద్ర నుంచి గద్దెగూడేనికి వె ళుతూ ‘సాక్షి’ కెమెరాకు చిక్కారు. వారిని పలకరించగా స్నేహబంధాన్ని వివరించారు. ఆస్తి, అంతస్తులు చూస్తున్న ఈ రోజుల్లో పుట్టుకతోనే శారీరకలోపంతో సతమతమయ్యే తాము 30ఏళ్ల క్రితమే స్నేహితులుగా మారామన్నారు. మహబూబ్‌నగర్‌లోని టీడీగుట్టకు చెందిన మహబూబ్‌పాషా పుట్టుకతోనే అంధుడు, అదే ప్రాంతానికి చెందిన కృష్ణకు బుద్ధిమాంధ్యం ఉంది. అప్పటి నుంచి ఒకరిని విడిచి మరొకరు ఉండరు. తన కళ్లతో కృష్ణ స్నేహితుడు మహబూబ్‌పాషాకు లోకాన్ని చూపిస్తున్నాడు. ఎక్కడికెళ్లినా కృష్ణ భుజంపై చేయి వేసి నడుస్తాడు. యాచించిన డబ్బులను ఇద్దరూ సమానంగా పంచుకుంటారు. వారు కలిసే తింటారు, ఉంటారు. వైకల్యం ముందు స్నేహం మిన్న అన్న చందంగా వీరు ముందుకు సాగుతున్నారు. కులమతాలు వేరైనా స్నేహానికి అవేమీ సాటిరావన్న నానుడిని నిజం చేస్తున్నారు. మనసుండాలే కాని స్నేహానికి కొదవలేదని చాటి చెబుతున్నారు. -
స్నేహితులే చంపేశారు
హొసూరు పారిశ్రామికవాడలో మూడు రోజుల క్రితం జరిగిన బెంగళూరు రౌడీషీటర్ విజయ్‌కుమార్ హత్య కేసులో తొమ్మిది మంది నిందితులను హొసూరు పోలీసులు గురువారం రాత్రి బెంగళూరులో అరెస్టు చేశారు. వారిని శుక్రవారం హొసూరు జేఎం(2)కోర్టులో హాజరు పరిచారు. కోర్టు నిందితులకు 15 రోజులు రిమాండ్ విధించడంతో వారిని సేలం జైలుకు తరలించారు. హత్యకు వాడిన మారణాయుధాలు, కారును పోలీసులు కోర్టులో అప్పగించారు. విజయ్‌కుమార్ హత్య కేసులో ముఖ్య నిందితుడైన మడివాళకు చెందిన బాబు(44), మడివాళ మారుతీ నగర్‌కు చెందిన శ్రీలాల్ప్రసాద్(38), అదే ప్రాంతానికి చెందిన అరుణ్‌కుమార్ (23)సునీల్‌గౌడ(26), చేతన్(22), విశ్వనాథ్ (33) మునిరాజు (39), నరేంద్ర(21), సతీష్‌రెడ్డి(22)లను పోలీసులు అరెస్టు చేశారు. ఆర్థిక లావాదేవీలు, పాత కక్షల కారణంగా విజయ్‌కుమార్ పాత స్నేహితులు బాబు తదితరులు అతనిని హత్య చేశారని పోలీసులు తెలిపారు. పరారీలో ఉన్న మరో ముగ్గురు నిందితుల కోసం గాలిస్తున్నామని కృష్ణగిరి జిల్లా ఎస్పీ కణ్ణమ్మాళ్ తెలిపారు. దర్యాప్తులో వెలుగు చూసిన ఆసక్తికరమైన విషయాలు విజయ్‌కుమార్ హత్య కేసు దర్యాప్తులో ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూశాయి. విజయ్‌కుమార్‌ను కుట్టి అనే తిరుమారన్ హత్య చేసి ఉంటాడని పోలీసులు తొలుత భావించారు. వియజ్కుమార్ను హత్య చేసింది కుట్టి కాదని, గతంలో వియజ్కుమార్తో తిరిగిన అతని పాత స్నేహితులు మడివాళకు చెందిన బాబు, అతని వర్గీయులు హత్యచేసినట్లు విచారణలో తెలియడంతో సిప్కాట్ పోలీసులు మడివాళకు చెందిన బాబును, అదుపులోకి తీసుకుని విచారించారు. ఏడాది క్రితం వీరిద్దరి మధ్య ఆర్థిక లావాదేవీల కారణంగా మనస్పర్ధలు ఏర్పడి, ఒకరిపై ఒకరు దాడి చేసుకుని ఇద్దరు విడిపోయారని పోలీసులు తెలిపారు. అనంతరం బాబుపై విజయ్‌కుమార్ దాడి చేసి అతని కాలు విరిచాడని పోలీసుల విచారణలో తెలిసింది. తనపై దాడి చేసిన విజయ్‌కుమార్‌ను మట్టుపెట్టాలని భావించి బాబు అతనిని హత్య చేసేందుకు పథకం పన్నాడు. మూడు రోజుల క్రితం బెంగళూరు రెసిడెన్సీ రోడ్డుకు విజయ్‌కుమార్ వస్తున్నాడని పసిగట్టిన బాబు వర్గీయులు అతనిని హత్యచేసేందుకు సిద్ధమయ్యారు. విజయ్‌కుమార్ రెసిడెన్సీ రోడ్డులో జరిగిన ఆడియో విడుదల కార్యక్రమం ముగించుకుని తన యనోవా కారులో వస్తుండగా, హొసూరు -బెంగళూరు జాతీయరహదారిలో సిప్కాట్ వద్ద విజయ్‌కుమార్ కారును అడ్డగించి అతని కళ్లలో కారంచల్లి వేటకొడవళ్లతో హత్య చేసి పరారయ్యారు. -
మిత్రలాభం
వేలూరు గురుకులం క్రీ.శ.463 మెదక్ జిల్లా చేగుంట వద్ద వెల్లూరు వరాహదేవుడికి ఇద్దరు ప్రాణమిత్రులు. ఒకడు విష్ణుకుండిన రాకుమారుడు ఇంద్రవర్మ, రెండోవాడు వాకాటక యువరాజు హరిసేనుడు. ఇద్దరూ వేలూరు గురుకులంలో విద్యాభ్యాసం పూర్తి చేసుకొని స్వంతవూళ్లకి బయలుదేరనున్నారు. ఇంద్రవర్మ విష్ణుకుండిన రాజధాని వేంగీపురికైతే (ప.గో.జిల్లా, దెందులూరు), హరిసేనుడు వాకాటక రాజధాని వత్సగుల్మానికి (మహారాష్ట్రలోని వాషిం). ఒకరు తూర్పు, మరొకరు పడమర. అంతలో యుద్ధం అని వార్త తెచ్చాడు వరాహదేవుడు. ఈ పరిస్థితుల్లో ప్రయాణం శ్రేయస్కరం కాదు. ‘యుద్ధమా! ఎవరెవరికి?’ అడిగారు హరిసేనుడు, ఇంద్రవర్మ. ‘మీ తండ్రులు మధ్యే యుద్ధం. వేంగిసైన్యం వాకాటక రాజ్యంపై దండయాత్రకి సిద్ధంగా ఉంది. వాకాటకుల అధీనంలో ఉన్న ఈ తెలుగు ప్రాంతాన్ని కూడా ఆంధ్రరాజ్యంలో కలుపుకోవడమే విష్ణుకుండినుల ఉద్దేశం’ అని వివరించాడు వరాహదేవుడు. ‘అందుకు మా తండ్రిగారు మహారాజు సాహసించరే? వాకాటకులకు, విష్ణుకుండినులకు ఉన్న స్నేహ బాంధవ్యాలు ఈనాటివి కావే?’ ఆశ్చర్యంగా అడిగాడు ఇంద్రవర్మ.స్నేహితులు వేలూరు గురుకులంలో కలిసి చదువుకున్నారు. ఆరేళ్లు ఆరు నిమిషాల్లా గడిచిపోయాయి. సహాధ్యాయులంతా రాజవంశాలకి, ధనిక వర్తకసంఘాలకి, పండిత కుటుంబాలకి చెందినవారే. గురుపీఠానికి అధ్యక్షుడు విష్ణువర్మ. రాజనీతి శాస్త్రంలో కౌటిల్యుడికి ఏమాత్రమూ తీసిపోడు. రాజతంత్రాన్ని పంచతంత్రమనే కథల రూపంగా చిరుతప్రాయంలోనే విద్యార్థుల తలకెక్కించాడు. వాకాటక, గాంగ, కదంబ, విష్ణుకుండిన ప్రభుత్వాలలో అనేకమంది మంత్రులు, రాకుమారులు ఆయన శిష్యులే. ‘అహ్హహ్హా! అంటే తరతరాలుగా వస్తున్న వైవాహిక స్నేహ సంబంధాలని విడిచిపెట్టి మాతోనే వైరానికి దిగుతారా, మా మామగారు?’ కందగడ్డలా ఎర్రబడిన ముఖంలో కోపాన్ని దిగమింగుతూ అడిగాడు హరిసేనుడు. ఇంద్రవర్మ, హరిసేనులు స్నేహితులేకాదు, మేనమరుదులు కూడా. ఇంద్రవర్మ తల్లి, వాకాటక మహారాజు దేవసేనుడి చెల్లెలూ, విష్ణుకుండిన మహారాజు మాధవవర్మకి పట్టమహిషి. ‘మా తండ్రిగారు అటు తూర్పున కళింగాన్ని (ఉత్తరకోస్తా), ఇటు దక్షిణాన రేనాటినీ (రాయలసీమ) వేంగిలో విలీనం చేసిన మహావీరుడు. ఇక గోదావరి వరకూ ఉన్న తెలుగు సీమలన్నింటినీ కలిపి ఆంధ్రదేశాన్ని నైసర్గిక ఎల్లల వరకూ ఒకే రాజ్యం కిందకి తేవడం ఒకందుకు మంచిదేనేమో!’ పౌరుషంగా తండ్రిని సమర్థిస్తూ మిత్రుడు హరిసేనుడి వంక చూశాడు ఇంద్రవర్మ.వరాహదేవుడి మనసు మనస్సులో లేదు. అతడి ప్రాణస్నేహితులలో ఒకడు వాకాటకుడు, ఒకడు విష్ణుకుండినుడు. ఇప్పుడు వాళ్ల తండ్రుల మధ్య యుద్ధం. వరాహదేవుడిది వేలూరు వంశం. అతడి తండ్రి గోదావరిలోయ నుంచి కృష్ణాతీరం వరకూ కొండపడమటి తెలుగుసీమలకు (తెలంగాణ) సంస్థానాధిపతి. వాకాటకులకి సామంతుడేగాక ముఖ్యమంత్రి కూడా! కానీ ఇటు విష్ణుకుండినులు భాషా సంస్కృతి రీత్యా తోటి తెలుగువాళ్లు. తానెవరి పక్షం వహించాలి? ‘ఈ యుద్ధంవల్ల విద్యావ్యాసంగాలకూ, పరిశ్రమలకూ ఆలవాలమై విలసిల్లే ఈ ప్రాంతం మరుభూమి కావల్సిందేనా? మీ రెండు రాజ్యాల మధ్యా స్నేహ సంబంధాలు ఉన్నంత కాలం ఈ ప్రశ్న ఉదయించలేదు. ఏది దారి? ఒకవేళ యుద్ధం ఆపాలన్నా పదిహేడేళ్లు నిండని మన మాట వినేది ఎవరు?’ అని నిట్టూర్చాడు, వరాహదేవుడు.స్నేహితుడు హరిసేనుడికి ముఖం చూపలేక తలదించుకొని అడుగులేయసాగాడు ఇంద్రవర్మ. వేంగిదేశం దక్షిణాపథానికే ధాన్యాగారం. గురుకులంలో అతడు చదివిన రాజతంత్రం ప్రకారం పరిశ్రమలూ ఖనిజసంపదా అపారంగా ఉన్న పక్క రాజ్యాన్ని జయించాలనే అతడి ఉద్దేశ్యం సరైనదే. దాని వలన తన స్నేహితుడితో వైరం అనివార్యమా? వేంగి రాజ్యానికి చుట్టూ శత్రువులే ఒక వాకాటకులు తప్ప! ఉత్తరభారతదేశపు గుప్తరాజు అండ వాకాటకులకి ఏనాటి నుండో ఉంది. భవిష్యత్తులో అది వేంగికే ప్రమాదంగా పరిణమించవచ్చు, అనే ఆలోచనలతో సతమతమౌతూ ‘యుద్ధనివారణ సాధ్యమా?’ అని పైకి అడిగాడు. తలతిప్పి చూసి స్నేహితుడి మాటల్లో ధ్వనించిన విచారాన్ని గమనించిన హరిసేనుడికి కోపం తగ్గిపోయింది. ‘మన సందేహాలకి సమాధానం చెప్పగలవాడు ఒక్కడే! ప్రపంచానికే తలమానికమైన జ్యోతిష శాస్త్రవేత్త ఆర్యభటాచార్యుడు. ఆర్యభటుడి నక్షత్రాశాల ఇక్కడికి దగ్గరే. వెళ్లి కలుద్దామా?’ అడిగాడు.సరేనని ముగ్గురూ ఆర్యభటుని నక్షత్రశాల చేరుకున్నారు. చీకటి పడింది. ఆకాశంలో కనబడే నక్షత్రాలని, గ్రహాలని గుర్తించి వెంటనే వాటి స్థానాలని నక్షత్రశాలలోని ఖగోళ చిత్రపటంపై సూచించేందుకు ఓపికగా అంచలంచలుగా ఎదురుచూసే నలుగురు విద్యార్థులు తప్ప గుట్టపై ఎవరూ లేరు. కింద గురుకులం పూర్తి అంధకారంలో ఉంది. ఆచార్యుడు ఆర్యభటుడు కూడా గుట్టదిగి వడివడిగా నక్షత్రశాల వైపు అడుగులేయసాగాడు. అరుగు మీద కూర్చొనివున్న ముగ్గురు కుర్రవాళ్లని చూసి ఆగాడు. ‘ఏవరు? రాత్రిపూట ఇక్కడేమి చేస్తున్నారు?’ పరిచయాల అనంతరం ముగ్గురు స్నేహితులనీ లోనికి ఆహ్వానించాడు.ఆచార్యుని నక్షత్రశాల ప్రవేశించటం వాళ్లకదే మొదటిసారి. నక్షత్రశాల మధ్యలో ఏడడుగుల ఎత్తు భ్రమయంత్రం (దిక్సూచి) గిర్రున తిరుగుతోంది. వివిధ గ్రహాలని, రాశులని, నక్షత్ర మండలాలని చిత్రించిన, అర్ధగోళాకారపు స్వయంవాహ (ఆటోమాటిక్) యంత్రం కప్పుకి వేలాడుతుంది. మూడడుగుల వ్యాసంగల వర్తులాకారపు పీఠాలపై కర్ణం (హైపోటెన్యూస్), తుర్యగోళం (క్వార్టర్ ప్లేట్), యష్టి (రూరల్) మొదలైన పరికరాలు కనిపిస్తున్నాయి. చుట్టూ నల్లని గోడలపై మరిన్ని ఖగోళ చిత్రపటాలు. మిత్రులు ముగ్గురూ నోళ్లెళ్లబెట్టి చూస్తూ ఉండిపోయారు. నల్ల మిరియాలు జల్లిన వేడి అంబలి తాగి సేదతీరి, ఆచార్యుడికి తమ సంకటస్థితి నివేదించారా ప్రాణమిత్రులు. ‘ఎక్కాలు రాసుకునే లెక్కల పండితుడిని. యుద్ధం ఆపడం నావల్ల ఏమవుతుంది? అయినా పిల్లలు మీరడిగారు కనుక ప్రయత్నిస్తాను’ అని చిరునవ్వు నవ్వాడు. ప్రఖ్యాత గణిత ఖగోళ శాస్త్రజ్ఞుడు ఆర్యభటుడు. అమావాస్య మధ్యాహ్నం. కృష్ణా గోదావరీ నదుల మధ్య రెండు యోజనాల విస్తీర్ణంగల మహాపట్టణం వేంగి. ఆంధ్రుల రాజధాని నగరం. వేంగీ నగరంలో చిత్రరథస్వామి కోవెల ముందు అశేషమైన జనం గుమికూడారు. మహారాజు మాధవవర్మ, మహామంత్రి, పుర ప్రముఖులు, ఆర్యభట పండితుడి సందేశం వినేందుకు వచ్చారు.ఆరోజు మధ్యాహ్నం సంపూర్ణ సూర్యగ్రహణం వస్తుందన్న విషయం ఆర్యభటుడికి తప్ప ఇంకెవ్వరికీ తెలియదు. చేతిలోని నిలువెత్తు యష్టిని నేలపై నిలిపాడు ఆర్యభటుడు. ఆ కర్ర నీడని గమనిస్తూ ఉపన్యాసం ఆరంభించాడు. ‘వాకాటక, విష్ణుకుండినుల మధ్య వైరం గ్రహాలూ, దేవతలూ అంగీకరించరు. రాహుకేతువులు వేంగి సామ్రాజ్యానికి గ్రహణాన్ని సూచిస్తున్నారు. యుద్ధమే మీ ఉద్దేశ్యమైతే ఈ క్షణంలో నా మంత్రోఛ్ఛారణతో ఆ గ్రహాల ఆగ్రహాన్ని దర్శింపజేస్తాను’ అని కళ్లు మూసుకొని జపం చేయసాగాడు. ఆర్యభటుడు కళ్లు మూసుకున్న మరుక్షణమే సూర్యుడు మసకబారసాగాడు. కొంతసేపటి తరువాత పూర్తిగా అదృశ్యమైన సూర్యుని చూసి భయంకంపితుడైన మహారాజు ఆర్యభటుని ఆజ్ఞ పాఠించి వెంటనే యుద్ధవిరమణ ఘోషణ చేసాడు. ఆచార్యుని ప్రార్థనతో గ్రహాలు శాంతించాయి. గ్రహణం వీడింది. ఆకాశంలో చిత్రరథస్వామి మళ్లీ దర్శనమిచ్చాడు.ప్రయత్నం సఫలమైనా ఆచార్యుడి ముఖంలోని విచారం వరాహదేవుడిని ఆశ్చర్యపరిచింది. కారణం అడిగిన శిష్యులతో ‘విజ్ఞానాన్ని దేశకల్యాణానికి ఉపయోగిస్తే తప్పులేదు. కానీ అమాయక ప్రజల మూఢవిశ్వాసాలని స్వార్థానికి ఉపయోగిస్తే, భవిష్యత్తులో మన భారతీయ శాస్త్రీయ విజ్ఞానానికి గ్రహణం పట్టక తప్పదు’, అన్న ఆర్యభటుని మాటలు వరాహదేవుడికి జీవితాంతం గుర్తుండిపోయాయి. ఈ శీర్షికపై మీ స్పందన రాయండి: saipapineni@gamil.com - సాయి పాపినేని శాస్త్రీయ విద్యలో తెలంగాణ ఆనాటి రాజులు పండితులను కళలను ఆదరించటమే కాక తాము కూడా ఎన్నో రచనలు చేశారు. అజంతా గుహలలో అధికభాగం వాకాటక మహారాజు హరిసేనుడు. అతడి మంత్రి వరాహదేవుల కాలంలో నిర్మించబడ్డాయి. విష్ణుకుండినరాజు ఇంద్రవర్మ మహాకవిగా కీర్తించబడ్డాడు. ఛందస్సుపై అతడు రచించిన గ్రంథం ‘జనాశ్రయఛందోవిచ్ఛితి’. ఇంద్రవర్మ హయాంలో ఆంధ్రరాజ్యం శ్రీకాకుళం నుండి నెల్లూరు వరకూ పశ్చిమాన బళ్లారి వరకూ విస్తరించింది. క్రీ.శ. 5వ శతాబ్దం భారతీయ శాస్త్రీయ విజ్ఞానానికి స్వర్ణయుగం అంటాడు. తెలంగాణ ఆనాటి లౌకిక విజ్ఞానానికి ఆయువుపట్టుగా విలసిల్లింది. హైదరాబాద్‌కి 50 కి.మీ. దూరంలో వేలూరు వాస్తవ్యులైన పండితులు మంత్రులుగా అప్పటి భారత రాజకీయాలు నిర్దేశించారు. అజంతా గుహల శాసనాలు మూడు తరాలుగా వాకాటకులకు ప్రధాన మంత్రులైన ఆ వంశాన్ని ప్రస్తావిస్తాయి. విష్ణుశర్మ రచించిన ‘పంచతంత్రం’ రాజనీతిని ఆసక్తికరమైన కథల ద్వారా ముగ్గురు వాకాటక రాకుమారులకు అందించిన నిదర్శన కావ్యం. మొదట పర్షియాలో ‘ఖలీల్ వా దిమ్నా’గా పరిచయమై, పిదప అరబ్బీ, ల్యాటిన్, జర్మన్, ఇంగ్లిష్లలోనేకాక చైనా, జపాన్, కావి (ఇండోనేసియా) భాషలలో క్రీ.శ.16వ శతాబ్దానికి పూర్వమే అనువదింపబడింది. ఇక నవీనయుగంలో ప్రపంచంలోని అన్ని ముఖ్య భాషల్లోకీ అనువదింపబడిన భారతీయ గ్రంధం ఇదొక్కటే. వాకాటక రాకుమారులకు రాజకీయ పాఠాలు బోధించిన విష్ణుశర్మ మన హైదరాబాద్ ప్రాంతం వాడే అని చారిత్రకుల అభిప్రాయం. ఇక భారతదేశంలో ప్రాచీన యుగం నుండీ గణిత, ఖగోళ శాస్త్రాలు ఎంతో పరిణతి చెందాయన్న విషయం తెలిసినదే. వేదవాజ్ఞ్మయంలోని శుల్వసూత్రాలు, ‘పైథాగరస్ థీరం’ పైథాగరస్‌కు మూడు శతాబ్దాల ముందే భారతీయ ఇంజనీర్లకు తెలుసని నిరూపిస్తాయి. సున్న, డెసిమల్, అంకెలు భారతీయులు ప్రపంచానికి ఇచ్చిన శాస్త్రీయ వారసత్వమే. ప్రాచీన గణిత శాస్త్రజ్ఞులలో అగ్రగణ్యుడు ఆర్యభటుడు. గెలీలియోకి వెయ్యేళ్ల పూర్వమే భూమి గోళాకారంలో ఉందని సూచించాడు. జామెట్రీకి ఆయువుపట్టైన ‘పై’ యొక్క విలువను 3.1416గా నిరూపించాడు. త్రికోణమితిలోని (ట్రిగొనామెట్రీ) ‘సైన్’ విలువకు పట్టికలు తయారుచేశాడు. సూర్య చంద్ర గ్రహణాలు - చంద్రగ్రహం భూమికి సూర్యునికి మధ్య రావటం వల్లనూ, భూమి ఛాయ చంద్రుని మీద పడటం వల్లనూ సంభవిస్తాయని ప్రకటించిన మొట్టమొదటి ఖగోళశాస్త్రజ్ఞుడు ఆర్యభటుడే. ఈ మహామేధావి స్వస్థలం అశ్మకదేశం, అంటే తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా పరిసరాలు. అతడు రచించిన ఆర్యభటీయం అనే గ్రంథమే గాక తదుపరి శాస్త్రజ్ఞులు రచించిన గ్రంథాలలో ప్రస్తావించబడిన అతడి గణిత, ఖగోళ సిద్ధాంతాలను ‘అశ్మకతంత్రం’ అని పిలిచారు. ఆర్యభటుని సిద్ధాంతాలను ఆచరించే శాస్త్రజ్ఞులను ‘అశ్మకీయులు’ అనేవారు. అంటే, ఆర్యభటుని తరువాత కూడా తెలంగాణలో గణిత ఖగోళ శాస్త్రాలపై పరిశోధనలు సాగించారని తెలుస్తుంది. బాసర, వేములవాడ, కొలనుపాక, అలంపురం పట్టణాలు ఉన్నత విద్యాకేంద్రాలుగా వికసించాయి. ధార్మిక శాస్త్రాలయిన వేద, వేదాంగ, ఆగమ శాస్త్రాలు చెప్పే పాఠశాలలు గ్రామగ్రామాలలో వెలిశాయి. అయితే క్రీ.శ. 5వ శతాబ్దం తరువాత దేశంలో ఆర్థిక రాజకీయ సంక్షోభం వల్ల విద్యావికాసం కుంటుపడింది. దేవాలయాలకు, వైదిక పండితులకు చేసిన దానశాసనాలు మాత్రమే కనిపిస్తాయి. అందువలన ధార్మిక ప్రాముఖ్యం పెరిగి లౌకిక విద్యలు వెనకబడ్డాయి. శాస్త్రీయజ్ఞానాన్ని ఆలంబనంగా చేసుకొని భుక్తికోసం అమాయక ప్రజలని భయోత్పాతులని చేసి విద్యలని స్వలాభానికి వాడుకొనే తంత్రవేత్తలూ, మంత్రగాళ్లూ బయలుదేరారు. దేశంలో స్వచ్ఛమైన శాస్త్రీయ విద్యకి గ్రహణం పట్టింది. -
విధి విడదీసింది...
రెండు కుటుంబాల్లో ముగ్గురు దుర్మరణం ఒక కుటుంబంలో తల్లి, కొడుకు... మరో కుటుంబంలో చిన్నారి మృతి బంధువుల ఆర్తనాదాలతో ఆస్పత్రిలో విషాదఛాయలు వారిద్దరూ ప్రాణ స్నేహితులు.. ఒకరిది జగ్గయ్యపేట, మరొకరిది ఖమ్మం జిల్లా సత్తుపల్లి. వేసవి సెలవుల్లో రెండు కుటుంబాలు పుణ్యక్షేత్రాల సందర్శనకు వెళ్లాయి. కానీ... తిరుగు ప్రయాణంలో విధి వారిద్దరినీ విడదీసింది. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో వారి కుటుంబాల్లోని ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. ప్రత్తిపాడు (గుంటూరు), న్యూస్‌లైన్ : గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం చినకోండ్రుపాడు వద్ద కాటూరి వైద్య కళాశాల సమీపంలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో రెండు కుటుంబాలకు చెందిన ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. వివరాలిలా ఉన్నాయి. ప్రాణ స్నేహితులైన జగ్గయ్యపేటకు చెందిన కుందేలు రవికిరణ్, సత్తుపల్లికి చెందిన దూదిపాళ్ల ప్రభు వేసవి సెలవుల్లో సకుటుంబసమేతంగా తిరుపతి, కంచి పుణ్యక్షేత్రాలను దర్శించుకోవాలనుకున్నారు. ఈనెల 23వ తేదీ శుక్రవారం కుందేలు రవికిరణ్ తన కుటుంబసభ్యులైన తల్లి రాజ్యం, భార్య శ్రీదేవి, కుమార్తె గాయత్రి, కుమారుడు హవీష్, ప్రాణ స్నేహితుడు దూదిపాళ్ల ప్రభు, అతని భార్య శ్రీదేవి, కుమార్తెలు యోజిత, చేతనలతో కలిసి మొత్తం రెండు కుటుంబాలకు చెందిన తొమ్మిదిమంది కారులో తిరుపతి బయలుదేరి వెళ్లారు. పుణ్యక్షేత్రాలను సందర్శించి బుధవారం సాయంత్రం జగ్గయ్యపేటకు బయలుదేరారు. గురువారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో వేగంగా వస్తున్న కారు గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం చినకోండ్రుపాడు వద్ద 16వ నంబరు జాతీయ రహదారిపై కాటూరి మెడికల్ కళాశాలకు సమీపంలో నిర్మించిన వంతెనను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రవికిరణ్ (38)తో పాటు అతని తల్లి రాజ్యం (63), స్నేహితుడు ప్రభు కుమార్తె యోజిత (8) మృత్యువాత పడ్డారు. మిగిలిన ఆరుగురు తీవ్ర గాయాలపాలై చికిత్స పొందుతున్నారు. దీంతో రెండు కుటుంబాల్లో విషాదం అలముకుంది. ఒక కుటుంబం తల్లీ కొడుకును కోల్పోగా, మరో కుటుంబం కన్నకూతురిని కోల్పోయింది. రవి ఎలా ఉన్నాడు... తీవ్రంగా గాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న దూదిపాళ్ల ప్రభు భరించలేని గాయాల దెబ్బలను సైతం పంటిబిగువున భరిస్తూ, తన స్నేహితుడి యోగక్షేమాలను ఆరా తీయడం అందరినీ కలిచివేసింది. స్ట్రెచర్‌పై చికిత్స పొందుతూనే తనకు వైద్యం చేస్తున్న వైద్యులు, నర్సులతో రవి ఎలా ఉన్నాడు.. వాడికేం ఇబ్బందిలేదుగా.. అంటూ అడిగాడు. తీవ్ర గాయాలతో బాధపడుతూ కూడా తన స్నేహితుడి యోగక్షేమాలు తెలుసుకునేందుకు ప్రయత్నించడం చూసిన వారు వారి స్నేహ బంధాన్ని తలచుకుని కంటతడి పెట్టుకున్నారు. అమ్మా.. ఒక్కసారి లేమ్మా.. కుందేలు రవికిరణ్, అతని తల్లి రాజ్యం మృతిచెందారన్న విషయం తెలుసుకున్న వారి కుటుంబీకులు, బంధువులు ప్రత్తిపాడు మండలం చినకోండ్రుపాడులోని కాటూరి వైద్యశాల వద్దకు చేరుకున్నారు. రవికిరణ్ చెల్లెలు విగతజీవులుగా పడి ఉన్న మృతదేహాలపై పడి అమ్మా లేవే.. ఒక్కసారి నాతో మాట్లాడవే.. అన్నా లే అన్నా.. ఒక్కసారి లే అన్నా.. అంటూ పెద్దపెద్దగా ఏడవడంతో ఆస్పత్రి ప్రాంగణం అంతా బంధువుల రోదనలతో మార్మోగింది. నొప్పులతో ఎగిరెగిరి పడుతూ.. ప్రమాదం బారిన పడిన వారిలో నలుగురు చిన్నారులు ఉండడంతో వారి పరిస్థితి మరీ దారుణంగా ఉంది. తలకు, కాళ్లకు, చెవులకు, చేతులతో పాటు పలు శరీర భాగాల వద్ద తీవ్ర గాయాలవడంతో నొప్పులు భరించలేక ఆ చిన్నారులు అల్లాడిపోయారు. వైద్య సిబ్బంది వైద్యం చేయడానికి ప్రయత్నిస్తున్న కొద్దీ చిన్నారులు నొప్పులతో ఎగిరెగిరిపడుతూ ఎక్కిళ్లు పెట్టి ఏడవడం అక్కడున్న వారందరినీ కంటతడి పెట్టించింది. చిన్నారులకు ఎంత కష్టం వచ్చింది దేవుడా..అంటూ విలపించారు. -
ఆయన ఇచ్చిన బర్త్‌డే గిఫ్ట్ చూసి... నాకు నవ్వాగలేదు!
కెమేరా ముందైనా, వెనకైనా... వారిది అపురూప జంట. ఒకరు నటనలో సూపర్‌స్టార్... మరొకరు మంచి నటి... రికార్డులకెక్కిన దర్శకురాలు... ఒకరిది సొంత దుస్తుల ఎంపికైనా తెలియని పసిపిల్లాడి మనస్తత్వం. మరొకరిది ఆయన కోసం గరిటె పట్టడంలో ఆత్మతృప్తి పొందే అమ్మతత్వం. కెమేరా కన్ను ‘సాక్షి’ (1967)గా పెరిగిన వయసుతో పాటు ప్రేమ కూడా మరింతగా పెనవేసుకుపోయిన కృష్ణ, విజయనిర్మల వైవాహిక జీవితంలో ఎన్నో తీపి గుర్తులు.. ఈ నాలుగున్నర దశాబ్దాల నిత్యనూతన ప్రేమానుబంధం ఇంత బలంగా ఉండడానికి కారణం ఏమిటి? అసలు వాళ్ళ మధ్య ప్రేమ ఎలా మొదలైంది? వారికి కోపతాపాలు లేవా? రావా? నిర్మల ఆరోగ్యం బాగా లేనప్పుడు కృష్ణ ఏం చేశారు? కృష్ణ మొదటి భార్య, పిల్లలతో నిర్మల ఎలా ఉంటారు? కృష్ణ పుట్టినరోజు మే 31కి ఓ వారం ముందే విజయ నిర్మల ఎన్నో ముచ్చట్లు ‘ఫ్యామిలీ’తో పంచుకున్నారు. రండి... నిర్మలమైన ఆ ప్రేమ జీవిత విజయ రహస్యాలను ఆమెనే అడిగి తెలుసుకుందాం... కృష్ణగార్ని మొదటెక్కడ చూశారు? ఎప్పుడు కలిశారు? విజయనిర్మల: మద్రాసులో ఓ సినిమా ఆఫీసులో ఆయనను మొదటిసారిగా చూశా. కలిసింది మాత్రం ‘సాక్షి’ చిత్రం షూటింగ్లో. అందులో చిన్నపిల్లాడి మనస్తత్వం ఉన్న వ్యక్తిలా ఆయన చేయాలి. ఆ యాక్టింగ్ నాకు చాలా నచ్చింది. కృష్ణగారి నవ్వు నాకు మరీ నచ్చింది. బాపూగారికీ ఆ నవ్వంటే చాలా ఇష్టం. ‘సాక్షి’ షూటింగ్ అప్పుడే నాకు కృష్ణగారంటే మనసులో ఓ ఇష్టం ఏర్పడింది. ‘సాక్షి’లో కృష్ణగారితో మీ పెళ్లి సన్నివేశాన్ని గుడిలో తీసినప్పుడు, నిజంగానే పెళ్లవుతుందని ఎవరో అన్నారట? విజయనిర్మల: చనిపోయి ఎక్కడున్నాడో తెలియదు కానీ..నటుడు రాజబాబు ‘ఇప్పుడు జరిగింది సినిమా పెళ్లి. కానీ, నిజంగా మీకు పెళ్లవుతుం’దన్నారు. ‘అలా మాట్లాడకు. తప్పు’ అన్నా. కానీ, నెల తర్వాత అదే జరిగింది. అదెలా జరిగింది? విజయనిర్మల: కృష్ణగారికి కూడా నేనంటే ఇష్టం మొదలైంది. మా ఇద్దరికీ మధ్యవర్తి నటుడు రాజబాబు. ‘కృష్ణగారు మిమ్మల్ని ఇష్టపడుతున్నారు’ అంటూ ఆయనే నా దగ్గర అన్నారు. అప్పుడు నేను అవుట్డోర్ షూటింగ్లో ఉన్నా. ‘ఇక్కడ కాదు.. మద్రాసు వచ్చిన తర్వాత దీని గురించి మాట్లాడతా’ అని రాజబాబుతో అన్నా. మద్రాసు వెళ్లిన తర్వాత మాట్లాడుకుని, కొంతమంది పరిశ్రమ పెద్దలతో చెప్పి, తిరుపతిలో పెళ్లి చేసుకున్నాం. నిర్మాత భావనారాయణగారు మా పెళ్లి పెద్ద. నటి రమాప్రభ, ఇంకొంతమంది మా పెళ్లికొచ్చారు. పెళ్లి కాగానే అట్నుంచి అటు ‘అమ్మ కోసం’ షూటింగ్లో పాల్గొనడానికి వెళ్లాం. అప్పుడు నాగయ్యగారు, అంజలీదేవి గారు... ‘ఇద్దరూ దొంగలు. నోట్లో అసలు నాలుకే లేనివాళ్లలా కనిపిస్తారు. గుట్టుచప్పుడు కాకుండా ఇంత పెద్ద పని చేసొచ్చారు’ అన్నారు సరదాగా. హనీమూన్‌కి మాత్రం కాశ్మీర్ వెళ్లాం. అది కూడా షూటింగ్ పని మీదే. ప్రేమ విషయాన్ని ముందుగా కృష్ణగారు చెప్పారా? లేక మీరా? విజయనిర్మల: కృష్ణగారే చెప్పారు. అప్పటికే ఆయనంటే ఇష్టం ఉండడంతో నేను కూడా వెంటనే ఒప్పుకున్నాను. కృష్ణగారు ఎంతోమంది అందమైన నాయికల సరసన నటించారు కదా! మిమ్మల్నే ప్రేమించడానికి కారణం ఏమిటంటారు? విజయనిర్మల: దర్శకురాలైన తర్వాత నేను అందరితో ఎక్కువగా మాట్లాడటం మొదలుపెట్టాను కానీ హీరోయిన్గా చేస్తున్నప్పుడు ఎవరితోనూ పెద్దగా మాట్లాడేదాన్ని కాదు. షూటింగ్లో విరామం దొరికితే, ఏదైనా నవల చదువుతూ కూర్చునేదాన్ని. నా పనేంటో నేనేంటో అన్నట్లుండేదాన్ని. కృష్ణగారు నన్నిష్టపడడానికి అదో కారణం అయ్యుంటుంది. మీరెందుకు నచ్చారో ఆయనను ఎప్పుడైనా అడిగారా?... ఏమన్నారు? విజయనిర్మల: ‘వంట బాగా చేస్తావు కాబట్టి ఇష్టం’ అని నవ్వుతూ అన్నారు. ‘వంట కోసమే పెళ్లాడారా’ అంటే, ‘కాదు. నీ కళ్లంటే ఇష్ట’మని చెప్పారు. కృష్ణగారి మొదటి భార్యతో మీ అనుబంధం ఎలా ఉంటుంది? విజయనిర్మల: మేమిద్దరం బాగానే ఉంటాం. ఓ రకంగా క్లోజ్‌ఫ్రెండ్స్ అనొచ్చు. ఆవిడ మా ఇంటికి భోజనానికి వస్తుంది. నేను వాళ్లింటికి వెళతాను. ఆవిడ పుట్టినరోజుకు కేక్ తీసుకెళతాం. పిల్లలందరికీ నేనంటే ఇష్టం. నన్ను ‘పిన్నీ’ అని పిలుస్తారు. నాతో చాలా ఆప్యాయంగా ఉంటారు. ఈ మధ్యే అనుబంధం పెరిగిందా? లేక మొదట నుంచీ మీ అందరూ బాగా ఉండేవారా? విజయనిర్మల: ఈ మధ్యే! అప్పట్లో సినిమాలతో బిజీ. తీరిక చిక్కేది కాదు. ఇప్పుడు కావాల్సినంత ఖాళీ కాబట్టి, రాకపోకలు ఎక్కువయ్యాయి. కృష్ణగారు, మీరు పెళ్లాడిన కొత్తలో సినిమాల బిజీ మధ్య ఫ్యామిలీ లైఫ్... విజయనిర్మల: చాలా మిస్సయ్యాం. మా పెళ్లయిన కొత్తలో నేనో మలయాళ సినిమా చేస్తున్నాను. ఆ సినిమా షూటింగ్ కేరళలో జరిగితే, కృష్ణగారు కారేసుకుని వచ్చేసేవారు. నాకు ఖాళీ దొరికినప్పుడు, ఆయన ఎక్కడ షూటింగ్ చేస్తే అక్కడికెళ్లేదాన్ని. కానీ, లొకేషన్‌కు మాత్రం వెళ్లేదాన్ని కాదు. ఎందుకంటే, హీరోయిన్స్‌తో యాక్ట్ చేసేటప్పుడు కృష్ణగారు ఇబ్బందిపడొచ్చు. అలాగే, ఆ హీరోయిన్స్ కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంది. డ్రెస్సింగ్, మేకప్ విషయంలో కృష్ణగారు మీకేమైనా ఆంక్షలు పెట్టేవారా? విజయనిర్మల: అస్సలు లేదు. ‘నీకు సౌకర్యవంతంగా ఉన్న డ్రెస్‌లు వేసుకో’ అంటారు. పాత్రకు అనుగుణంగా డ్రెస్ ఉండాలంటారు. హెయిర్ స్టయిల్ విషయంలో మాత్రం కామెంట్ చేసేవారు. ఒకప్పుడు జుట్టును ఇంతెత్తున చేసి, ముడిలా వేసేవాళ్లు. ఆ స్టయిల్ చేసుకున్నప్పుడు ‘ఇదేంటి పిచ్చుక గూడులా ఉంది. బాగా లేదు’ అనేవారు. కృష్ణగారితో మీకు అనుబంధం పెరిగిన తర్వాత జరుపుకొన్న మీ తొలి పుట్టినరోజుకు ఆయన ఏం బహుమతి ఇచ్చారు? విజయనిర్మల: ఆయనతో జరుపుకొన్న ప్రతి పుట్టినరోజూ నాకు జ్ఞాపకమే. ఓ పుట్టినరోజుకి ఆయన నాకు గడియారం కొనిపెట్టారు. మా మధ్య ప్రేమ ఏర్పడిన తర్వాత వచ్చిన తొలి పుట్టినరోజది. గిఫ్ట్ ప్యాక్ విప్పి చూసిన నాకు నవ్వాగలేదు. అది టేబుల్ క్లాక్. ఇష్టంగా ఇచ్చారు కాబట్టి, ఆ గడియారాన్ని నేను చాలా ఏళ్ళు పదిలంగా కాపాడుకున్నా. కృష్ణగారు బంగారు నగలు ఇష్టపడరు. ఎలాంటి కానుకలు కొనిపెట్టాలో మాత్రమే కాదు.. ఎలాంటి డ్రెస్సులేసుకోవాలో కూడా ఆయనకు తెలియదు. అంటే.. సూపర్‌స్టార్ డ్రెస్‌లన్నీ మీరే ఎంపిక చేస్తారన్నమాట? విజయనిర్మల: అవును. సినిమాల కోసం కాస్ట్యూమర్స్ సెలక్ట్ చేస్తారు. కానీ, విడిగా వేసుకునే బట్టలు మాత్రం నేనే కొంటాను. ఈ మధ్య చెయ్యికి ఫ్రాక్టర్ కావడంతోఓ ఆరు నెలలు నేను బయటకు వెళ్లలేదు. ఇటీవలే కృష్ణగారు పంచెలు కావాలనడిగారు.. దాంతో తెప్పించా. ఆ మధ్య ఆయన బర్త్‌డేకి బెంజ్ కారు కొనిపెట్టినట్లున్నారుగా! విజయనిర్మల: పుట్టినరోజుకు నెల రోజుల ముందే ఆ కారు బుక్ చేశాను కానీ, కృష్ణగారితో చెప్పలేదు. పుట్టినరోజు నాడు ఇంటి నుంచి పద్మాలయా స్టూడియోకు వెళ్లడానికి బయటికొచ్చాం. బెంజ్ కారు వచ్చి, మా ముందు ఆగింది. నేను ఆయన చేతికి కారు తాళాలు ఇస్తే, ‘ఈ కారెవరిది? ఇప్పుడు ఇందులో వెళ్లాలా?’ అనడిగారు. ఆ తర్వాత అసలు విషయం చెప్పాను. నిజజీవితంలో కృష్ణగారిది చిన్నపిల్లాడి మనస్తత్వమని అంతా అంటారు.. విజయనిర్మల: అది నిజమే. ఇప్పటికీ ఆయనది పసిపిల్లాడి మనస్తత్వమే. చాలా మంచి వ్యక్తి కూడా. నేను చేసే వంటలంటే ఆయనకు బాగా ఇష్టం. నాకెంత ఒంట్లో బాగాలేకపోయినా వంటలో నా చెయ్యి ఉండాల్సిందే. అప్పుడే ఇష్టంగా తింటారు. కాకపోతే ఈ మధ్య నాకు చెయ్యి ఫ్రాక్చరై దాదాపు ఆరు నెలలు వంట చేయలేకపోయాను. అప్పుడు చాలా బాధపడ్డా. నేను వంట చేయలేనప్పుడు మా వదినవాళ్లు చేస్తారు. అయినా నాకే మనసొప్పదు. కృష్ణగారికి స్వయంగా నేను చేసి పెడితేనే తృప్తి. నెల రోజులుగా మళ్ళీ వంట మొదలుపెట్టా. మీరు చేసే వంటల్లో కృష్ణగారికి బాగా నచ్చేవి? విజయనిర్మల: అన్నీ ఇష్టమే. ముఖ్యంగా నేను చేసే చేపల పులుసంటే ఆయనకు చాలా ఇష్టం. ‘నిర్మల చేసినట్లుగా ఎవరూ వంట చేయలేరు. ఆమె వంటలంటే నాకు చాలా ఇష్టం’ అని ఆయన అందరికీ చెబుతుంటారు. మామూలుగా కృష్ణగారు భోజనప్రియులా? విజయనిర్మల: ఒకప్పుడు! ఆయన కోసం తందూరీ ప్రత్యే కంగా నేర్చుకున్నా. కానీ, ఇప్పుడు తిండి తగ్గిపోయింది. మీ మధ్య చిన్న చిన్న అలకలు.. గొడవలు..? విజయనిర్మల: అలకలు సహజం. ఇక, సంసారమన్నాక గొడవలు రాకుండా ఎలా ఉంటాయి? అయితే విడిపోయేంత గొడవలు ఎప్పుడూ రాలేదు. చెప్పిన టైమ్‌కి ఇంటికి రానప్పుడు, కోపం ప్రదర్శించేదాన్ని. కాసేపు మాట్లాడుకోకపోయినా, తర్వాత మామూలైపోతాం. ఒకరి పట్ల మరొకరు కోపాన్ని ఎలా ప్రదర్శిస్తారు? విజయనిర్మల: కృష్ణగారు ఏ భావమూ ప్రదర్శించరు. అన్నిటికీ ఒకే విధంగా ఉంటారు. నేను మాత్రం కొంచెం కోపంగా చూస్తాను. మాట్లాడకుండా ఉంటాను. దాంతో కోపమొచ్చిందని అర్థం చేసుకుంటారు. మా కోపం కాసేపే. తర్వాత మామూలుగా మాట్లాడుకుంటాం. మీ ఇద్దరికీ ఇప్పుడు కావాల్సినంత సమయం దొరికింది. మరి, ఎలా గడుపుతున్నారు? విజయనిర్మల: మేం పెద్దగా బయటికెళ్లం. రోజూ పేపర్లు తిరగేస్తాం. టీవీలో వచ్చే ప్రోగ్రామ్స్‌ని కలిసి చూస్తాం. క్రికెట్ మ్యాచ్ వచ్చినప్పుడు మాత్రం ఆయనో టీవీ, నేనో టీవీ చూస్తాం. యాక్ట్ చేస్తున్నప్పుడు సెట్లో కూడా టీవీ పెట్టుకునేవారు కృష్ణగారు. క్రికెట్ ఆయనకు చాలా ఇష్టం. ఇద్దరం కలిసి సినిమాలు చేసినప్పుడు మాత్రం పేకాట ఆడేవాళ్లం. ఎప్పుడూ ఆయనే విన్నర్. మీ వైవాహిక జీవితంలో ఎదురైన క్లిష్టమైన సమస్య? విజయనిర్మల: దేవుడి ఆశీర్వాదం వల్ల ఏదీ రాలేదు. ఆయన భర్త కావడం దేవుడి వరం అనుకుంటారా? విజయనిర్మల: కచ్చితంగా! ఒక మంచి జీవిత భాగస్వామి లభించడం తేలిక కాదు. భార్యలను హింసించే భర్తల కథలు సినిమాల్లో చూస్తున్నాం. విడిగా కూడా అలాంటి భర్తలు చాలామందే ఉన్నారు. నాకు సంబంధించినంత వరకు నా జీవితం చాలా ఆనందంగా ఉంది. కృష్ణగారు మేలిమి బంగారం. - డి.జి. భవాని సాక్షి’ చిత్రంలో కృష్ణ, విజయనిర్మల కృష్ణగారు అందగాడు. జయప్రద, శ్రీదేవి.. ఇలా ఎందరో అందగత్తెల సరసన నటించారు! మీకెప్పుడూ అభద్రత కలగలేదా? విజయనిర్మల: వాళ్లందరూ అందగత్తెలే! ఒప్పుకుంటా. కానీ, కృష్ణగారు ఎవరితోనూ అంత చనువుగా ఉండేవారు కాదు. అందుకని నాకెప్పుడూ అభద్రతాభావం కలగలేదు. భాగస్వామి మన పట్ల ఎంత కేరింగ్‌గా ఉంటారో అనారోగ్యంగా ఉన్నప్పుడే తెలుస్తుంది. మరి.. కృష్ణగారెలా చూసుకున్నారు? విజయనిర్మల: నేనేం మందులు వాడానో నాకు తెలీదు. ఉదయం, మధ్యాహ్నం, రాత్రి - ఇలా ఎప్పటికప్పుడు వేసుకోవాల్సిన మందులు ఆయనే తెచ్చి ఇచ్చేవారు. చెప్పాలంటే నా గురించి నా కన్నా ఆయనే ఎక్కువ జాగ్రత్త తీసుకున్నారు (చెమర్చిన కళ్లతో). ఇంతకీ, కృష్ణగారిలో మీకు బాగా నచ్చిన అంశం? విజయనిర్మల: చాలా మంచి వ్యక్తి. సున్నిత మనస్కుడు. తన పనేంటో తనేంటో! అనవసరంగా ఒకర్ని నిందించడం, లేనిపో నివి మాట్లాడడం ఆయనకిష్టం ఉండదు. అది నాకు నచ్చింది.