
సాక్షి, చెన్నై: అన్నాడీఎంకే బహిష్కృత నాయకురాలు శశికళతో పాటు ఆమె సన్నిహితులు, కుటుంబ సభ్యులే లక్ష్యంగా ఈ నెల 9న ప్రారంభమైన ఐటీ దాడులు సోమవారం సాయంత్రం ముగిశాయి. వరుసగా ఐదో రోజూ ఐటీ అధికారులు శశికళ అన్న కుమారుడు వివేక్, ఆయన సోదరి కృష్ణప్రియ నివాసాలతో పాటు జయ టీవీ, నమదు ఎంజీఆర్ పత్రిక, జాస్ సినిమాస్, మిడాస్ స్పిరిట్స్ అండ్ లిక్కర్స్ తదితర సంస్థల కార్యాలయాలతో పాటు మరో 8 చోట్ల సోదాలు నిర్వహించారు. ఈ దాడుల్లో శశికళ కుటుంబీకులు, వ్యాపార భాగస్వాములు దాదాపు రూ. 1,403 కోట్ల మేర పన్నును ఎగవేసినట్లు గుర్తించామని ఐటీ ఉన్నతాధికారి తెలిపారు. సోదాలు పూర్తవడంతో 355 మందికి సమన్లు జారీచేసేందుకు ఐటీ వర్గాలు సిద్ధమయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment