కరీంనగర్ క్రైం : ప్రాణస్నేహితులే కలిసి హత్యచేసిన విషయం పన్నెండేళ్లకు వెలుగుచూసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేయకపోవడంతో ఇన్నేళ్లుగా హంతకుడు తప్పిం చుకు తిరగుతున్నాడు. పెండింగ్‌లో ఉన్న కేసు విషయమై విచారిస్తుండగా ఈ హత్యా వివరాలు వెల్లడించాడు. నిజామాబాద్ జిల్లా కమ్మర్‌పల్లి మండలం చౌట్‌పల్లికి చెందిన మాసం సాయ న్న అలియాస్ సాయిరెడ్డిపై చాలాకాలంగా మోర్తాడ్ పోలీస్‌స్టేషన్‌లో ఓ వారెంటు పెండింగ్‌లో ఉంది.
హైదారాబాద్‌లోని లాలాపేటలో ఉంటున్న సాయన్నను ఈనెల 25న మోర్తాడ్ పోలీసులు అరెస్టు చేశారు. వారెంట్ విషయమై విచారిస్తుండగా స్నేహితుల సాయంతో 2002లో సాయన్నను హతమార్చిన విషయాన్ని ఒప్పుకున్నాడు. దీంతో వారు వెల్పూర్ పోలీసులతోపా టు మృతదేహం లభించిన కరీంనగర్ రూరల్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. మాసం సాయన్నతోపాటు హత్య చేసేందుకు సాయపడ్డ నగేశ్, గంగడుపై కేసు పెట్టారు. ఈ ఇద్దరిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపినట్లు పోలీసులు తెలిపారు.
హత్య జరిగిందిలా..
వెల్పూర్ మండలం పడిగల్‌కు చెందిన మేకల వ్యాపారి కట్టాల సాయన్న(45), మాసం సాయన్న, నగేశ్, గంగడు మిత్రులు. 2002 నవంబర్ చివరివారంలో కలిసి మద్యం తాగారు. కట్టాల సాయన్న, మాసం సాయన్నల మధ్య మాట మాట పెరిగి దాడి చేసుకున్నా రు. కట్టాల సాయన్నను మిత్రులందరూ కలిసి హత్య చేసి, ఎస్సారెస్పీ కాలువలో పడేశారు. 14 రోజుల తర్వాత మృతదేహం కుళ్లిపోయి కరీంనగర్ మండ లం కొత్తపల్లి వద్ద బయటపడింది. దీంతో హత్య జరిగిన విషయం వెలుగులోకి రాలేదు.
బయటకు వెళ్తున్నానని చెప్పొచ్చిన కట్టాల సాయన్న రెండు రోజులైన కనిపించకపోవడంతో అతని సోదరులు డిసెంబర్ 1న వెల్పూ ర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, మిస్సింగ్ కేసుగా నమోదు చేశారు. అదే సంవత్సరం డిసెంబర్ 14న కొత్తపల్లి ప్రాంతంలోని ఎస్సారె స్పీ కాలువలో సాయన్న మృతదేహం లభించిం ది. దీంతో కరీంనగర్ పోలీసులు ఆత్మహత్యగా కే సు ఫైల్ చేసి మూసివేశారు. దీంతో సాయన్న ప్రమాదవశాత్తుగా చనిపోయాడని అందరూ భావించారు. కానీ స్నేహితులే చంపారనే విషయం ఆలస్యంగా వెలుగుచూసింది.
పుష్కరకాలానికి...
Published Fri, Aug 29 2014 2:18 AM | Last Updated on Mon, Jul 30 2018 8:29 PM
Advertisement
Advertisement