
పోస్ట్‌మ్యాన్ పోరాటం
తెలంగాణ పోరాట నేపథ్యంలో 1969- 72 మధ్య కాలంలో జరిగిన ఓ ప్రేమకథతో తెలుగు, ఇంగ్లీషు భాషల్లో తెరకెక్కుతున్న చిత్రం ‘ఇండియన్ పోస్ట్‌మ్యాన్’. అజయ్‌కుమార్, వేద జంటగా రమేశ్‌రెడ్డి స్వీయదర్శక త్వంలో నిర్మిస్తున్నారు.
సాయిచంద్ స్వరాలందించిన ఈ చిత్రం పాటల వేడుక హైదరాబాద్‌లో జరిగింది. తెలంగాణ రాష్ట్ర హోం మంత్రి నాయిని న రసింహారెడ్డి ఈ చిత్రం పాటలను ఆవిష్కరించారు. ‘‘కేవలం 50 లక్షల బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించాం.
ఇప్పటికే ఇంగ్లీషు వెర్షన్‌కు కోటి రూపాయాలకు పైగా బిజినెస్ జరుగుతోంది’’ అని రమేశ్‌రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో దర్శక, నిర్మాతలు రఫీ, పులి అమృత్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.