
సాక్షి, హైదరాబాద్: లోక్ సభతోపాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశా, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను ప్రకటించిన నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలును ఎత్తివేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం కార్యదర్శి అజయ్ కుమార్ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమలుకు తెరపడటంతో కొత్త అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకునేందుకు అడ్డంకి తొలగింది. మార్చి 10న లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచి ఆదివారం వరకు 79 రోజుల పాటు కోడ్ అమల్లోకి ఉండటంతో కొత్త అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలు కుంటుపడింది.