సాక్షి, హైదరాబాద్: సారు(కేసీఆర్).. కారు(బీఆర్‌ఎస్).. మళ్లీ రారు.. రావని ఏఐసీసీ పరిశీలకుడు అజయ్‌కుమార్ వ్యాఖ్యానించారు. కారును పోలీ సోళ్లు కూడా ఉండనివ్వడం లేదని, కాంగ్రెస్ ప్రచా రం కోసం గాం«దీభవన్‌లో అద్దె కార్లు తెచ్చి పెట్టుకుంటే పోలీసులు తీసుకెళ్లిపోయారని ఆయన ఎద్దే వా చేశారు. ఆదివారం గాందీభవన్‌లో టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లురవి, ఏఐసీసీ పరిశీలకుడు అంశు, పీసీసీ ప్రధాన కార్యదర్శి కౌశిక్ చరణ్‌యాదవ్‌తో కలిసి అజయ్ మీడియాతో మాట్లాడారు.
తెలంగాణలో వైద్య పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. గర్భిణీ లకు అవసరమైన రక్తం కూడా దొరకడం లేదని, మెజార్టీ ప్రజలకు పౌష్టికాహారం దూరమైందని, 70 శాతం మంది పిల్లలకు ప్రభుత్వ వైద్యం అందుబాటులో లేదని చెప్పారు. కేసీఆర్ పాలనపై విసిగిపోయిన ప్రజలు ఈసారి బీఆర్‌ఎస్ నుంచి విముక్తి పొందాలని నిర్ణయించారనీ, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
మాజీ ఎంపీ మల్లురవి మాట్లాడుతూ గత తొమ్మిదిన్నరేళ్లుగా వైద్య, ఆరోగ్య రంగాన్ని కేసీఆర్ నిర్లక్ష్యం చేశారని విమర్శించారు. మీడియా సమావేశంలో భాగంగా బీఆర్‌ఎస్ పాలనలో జరిగిన అవినీతి, కేసీఆర్ కుటుంబ ఆస్తులపై వీడియోను కాంగ్రెస్ నేతలు ప్రదర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment