బొల్లారం పోలీసు స్టేషన్ పరిధిలో సోమవారం వంచహ చంద్రయన్(17) అదృశ్యమైనట్లు బొల్లారం ఎస్‌ఐ సతీష్‌కుమార్ తెలిపారు. బొల్లారంలోని త్రిశుల్ లెన్‌లో నుండి ఉదయం తల్లి ఊర్మిల పాండేను నాచారం ఢిల్లీ పబ్లిక్ స్కూల్ వద్ద వదిలి ఇంటికి వచ్చినట్లు తెలిపారు. తదనంతరం తల్లి కూతురుకు పోన్ చేయాగా స్వీచ్ ఆఫ్ రావడంతో వెంటనే ఇంటికి వచ్చి చూడగా తలుపులు తెరిచి ఉన్నాయని తెలిసిన వారి వద్ద వాకబు చేయాగా ఎక్కడ ఆచూకి లబించలేదని తెలిపారు. దీంతో వెంటనే బొల్లారం పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. తల్లి ఊర్మిల పాండే ఫిర్యాదు మెరకు కేసు నమోదు చేసుకోని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. విద్యార్థి తల్లి టిచర్ అని తండ్రి మిలటరిలో పనిచేస్తున్నారు. వంచహా ఈమద్యనే ఇంటర్ పరీక్షలు వ్రాసింది.
విద్యార్థిని అదృశ్యం
Published Mon, Mar 14 2016 8:27 PM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM
Advertisement
Advertisement