Bolarum
-
Bolarum Cantonment Hospital: బోర్డుదే బాధ్యత
రసూల్‌పురా: బొల్లారం కంటోన్మెంట్ జనరల్ ఆసుపత్రిలో ఆవరణలో చెట్టు కూలి మృతి చెందిన తూంకుంట నివాసి రవీందర్ కుటుంబానికి కంటోన్మెంట్ బోర్డు అధికారులు న్యాయం చేయాలని కోరుతూ బంధువులు, కుటుంబ సభ్యులు బుధవారం ఆస్పత్రి ముందు ఆందోళనకు దిగారు. ఎండిన చెట్టు తొలగించడంలో బోర్డు అధికారుల నిర్లక్ష్యం కారణంగానే నిండు ప్రాణం బలైందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం జరిగిన ప్రమాద ఘటనలో తీవ్రంగా గాయ పడిన రవీందర్ సతీమణి సరళాదేవి ఆస్పత్రి ఆవరణలో అంబులెన్స్‌లోనే ఉండి ఈ ఆందోళనలో పాల్గొన్నారు. వీరికి ఉపాధ్యాయ సంఘాల నాయకులు, తిరుమలగిరి మండల పరిధిలోని ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు మద్దతు పలికి ఆందోళనలో పాల్గొన్నారు. దీనిపై సమాచారం అందుకున్న బోర్డు సీఈవో మధుకర్ నాయక్ తమ తరపున ప్రతినిధులుగా వాటర్‌వర్క్స్ సూపరిటెండెంట్ రాజ్‌కుమార్, నర్సింగ్ రావు, యాని, రమణ, రాములును ఆస్పత్రికి పంపించారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ బోర్డు అధికారులు ఘటనకు బాధ్యత వహించి రవీందర్ ఇద్దరు కుమార్తెలకు న్యాయం చేయాలని కోరారు. అధికారుల నిర్లక్ష్యంవల్లే రవీందర్ మృతి చెందాడని ఆరోపించారు. తమకు స్పష్టమైన హామీ ఇచ్చే వరకు ఆందోళన విరమించేది లేదని ఆస్పత్రి ముందు, మీటింగ్ హాల్లో, సూపరింటెండెంట్ రామకృష్ణ వద్ద నాలుగు గంటల పాటు నిరసనకు దిగారు. ఒక దశలో ఉపాధ్యాయులు అధికారి రాజ్‌కుమార్‌తో వాగ్వాదానికి దిగారు. అధికారుల హామీతో ఆందోళన విరమణ ఈ విషయంలో నిర్ణయం తీసుకునే వీలు తమకు లేదని, బోర్డు పాలకమండలి సమావేశంలో చర్చించి రవీందర్ కుటుంబానికి, వారి ఇద్దరు కుమార్తెలకు న్యాయం చేసేందుకు తగిన నిర్ణయం తీసుకుంటామని వాటర్‌వర్క్స్ అధికారి రాజ్‌కుమార్ హామీచ్చారు. అదే విధంగా తీవ్రంగా గాయపడిన సరళాదేవికి కిమ్స్ హాస్పిటల్లో మెరుగైన చికిత్స అందజేస్తామని, ఆ ఖర్చు మొత్తం బోర్డు భరిస్తుందని, బొల్లారం హస్పిటల్ నుంచి ఓ డాక్టర్‌ను కిమ్స్ ఆసుపత్రికి సరళాదేవితో పంపిస్తామని అధికారులు హామీచ్చారు. దీంతో ఆందోళన విరమించారు. -
సికింద్రాబాద్ బొల్లారంలో వేసవి శిబిరం
సికింద్రాబాద్ బొల్లారంలో గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో వేసవి శిబిరాన్ని ప్రారంభించారు సంఘం అధ్యక్షుడు పూస యోగేశ్వర్. విద్యార్థులందరికీ వేసవికాలం సెలవులు ఉంటాయని, వాటిని సద్వినియోగం చేసుకుంటే.. వచ్చే విద్ఆయ సంవత్సరం వారికి ఎంతో ప్రయోజనకరంగా మారుతుందన్నారు.వేసవి శిబిరంలో విద్యార్థులకు శిక్షణ ఇచ్చేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇటీవలే ఎన్నికైన కార్యవర్గం ఆధ్వర్యంలో ఈ శిబిరం ఏర్పాటు చేశారు. పిల్లలకు భరతనాట్యం, కర్ణాటక సంగీతం, సంస్కృత శ్లోకాలు, జానపద నృత్యకళల్లో శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేశారు. దీనికి సంబంధించి ఆయా రంగాల్లో అనుభవజ్ఞులను, గురువులను నియమించుకున్నారు.ఇవ్వాళ్టి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ ప్రియాంకను ఆహ్వనించగా.. వేసవి శిబిరాన్ని ఆమె జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. సమ్మర్ క్యాంపులో పాల్గొనే విద్యార్థులను ఉద్దేశించి గంగపుత్ర సంఘం అధ్యక్షుడు పూస యోగేశ్వరు మాట్లాడారు. క్రీడలు, వ్యాయామం, యోగను నిత్య జీవితంలో భాగస్వామ్యం చేసుకోవాలని సూచించారు. సమ్మర్ క్యాంపులో నేర్చుకున్న అంశాలు ఎప్పటికీ గుర్తుండిపోయేలా శ్రద్ధ పెట్టాలన్నారు. -
హైదరాబాద్ లో రూ.9కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత
-
హైదరాబాద్ బొల్లారంలోని ఆర్మీ పబ్లిక్ స్కూల్ లో వేడుకలు
-
హైదరాబాద్: బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి సందర్శకుల తాకిడి (ఫొటోలు)
-
సికింద్రాబాద్: బొల్లారం రాష్ట్రపతి నిలయానికి స్వాగతం (ఫొటోలు)
-
బొల్లారం ఆర్మీ పబ్లిక్ స్కూల్లో ఉద్యోగాలు
సికింద్రాబాద్‌లోని భారత ప్రభుత్వ రంగ సంస్థ, రక్షణ విభాగానికి చెందిన బొల్లారంలోని ఆర్మీ పబ్లిక్ స్కూల్(ఏపీఎస్).. టీచర్, ఇతర పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ► మొత్తం పోస్టుల సంఖ్య: 33 ► పోస్టుల వివరాలు: పీజీటీ, టీజీటీ, పీఆర్టీ, కంప్యూటర్ సైన్స్ టీచర్లు, లైబ్రేరియన్ తదితరాలు. ► విభాగాలు: హిస్టరీ, సైన్స్, జాగ్రఫీ, ఎకనామిక్స్, సైకాలజీ, మ్యాథ్స్, ఇంగ్లిష్, హిందీ, సోషల్ సైన్స్ తదితరాలు. ► పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్లు(పీజీటీ): అర్హతలు: సంబంధిత విభాగాన్ని అనుసరించి 50శాతం మార్కులతో పోస్టు గ్రాడ్యుయేట్ ఉత్తీర్ణులవ్వాలి. వయసు: ఫ్రెషర్స్ అభ్యర్థులు 40 ఏళ్లు మించకూడదు. అనుభవం ఉన్నవారు 57 ఏళ్లు మించకూడదు. ► ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లు(టీజీటీ): అర్హతలు: సంబంధిత విభాగంలో 50 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులవ్వాలి. వయసు: ఫ్రెషర్స్ అభ్యర్థులు 40 ఏళ్లు మించకూడదు. అనుభవం ఉన్నవారు 57 ఏళ్లు మించకూడదు. ► ప్రైమరీ టీచర్లు(పీఆర్టీ): అర్హతలు: సంబంధిత విభాగంలో 50శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులవ్వాలి. వయసు: ఫ్రెషర్స్ అభ్యర్థులు 40 ఏళ్లు మించకూడదు. అనుభవం ఉన్నవారు 57 ఏళ్లు మించకూడదు. ► లైబ్రేరియన్: అర్హతలు: బ్యాచిలర్ డిగ్రీ(లైబ్రరీ సైన్స్)/డిప్లొమా(లైబ్రరీ సైన్స్) ఉత్తీర్ణులవ్వాలి. కనీసం 3 ఏళ్లు పని అనుభవం ఉండాలి. ► సెక్యూరిటీ సూపర్వైజర్: అర్హతలు: ఎంఎస్ ఆఫీస్ పరిజ్ఞానం ఉండాలి. 55ఏళ్లు నిండిన ఎక్స్సర్వీస్మెన్లకు ప్రాధాన్యం ఇస్తారు. ► కంప్యూటర్ ల్యాబ్ టెక్నీషియన్: అర్హతలు: ఇంటర్మీడియట్, డిప్లొమా(కంప్యూటర్ సైన్స్) ఉత్తీర్ణులవ్వాలి. వయసు: 35 ఏళ్లు మించకూడదు. ► దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ఆర్మీ పబ్లిక్ స్కూల్, బొల్లారం, జేజే నగర్, సికింద్రాబాద్–500087 చిరునామాకు పంపించాలి. ► దరఖాస్తులకు చివరి తేది: 05.06.2021 ► వెబ్సైట్: http://www.apsbolarum.edu.in/index.html మరిన్ని నోటిఫికేషన్లు: టీటీడబ్ల్యూఆర్‌డీసీఎస్‌లో పార్ట్‌టైం టీచింగ్ పోస్టులు డీఎస్ఎస్ఎస్బీలో 7236 ఉద్యోగాలు -
బొల్లారంలో రెండు బ్రిజా కార్లు నుజ్జు నుజ్జు
సాక్షి, సికింద్రాబాద్ : బొల్లారం పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజీవ్ రహదారిపై శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఎదురెదురుగా వస్తున్న రెండు కార్లు పరస్పరం ఢీకొట్టుకోవడంతో నుజ్జు నుజ్జు అయ్యాయి. సికింద్రాబాద్ నుంచి శామీర్‌పేట్ వైపు వెళుతున్న బ్రిజా కారు శామీర్ పేట్ నుంచి ఎదురు గావస్తున్న బ్రిజా కారును ఢీకొంది. అంతే కాకుండా వెనకాల వస్తున్న యాక్టివా, బీఎండబ్ల్యూ వాహనాలను ఢీకొనడంతో స్కూటీపైన వస్తున్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. (నిర్మాత కమలాకర్ రెడ్డి మృతి) అయితే కారులో ఒక్కసారిగా ఎయిర్ బెలూన్స్ ఓపెన్ కావడంతో అందులో ప్రయాణిస్తున్న వారు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. తృటిలో ప్రాణ నష్టం తప్పింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని గాయపడిన వ్యక్తులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. (నదిలోకి దూసుకెళ్లిన కారు.. వ్యక్తి మృతి) -
ఆనంద వీక్షణం
-
బొల్లారం రైల్వేస్టేషన్లో విషాదం
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్ బొల్లారం రైల్వేస్టేషన్లో విషాదం నెలకొంది. స్టేషన్ వద్ద రైలు పట్టాలు దాటుతున్న ఇద్దరిని రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతులను నాందేడ్‌కు చెందిన సీతమ్మ(50), చిన్నారి పంకజగా గుర్తించారు. మృతదేహాలను గాంధీ ఆస్పత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు. -
గ్యాస్ లీకై కార్మికుడు మృతి
జిన్నారం (పటాన్చెరు): పరిశ్రమలో విధులు నిర్వహిస్తున్న ఓ కార్మికుడు మిథనాల్ గ్యాస్ లీక్ కావటంతో ఆ గ్యాస్‌ను పీల్చుకొని మృతి చెందాడు. ఈ సంఘటన జిన్నారం మండలంలోని బొల్లారం పారిశ్రామిక వాడలో బుధవారం జరిగింది. ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ అధికారులు, స్థానిక కార్మికుల కథనం ప్రకారం.. జనగాం గ్రామానికి చెందిన రాజిరెడ్డి (50) ఐదేళ్ల నుంచి బొల్లారంలోని ప్రభ ఆర్గా నిక్స్ పరిశ్రమలో కార్మికునిగా విధులు నిర్వహిస్తున్నాడు. పరిశ్రమలోని బీ–బ్లాక్‌లో విధులు నిర్వహిస్తున్న ఆయన రియాక్టర్‌లోకి మిథనాల్‌గ్యాస్ సరఫరా సరిగా లేకపోవటంతో చెక్ చేసేందుకు వెళ్లాడు. దీంతో ఒక్కసారిగా మిథనాల్ గ్యాస్ బయటకు వచ్చింది. ఆ గ్యాస్‌ను ఎక్కువగా పీల్చుకున్న రాజిరెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో పరిశ్రమల యాజమాన్యం ఎవరికీ తెలియకుండా మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించింది. అప్పటికే రాజిరెడ్డి మృతి చెందాడని వైద్యులు చెప్పారు. కుటుంబ సభ్యులు ఆసుపత్రికి చేరుకుని భోరున విలపించారు. సంఘటనా స్థలాన్ని ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ ధనలక్ష్మి సందర్శించారు. ఈ పరిశ్రమలపై చర్యలు తీసుకుంటామన్నారు. -
రాష్ట్రపతికి ఘనంగా వీడ్కోలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ హైదరాబాద్‌లో శీతాకాల విడిది ముగించుకుని శనివారం ఢిల్లీకి తిరిగివెళ్లారు. ప్రతి ఏటా శీతాకాలంలో రాష్ట్రపతి హైదరాబాద్‌లో కొన్ని రోజులపాటు బస చేయడం ఆనవాయితీ. డిసెంబర్ 22న నగరానికి చేరుకున్న ప్రణబ్ ముఖర్జీ 10 రోజులపాటు బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో బస చేశారు. పర్యటన ముగియడంతో శనివారం ఉదయం 11.20 గంటలకు హకీంపేట్ విమానాశ్రయం నుంచి ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన ప్రత్యేక విమానం ద్వారా ఢిల్లీకి బయలుదేరారు. గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు, కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, సీఎస్ ప్రదీప్ చంద్ర, రాష్ట్ర మంత్రులు, ఉన్నతాధికారులు విమానాశ్రయంలో రాష్ట్రపతికి ఘనంగా వీడ్కోలు పలికారు. -
22న హైదరాబాద్‌కు రాష్ట్రపతి
-
22న హైదరాబాద్‌కు రాష్ట్రపతి
31 వరకు బొల్లారంలో శీతాకాల విడిది సాక్షి, హైదరాబాద్: రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ దక్షిణాది రాష్ట్రాల శీతాకాల విడిదిలో భాగంగా ఈ నెల 22న హైదరాబాద్ రానున్నారు. 22 నుంచి 31 వరకు ఆయన సికింద్రాబాద్ బొల్లారంలో ఉన్న రాష్ట్రపతి నిలయంలో బస చేస్తారు. వారం రోజుల పాటు రాష్ట్రపతి ఇక్కణ్నుంచే కార్యకలాపాలు నిర్వహిస్తారు. దక్షిణాది రాష్ట్రాల పర్యటనలకు వెళ్లడంతో పాటు పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ సందర్భంగా ముందస్తు అనుమతితో వివిధ రంగాల ప్రముఖులు, రాజకీయ నేతలు రాష్ట్రపతిని కలుసుకుంటారు. రాష్ట్రపతి హైదరాబాద్ పర్యటన ఖరారైనట్లు ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ వర్గాలు రాష్ట్ర ప్రభుత్వానికి అధికారికంగా సమాచారం చేరవేశారుు. 22న సాయంత్రం 5.30కు ప్రత్యేక విమానంలో రాష్ట్రపతి ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు చేరుకుంటారు. 23న మధ్యాహ్నం హెచ్ఐసీసీలో ఫ్యాఫ్సీ అధ్యర్యంలో జరిగే సదస్సుకు హాజరవుతారు. 26న మౌలానా ఆజాద్ ఉర్దూ యూనివర్సిటీ స్నాతకోత్సవంలో పాల్గొంటారు. 27న రాజ్‌భవన్‌లో గవర్నర్ ఇచ్చే విందుకు హాజరవుతారు. 29న ఉదయం తిరువనంతపురంలో జరిగే ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్ సమావేశాలకు హాజరవుతారు. అదే రోజున మైసూరులో భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స జాతీయ సమ్మేళనంలో పాల్గొంటారు. అదేరోజు రాత్రి హైదరాబాద్‌కు తిరిగి వస్తారు. 30న రాష్ట్రపతి నిలయంలో ప్రభుత్వ ప్రతినిధులు, రాజకీయ ప్రముఖులు, వీఐపీలకు విందు ఏర్పాటు చేస్తారు. 31వ తేదీ మధ్యాహ్నం ఢిల్లీకి తిరుగు పయనమవుతారు. -
విద్యార్థిని అదృశ్యం
బొల్లారం పోలీసు స్టేషన్ పరిధిలో సోమవారం వంచహ చంద్రయన్(17) అదృశ్యమైనట్లు బొల్లారం ఎస్ఐ సతీష్‌కుమార్ తెలిపారు. బొల్లారంలోని త్రిశుల్ లెన్లో నుండి ఉదయం తల్లి ఊర్మిల పాండేను నాచారం ఢిల్లీ పబ్లిక్ స్కూల్ వద్ద వదిలి ఇంటికి వచ్చినట్లు తెలిపారు. తదనంతరం తల్లి కూతురుకు పోన్ చేయాగా స్వీచ్ ఆఫ్ రావడంతో వెంటనే ఇంటికి వచ్చి చూడగా తలుపులు తెరిచి ఉన్నాయని తెలిసిన వారి వద్ద వాకబు చేయాగా ఎక్కడ ఆచూకి లబించలేదని తెలిపారు. దీంతో వెంటనే బొల్లారం పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. తల్లి ఊర్మిల పాండే ఫిర్యాదు మెరకు కేసు నమోదు చేసుకోని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. విద్యార్థి తల్లి టిచర్ అని తండ్రి మిలటరిలో పనిచేస్తున్నారు. వంచహా ఈమద్యనే ఇంటర్ పరీక్షలు వ్రాసింది. -
హైదరాబాద్ లో అకాల వర్షం
హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో బుధవారం సాయంత్రం4 గంటల ప్రాంతంలో భారీ వర్షం కురిసింది. షామీర్పేట్, ఆల్వాల్, తిరుమల గిరి, బోల్లారం ప్రాంతాల్లో వరుణుడు తన ప్రతాపం చూపించాడు. అకాల వర్షానికి నగర ప్రజలు కొంత అసౌకర్యానికి గురయ్యారు. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. -
ఖాళీ జాగా.. వేసై పాగా
మండలంలోని బొల్లారం జిల్లాలోనే అతిపెద్ద మేజర్ పంచాయతీ. హైదరాబాద్‌కు కూతవేటు దూరంలో ఉండడం, దీనికి తోడు పారిశ్రామికంగా బొల్లారం అభివృద్ధి చెందుతుండడంతో భూముల ధరలు అమాంతం పెరిగిపోయాయి. ఎకరా స్థలం విలువ సుమారు రూ. 2 కోట్ల వరకు ఉంటుంది. బొల్లారం ప్రాంతంలో సుమారు వె య్యి ఎకరాల వరకు ప్రభుత్వ భూములుంటాయి. ఇందులో 172 ఎకరాల స్థలాన్ని నాలుగేళ్ల క్రితం అధికారులు హుడాకు కేటాయించారు. ఇలా హుడాకు కేటాయించిన స్థలంతో పాటు, బొల్లారం రెవెన్యూ పరిధిలో ఉన్న ప్రభుత్వ భూములపై కబ్జాదారుల కన్ను పడింది. అందులో భాగంగానే వైఎస్సార్ కాలనీలో పార్కు కోసం కేటాయించిన సుమారు నాలుగు ఎకరాల స్థలాన్ని కబ్జా చేసేందుకు నాయకులు సిద్ధపడ్డారు. స్థలం చుట్టుపక్కల ఇప్పటికే కొన్ని నిర్మాణాలు చేపట్టగా, మరికొంత కబ్జా చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. దీని విలువ సుమారు రూ. 10 కోట్ల వరకు ఉంటుంది. స్థానికంగా ఉన్న చెరువులను కూడా ఇక్కడి అధికార పార్టీ నేతలు కబ్జాలు చేసేందుకు యత్నిస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు చొరవ తీసుకుని ప్రభుత్వ భూమిని కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. -
బొల్లారం రాష్ట్రపతి నిలయం