
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్ బొల్లారం రైల్వేస్టేషన్‌లో విషాదం నెలకొంది. స్టేషన్ వద్ద రైలు పట్టాలు దాటుతున్న ఇద్దరిని రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతులను నాందేడ్‌కు చెందిన సీతమ్మ(50), చిన్నారి పంకజగా గుర్తించారు. మృతదేహాలను గాంధీ ఆస్పత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment