సెల్ ఫోనే ప్రాణం తీసింది | youth killed by train in hitech city railway station | Sakshi
Sakshi News home page

సెల్ ఫోనే ప్రాణం తీసింది

Published Sat, Jan 3 2015 9:22 AM | Last Updated on Wed, Sep 18 2019 3:26 PM

సెల్ ఫోనే ప్రాణం తీసింది - Sakshi

సెల్ ఫోనే ప్రాణం తీసింది

హైదరాబాద్: హైటెక్ సిటీ రైల్వే స్టేషన్లో శనివారం విషాదం చోటు చేసుకుంది. రైల్వేస్టేషన్లో ట్రాక్ దాటుతున్న యువకుడిని రైలు ఢీ కొట్టింది. ఆ ప్రమాదంలో సదరు యువకుడు అక్కడికక్కడే మరణించాడు. రైల్వేస్టేషన్లోని ప్రయాణికులు, సిబ్బంది వెంటనే రైల్వే పోలీసులకు సమాచారం అందించారు.

పోలీసులు మృతదేహన్ని స్వాధీనం చేసుకుని ... పోస్ట్మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడు సెల్ ఫోన్ మాట్లాడుతు రైల్వే ట్రాక్ దాటుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుందని ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి కుటుంబ సభ్యులకు పోలీసులు సమాచారం అందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement