గూడ్స్‌ను ఢీ కొన్న మైసూర్– దర్భంగా భాగమతి ఎక్స్‌ప్రెస్
రెండు బోగీల్లో మంటలు
సాక్షి, చెన్నై: చెన్నై వైపు వస్తున్న మైసూరు–దర్భంగా భాగమతి ఎక్స్‌ప్రెస్ తిరువళ్లూరు జిల్లా కవరపేట స్టేషన్ వద్ద శుక్రవారం రాత్రి 8.30 గంటల సమయంలో ఆగి ఉన్న గూడ్స్ రైలును ఢీ కొంది. ఈ ప్రమాదంలో రెండు బోగీలు పాక్షికంగా అగ్నికి ఆహుతయ్యాయి. మొత్తం 15 బోగీలు పట్టాలు తప్పాయి. రైలు వేగం తక్కువగా ఉండడంతో అదృష్టవశాత్తు ప్రాణనష్టం సంభవించలేదు. అయితే, ఐదుగురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. పలువురు స్వల్ప గాయాలతో బయట పడ్డారు.
కర్ణాటక రాష్ట్రం మైసూర్ నుంచి చెన్నై శివారులోని అరక్కోణం, పెరంబూరు, గుమ్మిడిపూండి మార్గం మీదుగా బిహార్ వైపు ప్రయాణించే దర్భంగా భాగమతి ఎక్స్‌ప్రెస్ శుక్రవారం ఉదయం 10.30 గంటలకు బయలుదేరింది. ఈ రైలు రాత్రి 8.30 గంటల సమయంలో పొన్నేరి రైల్వేస్టేషన్ దాటి గుమ్మడిపూండి సమీపంలోని కవరపేట వద్ద భారీ కుదుపులకు లోనై లూప్ లైన్‌లో ఆగి ఉన్న గూడ్స్‌ను ఢీకొంది. ప్రమాదం జరిగిన క్షణాలలో మంటలు వ్యాపించడంతో కలకలం రేగింది. మొత్తం 13 బోగీలు పట్టాలు తప్పడంతో ఒక్కసారిగా ప్రయాణికుల హాహాకారాలతో ఆ ప్రాంతం మార్మోగింది.
#TrainAccident 🚨
Visuals from the area where Mysuru - Darbhanga Train collided with a Goods train & derailed
More than 12 Coaches derailed & the condition is worst. Still there's "No Accountability" 😑 pic.twitter.com/UeeOGBGBOt— Veena Jain (@DrJain21) October 12, 2024
ప్రమాదం జరిగిన పరిసరాలు చిమ్మచీకటిగా ఉండడంతో రైలు ప్రయాణికులకు తీవ్ర ఆందోళనతో భీతావహులయ్యారు. ప్రమాద సమాచారంతో గుమ్మిడిపూండి ఎమ్మెల్యే గోవిందరాజ్ సంఘటనా స్థలానికి చేరుకుని అక్కడి ప్రజలతో సహాయక చర్యలు ముమ్మరం చేశారు. తిరువళ్లూరు కలెక్టర్ ప్రభుశంకర్,ఎస్పీ శ్రీనివాస పెరుమాల్, రైల్వే పోలీసు ఉన్నతాధికారి ఈశ్వరన్ నేతృత్వంలో బృందం సహాయక చర్యలకు పూనుకుంది. అప్పటికే గ్రామస్తులు రైలు బోగీలలో చిక్కుకున్న వారిని బయటకు తీశారు. అరక్కోణం నుంచి వచి్చన ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు మంటలు ఇతర బోగీలకు వ్యాపించకుండా కట్టడి చేశారు. ›ప్రమాదంలో ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి. వీరిని చెన్నైకు తరలించారు. మరికొందరు స్వల్పంగా గాయపడ్డారు.
Train accident in chennai Tamilnadu near ghumdipundi
Train no. 12578 please help us @AshwiniVaishnaw @PiyushGoyal @PMOIndia @AmitShah @GMSRailway pic.twitter.com/UqPCzaisIE— Rahul (@kumarsankarBJP) October 11, 2024
సిగ్నల్ సమస్యే కారణమా?
రైలు 109 కిలోమీటర్ల వేగంతో వెళుతూ భారీ కుదుపులకు లోనై లూప్ లైన్‌లోకి మళ్లింది. గార్డ్ సకాలంలో స్పందించి వేగాన్ని క్రమంగా 90 కి.మీ.కి తగ్గించారు. అప్పటికే ఆగి ఉన్న గూడ్స్‌ను ఢీకొంది. ఘటనలో 13 బోగీలు పట్టాలు తప్పాయి. ఏసీ బోగీలలో స్వల్పంగా మంటలు చెలరేగినా సకాలంలో ఆర్పి వేయడంతో ప్రమాదం తప్పినట్లైంది. ప్రమాదంలో ఎవ్వరికీ ప్రాణహాని కలగలేదని దక్షిణ రైల్వే ప్రకటించింది.
ఘటన కారణంగా ఆంధ్రప్రదేశ్ వైపు చెన్నై నుంచి వెళ్లాల్సిన పలు రైళ్లు మధ్యలోనే ఆగాయి. అలాగే, గుమ్మిడిపూండి మీదుగా చెన్నైకు రావాల్సిన రైళ్లు ఎక్కడికక్కడ ఆగడంతో ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు తప్పలేదు. దక్షిణ రైల్వే యంత్రాంగం 044 25354151, 2435499, అదేవిధంగా దక్షిణ మధ్య రైల్వే విజయవాడ హెల్ప్ లైన్ 0866–2571244 నంబర్‌ను ప్రకటించింది. తిరుచి్చ–హౌరా, ఎర్నాకులం–టాటా నగర్, కాకినాడ–దర్బంగా భాగమతి ప్రత్యేక రైలు సేవలను గూడురు మార్గంలో నిలుపుదల చేశారు. వీటిని ప్రత్యామ్నయ మార్గంలో నడిపేందుకు చర్యలు తీసుకున్నారు.
చదవండి: Trichy: ఎయిరిండియా విమానం.. సేఫ్ ల్యాండింగ్
Comments
Please login to add a commentAdd a comment