రాష్ట్రపతికి ఘనంగా వీడ్కోలు | grand farewell to the President | Sakshi
Sakshi News home page

రాష్ట్రపతికి ఘనంగా వీడ్కోలు

Published Sun, Jan 1 2017 2:41 AM | Last Updated on Tue, Sep 5 2017 12:03 AM

grand farewell to the President

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ హైదరాబాద్‌లో శీతాకాల విడిది ముగించుకుని శనివారం ఢిల్లీకి తిరిగివెళ్లారు. ప్రతి ఏటా శీతాకాలంలో రాష్ట్రపతి హైదరాబాద్‌లో కొన్ని రోజులపాటు బస చేయడం ఆనవాయితీ. డిసెంబర్‌ 22న నగరానికి చేరుకున్న ప్రణబ్‌ ముఖర్జీ 10 రోజులపాటు బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో బస చేశారు. పర్యటన ముగియడంతో శనివారం ఉదయం 11.20 గంటలకు హకీంపేట్‌ విమానాశ్రయం నుంచి ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన ప్రత్యేక విమానం ద్వారా  ఢిల్లీకి బయలుదేరారు. గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు, కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, సీఎస్‌ ప్రదీప్‌ చంద్ర, రాష్ట్ర మంత్రులు, ఉన్నతాధికారులు విమానాశ్రయంలో రాష్ట్రపతికి ఘనంగా వీడ్కోలు పలికారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement