Winter camping
-
రాష్ట్రపతికి ఘనంగా వీడ్కోలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ హైదరాబాద్‌లో శీతాకాల విడిది ముగించుకుని శనివారం ఢిల్లీకి తిరిగివెళ్లారు. ప్రతి ఏటా శీతాకాలంలో రాష్ట్రపతి హైదరాబాద్‌లో కొన్ని రోజులపాటు బస చేయడం ఆనవాయితీ. డిసెంబర్ 22న నగరానికి చేరుకున్న ప్రణబ్ ముఖర్జీ 10 రోజులపాటు బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో బస చేశారు. పర్యటన ముగియడంతో శనివారం ఉదయం 11.20 గంటలకు హకీంపేట్ విమానాశ్రయం నుంచి ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన ప్రత్యేక విమానం ద్వారా ఢిల్లీకి బయలుదేరారు. గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు, కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, సీఎస్ ప్రదీప్ చంద్ర, రాష్ట్ర మంత్రులు, ఉన్నతాధికారులు విమానాశ్రయంలో రాష్ట్రపతికి ఘనంగా వీడ్కోలు పలికారు. -
28న తిరుమలకు రానున్న రాష్ట్రపతి
సాక్షి, తిరుమల: రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ శ్రీవారి దర్శనానికి ఈనెల 28న తిరుమల రానున్నారు. శీతాకాల విడిదికి రాష్ట్రపతి గురువారమే హైదరాబాద్ చేరుకున్న విషయం తెలిసిందే. విడిదికి వచ్చిన సందర్భంలో శ్రీవారిని దర్శించుకోవటం సంప్రదాయంగా ఉంది. 28న ప్రత్యేక విమానంలో ప్రణబ్ హైదరాబాద్ నుంచి ఉదయం 11 గంటలకు తిరుపతి విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా తిరుచానూరులోని పద్మావతి అమ్మవారిని దర్శించుకుంటారు. తర్వాత తిరుమల పద్మావతి అతిథి గృహానికి చేరుకుని వరాహస్వామి వారిని, శ్రీవారిని దర్శించుకుంటారు. భోజనవిరామం అనంతరం హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం అవుతారు. -
22న హైదరాబాద్‌కు రాష్ట్రపతి
-
22న హైదరాబాద్‌కు రాష్ట్రపతి
31 వరకు బొల్లారంలో శీతాకాల విడిది సాక్షి, హైదరాబాద్: రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ దక్షిణాది రాష్ట్రాల శీతాకాల విడిదిలో భాగంగా ఈ నెల 22న హైదరాబాద్ రానున్నారు. 22 నుంచి 31 వరకు ఆయన సికింద్రాబాద్ బొల్లారంలో ఉన్న రాష్ట్రపతి నిలయంలో బస చేస్తారు. వారం రోజుల పాటు రాష్ట్రపతి ఇక్కణ్నుంచే కార్యకలాపాలు నిర్వహిస్తారు. దక్షిణాది రాష్ట్రాల పర్యటనలకు వెళ్లడంతో పాటు పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ సందర్భంగా ముందస్తు అనుమతితో వివిధ రంగాల ప్రముఖులు, రాజకీయ నేతలు రాష్ట్రపతిని కలుసుకుంటారు. రాష్ట్రపతి హైదరాబాద్ పర్యటన ఖరారైనట్లు ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ వర్గాలు రాష్ట్ర ప్రభుత్వానికి అధికారికంగా సమాచారం చేరవేశారుు. 22న సాయంత్రం 5.30కు ప్రత్యేక విమానంలో రాష్ట్రపతి ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు చేరుకుంటారు. 23న మధ్యాహ్నం హెచ్ఐసీసీలో ఫ్యాఫ్సీ అధ్యర్యంలో జరిగే సదస్సుకు హాజరవుతారు. 26న మౌలానా ఆజాద్ ఉర్దూ యూనివర్సిటీ స్నాతకోత్సవంలో పాల్గొంటారు. 27న రాజ్‌భవన్‌లో గవర్నర్ ఇచ్చే విందుకు హాజరవుతారు. 29న ఉదయం తిరువనంతపురంలో జరిగే ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్ సమావేశాలకు హాజరవుతారు. అదే రోజున మైసూరులో భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స జాతీయ సమ్మేళనంలో పాల్గొంటారు. అదేరోజు రాత్రి హైదరాబాద్‌కు తిరిగి వస్తారు. 30న రాష్ట్రపతి నిలయంలో ప్రభుత్వ ప్రతినిధులు, రాజకీయ ప్రముఖులు, వీఐపీలకు విందు ఏర్పాటు చేస్తారు. 31వ తేదీ మధ్యాహ్నం ఢిల్లీకి తిరుగు పయనమవుతారు. -
డిసెంబర్ 18న రాష్ట్రపతి నగరానికి రాక
-30 వరకు హైదరాబాద్‌లో విడిది సాక్షి, హైదరాబాద్ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ డిసెంబర్లో హైదరాబాద్ పర్యటనకు రానున్నారు. శీతాకాల విడిదిలో భాగంగా రాష్ట్రపతి హైదరాబాద్‌లో విడిది చేయటం ఆనవాయితీ. ఈ నేపథ్యంలో ఈ ఏడాది డిసెంబర్ 18 నుంచి 30 వరకు శీతాకాల విడిదికి రానున్నారు. ఈ సందర్భంగా ఆయన సికింద్రాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి భవన్లో బస చేస్తారు. ఇక్కడి నుంచే దక్షిణాది రాష్ట్రాల్లో వివిధ పర్యటనలకు హాజరవుతారు. రాష్ట్రపతి భవన్‌లోనే పలువురు ప్రముఖులను కలుసుకుంటారు. రాష్ట్రపతి పర్యటనకు సంబంధించి ముందస్తు సమాచారాన్ని, తేదీల వివరాలను ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ కార్యాలయం రాష్ట్ర ప్రభుత్వానికి పంపింది. -
వెల్కం సార్..
శీతాకాల విడిదిలో భాగంగా రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ శుక్రవారం హైదరాబాద్ చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో హకీంపేట్ విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు కలెక్టర్ రఘునందన్‌రావు కరచాలనం చేసి స్వాగతం పలికారు. - సాక్షి, రంగారెడ్డి జిల్లా -
రేపటి నుంచి శీతాకాలం విడిదిలో రాష్ట్రపతి
శుక్రవారం నుంచి 14 రోజుల పాటు రాష్ట్ర ప్రతి ప్రణబ్ ముఖర్జి తన శీతాకాల విడిదిలో బస చేయనున్నారు. ఏటా శీతాకాలంలో కొద్ది రోజుల పాటు.. హైదరాబాద్ లోని రాష్ట్ర పతి నిలయంలో రాష్ట్రపతి బస చేయడం ఆనవాయితీ అన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈనెల 18 తేదీ ఉదయం రాష్ట్ర పతి సికింద్రాబాద్ లోని రాష్ట్రపతి నిలయానికి రానున్నారు. డిసెంబర్ 22, 23 తేదీల్లో కర్ణాటక లో పర్యటిస్తారు. కర్ణాటక పర్యటనలో భాగంగా గుల్బర్గాలోని సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ కర్ణాటక రెండో స్నాతకోత్సవానికి హాజరుకానున్నారు. అదే రోజు నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్స్ భవనాన్ని ప్రారంభించిన జాతికి అంకితం ఇవ్వనున్నారు. మరుసటి రోజు బిషప్ కాటన్ బాలుర పాఠశాల 150వ వార్షికోత్సవానికి హాజరు కానున్నారు. తర్వాత స్టేట్ క్యాన్సర్ ఇనిస్టిట్యూట్ కి శంఖుస్థాపన చేయనున్నారు. 25న భీమవరంలో టీటీడీ ఏర్పాటు చేసిన వేద పాఠశాల ను ప్రారంభించనున్నారు. 27న ఇండియన్ ఎకనామిక్ అసోసియేషన్ వార్షిక సమావేశంలో ప్రసంగించనున్నారు. అదే రోజు తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు నిర్వహిస్తున్న ఆయత చండీ యాగంలో పాల్గొంటారు. 29న రాష్ట్రపతి గౌరవార్థం గవర్నర్ నరసింహన్ విందు ఇవ్వనున్నారు. కాగా రాష్ట్ర పతి పర్యటనలో చివరి రోజు.. డిసెంబర్ 30న రాష్ట్ర పతి సీనియర్ అధికారులు, రాష్ట్ర మంత్రులు, జర్నలిస్టులకు విందు ఇవ్వనున్నారు. కాగా.. ఇప్పటికే సికింద్రాబాద్ బొల్లారంలోని రాష్ట్ర పతి నిలయం.. ప్రణబ్ ముఖర్జి పర్యటన కోసం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. మిలటరీ అధికారులు, రాష్ట్ర ప్రభుత్వ అధికారుల సంయుక్త ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తైయ్యాయి. -
నేటితో ముగియనున్న శీతాకాల విడిది
-
నేటితో ముగియనున్న శీతాకాల విడిది
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ శీతాకాల విడిది మంగళవారం ముగియనుంది. ఈ సందర్భంగా రాష్ట్రపతి బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో సోమవారం ‘ఎట్ హోమ్’ తేనీటి విందు ఏర్పాటు చేశారు. రాష్ట్ర గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, శాసనమండలి చైర్మన్ చక్రపాణి, స్పీకర్ నాదెండ్ల మనోహర్, కేంద్ర మంత్రులు కావూరి సాంబశివరావు, దగ్గుబాటి పురందేశ్వరి, చిరంజీవి, పలువురు రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇరు ప్రాంతాల జేఏసీ నాయకులు హాజరయ్యారు. సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, త్రివిధ దళాల అధికారులు, వివిధ రంగాల ప్రముఖులు, మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు. జయప్రద రామ్మూర్తి బృందం వేణుగానం, యశోదా ఠాగూర్ కూచిపూడి నృత్యం ఆహూతులను ఆకట్టుకున్నాయి. శీతాకాల విడిది కోసం హైదరాబాద్‌లో గడిపిన దాదాపు రెండు వారాల కాలంలో ప్రణబ్ రాష్ట్ర విభజన, సమైక్య రాష్ట్రానికి సంబంధించిన వినతులను కుప్పలు తెప్పలుగా స్వీకరించారు. సమస్య తీవ్రతను, వైషమ్యాల్ని గ్రిహ ంచినందు వల్లనేమో.. ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి చాలావరకు ముభావంగానే గడిపారు. తన పక్క సీట్లో సతీ సమేతంగా కూర్చున్న గవర్నర్‌తో మాత్రమే ఒకట్రెండు మాటలు మాట్లాడారు. సీనియర్ జర్నలిస్టు కె.శ్రీనివాసరెడ్డి చొరవ తీసుకొని.. రాష్ట్రపతి హైదరాబాద్ విడిదికి వచ్చే ముందు ఢిల్లీలో వినూత్నంగా ప్రారంభించిన రాష్ట్రపతి భవన్ ‘ఇన్ రెసిడెన్సీ’ కార్యక్రమం బాగుందని అభినందించినప్పుడు కూడా ప్రణబ్ తన సహజ ధోరణిలో ముసిముసి నవ్వుతో థాంక్యూ అని మాత్రమే అంటూ ముందుకు సాగారు. దాదాపు ఇదే వైఖరి మిగతా అందరి పట్ల రాష్ట్రపతి కనబరిచారు. ప్రాంతాలవారీగా వేర్వేరు వరుసల్లో మంత్రులు: తేనీటి విందుకు హాజరైన రాష్ట్ర మంత్రులు సీమాంధ్ర, తెలంగాణ ప్రాంతాల వారీగా వేర్వేరు వరుసల్లో కూర్చున్నారు. సీమాంధ్ర మంత్రులు రెండో వరసలో, తెలంగాణ మంత్రులు మూడో వరుసలో కూర్చున్నారు. ఇది గమనించిన మంత్రి శ్రీధర్‌బాబు, ఎంపీ వివేక్‌లు మంత్రి జానారెడ్డిని బలవంతంగా రెండో వరుసలోకి తీసుకెళ్లి కన్నా లక్ష్మీనారాయణ పక్కన కూర్చోబెట్టారు. తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు మధుయాష్కీ, వివేక్, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, మంత్రులు జానారెడ్డి, శ్రీధర్‌బాబు, సుదర్శన్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, గీతారెడ్డి ఒక వరుసలో కూర్చోగా, సీమాంధ్ర మంత్రులు కన్నా, రఘువీరా, బాలరాజు, కొండ్రు మురళీమోహన్, వట్టి వసంత్‌కుమార్ మరో వరుసలో కూర్చున్నారు. రాష్ట్రపతి రావడానికి ముందుగానే ముఖ్యమంత్రితో పాటు కాంగ్రెస్ నేతలంతా చేరుకోవడంతో అక్కడ కాసేపు సందడి నెలకొంది. మంగళవారం ఉదయం 11 గంటల సమయంలో ప్రణబ్ రాష్ట్రపతి నిలయం నుంచి బయలుదేరి హకీంపేట్ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్ నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వె ళతారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇలావుండగా రాష్ట్రపతి నిలయూన్ని ప్రజలు సందర్శించేందుకు వీలుగా త్వరలో తేదీలు ఖరారు కానున్నట్లు సమాచారం. -
నీలం సంజీవరెడ్డి శత జయంతి ముగింపు వేడుకల్లో పాల్గొన్న రాష్ట్రపతి
సాక్షి ప్రతినిధి, అనంతపురం : సాయుధ బలగాల పహారా.. సమైక్యవాదుల నిర్బంధం.. అధికారుల హడావుడి నడుమ భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మూడున్నర గంటల జిల్లా పర్యటన సాగింది. శీతాకాల విడిది కోసం ఇటీవల హైదరాబాద్‌కు చేరుకున్న ప్రణబ్ ముఖర్జీ సోమవారం అనంతపురంలో నిర్వహించిన మాజీ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి శత జయంతి ముగింపు ఉత్సవాల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం పుట్టపర్తి ప్రశాంతి నిలయంలోని సత్యసాయి బాబా మహా సమాధిని దర్శించుకుని.. హైదరాబాద్‌కు బయలుదేరి వెళ్లారు. రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ జిల్లాకు చేరుకోక మునుపే అనంతపురంలో సమైక్యవాదులు, వైఎస్సార్సీపీ నేతలు, విద్యార్థి, ప్రజాసంఘాల నేతలను పోలీసులు అరెస్టు చేశారు. అనంతపురం ఆర్ట్స్ కాలేజీ, ఎస్కేయూ విద్యార్థులను హాస్టళ్ల నుంచి బయటకు రానివ్వకుండా నిర్బంధించారు. వివరాల్లోకి వెళితే.. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్, సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి తదితరులు హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో సోమవారం ఉదయం 10.35 గంటలకు బయలుదేరి 11.30 గంటలకు పుట్టపర్తిలోని సత్యసాయి విమానాశ్రయానికి చేరుకున్నారు. జాయింట్ కలెక్టర్ సత్యనారాయణ, ఎంపీ నిమ్మల కిష్టప్ప, ఎమ్మెల్యే పల్లె రఘునాథరెడ్డి తదితరులు రాష్ట్రపతికి స్వాగతం పలికారు. పుట్టపర్తి విమానాశ్రయం నుంచి 11.40 గంటలకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఒక హెలికాప్టర్లో, గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్, సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి మరో హెలికాప్టర్లో, రాష్ట్రపతి భద్రత, వ్యక్తిగత సిబ్బంది మూడో హెలికాప్టర్లో బయలుదేరి మధ్యాహ్నం 12.16 గంటలకు అనంతపురంలోని ఎన్‌హెచ్-44కు సమీపంలోని ‘సాక్షి’ దినపత్రిక కార్యాలయం ఎదురుగా ఏర్పాటు చేసిన హెలీప్యాడ్‌కు చేరుకున్నారు. రెవెన్యూ మంత్రి ఎన్.రఘువీరారెడ్డి, ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి, కలెక్టర్ డీఎస్ లోకేష్‌కుమార్ తదితరులు రాష్ట్రపతికి స్వాగతం పలికారు. అక్కడి నుంచి ఎన్‌హెచ్-44, నీలం సంజీవరెడ్డి నివాసం మీదుగా పోలీసు శిక్షణ కేంద్రంలోని స్టేడియానికి 12.35 గంటలకు చేరుకున్నారు. నీలం సంజీవరెడ్డి శత జయంతి ముగింపు వేడుకల సభ వేదికపైకి రాష్ట్రపతి చేరుకున్న అనంతరం జాతీయగీతాలాపన చేశారు. అనంతరం ప్రాథమిక విద్యాశాఖ మంత్రి సాకే శైలజానాథ్ ప్రారంభోపన్యాసం చేశారు. తెలుగుజాతి ఐక్యత కోసం నీలం సంజీవరెడ్డి పాటుపడ్డారని.. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని రాష్ట్రపతిని కోరారు. అనంతరం నీలం సంజీవరెడ్డి తోడల్లుడు జస్టిస్ ఎం.రంగారెడ్డి, నిరుపమాన త్యాగధనుడు పుస్తక రచయిత్రి డాక్టర్ కేవీ కృష్ణకుమారి, నీలం వ్యక్తిగత వైద్యుడు డాక్టర్ వై.రామసుబ్బయ్య, నీలం నివాస సంరక్షకుడు శివారెడ్డిని రాష్ట్రపతి ప్రణబ్ సన్మానించారు. అనంతరం ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ నీలం సంజీవరెడ్డిపై ప్రశంసల వర్షం కురిపించారు. సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి తన ప్రసంగంలో ఎక్కడా సమైక్యాంధ్ర ప్రదేశ్ అన్న మాటను కూడా ఉచ్చరించకపోవడం చర్చనీయాంశంగా మారింది. అనంతరం కేవీ కృష్ణకుమారి రచించిన ‘నిరుపమాన త్యాగధనుడు నీలం’, ఎస్కేయూ రూపొందించిన ‘ఏ హిస్టారికల్ స్టడీ అండ్ అస్సెస్మెంట్’ పుస్తకాలను గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ఆవిష్కరించి.. తొలి ప్రతులను రాష్ట్రపతికి అందజేశారు. నీలం సంజీవరెడ్డి జీవితంపై నిర్వహించిన రాత, వకృ్తత్వ పోటీల్లో ప్రథమ స్థానంలో నిలిచిన ఎనిమిది మంది విద్యార్థులకు ప్రశంసాపత్రాలను రాష్ట్రపతి అందజేశారు. అనంతరం గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ మాజీ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డిని తెలుగు వజ్రం అంటూ కొనియాడుతూ అచ్చ తెలుగులో ప్రసంగించి.. అబ్బురపరిచారు. సరిగ్గా 1.17 గంటలకు రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ ప్రసంగాన్ని ప్రారంభించారు. చిత్తశుద్ధి కలిగిన రాజకీయ నేతగా.. పరిపాలనాదక్షుడిగా.. అత్యుత్తమ పార్లమెంటేరియన్‌గా నీలం సంజీవరెడ్డి రోల్‌మోడల్‌గా నిలిచారని ఆయన సేవలను కొనియాడారు. రాష్ట్రపతి 1.42 గంటలకు తన ప్రసంగాన్ని ముగించారు. రాష్ట్రపతి ఇంగ్లీష్‌లో ప్రసంగించగా.. మంత్రి రఘువీరారెడ్డి తెలుగులోకి అనువదించారు. ఎంపీ అనంత వెంకటరామిరెడ్డి ముగింపు ఉపన్యాసం చేస్తూ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని రాష్ట్రపతి ప్రణబ్‌ను కోరారు. అనంతరం జాతీయ గీతాలాపన చేసి.. సభను ముగించారు. సభాస్థలి నుంచి హెలిప్యాడ్‌కు చేరుకున్న రాష్ట్రపతి, గవర్నర్, సీఎం ప్రత్యేక హెలికాప్టర్లలో 2.07 గంటలకు పుట్టపర్తికి బయలుదేరి వెళ్లారు. పుట్టపర్తి విమానాశ్రయానికి 2.35 గంటలకు చేరుకున్న రాష్ట్రపతి, గవర్నర్, సీఎంలు నేరుగా ప్రశాంతి నిలయానికి చేరుకుని సత్యసాయి బాబా మహాసమాధిని దర్శించుకున్నారు. రాష్ట్రపతి ప్రణబ్‌కు సత్యసాయి ట్రస్ట్ ప్రతినిధులు బాబా చిత్రపటాన్ని అందజేసి, సన్మానించారు. తర్వాత సత్యసాయి విమానాశ్రయానికి చేరుకుని ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు బయలుదేరి వెళ్లారు. హైదరాబాద్‌కు వెళ్లే సమయంలో ప్రత్యేక విమానంలోనే రాష్ట్రపతి ప్రణబ్ ఆలస్యంగా భోజనం చేశారు.