జిన్నారం (పటాన్‌చెరు): పరిశ్రమలో విధులు నిర్వహిస్తున్న ఓ కార్మికుడు మిథనాల్ గ్యాస్ లీక్ కావటంతో ఆ గ్యాస్‌ను పీల్చుకొని మృతి చెందాడు. ఈ సంఘటన జిన్నారం మండలంలోని బొల్లారం పారిశ్రామిక వాడలో బుధవారం జరిగింది. ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ అధికారులు, స్థానిక కార్మికుల కథనం ప్రకారం.. జనగాం గ్రామానికి చెందిన రాజిరెడ్డి (50) ఐదేళ్ల నుంచి బొల్లారంలోని ప్రభ ఆర్గా నిక్స్ పరిశ్రమలో కార్మికునిగా విధులు నిర్వహిస్తున్నాడు. పరిశ్రమలోని బీ–బ్లాక్‌లో విధులు నిర్వహిస్తున్న ఆయన రియాక్టర్‌లోకి మిథనాల్‌గ్యాస్ సరఫరా సరిగా లేకపోవటంతో చెక్ చేసేందుకు వెళ్లాడు. దీంతో ఒక్కసారిగా మిథనాల్ గ్యాస్ బయటకు వచ్చింది.
ఆ గ్యాస్‌ను ఎక్కువగా పీల్చుకున్న రాజిరెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో పరిశ్రమల యాజమాన్యం ఎవరికీ తెలియకుండా మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించింది. అప్పటికే రాజిరెడ్డి మృతి చెందాడని వైద్యులు చెప్పారు. కుటుంబ సభ్యులు ఆసుపత్రికి చేరుకుని భోరున విలపించారు. సంఘటనా స్థలాన్ని ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ ధనలక్ష్మి సందర్శించారు. ఈ పరిశ్రమలపై చర్యలు తీసుకుంటామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment