సికింద్రాబాద్ బొల్లారంలో గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో వేసవి శిబిరాన్ని ప్రారంభించారు సంఘం అధ్యక్షుడు పూస యోగేశ్వర్. విద్యార్థులందరికీ వేసవికాలం సెలవులు ఉంటాయని, వాటిని సద్వినియోగం చేసుకుంటే.. వచ్చే విద్ఆయ సంవత్సరం వారికి ఎంతో ప్రయోజనకరంగా మారుతుందన్నారు.
వేసవి శిబిరంలో విద్యార్థులకు శిక్షణ ఇచ్చేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇటీవలే ఎన్నికైన కార్యవర్గం ఆధ్వర్యంలో ఈ శిబిరం ఏర్పాటు చేశారు. పిల్లలకు భరతనాట్యం, కర్ణాటక సంగీతం, సంస్కృత శ్లోకాలు, జానపద నృత్యకళల్లో శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేశారు. దీనికి సంబంధించి ఆయా రంగాల్లో అనుభవజ్ఞులను, గురువులను నియమించుకున్నారు.
ఇవ్వాళ్టి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ ప్రియాంకను ఆహ్వనించగా.. వేసవి శిబిరాన్ని ఆమె జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. సమ్మర్ క్యాంపులో పాల్గొనే విద్యార్థులను ఉద్దేశించి గంగపుత్ర సంఘం అధ్యక్షుడు పూస యోగేశ్వరు మాట్లాడారు. క్రీడలు, వ్యాయామం, యోగను నిత్య జీవితంలో భాగస్వామ్యం చేసుకోవాలని సూచించారు. సమ్మర్ క్యాంపులో నేర్చుకున్న అంశాలు ఎప్పటికీ గుర్తుండిపోయేలా శ్రద్ధ పెట్టాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment