హుస్నాబాద్ రాజకీయ చరిత్ర ఏంటీ?
హుస్నాబాద్ నియోజకవర్గం భిన్నమైన భౌగోళిక, రాజకీయ స్వరూపం కలిగింది ఉంది. గతంలో కమలాపురం కాస్తా.. ఇప్పుడు హుస్నాబాద్ అయింది.
2018లో టిఆర్‌ఎస్ అభ్యర్ధి ఒడితెల సతీష్ కుమార్ మరోసారి గెలిచారు. ఆయన తన సమీప సిపిఐ ప్రత్యర్ది చాడ వెంకటరెడ్డి పై 70157 ఓట్ల ఆదిక్యతతో గెలుపొందారు. కాంగ్రెస్, టిడిపి, సిపిఐ, తెలంగాణ జనసమితిలతో ఏర్పడిన మహా కూటమిలో భాగంగా సిపిఐ ఇక్కడ పోటీచేసింది. ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి పోటీచేసినా ఫలితం దక్కలేదు సతీష్ కుమార్‌కు 116388 ఓట్లు తెచ్చుకోగా, చాడా వెంకటరెడ్డికి 46181 ఓట్లు లభించాయి. సతీష్ కుమార్ బ్రాహ్మణ సామాజికవర్గానికి చెందిన వారు. కాగా సతీష్ తండ్రి కెప్టెన్ లక్ష్మీకాంతరావు కూడా గతంలో రెండుసార్లు అసెంబ్లీకి గెలిచారు. తదుపరి రాజ్యసభ సభ్యునిగా పదవి పొందారు. హుస్నాబాద్‌లో 2014లో సిటింగ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రవీణ్ రెడ్డిని ఒడితెల సతీష్ బాబు ఓడిరచారు. 2014లో సతీష్ బాబు హుస్నాబాద్ లో 34269 ఓట్ల ఆధిక్యతతో గెలపొందారు.
గతంలో కమలాపురం నియోజకవర్గం ఉండేది. అది రద్దయింది. కొత్తగా ఏర్పడిన హుస్నాబాద్, రద్దయిన కమలాపురంలలో కలిపి రెడ్లు పదిసార్లు గెలిస్తే, రెండుసార్లు బిసి నేతలు, రెండుసార్లు బ్రాహ్మణ నేత విజయం సాధించారు. సతీష్ తండ్రి లక్ష్మీకాంతరావు హుజూరాబాద్ నుంచి రెండుసార్లు గెలిచారు. ఒకసారి సాధారణ ఎన్నికలలోను, మరోసారి ఉపఎన్నికలో గెలు పొందారు. కొంత కాలం ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి క్యాబినెట్‌లో మంత్రిగా ఉన్నారు. ఈయన సోదరుడు ఒడితెల రాజేశ్వరరావు ఒకసారి శాసనసభ్యుడిగా, మరోసారి రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. హుజూరాబాద్‌లో రెండుసార్లు గెలిచి చంద్రబాబు క్యాబినెట్‌లో మంత్రిగా పనిచేసిన ఇ. పెద్దిరెడ్డి కూడా హుస్నాబాద్‌లో 2009లో ప్రజారాజ్యంపక్షాన పోటీచేసి ఓడిపోయారు.
1957లో ఏర్పడి 2009 వరకు వున్న ఇందుర్తి శాసనసభ నియోజకవర్గానికి మొత్తం 11సార్లు ఎన్నికలు జరిగితే పిడిఎఫ్ ఒకసారి, కాంగ్రెస్, కాంగ్రెస్ (ఐ)లు కలిసి నాలుగుసార్లు గెలుపొందగా, సిపిఐ ఆరు సార్లు విజయం సాదించింది. ఒకసారి పిడిఎఫ్ గెలిచింది.
సిపిఐ నాయకుడు దేశిని చిన మల్లయ్య మొత్తం నాలుగుసార్లు ఇక్కడ విజయం సాధించారు. 2001లో ఆయన పార్టీని వదలి వెళ్ళిపోయారు. మరో సిపిఐ నేత బద్దం ఎల్లారెడ్డి ఇక్కడ ఒకసారి బుగ్గారంలో మరోసారి గెలిచారు. కాంగ్రెస్ నేత బొప్పరాజు లక్ష్మీకాంతరావు ఇందుర్తిలో మూడుసార్లు గెలిచారు. టిడిపి ఒక్కసారి కూడా ప్రాతినిధ్యం వహించలేదు.
రద్దయిన కమలాపురం నియోజకవర్గం నుంచి టిడిపి నేత ముద్దసాని దామోదరరెడ్డి నాలుగుసార్లు గెలిచారు. ఆయన ఎన్.టి.ఆర్, చంద్రబాబు క్యాబినెట్‌లలో పనిచేశారు. 2009లో హుస్నాబాద్‌లో పోటీ చేసి ఓడిపోయారు. తిరిగి 2010లో ఉప ఎన్నికలో పోటీచేసి పరాజయం చెందారు. టిఆర్‌ఎస్ నేత ఈటెల రాజేందర్ కమలాపురంలో రెండుసార్లు, హుజూరాబాద్‌లో ఐదుసార్లు గెలిచారు. గతంలో ఇక్కడ ప్రాతినిధ్యం వహించిన కె.వి. నారాయణరెడ్డి అప్పట్లో కాసు మంత్రి వర్గంలో పనిచేశారు.
హుస్నాబాద్ నియోజకవర్గంలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే..
Comments
Please login to add a commentAdd a comment