Siddipet Assembly Constituency
-
సిద్దిపేట: తిరుగులేని తన్నీరు హరీష్‌రావు
తెలంగాణలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సిద్దిపేట ఒకటి. ఉమ్మడి మెదక్ జిల్లాలోనే సిద్దిపేట అసెంబ్లీకి ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు(KCR), మంత్రి తన్నీరు హరీష్ రావు ఆరు సార్లు వరుసగా విజయాలు సాధించిన ఘనత ఇక్కడ ఉంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లోనూ సిద్ధిపేట ఎమ్మెల్యేగా బీఆర్ఎస్కు చెందిన హరీష్ రావు గెలుపొందారు. కాంగ్రెస్ అభ్యర్థి తాడూరి శ్రీనివాస్ గౌడ్‌పై 80వేల ఓట్ల మెజార్టీతో హరీష్ రావు గెలిచారు. కులాల వారిగా ఓటర్లు శాతం ► ఎస్సీలు : 38.23 % ► ఎస్టీలు : 9.14 % ► బీసీలు : 41.94 % ► ఇతరులు : 10.69 % అభ్యర్థుల బలాలు, బలహీనతలు: 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో హరీష్ రావు తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్‌కి చెందిన తాడూరి శ్రీనివాస్ గౌడ్‌పై 80,000 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఆయనకు 1,17,091 ఓట్లు రాగా, గౌడ్‌కు 36,280 ఓట్లు వచ్చాయి. హరీశ్‌రావు సిద్దిపేటలో ప్రజాభిమానం కలిగిన నాయకుడు, నియోజకవర్గ అభివృద్ధిలో తనవంతు కృషిచేశారనే పేరు ఉంది. సిద్దిపేట సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, సిద్దిపేట విమానాశ్రయం, సిద్దిపేట పారిశ్రామిక పార్కుతో పాటు అనేక అభివృద్ధి కార్యక్రమాలను ఈ ప్రాంతానికి తీసుకురావడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రిగానూ, టీఆర్ఎస్ వర్కింగ్ కమిటీ సభ్యుడు కూడా ఆయన వ్యవహరిస్తున్నారు. -
సిద్దిపేట నియోజకవర్గంలో గెలుపు ఎవరిది?
సిద్దిపేట నియోజకవర్గం టిఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు మరోసారి సిద్దిపేటలో ఘన విజయం సాదించారు. ఆయన మూడు ఉప ఎన్నికలు, మూడు సాదారణ ఎన్నికలలో గెలిచారు. మూడు ఉప ఎన్నికలలో గెలవడం ఒక రికార్డు. గతంలో కాంగ్రెస్ హయాంలో వైఎస్ రాజశేఖరరడ్డి క్యాబినెట్లో ఒక ఏడాది పాటు మంత్రిగా ఉన్నారు. 2014లో తెలంగాణ ఏర్పడి టిఆర్ఎస్ అదికారంలోకి వచ్చాక కెసిఆర్ క్యాబినెట్లో మంత్రి అయ్యారు. కాని 2018లో గెలిచిన వెంటనే మంత్రి కాలేకపోయారు. కొన్ని నెలల తర్వాత మంత్రి పదవి చేపట్టగలిగారు. 2018లో హరీష్‌రావుకు సిద్దిపేటలో 118699 ఓట్ల రికార్డు మెజార్టీ వచ్చింది. ఆయన తన సమీప ప్రత్యర్ది, కాంగ్రెస్ ఐ నేత శ్రీనివాసరెడ్డిపై విజయం సాదించారు. హరీష్ రావుకు 131295 ఓట్లు రాగా శ్రీనివాసరెడ్డికి కేవలం 12596 ఓట్లు మాత్రమే వచ్చి డిపాజిట్ గల్లంతు అయింది. కాగా ఇక్కడ బిజెపి పక్షాన పోటీచేసిన నాయిని నరోత్తం రెడ్డికి నాలుగువేల పైచిలుకు ఓట్లు మాత్రమే వచ్చాయి. హరీష్‌రావు ముఖ్యమంత్రి కెసిఆర్‌కు స్వయానా మేనల్లుడు. వెలమ సామాజికవర్గానికి చెందినవారు. 1985 నుంచి 2004 వరకు ఈ నియోజకవర్గానికి కెసిఆర్ ప్రాతినిద్యం వహించగా, ఆ తర్వాత హరీష్ రావు ఇక్కడ నుంచి గెలుస్తున్నారు. వీరిద్దరూ కలిసి ఇంతవరకు పన్నెండుసార్లు ఇక్కడ గెలిచినట్లు లెక్క. కాగా, ఇక్కడ ఆరుసార్లు గెలిచిన కెసిఆర్ గజ్వేల్ నుంచి రెండుసార్లు గెలిచి తెలంగాణలోనే అత్యదికంగా ఎనిమిది సార్లు గెలిచిన నేతగా నమోదయ్యారు. కాగా కెసిఆర్ నాయకత్వంతో హరీష్‌రావు తెలంగాణ ఉద్యమంలో ముఖ్య భూమిక పోషించారు. టిఆర్ఎస్ నేతలు ఈటెల రాజేందర్, కొప్పుల ఈశ్వర్‌లతో పాటు హరీష్‌రావు కూడా రెండుమార్లు తెలంగాణ సాదనలో భాగంగా తమ ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి, ఉప ఎన్నికలలో విజయం సాధించారు. రెండువేల నాలుగులో పార్టీ అదినేత కెసిఆర్ లోక్ సభకు కూడా ఎన్నికై సిద్దిపేట సీటుకు రాజీనామా చేశారు. దరిమిలా జరిగిన ఉప ఎన్నిక ద్వారా హరీష్ రావు శాసనసభలోకి ప్రవేశించారు. అప్పటి నుంచి తిరుగులేని ఆదిక్యతతో గెలుస్తున్నారు. సిద్దిపేట నియోజకవర్గంలో 15 సార్లు వెలమ సామాజికవర్గం నేతలు గెలుపొందారు. నాలుగుసార్లు బిసి మున్నూరు కాపు నేతలు, ఒకసారి రెడ్డి, మరోసారి బ్రాహ్మణ వర్గం నేత విజయం సాధించారు. కెసిఆర్‌కు ముందు మరో తెలంగాణ వాద నేత మదన్మోహన్ కూడా సిద్ధిపేట శాసనసభ నియోజకవర్గం నుంచి నాలుగుసార్లు గెలిచారు. 1970లో జరిగిన ఉప ఎన్నికలో మదన్మోహన్ తెలంగాణ ప్రజాసమితి పక్షాన ఇండి పెండెంటుగా పోటీచేసి గెలిచారు. ఆ తరువాత ఆయన కాంగ్రెస్‌లో కలిసిపోయారు. మదన్మోహన్ అప్పట్లో పి.వి.నరసింహారావు, చెన్నారెడ్డి, అంజయ్య, భవనం, కోట్ల క్యాబినెట్లలో మంత్రిగా పని చేసారు. 1967లో ఇక్కడ గెలిచిన వి.బి.రాజు 1952లో సికింద్రాబాద్, 1957లో అసిఫ్‌నగర్ నుంచి ఎన్నికయ్యారు. కెసిఆర్ శాసనసభలో అత్యధిక సార్లు గెలిచిన నేతగా రికార్డు సృష్టించడమే కాకుండా, 2004 నుంచి2009 వరకు కరీంనగర్ లోక్‌సభ స్థానం నుంచి మూడుసార్లు గెలిచిన ఘనత కెసిఆర్‌కి దక్కింది. ఆ తర్వాత మహబూబ్ నగర్లో ఒకసారి, మెదక్‌లో మరోసారి మొత్తం ఐదుసార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఒకే టరమ్‌లో రెండుసార్లు రాజీనామా చేసి గెలిచిన రికార్డు కూడా కేసిఆర్ సొంతం. కెసిఆర్ కుమారుడు తారకరామారావు కరీంనగర్ జిల్లా సిరిసిల్ల నుంచి గెలుపొంది ఆయన క్యాబినెట్లో మంత్రి కాగా, కెసిఆర్ కుమార్తె కవిత నిజామాబాద్ నుంచి 2014లో ఎమ్.పి అయ్యారు. ఒక కుటుంబం నుంచి ముగ్గురు పదవులలో ఉన్న ఘనత వీరికి దక్కింది.అయితే 2019 లోక్ సభ ఎన్నికలలో కవిత ఓటమి చెందడం విశేషం. ఆ తర్వాత కవిత శాసనమండలి సభ్యురాలు అయ్యారు. సిద్దిపేట నియోజకవర్గంలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే.. -
హుస్నాబాద్ నియోజకవర్గ రాజకీయ చరిత్ర ఏంటీ?
హుస్నాబాద్ రాజకీయ చరిత్ర ఏంటీ? హుస్నాబాద్ నియోజకవర్గం భిన్నమైన భౌగోళిక, రాజకీయ స్వరూపం కలిగింది ఉంది. గతంలో కమలాపురం కాస్తా.. ఇప్పుడు హుస్నాబాద్ అయింది. 2018లో టిఆర్ఎస్ అభ్యర్ధి ఒడితెల సతీష్ కుమార్ మరోసారి గెలిచారు. ఆయన తన సమీప సిపిఐ ప్రత్యర్ది చాడ వెంకటరెడ్డి పై 70157 ఓట్ల ఆదిక్యతతో గెలుపొందారు. కాంగ్రెస్, టిడిపి, సిపిఐ, తెలంగాణ జనసమితిలతో ఏర్పడిన మహా కూటమిలో భాగంగా సిపిఐ ఇక్కడ పోటీచేసింది. ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి పోటీచేసినా ఫలితం దక్కలేదు సతీష్ కుమార్‌కు 116388 ఓట్లు తెచ్చుకోగా, చాడా వెంకటరెడ్డికి 46181 ఓట్లు లభించాయి. సతీష్ కుమార్ బ్రాహ్మణ సామాజికవర్గానికి చెందిన వారు. కాగా సతీష్ తండ్రి కెప్టెన్ లక్ష్మీకాంతరావు కూడా గతంలో రెండుసార్లు అసెంబ్లీకి గెలిచారు. తదుపరి రాజ్యసభ సభ్యునిగా పదవి పొందారు. హుస్నాబాద్‌లో 2014లో సిటింగ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రవీణ్ రెడ్డిని ఒడితెల సతీష్ బాబు ఓడిరచారు. 2014లో సతీష్ బాబు హుస్నాబాద్ లో 34269 ఓట్ల ఆధిక్యతతో గెలపొందారు. గతంలో కమలాపురం నియోజకవర్గం ఉండేది. అది రద్దయింది. కొత్తగా ఏర్పడిన హుస్నాబాద్, రద్దయిన కమలాపురంలలో కలిపి రెడ్లు పదిసార్లు గెలిస్తే, రెండుసార్లు బిసి నేతలు, రెండుసార్లు బ్రాహ్మణ నేత విజయం సాధించారు. సతీష్ తండ్రి లక్ష్మీకాంతరావు హుజూరాబాద్ నుంచి రెండుసార్లు గెలిచారు. ఒకసారి సాధారణ ఎన్నికలలోను, మరోసారి ఉపఎన్నికలో గెలు పొందారు. కొంత కాలం ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి క్యాబినెట్లో మంత్రిగా ఉన్నారు. ఈయన సోదరుడు ఒడితెల రాజేశ్వరరావు ఒకసారి శాసనసభ్యుడిగా, మరోసారి రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. హుజూరాబాద్‌లో రెండుసార్లు గెలిచి చంద్రబాబు క్యాబినెట్లో మంత్రిగా పనిచేసిన ఇ. పెద్దిరెడ్డి కూడా హుస్నాబాద్‌లో 2009లో ప్రజారాజ్యంపక్షాన పోటీచేసి ఓడిపోయారు. 1957లో ఏర్పడి 2009 వరకు వున్న ఇందుర్తి శాసనసభ నియోజకవర్గానికి మొత్తం 11సార్లు ఎన్నికలు జరిగితే పిడిఎఫ్ ఒకసారి, కాంగ్రెస్, కాంగ్రెస్ (ఐ)లు కలిసి నాలుగుసార్లు గెలుపొందగా, సిపిఐ ఆరు సార్లు విజయం సాదించింది. ఒకసారి పిడిఎఫ్ గెలిచింది. సిపిఐ నాయకుడు దేశిని చిన మల్లయ్య మొత్తం నాలుగుసార్లు ఇక్కడ విజయం సాధించారు. 2001లో ఆయన పార్టీని వదలి వెళ్ళిపోయారు. మరో సిపిఐ నేత బద్దం ఎల్లారెడ్డి ఇక్కడ ఒకసారి బుగ్గారంలో మరోసారి గెలిచారు. కాంగ్రెస్ నేత బొప్పరాజు లక్ష్మీకాంతరావు ఇందుర్తిలో మూడుసార్లు గెలిచారు. టిడిపి ఒక్కసారి కూడా ప్రాతినిధ్యం వహించలేదు. రద్దయిన కమలాపురం నియోజకవర్గం నుంచి టిడిపి నేత ముద్దసాని దామోదరరెడ్డి నాలుగుసార్లు గెలిచారు. ఆయన ఎన్.టి.ఆర్, చంద్రబాబు క్యాబినెట్లలో పనిచేశారు. 2009లో హుస్నాబాద్‌లో పోటీ చేసి ఓడిపోయారు. తిరిగి 2010లో ఉప ఎన్నికలో పోటీచేసి పరాజయం చెందారు. టిఆర్ఎస్ నేత ఈటెల రాజేందర్ కమలాపురంలో రెండుసార్లు, హుజూరాబాద్‌లో ఐదుసార్లు గెలిచారు. గతంలో ఇక్కడ ప్రాతినిధ్యం వహించిన కె.వి. నారాయణరెడ్డి అప్పట్లో కాసు మంత్రి వర్గంలో పనిచేశారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే..