తెలంగాణలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సిద్దిపేట ఒకటి. ఉమ్మడి మెదక్ జిల్లాలోనే సిద్దిపేట అసెంబ్లీకి ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు(KCR), మంత్రి తన్నీరు హరీష్ రావు ఆరు సార్లు వరుసగా విజయాలు సాధించిన ఘనత ఇక్కడ ఉంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లోనూ సిద్ధిపేట ఎమ్మెల్యేగా బీఆర్‌ఎస్‌కు చెందిన హరీష్ రావు గెలుపొందారు. కాంగ్రెస్ అభ్యర్థి తాడూరి శ్రీనివాస్ గౌడ్‌పై 80వేల ఓట్ల మెజార్టీతో హరీష్ రావు గెలిచారు.
కులాల వారిగా ఓటర్లు శాతం
► ఎస్సీలు : 38.23 %
► ఎస్టీలు : 9.14 %
► బీసీలు : 41.94 %
► ఇతరులు : 10.69 %
అభ్యర్థుల బలాలు, బలహీనతలు:
- 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో హరీష్ రావు తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్‌కి చెందిన తాడూరి శ్రీనివాస్ గౌడ్‌పై 80,000 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఆయనకు 1,17,091 ఓట్లు రాగా, గౌడ్‌కు 36,280 ఓట్లు వచ్చాయి.
- హరీశ్‌రావు సిద్దిపేటలో ప్రజాభిమానం కలిగిన నాయకుడు, నియోజకవర్గ అభివృద్ధిలో తనవంతు కృషిచేశారనే పేరు ఉంది.
- సిద్దిపేట సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, సిద్దిపేట విమానాశ్రయం, సిద్దిపేట పారిశ్రామిక పార్కుతో పాటు అనేక అభివృద్ధి కార్యక్రమాలను ఈ ప్రాంతానికి తీసుకురావడంలో ఆయన కీలక పాత్ర పోషించారు.
- తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రిగానూ, టీఆర్‌ఎస్ వర్కింగ్ కమిటీ సభ్యుడు కూడా ఆయన వ్యవహరిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment