Medak Assembly Constituency
-
బీఆర్ఎస్పై బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ఘాటు వ్యాఖ్యలు
నరకాసురుడు చనిపోతే దీపావళి జర్పుకున్నట్టు నేడు మెదక్‌లో బీజేపీ గెలిస్తే అంత సంబరాలు జరుపుకున్నారని మెదక్ బీజేపీ ఎంపీ రఘు నందన్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ అన్నీ వర్గాల ప్రజల్ని ప్రజలను అణిచి వేయాలని చూసింది. ఫలితంగా పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవలేకపోయిందన్నారు. తన గెలుపును మల్లన్న సాగర్‌లో తన చితి తానే పెర్చుకొని మరణించిన రైతు మల్లారెడ్డికి అంకితం చేస్తున్నట్లు తెలిపారు.దుబ్బాకలో రఘునందన్ రావుకి ప్రోటోకాల్ లేకుండా చేద్దామని అనుకున్నారు కానీ నేడు సిద్దిపేటలో కూడా ప్రోటోకాల్ వచ్చింది. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత మొదటిసారి మెదక్ గడ్డపై కాషాయ జెండా ఎగిరిందన్న రఘనందన్ .. నా గెలుపు కోసం బీఆర్ఎస్ నాయకులు పరోక్షంగా ప్రచారం చేశారని అన్నారు. నరకాసురుడు చనిపోతే దీపావళి జరుపుకున్నట్లు నేడు మెదక్‌లో బీజేపీ గెలిస్తే అంత సంబరాలు జరుపుకున్నారుబీఆర్ఎస్ నేత వెంకట్ రాంరెడ్డి 30రోజులలో గజ్వేల్ ప్రాంత క్షిరా సాగర్ రైతులకు వారి భూములను తిరిగి ఇవ్వకపోతే ఎక్కడి వరకు అయినా పోరాటం చేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి, నిజాయితీ ఉంటే వెంకట్ రాంరెడ్డి స్వాధీనం చేసుకున్న గజ్వేల్ భూములపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై అవినీతి జరిగిందన్న రేవంత్ రెడ్డి దానిపై చర్యలు ఏవి అని ప్రశ్నించారు. -
మెదక్ మొనగాడెవరు
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో అందరి దృష్టి మెదక్ పార్లమెంట్ స్థానంపైనే ఉంది. తొలి మహిళా ప్రధాని ఇందిరాగాం«దీ, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు వంటి కాకలుతీరిన నేతలు ప్రాతినిధ్యం వహించిన ఈ స్థానంలో విజయం ఎవరిని వరిస్తుందనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మూడు ప్రధాన పార్టీలు గట్టి అభ్యర్థులను బరిలో దింపగా, వారు నువ్వానేనా అన్నట్టు పోటీ పడుతున్నారు.ప్రత్యర్థి పార్టీల నుంచి చేరికలు..విమర్శలు.. ప్రతివిమర్శలతో మెదక్ పార్లమెంట్ స్థానంలో రాజకీయం వేడెక్కింది. ఉమ్మడి జిల్లాలో గులాబీ పార్టీ బలంగా ఉండటంతో కాంగ్రెస్ పార్టీకి గట్టి పోటీ ఎదురవుతోంది. మొత్తం మీద ఈ స్థానంలో త్రిముఖ పోరు కొనసాగుతోందనే అభిప్రాయం రాజకీయవర్గాల్లో నెలకొంది. ఈ నియోజకవర్గానికి ఇప్పటివరకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ తొమ్మిదిసార్లు, బీఆర్ఎస్ ఐదు పర్యాయాలు (ఉప ఎన్నికతో కలిపి) గెలిచాయి. బీజేపీ, టీడీపీ, పీడీఎఫ్, టీపీఎస్ ఒక్కోసారి విజయం సాధించాయి.పట్టు నిలుపుకునేందుకు గులాబీ 2004 నుంచి రెండు దశాబ్దాలుగా ఈ పార్లమెంట్ స్థానం బీఆర్ఎస్కు కంచుకోటగా ఉంది. ఈసారి కూడా ఎలాగైనా పట్టు నిలుపుకునేందుకు గులాబీ పార్టీ అన్ని ప్రయత్నాలు చేస్తోంది. మాజీ కలెక్టర్, ఎమ్మెల్సీ పి.వెంకట్రాంరెడ్డిని బీఆర్ఎస్ బరిలోకి దింపింది. గెలుపు బాధ్యత మాజీ మంత్రి హరీశ్‌రావు తన భుజాలపై వేసుకొని నియోజకవర్గాన్ని చుట్టేస్తున్నారు. ఈ ఎంపీ సెగ్మెంట్ పరిధిలో ఉన్న ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆరుచోట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే ఉండగా, ఒక్క మెదక్ అసెంబ్లీ స్థానంలో మాత్రమే కాంగ్రెస్ గెలుపొందింది. ఈ ఫలితాలను పునరావృతం చేసేందుకు బీఆర్ఎస్ ఎత్తుకు పైఎత్తులు వేస్తోంది. పాగా వేసేందుకు బీజేపీ యత్నం.. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఈ సెగ్మెంట్ పరిధిలో ఉన్న ఒకేఒక దుబ్బాక సీటును కోల్పోయి.. ఘెర పరాజయం పాలైన కమలం పార్టీ ఈ ఎన్నికల్లో ఎలాగైనా ఇక్కడ పాగా వేయాలని ప్రయతి్నస్తోంది. ప్రధాని మోదీకి ప్రజల్లో ఉన్న చరిష్మాతో ఈ ఎన్నికల్లో ముందుకెళుతోంది. బీజేపీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే ఎం.రఘునందన్‌రావును బరిలో దింపింది. పార్టీకి బలమైన కేడర్ ఉన్నా, అసెంబ్లీ నియోజకవర్గాల్లో నాయకత్వ సమస్యను ఎదుర్కొంటోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఈ పార్టీ తరపున పోటీ చేసిన నందీశ్వర్‌గౌడ్ వంటి నాయకులు ఈ ఎన్నికల్లో అంటీ ముట్టనట్టుగా ఉంటున్నారు. సంగారెడ్డి నుంచి పోటీ చేసిన పులిమామిడి రాజు పార్టీని వీడారు. సత్తా చాటేందుకు హస్తం యత్నం రాష్ట్రంలో అధికారంలోకి వచి్చన ఉత్సాహంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మెదక్ స్థానంలో సత్తా చాటేందుకు సై అంటోంది. వరుస చేరికలతో ఊపు మీదున్న హస్తం పార్టీ దూకుడుగా ముందుకెళుతోంది. మాజీ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి తదితర నాయకులను పార్టీలో చేర్చుకుంది. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థిగా నీలంమధు ముదిరాజ్‌ను ఎంపిక చేసింది. ప్రత్యర్థి పార్టీల నుంచి ఇద్దరు అగ్రవర్ణాల అభ్యర్థులు పోటీ చేస్తుండగా., కాంగ్రెస్ వ్యూహాత్మకంగా బీసీ సామాజికవర్గానికి చెందిన నాయకుడిని ఎంపిక చేసింది. దివంగత ప్రధాని ఇందిరాగాంధీ ప్రాతినిధ్యం వహించిన ఈ స్థానాన్ని ఎలాగైనా తన ఖాతాలో వేసుకునేందుకు కాంగ్రెస్ శతవిధాలా ప్రయతి్నస్తోంది.ప్రభావితం చేసే అంశాలు ► మల్లన్నసాగర్, కొండపోచమ్మ జలాశయాల భూనిర్వాసితుల ఓట్లు ఈ ఎన్నికల్లో కీలకం కానున్నాయి. సర్వం కోల్పోయిన నిర్వాసితులకు పరిహార పంపిణీ, పునరావాస కల్పన అంశాలు ఈ ఎన్నికల్లో చర్చనీయాంశంగా మారాయి. ఐదు వేల వరకు నిర్వాసిత కుటుంబాలున్నాయి. ► బీహెచ్ఈఎల్, బీడీఎల్, ఆర్డినె న్స్ ఫ్యాక్టరీ వంటి కేంద్ర ప్రభు త్వరంగ సంస్థల్లో సుమారు 20 వేలమంది ఉద్యోగులున్నారు. వారితోపా టు కుటుంబసభ్యుల ఓట్లూ ఈ ఎన్నికల్లో ప్రభావితం చూపనున్నాయి. ► యూపీ, బిహార్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలకు చెందిన వేలాది మంది కారి్మకులు పటాన్చెరు, పాశమైలారం, ఖాజీపల్లి వంటి పారిశ్రామిక వాడల్లో పనిచేస్తున్నారు. చాలామంది ఇక్కడే స్థిరపడిపోయారు. వీరి ఓట్లు అభ్యర్థుల గెలుపోటములను ప్రభావితం చేసే అవకాశాలున్నాయి. ► మెదక్ ఎన్డీఎస్ఎల్ చక్కెర కర్మాగారాన్ని తెరిపించాలనే డిమాండ్ చాలా ఏళ్లుగా ఉంది. చెరకు రైతుల సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నారు. -
పటాన్చెరు: అన్ని పార్టీల్లో వర్గపోరు!
ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉన్న పది నియోజకవర్గాల్లో పటాన్ చెరు ఒకటి. వైవిధ్యమైన ప్రాంతంగా దీనికి పేరు ఉంది. ఇండియాలోని అన్ని ప్రాంతాల వారికి ప్రాతినిధ్యం కల్పించే ప్రాంతంగా ఉన్న ఇక్కడ బీఆర్ఎస్ రెండు సార్లు గెలిచింది. మరోవైపు ఈసారి ఎలాగైన సీటు దక్కించుకునేందుకు ప్రతిపక్షాలు గట్టి ప్రయత్నాలు చేస్తున్నాయి. దాంతో పటాన్చేరులోని రాజకీయాలు ఆసక్తిగా మారాయి. నువ్వా-నేనా అన్నట్టు సొంత పార్టీ అభ్యర్ధులే పోటీ పడుతున్నారు. ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా టికెటు తనకే అంటూ ఎవరికి వారు ప్రచారం చేసుకుంటున్నారు. మూడు పార్టీల్లోనూ వర్గపోరు! మూడు పార్టీల్లో వర్గ పోరు నడుస్తోంది. ఈసారి పటాన్చేరు ఎన్నికలు వాడివేడిగా కొనసాగేలా ఉన్నాయి. అధికార పార్టీ బీఆర్ఎస్లో సైతం వర్గపోరు గట్టిగానే నడిచింది. కానీ అధిష్టానంలో తన మాట ప్రకారం ఈసారి సిట్టింగ్‌లకే టికెట్ కెటాయించింది. దాంతో పటాన్‌చేరులో అధికార పార్టీ బీఆర్ఎస్ నుంచి మరోసారి మహిపాల్ రెడ్డి పోటీ చేయబోతున్నారు. ఇక కాంగ్రెస్‌లో కూడా ఇద్దరు పోటీపడుతున్నారు. మెదక్ పార్లమెంట్ ఇంచార్జీగా ఉన్న గాలి అనిల్ కుమార్, పటాన్ చెరు అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జీగా ఉన్న కాట శ్రీనివాస్ గౌడ్ మధ్య వర్గపోరు నడుస్తోంది. టికెట్ తనకంటే తనకే అంటూ పోటీ పడుతూ మరి ప్రచారం చేసుకుంటున్నారు. ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు కనిపిస్తున్నాయి. దాంతో అధిష్టానం ఎవరివైపు మొగ్గు చూపుతుందనేది ఆసక్తిని సంతరించుకుంది. బీజేపీ నుంచి నందీశ్వర్, గోదావరి అంజిరెడ్డి పోటీలో ఉన్నారు. టికెట్ విషయంలో తగ్గేదే లే అన్నట్టుగా నేతలు పోటీ పడుతున్నారు. పార్టీల్లో నెలకొన్ని వర్గపోరు అధిష్టానాలకు తలనొప్పిగా మారేలా ఉంది. టికెట్ల వ్యవహారంతో అసమ్మతి నెలకొనే అవకాశం ఉందని భయపడుతున్నారు. నియోజకవర్గంలోని ఆసక్తికర అంశాలు : 29 రాష్ట్రాల ప్రజలు ఇక్కడ ఉండడం వివిధ మతాల సాంప్రదాయాలు సంస్కృతులు నిలయం. రాజకీయానికి అంశాలు : పారిశ్రామిక వాడ కాబట్టి ఒక గ్రామ వార్డు సభ్యులు కావాలంటే అన్ని లక్షల్లో ఖర్చు పెట్టాల్సి వస్తుంది, రాజకీయం చేయడం అంటే డబ్బులతో కూడిన వ్యవహారం ఈ విషయంలోనె కొంతమంది రాజకీయ నాయకులు వెనుకడుగు వేస్తున్నారు. ఎన్నికలను ప్రభావితం చేసే కీలక అంశాలు : పారిశ్రామిక రంగం, రియల్ ఎస్టేట్ రంగం.హైదరాబాద్ పట్టణానికి కూత వేటు దూరం కాబట్టి విద్య, ఉపాధి అవకాశాలు మెరుగ్గా ఉండడంతో 29 రాష్ట్రాల ప్రజలు ఇక్కడ నివసిస్తూ ఉంటారు. వివిధ రకాల సంస్కృతులు సాంప్రదాయాలు, కూడుకోని ఉంటాయి. ప్రధాన పార్టీల టికెట్ల కోసం పోటీ పడుతున్నవారు : బీఆర్ఎస్ : ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ : కాట శ్రీనివాస్ గౌడ్, గాలి అనిల్ కుమార్ (పిసిసి వైస్ ప్రెసిడెంట్) బిజెపి: మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ మాజీ జెడ్పిటిసి గడిల శ్రీకాంత్ గౌడ్ అమీన్పూర్ కౌన్సిలర్ ఎడ్ల రమేష్ పారిశ్రామికవేత్త అంజిరెడ్డి. -
సంగారెడ్డి: బీఆర్ఎస్లో అయోమయ పరిస్థితి!
మెదక్ జిల్లాలోని 10 శాసనసభ స్థానాలలో సంగారెడ్డి శాసనసభ నియోజకవర్గం ఒకటి. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఉమ్మడి మెదక్ జిల్లాలో అత్యంత ఆసక్తిని రేపే నియోజకవర్గం ఇది. ఇక్కడి ప్రజాతీర్పు భిన్నంగా ఉంటుంది. ఇప్పటి వరకు 14 సార్లు ఎన్నికలు జరిగితే.. ఆరు సార్లు కాంగ్రెస్, నాలుగుసార్లు ఇండిపెండెంట్లు గెలిచారు. ఇక.. బీఆర్ఎస్ రెండు సార్లు, బీజేపీ, టీడీపీ ఒక్కోసారి అధికారంలోకి వచ్చాయి. మళ్లీ కాంగ్రెస్ పట్టు సాధించేనా? కాంగ్రెస్‌లో స్ట్రాంగ్ లీడర్‌గా ఉన్న తూర్పు జయప్రకాశ్ రెడ్డి(అలియాస్ జగ్గారెడ్డి) 3 సార్లు ఎమ్మెల్యేగా గెలవడం విశేషం. తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేకుండ తన సొంత క్యాడర్‌తో దూసుకుపోయాడు. 2004లో ఆయన తొలిసారి బీఆర్ఎస్ అభ్యర్థిగా విజయం పొందారు. ఆ తర్వాత 2009, 2018లో మాత్రం కాంగ్రెస్ తరఫున గెలిచారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే ముందు వరకు కాంగ్రెస్ సంగారెడ్డి అడ్డాగా ఉండేది. కానీ 2014 ఎన్నికల తర్వాత సీన్ మొత్తం మారింది. అక్కడ గులాబీ జెండ ఎగరింది. దాంతో సంగారెడ్డిలో కాంగ్రెస్ వీక్ అయ్యి బీఆర్ఎస్ బలపడినట్లు అనిపించింది. కానీ గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి జగ్గారెడ్డి గెలుపొందడంతో సంగారెడ్డిపై మళ్లీ హస్తం పట్టు సాధించింది. ఇక తాజా పరిణామాలు ప్రకారం.. ఇప్పుడు జగ్గారెడ్డి బీఆర్ఎస్లో చేరే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తుండటంతో రాబోయే సంగారెడ్డి అసెంబ్లీ ఎన్నికలు ఆసక్తిగా మారాయి. ఎప్పుడు ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో తెలిక సంగారెడ్డిలో ఉత్కంఠత నెలకొంది. నియోజకవర్గంలోని ఆసక్తికర అంశాలు : మహబూబ్ చెరువు, మంజీర డ్యామ్ రాజకీయానికి అంశాలు బీఆర్ఎస్లో అయోమయం కార్ ఓవర్ లోడ్ అధిక పోటీలో బిఆర్ఎస్ నాయకులు MLA జగ్గారెడ్డి బిఆర్ఎస్లోఇక వెళ్ళే సూచనలు ఎన్నికలను ప్రభావితం చేసే కీలక అంశాలు: రియల్ వ్యాపారం హైదరాబాద్‌కి దగ్గర ఉన్నా నియోజక వర్గంలో మౌలిక వసతుల విషయంలో పెద్దగా అభివృద్ధి లేకపోవడం రాజకీయ పార్టీల వారీగా ప్రధాన పార్టీల టికెట్ల ఆశిస్తున్నవారు బీఆర్ఎస్ చింతా ప్రభాకర్ (మాజీ ఎమ్మెల్యే) కాంగ్రెస్ జగ్గారెడ్డి బిజేపి రాజేశ్వర్ రావు దేశ్ పాండే (బిజేపి నియోజక వర్గ ఇంచార్జ్) శివరాజ్ పాటిల్ నియోజకవర్గంలో భౌగోళిక పరిస్థితులు : నదులు : మంజీర నది ఆలయాలు : వైకుంట పురం ఆలయం / ఇస్మాయిల్ ఖాన్ పేట భవానీ మాత ఆలయం -
జహీరాబాద్: కాంగ్రెస్ కంచుకోటలో విచిత్ర పరిస్థితి
ఉమ్మడి మెదక్ జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గం జహీరాబాద్. ప్రస్తుతం ఇది సంగారెడ్డి జిల్లా పరిధిలోకి వస్తోంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ముందు వరకు ఇది కాంగ్రెస్ కంచుకోటగా ఉండేది. సీనియర్ మహిళ నేత గీతారెడ్డి ఇక్కడి నుంచే ప్రాతినిధ్యం వహించారు. ఇక రాష్ట్ర ఏర్పాటు తర్వాత జరిగిన 2014 ఎన్నికల్లోనూ గీతారెడ్డి గెలిచారు. కానీ ముందస్తు ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ ఓటమిపాలైంది. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి మాణిక్ రావ్ గెలుపుపొందారు. బీఆర్ఎస్కి భారీ వలసలు.. నేతల మధ్య కుమ్ములాట! 2014 ఎన్నికల తర్వాత నియోజకవర్గంలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. కాంగ్రెస్ నేతలు వరసగా బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈ క్రమంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ ఘనవిజయం సాధించింది. త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు రాబోతుండటంతో.. అధికార బీఆర్ఎస్ టికెట్ కోసం ప్రధానంగా నలుగురు నేతలు పోటీ ఉన్నప్పటికి ఈసారి సిట్టింగ్ ఎమ్మెల్యేనే టికెట్ వరించింది. గీతారెడ్డి సైలెంట్ వెనక వ్యూహాం? మరోవైపు కంచుకోట కాంగ్రెస్‌లో విచిత్ర పరిస్థితులు నెలకొన్నాయి. కాంగ్రెస్ నుంచి వరసగా బీఆర్ఎస్లోకి వలసలు పెరుగుతున్న సీనియర్ నేత గీతా రెడ్డి పట్టనట్టు వ్యవహరిస్తున్నారట. అంతేకాదు ఈమె పార్టీని కూడా పెద్ద పట్టించుకోవడం లేదని సొంత పార్టీలోనే వాదనలు వినిపిస్తున్నాయి. రీసెంట్గా నరోత్తం లాంటి సీనియర్ నేతే పార్టీ వీడిన ఆమె సైలెంట్‌గానే ఉన్నారు. భారీగా వలసలు పెరుగుతున్న ఆమె సైలెంట్‌గా ఉండటంపై మిగతా లీడర్లు సర్ప్రైజ్ అవుతున్నారు. ఆమె తీరు పార్టీ నేతలకు కూడా అంతుపట్టడం లేదు. గీతారెడ్డి సైలెంట్ వెనుక ఏదైనా వ్యూహం ఉందా? కావాలనే ఇలా ఉంటున్నారా? అనే సందేహాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో ఆమె జహీరాబాద్ నుండి కాకుండా కంటోన్మెంట్ నుండి పోటీ చేయాలని చూస్తుందనే వార్త తెరపైకి వచ్చింది. అందుకే గీతారెడ్డి ఇక్కడ దృష్టి సారించడం లేదనే ఈ ప్రచారం తెరమీదకు వచ్చింది. దాంతో పక్క జిల్లాలు, పక్క నియోజకవర్గ నేతలు జహీరాబాద్ నియోజకవర్గంపై దృష్టి సారిస్తున్నారట. జహీరాబాద్ నియోజకవర్గ పరిధిలో కాంగ్రెస్ పార్టీకి ఫుల్ క్యాడర్ ఉన్న వారిని పట్టించుకునే లీడర్ లేకపోవడం అనేది విచిత్ర పరిస్థితే అని చెప్పాలి. ఎన్నికలను ప్రభావితం చేసే అత్యంత కీలక అంశాలు: నిరుద్యోగ సమస్య యువతకు ఉపాధి NIMZ రైతుల సమస్య చెరుకు రైతుల సమస్య రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు డిమాండ్. మంజూరైన ఐ టి ఐ కళాశాల, మహిళా డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేయాలని ప్రధాన డిమాండ్. ప్రధాన పార్టీల టికెట్ల కోసం పోటీ పడుతున్న అభ్యర్థులు బీఆర్ఎస్: కే మానిక్ రావు (సిట్టింగ్ ఎమ్మెల్యే) కాంగ్రెస్ పార్టీ: మాజీ మంత్రి జే గీతారెడ్డికే టికెట్ ఖాయమని భావిస్తున్నా, స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు బి నరేష్, కండేమ్ నర్సింహులు, మాజీ సర్పంచ్ గోపాల్‌ల పేర్లు వినిపిస్తున్నాయి. బీజేపీ రాంచంద్ర రాజనర్సింహ, చింతల గట్టు సుధీర్ కుమార్ లు టికెట్ రేస్ లో ఉన్నారు. వృత్తిపరంగా ఓటర్లు.. నియోజకవర్గంలో ప్రధానంగా వ్యవసాయ రంగంలో, వ్యాపార రంగంలో ప్రజలు అధికంగా ఆధార పడి ఉన్నారు. వ్యాపార పరంగా ఉమ్మడి మెదక్ జిల్లాలో జహీరాబాద్ రెండో స్థానంలో ఉంది. మతం/కులం పరంగా ఓటర్లు? ఓటర్ల పరంగా చూస్తే 35 శాతం ఉన్న ముస్లింలు రాజకీయంగా నిర్ణయాత్మక శక్తిగా ఉన్నారు కులాల పరంగా SC- మాదిగ, లింగాయత్‌లు గణనీయ సంఖ్యలో ఉన్నారు. నియోజకవర్గంలో భౌగోళిక పరిస్థితులు నదులు : నియోజకవర్గంలో నారింజ వాగు, పెద్ద వాగు, వీరన్న వాగు లు ఉన్నాయి. ఆలయాలు: దక్షిణ కాశీగా పేరు గాంచిన జరాసంగం మండల కేంద్రంలోని శ్రీ కేతకి సంగమేశ్వర స్వామి ఆలయం, స్వయంభూగా వెలిసిన రేజీంతల్ శ్రీ సిద్ధి వినాయక స్వామి ఆలయం. నియోజకవర్గం గురించి ఆసక్తికర అంశాలు : ఇప్పటి వరకు ఎన్నికలు 15 సార్లు జరగగా వాటిలో ఏకంగా 13 సార్లు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుపొందారు. కేవలం రెండు సార్లు మాత్రమే నాన్ కాంగ్రెసు పక్షమైన టిడిపి, టి ఆర్ ఎస్ లు చెరో సారి గెలుపొందాయీ. 7 సార్లు వరుసగా కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందిన ఎమ్. బాగా రెడ్డి ఇక్కడి నుండే ప్రాతినిద్యం వహించారు. రాజకీయాకపరమైన అంశాలు : కాంగ్రెసేతర పక్షాలు పెద్ద మెజారిటీ తో గెలుపొంది నా అనంతరం జరిగిన ఎన్నికల్లో ఆ పట్టును నిలుపుకో లేదు. కాంగ్రెసు పార్టీ కి వ్యతిరేకంగా నిలబడ్డ రాజకీయ పక్షాలలో ఐక్యత లేకపోవడం, కాంగ్రెసు పార్టీ తన పట్టును కొనసాగించడానికి ముఖ్య కారణం. -
అందోల్‌లో వేడెక్కుతున్న రాజకీయం.. వ్యూహాలు ఫలించేనా?
తెలంగాణ ఏర్పడిన తరువాత జరిగిన 2014 మొదటి సార్వత్రిక ఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్థిగా మాజీ మంత్రి బాబుమోహన్ కాంగ్రెస్ అభ్యర్థి అప్పటి ఉమ్మడి ఆంద్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహపై విజయం సాధించడం జరిగింది. 2018 ఎన్నికల్లో టిఆర్ఎస్ ఆభ్యర్థిగా జర్నలిస్ట్ నాయకుడు మలిదశ ఉద్యమకారుడు చంటి క్రాంతి కిరణ్ కాంగ్రెస్ అభ్యర్ధి దామోదర రాజనర్సింహపై విజయం సాధించారు. ఈ నియోజకవర్గానికి ఓ ప్రత్యేకత ఉంది. ఇక్కడ ఏ పార్టీ అభ్యర్థి అయితే విజయం సాధిస్తారో అదే పార్టీ ప్రభుత్వం చేపడుతోంది. వేడెక్కుతున్న రాజకీయం.. అధికార పార్టీలో పోటీలు! రోజు రోజుకు అందోల్‌లో రాజకీయం వేడెక్కింది. పోటీలో ఉండే నాయకులు టికెట్ల కోసం వారి, వారి ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఈ సారి ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి సీనియర్ నాయకుడు, మాజీ డిప్యూటి సిఎం దామోదర్ రాజనర్సింహ పేరు ఖరారు అయినట్టు తెలుస్తుంది. ఇక బీజేపీ నుంచి గత ఎన్నికల్లో మాజీ మంత్రి బాబూమోహన్ బరిలో నిలిచారు. ఈ సారి ఆయనకే టికెట్ ఇచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కమలంలో కూడా టికెట్ కోసం పోటీ పడుతున్నారు. ఇక అధికార పార్టీలో ఈసారి సిట్టింగ్‌లకే టికెటు దక్కడంతో మరోసారి అందోల్ నుంచి క్రాంతి కిరణ్ పోటీకి సై అంటున్నారు. ఎన్నికలను ప్రభావితం చేసే కీలక అంశాలు : నిరుద్యోగ సమస్య గ్రామీణ రోడ్ల సమస్య రైతులు పండించిన పంటలకు మద్దత్తు ధర లేకపోవడం పీజీ కళాశాలలో మౌళిక వసతుల లేమి మున్సిపల్‌కు సొంత భవనం లేకపోవడం రాజకీయ పార్టీల ప్రధాన పార్టీల టికెట్ల కోసం పోటీ పడుతున్న అభ్యర్థులు: బీఆర్ఎస్ చంటి క్రాంతి కిరణ్ (సిట్టింగ్ ఎమ్మెల్యే) కాంగ్రెస్ పార్టీ మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ బీజేపీ మాజీ మంత్రి పల్లి బాబుమోహన్ జిల్లా మాజీ జెడ్పి చైర్మన్ బాలయ్య టికెట్ రేసులో ఉన్నారు. వృత్తి పరంగా ఓటర్లు: నియోజకవర్గంలో ప్రధానంగా ఎక్కువ మంది ప్రజలు రైతాంగంపైనే ఆధారపడి ఉన్నారు. కొంత శాతం మంది వ్యాపారంపై ఆధారపడి ఉన్నారు. వ్యాపార పరంగా ఉమ్మడి మెదక్ జిల్లాలో జోగిపేట మున్సిపాలిటీ ముందంజలో ఉంది. నియోజకవర్గంలో భౌగోళిక పరిస్థితులు నదులు: మంజీరా అత్యంత కీలకమైనది. మంజీరా నదిపై సింగూరు జలాశయం 30 టీఎంసీల కెపాసిటీతో నిర్మించిన ప్రాజెక్టు జంట నగరాల దాహార్తి తిరుస్తూ సంగారెడ్డి మెదక్ జిల్లాల రైతులకు సాగునీటి అవసరాలు తిరుస్తుంది. ఒక్క అందోలు నియోజకవర్గంలో ఎడమ కాలువ ద్వారా 40 వేల ఎకరాలకు సాగునీరు అందించడం జరుగుతుంది. సింగూరు పర్యాటక కేంద్రంగా విరజిల్లుతుంది. ఆలయాలు: ఉత్తర తెలంగాణ తిరుమల తిరుపతి దేవస్థానంగా పేరుగాంచిన అందోలు మండలంలోని కిచ్చన్నపల్లిలో దేవాలయం కలదు. అల్లాదుర్గం మండల కేంద్రంలో రేణుక ఎల్లమ్మ దేవాలయం అదే విధంగా అక్కడే బేతాళ స్వామి ఆలయం అత్యంత ప్రతిష్ట గాంచినవి. నియోజకవర్గంలోని ఆసక్తికర అంశాలు : ఇప్పటి వరకు అందోలు నియోజకవర్గంలో 15 సార్లు ఎన్నికలు జరగగా మొదటి సారి జరిగిన ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థి జోగిపేటకు చెందిన బసవ మామయ్య విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీ ఎనిమిది సార్లు విజయం సాధించగా టీడీపీ నాలుగు సార్లు విజయం సాధించింది. తెలంగాణ రాష్టం ఏర్పడ్డాక బీఆర్ఎస్ రెండు సార్లు విజయం సాధించింది. రాజకీయానికి సంబంధించి ఇతర అంశాలు : 1957 లో మొదటిసారిగా ఏర్పడిన అందోలు నియోజకవర్గం మొదటి రెండు పర్యయాలు జనరల్ స్థానంగా ఉండి 1967 లో ఎస్సి రీజర్వు స్థానంగా ఏర్పడింది. 1957 లో జోగిపేటకు చెందిన ప్రముఖ స్వతంత్ర సమర యోధుడు బసవ మనయ్య కాంగ్రెస్ అభ్యర్ధి రూక్ ఎండి.రూక్ మోద్దీన్ పై విజయం సాధించడం జరిగింది. 1962 లో లక్షిదేవి గారు కాంగ్రెస్ పార్టీ తరుపున స్వతంత్ర అభ్యర్థి బసవ మణయ్య పై విజయం సాధించారు. 1967 లో ఎస్సి రిజర్వుడ్ గా ఏర్పడిన తరువాత సిరారపు రాజనర్సింహ కాంగ్రెస్ పార్టీ తరుపున స్వతంత్ర అభ్యర్థి ఈశ్వరప్ప పై విజయం సాధించారు. 1972 లో రాజనర్సింహ కాంగ్రెస్ అభ్యర్థిగా స్వతంత్ర అభ్యర్థి లక్మన్ కుమార్ పై విజయం సాధించారు. 1978 లో మరో మారు రాజనర్సింహ ఎమ్మెల్యేగా విజయం సాధించారు 1983 లో టిడిపి తరుపున ఆల్ దేకర్ లక్మన్ జి ఈశ్వరి భాయ్ పై విజయం సాధించడం జరిగింది 1985 లో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరుపున మాల్యాల రాజయ్య కాంగ్రెస్ అభ్యర్థి రాజనర్సింహ పై గెలుపొందడం జరిగింది. 1989 లో కాంగ్రెస్ పార్టీ తరువున దామోదర రాజనర్సింహ పోటి చేసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మాల్యాల రాజయ్య పై విజయం సాదించారు. 1994 లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మాల్యాల రాజయ్య కాంగ్రెస్ అభ్యర్థి దామోదర రాజనర్సింహ పై గెలుపొందారు. 1998 లో అప్పటి గృహ నిర్మాణ శాఖ మంత్రిగా కొనసాగుతున్న మాల్యాల రాజయ్య సిద్ధిపేట ఎంపీగా గెలుపొందడంతో జరిగిన బై ఎలక్షన్ లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గా సినీ యాక్టర్ బాబుమోహాన్ గెలుపొందారు. 1999 లో జనరల్ ఎలక్షన్ లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బాబుమోహన్ కాంగ్రెస్ అభ్యర్థి దామోదర రాజనర్సింహ పై మరోమారు గెలుపొందడం జరిగింది. 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి దామోదర రాజనర్సింహ తెలుగుదేశం అభ్యర్థి బాబుమోహన్ పై రెండు సార్లు వరుసగా విజయం సాధించి ప్రాథమిక ఉన్న విద్యాశాఖలతో ఉప ముఖ్యమంత్రి గా కావడం జరిగింది. -
అభివృద్ధిలో ఆదర్శంగా నారాయణఖేడ్.. బీఆర్ఎస్కే అధికార పగ్గాలా?
మెదక్ జిల్లాలోని 10 శాసనసభ స్థానాలలో నారాయణ్‌ఖేడ్ శాసనసభ నియోజకవర్గం ఒకటి. తెలంగాణ రాష్ట్రం, సంగారెడ్డి జిల్లా, నారాయణ్‌ఖేడ్ మండలానికి చెందిన గ్రామం ఇది. తెలంగాణ ప్రభుత్వం చేసిన పురపాలక సవరణ బిల్లులో భాగంగా 2018 ఆగస్టు 2న నారాయణఖేడ్ పురపాలక సంఘంగా ఏర్పడింది. ఉమ్మడి రాష్ట్రంలో దశాబ్దాల పాటు నిర్లక్ష్యానికి గురైన ఈ ప్రాంతం తొమ్మిది ఏళ్లలోనే ఊహించని ప్రగతి సాధించి ఆదర్శంగా నిలుస్తుంది. వేలకోట్లతో ఇక్కడ అభివృద్ధి పనులు చేపడుతుండడంతో అన్ని వర్గాల ప్రజలకు వసతులు సమకూరుతున్నాయి. నియోజకవర్గంలో ఎన్నికలను ప్రభావితం చేసే అత్యంత కీలకమైన అంశాలు : అత్యధికంగా గిరిజన తాండాలు కలిగిన ఖేడ్ నియోజకవర్గం కాబట్టి ఉపాధి కోసం వలసలు పరిశ్రమలు ఇతర ఉద్యోగ అవకాశాలు లేకపోవడం కారణంగా నిరుద్యోగ యువత ఎక్కువ ఉంది. ఉపాధి కల్పన నైపుణ్య విద్య సాంకేతిక విద్య అందుబాటులో లేకపోవడం మౌలిక వసతుల్లో భాగంగా గ్రామాల అభివృద్ధి సరిఅయిన రవాణా సౌకర్యం లేకపోవడం కంగ్టీ, నాగలిగిద్ద సిర్గాపూర్, మండలాల రైతులకు సాగునీటి సౌకర్యం లేకపోవడం రాజకీయ పార్టీల వారీగా ప్రధాన పార్టీల టికెట్ల కోసం పోటీ పడుతున్న అభ్యర్థులు : బీఆర్ఎస్ మహా రెడ్డి భూపాల్ రెడ్డి (ప్రస్తుతం ఎమ్మెల్యే ) కాంగ్రెస్ సురేష్ కుమార్ షెత్కర్ పట్లోల సంజీవరెడ్డి ( Ex MPP పిసిసి ఉపాధ్యక్షులు ) బీజేపీ మహా రెడ్డి విజయపాల్ రెడ్డి జన్వాడ సంగప్ప ( అధికార ప్రతినిధి ) వృత్తిపరంగా ఓటర్లు మత్స్యకారులు 16 % పంచకర్మలు 5% కుమ్మరి 2% మంగలి 2% చాకలి 3 % యాదవులు 10 % SC లు 12 % ST లు 16 % మైనార్టీలు 12% ఇతరులు 22 % నియోజకవర్గంలో ఆసక్తికర అంశాలు : ► వార్ కార్ సాంప్రదాయం, కన్నడ తెలుగు మరాఠీ ఉర్దూ తదితర భాషల ప్రయోగం. ► రాజకీయానికి సంబంధించి ఇతర ఏవైనా అంశాలు : షట్కార్, మహారెడ్డి, పట్లోళ్ల కుటుంబాల రాజకీయ వారసత్వం. భౌగోళిక పరిస్థితులు : నదులు : కర్ణాటక మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతం, మంజీరా నది, నల్ల వాగు మధ్యతర ప్రాజెక్టు అడవులు: కడపల్ అటవీ ప్రాంతం ఆలయాలు : కొండాపూర్, పంచగామా, కోర్పోల్, అంతర్గాం, దామరగిద్ద రామాలయం పర్యాటకం : నారాయణఖేడ్, కంగ్టీ,పెద్ద శంకరంపేట్, నిజాంపేట్, మంజీరా నది తీర ప్రాంతం -
దుబ్బాక: ఓటర్ల తీర్పెటు? బీఆర్ఎస్లో హైటెన్షన్
దుబ్బాక నియోజకవర్గంలో నాల్గవసారి సోలిపేట రామలింగారెడ్డి విజయం సాదించినప్పటికి ఆయన అనారోగ్యంతో 2020లో కన్నుముశారు. ఆ కారణంగా జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధి రఘునందన్‌రావు టీఆర్ఎస్ అభ్యర్ధి, దివంగతుడు అయిన రామలింగారెడ్డి సతీమణి సుజాతను కేవలం 1,079 ఓట్ల తేడాతో ఓడించి సంచలన విజయం అందుకున్నారు. ఎమ్. రఘునందన్‌రావుకు 63352 ఓట్లు రాగా, సుజాతకు 62273 ఓట్లు వచ్చాయి. దుబ్బాక నియోజకవర్గం నుండి పోటీలో ఉండొచ్చు అని భావిస్తున్న అభ్యర్థులు: బీజేపీ పార్టీ: మాధవనేని రఘునందన్ రావు (ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే) బీఆర్ఎస్ పార్టీ కొత్త ప్రభాకర్ రెడ్డి (ప్రస్తుత మెదక్ ఎంపీ) కాంగ్రెస్ పార్టీ: చెరుకు శ్రీనివాసరెడ్డి మాజీ మంత్రి ముత్యం రెడ్డి కుమారుడు కత్తి కార్తీక డాక్టర్ శ్రావణ్ కుమార్ రెడ్డి ఎన్నికలలో ప్రభావితం చేసే అంశాలు: దుబ్బాక నియోజకవర్గం లో మహిళా ఓటర్ల సంఖ్య పురుష ఓటర్ల సంఖ్య కంటే ఎక్కువగా ఉంది. కావున వచ్చే ఎన్నికల్లో మహిళ ఓట్లే కీలకం కానున్నాయి.. నిత్యవసర వస్తువుల ధరలు, సిలిండర్ ధరలు, బస్సు చార్జీలు, కరెంటు బిల్లులు విపరీతంగా పెరగడంతో ఇల్లు గడపడం కుటుంబ ఖర్చులు కొనసాగించడం కష్టంగా ఉందని మహిళలు భావిస్తున్నారు. మహిళలకు డ్వాక్రా రుణాలు, అర్హులందరికీ రెండు పడకల గదుల ఇల్లు నిర్మించి ఇవ్వాలని ఆశిస్తున్నారు. ప్రభుత్వం ఇవ్వదలచిన మూడు లక్షలు ఇల్లు నిర్మాణానికి సరిపోవని మహిళలు భావిస్తున్నారు. నూతన మండలాలైన భూంపల్లి,రాయపొల్ మండలాల్లో ప్రభుత్వ కార్యాలయాలు నిర్మించాలని, మెరుగైన రోడ్డు రవాణా సౌకర్యాలు కల్పించాలని ఈ ప్రాంత ప్రజలు కోరుతున్నారు. ఆయా వర్గాలకు కులస్తులకు ఇస్తున్న ఆర్థిక సహాయం పథకాలు అన్ని వర్గాలకు వర్తింపజేయాలని అన్ని కులస్తులకు వర్తింపజేయాలని కోరుతున్నారు. విద్యాలయాలు, ఆసుపత్రులు నూతన భవనాలు నిర్మించి వాటిలో సిబ్బందిని పెంచాలని ఈ ప్రాంత ప్రజలు కోరుతున్నారు సామాన్యులకు విద్యా వైద్యం అందాలని కోరుతున్నారు. ధరణి లో ఉన్న సమస్యలు పరిష్కరించాలని రైతులు కోరుతున్నారు. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇవ్వాలని లేదా నోటిఫికేషన్లు ఇచ్చి ఉద్యోగాల కల్పన చేయాలని ఈ ప్రాంత నిరుద్యోగులు కోరుతున్నారు. దుబ్బాక నియోజకవర్గం లోని ఆయా మండల కేంద్రాల్లో డిగ్రీ కళాశాలలు నెలకొల్పాలని ఈ ప్రాంత ప్రజలు ఆశిస్తున్నారు -
గజ్వేల్: ఆ సెంటిమెంట్‌దే ఎప్పుడూ విజయం!
గజ్వేల్ నియోజకవర్గానికి ఒక ప్రత్యేకత ఉంది. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్‌ను రాష్ట్రాధినేతగా నిలబెట్టింది ఈ నియోజకవర్గమే. విభిన్న సంస్కృతికి నిలయంగా పేరుగాంచిన నియోజకజవర్గం గజ్వేల్. ఎందరో ఉద్యమకారులకు, కవులు, కళాకారులకు జన్మనిచ్చిన గడ్డ. వివిధ మతస్థులు జాతుల సంగమంతో ఈ నియోజకవర్గాన్ని మినీ ఇండియాగా అభివర్ణిస్తారు. రాజకీయ పార్టీలకు ఆ సెంటిమెంటే: కేసీఆర్ ఇలాకాగా అభివర్ణించే ఈ నియోజకవర్గానికి మరో ప్రత్యేకత కూడా ఉంది. ఇది స్థానికేతరులకు అచొచ్చిన నియోకవర్గం. 1952లో ఎమ్మెల్యేగా గెలిచిన పెండెం సుదేవ్ నుంచి 2014లో గెలిచిన కేసీఆర్ వరకు అంతా స్థానికేతరులే. అలాగే ఈ నియోజకవర్గంలో ఏ పార్టీ అయితే గెలుస్తుందో అదే అధికారంలోకి రావడం మరో విశేషం. గత 13 ఎన్నికలు పరిశిలీస్తే అదే జరిగింది. దాంతో ఈ సెంటిమెంట్‌ను రాజకీయవర్గాలు అన్ని కూడా బలంగా నమ్ముతున్నాయి. ఇక 1952లో ఎమ్మెల్యేగా గెలిచిన పెండెం వాసుదేవ్, 1957లో ద్విసభ్య నియోజకవర్గంగా ఉన్న సమయంలో పనిచేసిన జేబీ ముత్యాలరావు, ఆర్.నరసింహారెడ్డి కూడా స్థానికేతరులే. ఆ తర్వాత 1962లో నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్ కావడంతో ఎస్సీలు ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చారు. ఆ తర్వాత 1983లో అల్లం సాయిలు, 1985లో సంజీవరావు, 1989, 2004లలో డాక్టర్ జె గీతారెడ్డి, 1994లో డాక్టర్ జి విజయరామారావు, 1999లో సంజీవరావులు ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. వీరంతా స్థానికేతరులే కావడం విశేషం. 2009లో జనరల్.. సీటు కొట్టేసిన కేసీఆర్! 2009లో జరిగిన ఎన్నికల్లో తూంకుంట నర్సారెడ్డి గెలుపొందారు. ఆ తర్వాత 2014లో టీఆర్ఎస్ నుంచి కేసీఆర్ పోటీ చేసి విజయం సాధించారు. తొలిసారి గజ్వేల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందడమే కాకుండా స్వరాష్ట్రంలో తొలి ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. ఈ నియోజకవర్గానికి కేసీఆర్ కూడా స్థానికేతరులే కావడం విశేషం. వాస్తవానికి 2008లోనే సీఎం కేసీఆర్ గజ్వేల్‌లో పాగా వేశారు. ఇక్కడ ఫాంహౌజ్ ఏర్పాటు చేసుకుని వ్యవసాయం చేస్తూ తన ఇలాకాగా ప్రకటించుకున్నారు. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక 2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడి నుంచి పోటీ చేసి విజయం సాధించారు. నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే అభివృద్ధికి నమూనగా తీర్చిదిద్దుతున్నారు. ఎన్నికలను ప్రభావితం చేసే అంశాలు భూ సేకరణ (జలశాలయాల నిర్మాణంకోసం,కంపెనీల ఏర్పాటు కోసం) సామాన్యుల సమస్యలు పరిష్కారం లేకపోవడం రోడ్లు,పెద్ద భవనాలు తప్ప సామాన్యులకు లబ్ది చేకూరలేదనే అపవాదు రాజకీయ పార్టీల వారిగా పోటీ : బీఆరెస్ పార్టీ కేసీఆర్(బీఆరెస్ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి) కాంగ్రెస్ పార్టీ తుంకుంట నర్సారెడ్డి(జిల్లా అధ్యక్షుడు, గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే) మాదాడి జశ్వంత్ రెడ్డి(టీపీసీసీ మెంబర్,సీనియర్ నాయకుడు రంగారెడ్డి తనయుడు) బండారు శ్రీకాంత్ రావు(టీపీసీసీ ప్రధాన కార్యదర్శి) -
సిద్దిపేట: తిరుగులేని తన్నీరు హరీష్‌రావు
తెలంగాణలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సిద్దిపేట ఒకటి. ఉమ్మడి మెదక్ జిల్లాలోనే సిద్దిపేట అసెంబ్లీకి ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు(KCR), మంత్రి తన్నీరు హరీష్ రావు ఆరు సార్లు వరుసగా విజయాలు సాధించిన ఘనత ఇక్కడ ఉంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లోనూ సిద్ధిపేట ఎమ్మెల్యేగా బీఆర్ఎస్కు చెందిన హరీష్ రావు గెలుపొందారు. కాంగ్రెస్ అభ్యర్థి తాడూరి శ్రీనివాస్ గౌడ్‌పై 80వేల ఓట్ల మెజార్టీతో హరీష్ రావు గెలిచారు. కులాల వారిగా ఓటర్లు శాతం ► ఎస్సీలు : 38.23 % ► ఎస్టీలు : 9.14 % ► బీసీలు : 41.94 % ► ఇతరులు : 10.69 % అభ్యర్థుల బలాలు, బలహీనతలు: 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో హరీష్ రావు తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్‌కి చెందిన తాడూరి శ్రీనివాస్ గౌడ్‌పై 80,000 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఆయనకు 1,17,091 ఓట్లు రాగా, గౌడ్‌కు 36,280 ఓట్లు వచ్చాయి. హరీశ్‌రావు సిద్దిపేటలో ప్రజాభిమానం కలిగిన నాయకుడు, నియోజకవర్గ అభివృద్ధిలో తనవంతు కృషిచేశారనే పేరు ఉంది. సిద్దిపేట సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, సిద్దిపేట విమానాశ్రయం, సిద్దిపేట పారిశ్రామిక పార్కుతో పాటు అనేక అభివృద్ధి కార్యక్రమాలను ఈ ప్రాంతానికి తీసుకురావడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రిగానూ, టీఆర్ఎస్ వర్కింగ్ కమిటీ సభ్యుడు కూడా ఆయన వ్యవహరిస్తున్నారు. -
ఈసారి రసవత్తవరంగా మెదక్ ఎన్నికలు
మెదక్ అసెంబ్లీ నియోజకవర్గం కరీంనగర్ జిల్లాలోని 10 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజవర్గంలో 7 మండలాలు కలవు. ఈ సెగ్మెంట్ మెదక్ లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉంది. 2014, 2018 ఎన్నికలలో ఇక్కడి నుంచి పద్మా దేవేందర్ రెడ్డి విజయం సాధించారు. ధీమాగా బీఆర్ఎస్ నేతలు.. టికెట్ కోసం ఎదురుచూపులు! తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి బీఆర్ఎస్కు మెదక్ కంచుకోటగా మారింది. కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ ఇక్కడ ప్రభావం చూపించలేకపోతున్నాయి. దీంతో ఇక్కడ పోటీచేస్తే గెలుపు గ్యారంటీ అనేది బీఆర్ఎస్ నేతల ధీమా. ఈ క్రమంలోనే సిటింగ్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ మరోసారి ఇక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు. పద్మ దేవేందర్ రెడ్డి 2014, 2018 ఎన్నికల్లో వరుసగా భారీ మెజారిటీతో ఇక్కడి నుంచి గెలిచారు. విజయశాంతి, బట్టి జగపతి వంటి హేమాహేమీలను సైతం ఆమె ఓడించారు. మరోవైపు సుభాష్ రెడ్డి కేసీఆర్ పొలిటికల్ సెక్రటరీ కావడంతో ఆయన చాలాకాలంగా కోరుతున్న ఎమ్మెల్యే టికెట్ ఈసారి ఆయనకే వస్తుందని చెప్తున్నారు. అలాగే కేసీఆర్ ఓకే చేయడంతోనే ఆయన గత రెండేళ్లుగా మెదక్‌లో నిత్యం తిరుగుతూ పునాదులు వేసుకున్నారని మాట్లాడుకుంటున్నారు. దాంతో ఈసారి ఇక్కడ ఎన్నికలు రసవత్తరంగా మారనున్నాయి. రాజకీయ పార్టీల వారీగా టికెట్లు కోసం పోటీపడుతున్న అభ్యర్థులు : బీఆర్ఎస్ పద్మాదేవేందర్ రెడ్డి (సిట్టింగ్ ఎమ్మెల్యే) కాంగ్రెస్ పట్లోళ శశిధర్ రెడ్డి(మాజీ ఎమ్మెల్యే) కంఠ తిరుపతిరెడ్డి(మెదక్ జిల్లా డిసిసి అధ్యక్షులు) మ్యాడo బాలకృష్ణ(టిపిసిసి ఆర్గనైజింగ్ సెక్రటరీ) సుప్రభాత్ రావ్(టిపిసిసి సభ్యులు). బిజెపి తాళ్లపల్లి రాజశేఖర్(న్యాయవాది బిజెపి నాయకులు) గడ్డం శ్రీనివాస్(బిజెపి మెదక్ జిల్లా అధ్యక్షులు) నందా రెడ్డి(బిజెపి నాయకులు మెదక్ ) చోళ రాంచరణ్ యాదవ్(బిజెపి నాయకులు మెదక్) నియోజకవర్గంలో ఎన్నికలను ప్రభావితం చేసే కీలక అంశాలు: గత కొన్ని రోజులుగా రామాయంపేట ను రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేయాలని ఈ ప్రాంత ప్రజలు రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు.. అన్ని ప్రాంతాలలో రెండు పడకల గదుల ఇళ్ల నిర్మాణం జరగలేదు. అన్ని ప్రాంతాలలో అన్ని మండలాలలో రెండు పడకల గదుల ఇళ్ల నిర్మాణం చేసి నిరుపేదలకు ఇవ్వాలని డిమాండ్. నిజాంపేట, నార్సింగీ నూతన మండల కేంద్రముల లో ప్రభుత్వ కార్యాలయాలకు సొంత భవనాలు లేవు. బస్టాండ్ కూడా లేని పరిస్థితి. నిరుద్యోగులకు ఉద్యోగాల కల్పన లేదని ఈ ప్రాంత యువత భావిస్తున్నారు రైతు రుణమాఫీ ఏకకాలంలో చేయాలని రైతులు కోరుతున్నారు. రామాయంపేటలో ఇంటర్నల్ రోడ్ల పరిస్థితి దారుణంగా ఉంది. నూతన రోడ్లు నిర్మించాలని ఈ ప్రాంత ప్రజల అభ్యర్థన. రామయంపేట మున్సిపాలిటీలో డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని విద్యార్థుల అభ్యర్థన. చిన్న శంకరంపేట మండల కేంద్రంలో బస్టాండ్, మరియు డిగ్రీ కళాశాల నిర్మించాలని ఈ ప్రాంత ప్రజల అభ్యర్థన. ధరణిలో సమస్యలు పరిష్కారం కావడం లేదని ఒకరి భూమి మరొకరిపై పడిందని అట్టి సమస్యలు ఇంతవరకు పరిష్కారానికి నోచుకోలేదని ధరణి సమస్యలు పరిష్కరించాలని రైతులు కోరుతున్నారు. మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్న మెదక్ నియోజకవర్గంలో మహిళల ఓట్లే కీలకంగా ఉన్నాయి. మహిళలకు సంబంధించిన డ్వాక్రా మహిళల రుణాలు మంజూరు చేయాలని మహిళలు కోరుతున్నారు. నిత్యవసర సరుకుల ధరలు పెరగడం వల్ల ఏం తినలేక పోతున్నామని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్యాస్ సిలిండర్ల ధరలు పెరగడం వల్ల ఇంటి ఖర్చులు వ్యయం పెరిగి ఇబ్బందుల పాలవుతున్నామని మహిళలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బీడీ కార్మికులకు సరైన మద్దతు ధర ఇవ్వడం లేదని కొన్ని కంపెనీల వారు పిఎఫ్ సౌకర్యం కల్పించేలా కృషి చేయడం లేదని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామపంచాయతీ సిబ్బంది తమ ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని వేతనాలు పెంచాలని గత కొన్ని రోజులుగా సమ్మె చేస్తున్నారు అత్యంత ప్రభావితం చేసే రాజకీయ అంశాలు : మెదక్‌లో మెడికల్ కాలేజ్నిని మంజూరు చేపిస్థామని ఇప్పటి వరకు మంజూరు చేయకపోవడం ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల్లో నిజాం షూగర్ ఫ్యాక్టరీ ఓపెన్ చేయిస్తామని 9 సంవత్సరాలు అవుతున్న దానిని ఓపెన్ చేయించకపోవడం ముఖ్యంగా మెదక్‌కు రింగ్ రోడ్ లేదు.. 9 సంవత్సరాల పాలనలో మెదక్ నియోజకవర్గం అభివృద్ధికి నోచుకోలేదని చెప్పాలి భౌగోళిక పరిస్థితులు: పర్యాటకం: కాకతీయులు పరిపాలించిన మెదక్ కిల ఉంది ఇక్కడే. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మెదక్ సీఎస్ఐ(CSI) చర్చి. నదులు: మంజీరా నది, వనదుర్గ ప్రాజెక్టు, పసుపులేరు వాగు. పోచారం అభయారణ్యం కొంత భాగం మెదక్ నియోజకవర్గంలో ఉంది. చిన్న శంకరంపేట రామయంపేట హవేలీ ఘనపూర్ మండలాలు అడవులు విస్తరించి ఉన్నాయి. ఆలయాలు : ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మెదక్ csi చర్చి అత్యంత పర్యాటక ప్రాంతాలు.. -
మెదక్ నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారు..!
మెదక్ నియోజకవర్గం మెదక్ నియోజకవర్గం నుంచి టిఆర్ఎస్ నేత పద్మాదేవేందర్ రెడ్డి మూడోసారి గెలుపొందారు.ఆమె గతంలో ఒకసారి రామాయంపేట(2009లో రద్దయింది) నుంచి , రెండుసార్లు మెదక్ నుంచి గెలుపొందారు. 2018లో ఆమె తన సమీప ప్రత్యర్ది, కాంగ్రెస్ అభ్యర్ది ఉపేందర్ రెడ్డిపై 44609 ఓట్ల ఆదిక్యతతో విజయం సాధించారు. 2014లో గెలిచిన తర్వాత ఆమె డిప్యూటి స్పీకర్ పదవి పొందారు. కాని 2018లో గెలిచాక పదవి దక్కలేదు. పద్మా దేవేందర్ రెడ్డికి 92176ఓట్లు రాగా, ఉపేందర్ రెడ్డికి 47567 ఓట్లు వచ్చాయి. రెడ్డి సామాజికవర్గానికి చెందిన పద్మ మొదటి నుంచి తెలంగాణ ఉద్యమ నేతగా గుర్తింపు పొందారు.కాగా ఇక్కడ నుంచి ఎస్.ఎఫ్ బి అభ్యర్ది గా పోటీచేసిన వినయ్ సాగర్ సుమారు ఏడువేల ఓట్లు తెచ్చుకున్నారు. ప్రముఖ నటి, మెదక్ నుంచి 2009లో టిఆర్ఎస్ తరపున ఎమ్.పిగా గెలిచిన విజయశాంతి 2014లో మెదక్ అసెంబ్లీ స్థానానికి పోటీచేసి ఓడిపోయారు. టిఆర్ఎస్ తో వచ్చిన విభేదాల కారణంగా ఆమె కాంగ్రెస్ ఐలో చేరి పోటీచేసి పరాజయం పాలయ్యారు. టిఆర్ఎస్ నేత పద్మ దేవేందర్ రెడ్డి మెదక్ లో విజయశాంతిని 39600 ఓట్ల ఆధిక్యతతో ఓడిరచారు. పద్మ 2004లో రామాయంపేట నుంచి గెలుపొందారు. తెలంగాణ ఉద్యమంలో భాగంగా 2008లో తన పదవికి రాజీనామా చేసి,ఉప ఎన్నికలో పోటీచేసి ఓడిపోయారు. ఆ తర్వాత 2009లో సాధారణ ఎన్నికలో టిడిపి,టిఆర్ఎస్ , సిపిఐ,సిపిఎం లు మహాకూటమి ఏర్పాటు కారణంగా ఆమెకు టిక్క్ ట్ రాలేదు.దాంతో ఆమె తిరుగుబాటు అభ్యర్ధిగా రంగంలో దిగి ఓడిపోయారు. కాని ఆ తర్వాత కొద్ది కాలానికి పార్టీలో తిరిగి చేరి మళ్లీ 2014లో మెదక్ నుంచి పోటీచేసి గెలిచారు. .మెదక్ లో ఇంతవరకు ఆరుసార్లు రెడ్డి సామాజికవర్గం నేతలు ఎమ్మెల్యేలుగా ఎన్నిక కాగా, ఒకసారి వెలమ, ఆరుసార్లు బ్రాహ్మణ , మూడు సార్లు ఇతర వర్గాల నేతలు ఎన్నికయ్యారు. 2008లో రామాయంపేటకు జరిగిన ఉప ఎన్నిక ద్వారా శాసనసభలో ప్రవేశించిన మైనంపాటి హనుమంతరావు 2009 ఎన్నికలో మెదక్ నుంచి టిడిపి పక్షన పోటీ చేసి విజయం సాధించారు. 2008లో రామాయంపేట నుంచి పోటీ చేసి డీలిమిటేషన్ తరువాత ఆ నియోజకవర్గం రద్దు కావడంతో 2009లో మెదక్ నుంచి రంగంలో దిగారు. సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన పి. శశిధర్‌రెడ్డిని ఈయన ఓడిరచారు.తదుపరి 2014లో ఎన్నికలలో ఆయన టిఆర్ఎస్ లో చేరి మల్కాజిగిరినుంచి లోక్ సభకు పోటీచేసి ఓడిపోయారు. 1952లో ఏర్పడిన మెదక్ అసెంబ్లీ స్థానానికి ఒక ఉప ఎన్నికతో సహా 16 సార్లు ఎన్నికలు జరిగితే ఐదుసార్లు కాంగ్రెస్, కాంగ్రెస్ ఐలు, ఆరుసార్లు టిడిపి, రెండుసార్లు టిఆర్ఎస్, ఒకసారి సిపిఐ, ఒకసారి జనతా (కాంగ్రెస్ టికెట్ రాకపోతే తిరుగుబాటు చేసి జనతాటిక్కెట్పై శశిధర్‌రెడ్డి గెలిచారు) పార్టీ గెలుపొందాయి. ఒకసారి ఇండిపెండెంటు కూడా నెగ్గారు. టిడిపి నేత కరణం రామచంద్రరావు ఇక్కడ నుంచి నాలుగుసార్లు టిడిపి పక్షాన గెలిచారు. ఒకసారి ఇండిపెండెంటుగా నెగ్గారు. కరణం మరణం తరువాత జరిగిన ఉప ఎన్నికలో ఆయన భార్య కరణం ఉమాదేవి గెలుపొందారు. కరణం రామచంద్రరావు గతంలో ఎన్టిఆర్ క్యాబినెట్‌లోను, చంద్రబాబు క్యాబినెట్‌లోను పనిచేసారు. 1989లో గెలిచిన పి.నారాయణరెడ్డి 2004లో గెలుపొందిన శశిధర్‌రెడ్డి తండ్రి, కొడుకులు. 2009లో రద్దు అయిపోయిన రామాయంపేట నియోజకవర్గానికి 14సార్లు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్, కాంగ్రెస్ ఐలు కలిసి ఎనిమిదిసార్లు, టిడిపి రెండుసార్లు బిజిపి, పిడిఎఫ్, టిఆర్ఎస్లు ఒక్కోసారి గెలుపొందగా, ఒక ఇండిపెండెంట్ కూడా నెగ్గారు. 1953లో జరిగిన ఉప ఎన్నికలో ప్రముఖ సిపిఐ నాయకుడు ఆరుట్ల రామచంద్రారెడ్డి గెలుపొందారు. ఇదే సమయంలో ఈయన భార్య కమలాదేవి ఆలేరు నుంచి గెలుపొందారు. 1962లో సైతం వీరిద్దరూ ఒకరు భువనగిరి నుంచి మరొకరు ఆలేరు నుంచి గెలుపొందారు. కాంగ్రెస్ ప్రముఖుడు టి.అంజయ్య 1981లో రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యాక రామాయంపేట నుంచి ఏకగ్రీవంగా ఎన్నికవడం విశేషం. ఈయన కోసం అప్పటి ఎమ్మెల్యే ఆర్.ముత్యంరెడ్డి తన పదవికి రాజీనామా చేసారు. 2004లోటిఆర్ఎస్ పక్షాన గెలిచిన పద్మాదేవేందర్‌రెడ్డి, 2008లో టిఆర్ఎస్ తెలంగాణ వ్యూహంలో భాగంగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసారు. ఆ తరువాత జరిగిన ఉప ఎన్నికలో టిడిపి నేత హనుమంతరావు చేతిలో ఆమె ఓటమిపాలయ్యారు. ఇక్కడ పదకుండు సార్లు రెడ్లు గెలుపొందారు. ఒకసారి వెలమ గెలుపొందగా, ఇద్దరు ఇతర వర్గాలవారు విజయం సాధించారు. మెదక్ నియోజకవర్గంలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే..