మెదక్ అసెంబ్లీ నియోజకవర్గం కరీంనగర్ జిల్లాలోని 10 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజవర్గంలో 7 మండలాలు కలవు. ఈ సెగ్మెంట్ మెదక్ లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉంది. 2014, 2018 ఎన్నికలలో ఇక్కడి నుంచి పద్మా దేవేందర్ రెడ్డి విజయం సాధించారు.
ధీమాగా బీఆర్‌ఎస్ నేతలు.. టికెట్ కోసం ఎదురుచూపులు!
తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి బీఆర్ఎస్‌కు మెదక్ కంచుకోటగా మారింది. కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ ఇక్కడ ప్రభావం చూపించలేకపోతున్నాయి. దీంతో ఇక్కడ పోటీచేస్తే గెలుపు గ్యారంటీ అనేది బీఆర్‌ఎస్ నేతల ధీమా. ఈ క్రమంలోనే సిటింగ్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ మరోసారి ఇక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు. పద్మ దేవేందర్ రెడ్డి 2014, 2018 ఎన్నికల్లో వరుసగా భారీ మెజారిటీతో ఇక్కడి నుంచి గెలిచారు.
విజయశాంతి, బట్టి జగపతి వంటి హేమాహేమీలను సైతం ఆమె ఓడించారు. మరోవైపు సుభాష్ రెడ్డి కేసీఆర్ పొలిటికల్ సెక్రటరీ కావడంతో ఆయన చాలాకాలంగా కోరుతున్న ఎమ్మెల్యే టికెట్ ఈసారి ఆయనకే వస్తుందని చెప్తున్నారు. అలాగే కేసీఆర్ ఓకే చేయడంతోనే ఆయన గత రెండేళ్లుగా మెదక్‌లో నిత్యం తిరుగుతూ పునాదులు వేసుకున్నారని మాట్లాడుకుంటున్నారు. దాంతో ఈసారి ఇక్కడ ఎన్నికలు రసవత్తరంగా మారనున్నాయి.
రాజకీయ పార్టీల వారీగా టికెట్లు కోసం పోటీపడుతున్న అభ్యర్థులు :
బీఆర్‌ఎస్
- పద్మాదేవేందర్ రెడ్డి (సిట్టింగ్ ఎమ్మెల్యే)
కాంగ్రెస్
- పట్లోళ శశిధర్ రెడ్డి(మాజీ ఎమ్మెల్యే)
- కంఠ తిరుపతిరెడ్డి(మెదక్ జిల్లా డిసిసి అధ్యక్షులు)
- మ్యాడo బాలకృష్ణ(టిపిసిసి ఆర్గనైజింగ్ సెక్రటరీ)
- సుప్రభాత్ రావ్(టిపిసిసి సభ్యులు).
బిజెపి
- తాళ్లపల్లి రాజశేఖర్(న్యాయవాది బిజెపి నాయకులు)
- గడ్డం శ్రీనివాస్(బిజెపి మెదక్ జిల్లా అధ్యక్షులు)
- నందా రెడ్డి(బిజెపి నాయకులు మెదక్ )
- చోళ రాంచరణ్ యాదవ్(బిజెపి నాయకులు మెదక్)
నియోజకవర్గంలో ఎన్నికలను ప్రభావితం చేసే కీలక అంశాలు:
- గత కొన్ని రోజులుగా రామాయంపేట ను రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేయాలని ఈ ప్రాంత ప్రజలు రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు..
- అన్ని ప్రాంతాలలో రెండు పడకల గదుల ఇళ్ల నిర్మాణం జరగలేదు. అన్ని ప్రాంతాలలో అన్ని మండలాలలో రెండు పడకల గదుల ఇళ్ల నిర్మాణం చేసి నిరుపేదలకు ఇవ్వాలని డిమాండ్.
- నిజాంపేట, నార్సింగీ నూతన మండల కేంద్రముల లో ప్రభుత్వ కార్యాలయాలకు సొంత భవనాలు లేవు. బస్టాండ్ కూడా లేని పరిస్థితి.
- నిరుద్యోగులకు ఉద్యోగాల కల్పన లేదని ఈ ప్రాంత యువత భావిస్తున్నారు
- రైతు రుణమాఫీ ఏకకాలంలో చేయాలని రైతులు కోరుతున్నారు.
- రామాయంపేటలో ఇంటర్నల్ రోడ్ల పరిస్థితి దారుణంగా ఉంది. నూతన రోడ్లు నిర్మించాలని ఈ ప్రాంత ప్రజల అభ్యర్థన.
- రామయంపేట మున్సిపాలిటీలో డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని విద్యార్థుల అభ్యర్థన.
- చిన్న శంకరంపేట మండల కేంద్రంలో బస్టాండ్, మరియు డిగ్రీ కళాశాల నిర్మించాలని ఈ ప్రాంత ప్రజల అభ్యర్థన.
- ధరణిలో సమస్యలు పరిష్కారం కావడం లేదని ఒకరి భూమి మరొకరిపై పడిందని అట్టి సమస్యలు ఇంతవరకు పరిష్కారానికి నోచుకోలేదని ధరణి సమస్యలు పరిష్కరించాలని రైతులు కోరుతున్నారు.
- మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్న మెదక్ నియోజకవర్గంలో మహిళల ఓట్లే కీలకంగా ఉన్నాయి. మహిళలకు సంబంధించిన డ్వాక్రా మహిళల రుణాలు మంజూరు చేయాలని మహిళలు కోరుతున్నారు. నిత్యవసర సరుకుల ధరలు పెరగడం వల్ల ఏం తినలేక పోతున్నామని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్యాస్ సిలిండర్ల ధరలు పెరగడం వల్ల ఇంటి ఖర్చులు వ్యయం పెరిగి ఇబ్బందుల పాలవుతున్నామని మహిళలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బీడీ కార్మికులకు సరైన మద్దతు ధర ఇవ్వడం లేదని కొన్ని కంపెనీల వారు పిఎఫ్ సౌకర్యం కల్పించేలా కృషి చేయడం లేదని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
- గ్రామపంచాయతీ సిబ్బంది తమ ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని వేతనాలు పెంచాలని గత కొన్ని రోజులుగా సమ్మె చేస్తున్నారు
అత్యంత ప్రభావితం చేసే రాజకీయ అంశాలు :
- మెదక్లో మెడికల్ కాలేజ్‌నిని మంజూరు చేపిస్థామని ఇప్పటి వరకు మంజూరు చేయకపోవడం
- ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల్లో నిజాం షూగర్ ఫ్యాక్టరీ ఓపెన్ చేయిస్తామని 9 సంవత్సరాలు అవుతున్న దానిని ఓపెన్ చేయించకపోవడం
- ముఖ్యంగా మెదక్కు రింగ్ రోడ్ లేదు..
- 9 సంవత్సరాల పాలనలో మెదక్ నియోజకవర్గం అభివృద్ధికి నోచుకోలేదని చెప్పాలి
భౌగోళిక పరిస్థితులు:
పర్యాటకం: కాకతీయులు పరిపాలించిన మెదక్ కిల ఉంది ఇక్కడే. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మెదక్ సీఎస్‌ఐ(CSI) చర్చి.
నదులు: మంజీరా నది, వనదుర్గ ప్రాజెక్టు, పసుపులేరు వాగు. పోచారం అభయారణ్యం కొంత భాగం మెదక్ నియోజకవర్గంలో ఉంది. చిన్న శంకరంపేట రామయంపేట హవేలీ ఘనపూర్ మండలాలు అడవులు విస్తరించి ఉన్నాయి.
ఆలయాలు : ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మెదక్ csi చర్చి అత్యంత పర్యాటక ప్రాంతాలు..
Comments
Please login to add a commentAdd a comment