ఉమ్మడి మెదక్ జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గం జహీరాబాద్. ప్రస్తుతం ఇది సంగారెడ్డి జిల్లా పరిధిలోకి వస్తోంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ముందు వరకు ఇది కాంగ్రెస్ కంచుకోటగా ఉండేది. సీనియర్ మహిళ నేత గీతారెడ్డి ఇక్కడి నుంచే ప్రాతినిధ్యం వహించారు. ఇక రాష్ట్ర ఏర్పాటు తర్వాత జరిగిన 2014 ఎన్నికల్లోనూ గీతారెడ్డి గెలిచారు. కానీ ముందస్తు ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ ఓటమిపాలైంది. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి మాణిక్ రావ్ గెలుపుపొందారు.
బీఆర్‌ఎస్‌కి భారీ వలసలు.. నేతల మధ్య కుమ్ములాట!
2014 ఎన్నికల తర్వాత నియోజకవర్గంలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. కాంగ్రెస్ నేతలు వరసగా బీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈ క్రమంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ బీఆర్‌ఎస్ ఘనవిజయం సాధించింది. త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు రాబోతుండటంతో.. అధికార బీఆర్ఎస్ టికెట్ కోసం ప్రధానంగా నలుగురు నేతలు పోటీ ఉన్నప్పటికి ఈసారి సిట్టింగ్ ఎమ్మెల్యేనే టికెట్ వరించింది.
గీతారెడ్డి సైలెంట్ వెనక వ్యూహాం?
మరోవైపు కంచుకోట కాంగ్రెస్‌లో విచిత్ర పరిస్థితులు నెలకొన్నాయి. కాంగ్రెస్ నుంచి వరసగా బీఆర్‌ఎస్‌లోకి వలసలు పెరుగుతున్న సీనియర్ నేత గీతా రెడ్డి పట్టనట్టు వ్యవహరిస్తున్నారట. అంతేకాదు ఈమె పార్టీని కూడా పెద్ద పట్టించుకోవడం లేదని సొంత పార్టీలోనే వాదనలు వినిపిస్తున్నాయి. రీసెంట్‌గా నరోత్తం లాంటి సీనియర్ నేతే పార్టీ వీడిన ఆమె సైలెంట్‌గానే ఉన్నారు. భారీగా వలసలు పెరుగుతున్న ఆమె సైలెంట్‌గా ఉండటంపై మిగతా లీడర్లు సర్‌ప్రైజ్ అవుతున్నారు. ఆమె తీరు పార్టీ నేతలకు కూడా అంతుపట్టడం లేదు.
గీతారెడ్డి సైలెంట్ వెనుక ఏదైనా వ్యూహం ఉందా? కావాలనే ఇలా ఉంటున్నారా? అనే సందేహాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో ఆమె జహీరాబాద్ నుండి కాకుండా కంటోన్మెంట్ నుండి పోటీ చేయాలని చూస్తుందనే వార్త తెరపైకి వచ్చింది. అందుకే గీతారెడ్డి ఇక్కడ దృష్టి సారించడం లేదనే ఈ ప్రచారం తెరమీదకు వచ్చింది. దాంతో పక్క జిల్లాలు, పక్క నియోజకవర్గ నేతలు జహీరాబాద్ నియోజకవర్గంపై దృష్టి సారిస్తున్నారట. జహీరాబాద్ నియోజకవర్గ పరిధిలో కాంగ్రెస్ పార్టీకి ఫుల్ క్యాడర్ ఉన్న వారిని పట్టించుకునే లీడర్ లేకపోవడం అనేది విచిత్ర పరిస్థితే అని చెప్పాలి.
ఎన్నికలను ప్రభావితం చేసే అత్యంత కీలక అంశాలు:
- నిరుద్యోగ సమస్య
- యువతకు ఉపాధి
- NIMZ రైతుల సమస్య
- చెరుకు రైతుల సమస్య
- రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు డిమాండ్.
- మంజూరైన ఐ టి ఐ కళాశాల, మహిళా డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేయాలని ప్రధాన డిమాండ్.
ప్రధాన పార్టీల టికెట్ల కోసం పోటీ పడుతున్న అభ్యర్థులు
బీఆర్‌ఎస్:
- కే మానిక్ రావు (సిట్టింగ్ ఎమ్మెల్యే)
కాంగ్రెస్ పార్టీ:
- మాజీ మంత్రి జే గీతారెడ్డికే టికెట్ ఖాయమని భావిస్తున్నా, స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు బి నరేష్, కండేమ్ నర్సింహులు, మాజీ సర్పంచ్ గోపాల్‌ల పేర్లు వినిపిస్తున్నాయి.
బీజేపీ
- రాంచంద్ర రాజనర్సింహ, చింతల గట్టు సుధీర్ కుమార్ లు టికెట్ రేస్ లో ఉన్నారు.
వృత్తిపరంగా ఓటర్లు..
నియోజకవర్గంలో ప్రధానంగా వ్యవసాయ రంగంలో, వ్యాపార రంగంలో ప్రజలు అధికంగా ఆధార పడి ఉన్నారు. వ్యాపార పరంగా ఉమ్మడి మెదక్ జిల్లాలో జహీరాబాద్ రెండో స్థానంలో ఉంది.
మతం/కులం పరంగా ఓటర్లు?
- ఓటర్ల పరంగా చూస్తే 35 శాతం ఉన్న ముస్లింలు రాజకీయంగా నిర్ణయాత్మక శక్తిగా ఉన్నారు
- కులాల పరంగా SC- మాదిగ, లింగాయత్‌లు గణనీయ సంఖ్యలో ఉన్నారు.
నియోజకవర్గంలో భౌగోళిక పరిస్థితులు
నదులు : నియోజకవర్గంలో నారింజ వాగు, పెద్ద వాగు, వీరన్న వాగు లు ఉన్నాయి.
ఆలయాలు: దక్షిణ కాశీగా పేరు గాంచిన జరాసంగం మండల కేంద్రంలోని శ్రీ కేతకి సంగమేశ్వర స్వామి ఆలయం, స్వయంభూగా వెలిసిన రేజీంతల్ శ్రీ సిద్ధి వినాయక స్వామి ఆలయం.
నియోజకవర్గం గురించి ఆసక్తికర అంశాలు :
ఇప్పటి వరకు ఎన్నికలు 15 సార్లు జరగగా వాటిలో ఏకంగా 13 సార్లు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుపొందారు. కేవలం రెండు సార్లు మాత్రమే నాన్ కాంగ్రెసు పక్షమైన టిడిపి, టి ఆర్ ఎస్ లు చెరో సారి గెలుపొందాయీ. 7 సార్లు వరుసగా కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందిన ఎమ్. బాగా రెడ్డి ఇక్కడి నుండే ప్రాతినిద్యం వహించారు.
రాజకీయాకపరమైన అంశాలు :
కాంగ్రెసేతర పక్షాలు పెద్ద మెజారిటీ తో గెలుపొంది నా అనంతరం జరిగిన ఎన్నికల్లో ఆ పట్టును నిలుపుకో లేదు. కాంగ్రెసు పార్టీ కి వ్యతిరేకంగా నిలబడ్డ రాజకీయ పక్షాలలో ఐక్యత లేకపోవడం, కాంగ్రెసు పార్టీ తన పట్టును కొనసాగించడానికి ముఖ్య కారణం.
Comments
Please login to add a commentAdd a comment