మెదక్ నియోజకవర్గం
మెదక్ నియోజకవర్గం నుంచి టిఆర్‌ఎస్ నేత పద్మాదేవేందర్ రెడ్డి మూడోసారి గెలుపొందారు.ఆమె గతంలో ఒకసారి రామాయంపేట(2009లో రద్దయింది) నుంచి , రెండుసార్లు మెదక్ నుంచి గెలుపొందారు. 2018లో ఆమె తన సమీప ప్రత్యర్ది, కాంగ్రెస్ అభ్యర్ది ఉపేందర్ రెడ్డిపై 44609 ఓట్ల ఆదిక్యతతో విజయం సాధించారు. 2014లో గెలిచిన తర్వాత ఆమె డిప్యూటి స్పీకర్ పదవి పొందారు. కాని 2018లో గెలిచాక పదవి దక్కలేదు. పద్మా దేవేందర్ రెడ్డికి 92176ఓట్లు రాగా, ఉపేందర్ రెడ్డికి 47567 ఓట్లు వచ్చాయి.
రెడ్డి సామాజికవర్గానికి చెందిన పద్మ మొదటి నుంచి తెలంగాణ ఉద్యమ నేతగా గుర్తింపు పొందారు.కాగా ఇక్కడ నుంచి ఎస్.ఎఫ్ బి అభ్యర్ది గా పోటీచేసిన వినయ్ సాగర్ సుమారు ఏడువేల ఓట్లు తెచ్చుకున్నారు. ప్రముఖ నటి, మెదక్ నుంచి 2009లో టిఆర్‌ఎస్ తరపున ఎమ్.పిగా గెలిచిన విజయశాంతి 2014లో మెదక్ అసెంబ్లీ స్థానానికి పోటీచేసి ఓడిపోయారు. టిఆర్‌ఎస్ తో వచ్చిన విభేదాల కారణంగా ఆమె కాంగ్రెస్ ఐలో చేరి పోటీచేసి పరాజయం పాలయ్యారు. టిఆర్‌ఎస్ నేత పద్మ దేవేందర్ రెడ్డి మెదక్ లో విజయశాంతిని 39600 ఓట్ల ఆధిక్యతతో ఓడిరచారు. పద్మ 2004లో రామాయంపేట నుంచి గెలుపొందారు.
తెలంగాణ ఉద్యమంలో భాగంగా 2008లో తన పదవికి రాజీనామా చేసి,ఉప ఎన్నికలో పోటీచేసి ఓడిపోయారు. ఆ తర్వాత 2009లో సాధారణ ఎన్నికలో టిడిపి,టిఆర్‌ఎస్ , సిపిఐ,సిపిఎం లు మహాకూటమి ఏర్పాటు కారణంగా ఆమెకు టిక్క్ ట్ రాలేదు.దాంతో ఆమె తిరుగుబాటు అభ్యర్ధిగా రంగంలో దిగి ఓడిపోయారు. కాని ఆ తర్వాత కొద్ది కాలానికి పార్టీలో తిరిగి చేరి మళ్లీ 2014లో మెదక్ నుంచి పోటీచేసి గెలిచారు. .మెదక్ లో ఇంతవరకు ఆరుసార్లు రెడ్డి సామాజికవర్గం నేతలు ఎమ్మెల్యేలుగా ఎన్నిక కాగా, ఒకసారి వెలమ, ఆరుసార్లు బ్రాహ్మణ , మూడు సార్లు ఇతర వర్గాల నేతలు ఎన్నికయ్యారు.
2008లో రామాయంపేటకు జరిగిన ఉప ఎన్నిక ద్వారా శాసనసభలో ప్రవేశించిన మైనంపాటి హనుమంతరావు 2009 ఎన్నికలో మెదక్ నుంచి టిడిపి పక్షన పోటీ చేసి విజయం సాధించారు. 2008లో రామాయంపేట నుంచి పోటీ చేసి డీలిమిటేషన్ తరువాత ఆ నియోజకవర్గం రద్దు కావడంతో 2009లో మెదక్ నుంచి రంగంలో దిగారు. సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన పి. శశిధర్‌రెడ్డిని ఈయన ఓడిరచారు.తదుపరి 2014లో ఎన్నికలలో ఆయన టిఆర్‌ఎస్ లో చేరి మల్కాజిగిరినుంచి లోక్ సభకు పోటీచేసి ఓడిపోయారు.
1952లో ఏర్పడిన మెదక్ అసెంబ్లీ స్థానానికి ఒక ఉప ఎన్నికతో సహా 16 సార్లు ఎన్నికలు జరిగితే ఐదుసార్లు కాంగ్రెస్, కాంగ్రెస్ ఐలు, ఆరుసార్లు టిడిపి, రెండుసార్లు టిఆర్‌ఎస్, ఒకసారి సిపిఐ, ఒకసారి జనతా (కాంగ్రెస్ టికెట్ రాకపోతే తిరుగుబాటు చేసి జనతాటిక్కెట్‌పై శశిధర్‌రెడ్డి గెలిచారు) పార్టీ గెలుపొందాయి. ఒకసారి ఇండిపెండెంటు కూడా నెగ్గారు. టిడిపి నేత కరణం రామచంద్రరావు ఇక్కడ నుంచి నాలుగుసార్లు టిడిపి పక్షాన గెలిచారు. ఒకసారి ఇండిపెండెంటుగా నెగ్గారు. కరణం మరణం తరువాత జరిగిన ఉప ఎన్నికలో ఆయన భార్య కరణం ఉమాదేవి గెలుపొందారు.
కరణం రామచంద్రరావు గతంలో ఎన్‌టిఆర్ క్యాబినెట్‌లోను, చంద్రబాబు క్యాబినెట్‌లోను పనిచేసారు. 1989లో గెలిచిన పి.నారాయణరెడ్డి 2004లో గెలుపొందిన శశిధర్‌రెడ్డి తండ్రి, కొడుకులు. 2009లో రద్దు అయిపోయిన రామాయంపేట నియోజకవర్గానికి 14సార్లు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్, కాంగ్రెస్ ఐలు కలిసి ఎనిమిదిసార్లు, టిడిపి రెండుసార్లు బిజిపి, పిడిఎఫ్, టిఆర్‌ఎస్‌లు ఒక్కోసారి గెలుపొందగా, ఒక ఇండిపెండెంట్ కూడా నెగ్గారు. 1953లో జరిగిన ఉప ఎన్నికలో ప్రముఖ సిపిఐ నాయకుడు ఆరుట్ల రామచంద్రారెడ్డి గెలుపొందారు.
ఇదే సమయంలో ఈయన భార్య కమలాదేవి ఆలేరు నుంచి గెలుపొందారు. 1962లో సైతం వీరిద్దరూ ఒకరు భువనగిరి నుంచి మరొకరు ఆలేరు నుంచి గెలుపొందారు. కాంగ్రెస్ ప్రముఖుడు టి.అంజయ్య 1981లో రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యాక రామాయంపేట నుంచి ఏకగ్రీవంగా ఎన్నికవడం విశేషం. ఈయన కోసం అప్పటి ఎమ్మెల్యే ఆర్.ముత్యంరెడ్డి తన పదవికి రాజీనామా చేసారు. 2004లోటిఆర్‌ఎస్ పక్షాన గెలిచిన పద్మాదేవేందర్‌రెడ్డి, 2008లో టిఆర్‌ఎస్ తెలంగాణ వ్యూహంలో భాగంగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసారు. ఆ తరువాత జరిగిన ఉప ఎన్నికలో టిడిపి నేత హనుమంతరావు చేతిలో ఆమె ఓటమిపాలయ్యారు. ఇక్కడ పదకుండు సార్లు రెడ్లు గెలుపొందారు. ఒకసారి వెలమ గెలుపొందగా, ఇద్దరు ఇతర వర్గాలవారు విజయం సాధించారు.
మెదక్ నియోజకవర్గంలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే..
Comments
Please login to add a commentAdd a comment