Padmadevender reddy
-
19 ఏళ్ల పోరాటం.. ఈసారైనా ఆమెను ఓడిస్తారా?
ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల విషయంలో కొన్నిసార్లు ఆసక్తికర విషయాలు సంతరించుకుంటాయి. తండ్రీకొడుకులు, భార్యాభర్తలు, అన్నాదమ్ముళ్లు పోటీపడి అందర్ని ఆశ్చర్యానికి గురి చేస్తుండడం చూస్తూనే ఉంటాం. కానీ, ఒకే ప్రత్యర్థిపై ఒకే కుటుంబానికి చెందిన వారు వరుసగా పోటీ చేయడం అరుదుగా జరుగుతుంది. ఇదే పరిస్థితి ఇప్పుడు మెదక్ నియోజకవర్గంలో కనిపించింది. ఎమ్మెల్యే పద్మపై మైనంపల్లి కుటుంబీకులు చాలా ఏళ్లుగా పోటీ చేస్తూ రావడం ఆసక్తి సంతరించుకుంది. మెదక్: ప్రస్తుత మెదక్ సిట్టింగ్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి ఉమ్మడి ఏపీలో 2004 అసెంబ్లీ ఎన్నికల్లో మెదక్ జిల్లా రామాయంపేట అసెంబ్లీ నియోజకవర్గ టీఆర్ఎస్ అభ్యరి్థగా పోటీ చేయగా, ఆమె ప్రత్యర్థిగా టీడీపీ నుంచి ప్రస్తుత మల్కాజిగిరి సిట్టింగ్ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు సతీమణి మైనంపల్లి వాణి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అనంతరం తెలంగాణ ఉద్యమ సమయంలో అప్పటి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపు మేరకు రామాయంపేట ఎమ్మెల్యేగా ఉన్న పద్మాదేవేందర్‌రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. ఈ క్రమంలో 2008లో జరిగిన రామాయంపేట ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థిగా మళ్లీ పద్మాదేవేందర్‌రెడ్డి పోటీ చేయగా, ఆమె ప్రత్యర్థిగా టీడీపీ నుంచి మైనం పల్లి హన్మంత రావు బరిలో నిలిచి గెలిచారు. స్వతంత్ర అభ్యర్థిగా బరిలో.. అనంతరం నియోజకవర్గాల పునర్ విభజనలో రామాయంపేట నియోజకవర్గాన్ని రద్దుచేసి చిన్నశంకరంపేట, రామాయంపేట మండలాలను మెదక్ నియోజకవర్గంలో కలిపారు. ఈ నేపథ్యంలో 2009లో జరిగిన సాధారణ ఎన్నికల్లో టీడీపీ, టీఆర్ఎస్ పొత్తులో భాగంగా మెదక్ టికెట్‌ను మైనంపల్లి హన్మంతరావుకు కేటాయించడంతో పద్మాదేవేందర్‌రెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచి మైనంపల్లి చేతిలో మరోసారి ఓటమి చవి చూశారు. ఆ తర్వాత 2014, 2018 లో వరుసగా పద్మాదేవేందర్‌రెడ్డి టీఆర్ఎస్ పార్టీ అభ్యరి్థగా పోటీచేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తాజాగా మూడోసారి సైతం పద్మారెడ్డికి బీఆర్ఎస్ హైకమాండ్ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది. ఈసారి పద్మపై రోహిత్.. గతంలో మైనంపల్లి హన్మంతరావు, వాణి దంపతులు పద్మాదేవేందర్‌రెడ్డిపై పోటీ పడగా, ప్రస్తుతం వారి కుమారుడు రోహిత్‌రావు కాంగ్రెస్ అభ్యరి్థగా పద్మకు పోటీగా బరిలో నిలిచారు. నాడు తల్లీదండ్రులు, నేడు కొడుకు పోటీపడుతుండడంతో జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. 19 ఏళ్లుగా రాజకీయ వైరం వీరి మధ్యలోనే జరుగుతుండడం విశేషం. -
అన్నా ..! మరో ఛాన్స్ మాకు ఇవ్వండి...
ఒక్క చాన్స్ ప్లీజ్.. మరో చాన్స్ ప్లీజ్.. అనే డైలాగులు మామూలుగా సినిమాల్లో వినిపిస్తుంటాయి. ఇప్పుడు ట్రెండ్ మారింది. ఈ పదాన్ని ప్రస్తుతం రాజకీయ నాయకులు కూడా వాడేస్తున్నారు. గతంలో ఏం చేశాం.. గెలిపిస్తే ఏం చేస్తామో చెప్పి ఎన్నికల్లో ఓట్లు అడిగేవారు. కానీ ఇప్పుడు ఎన్నికల్లో గెలిచేందుకు ప్లీజ్ ప్లీజ్ అంటూ రిక్వెస్ట్‌లు చేయడం మొదలు పెట్టారు. మెదక్: ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో మెదక్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ నేతలు బిజీబిజీ అయ్యారు. ఎన్నికలకు మరో 50 రోజుల గడువు మాత్రమే ఉంది. దీంతో ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి వరకు వ్యూహాలకు పదును పెడుతున్నారు. నియోజకవర్గంలోని అన్ని మండలాల కాంగ్రెస్ నేతలకు గాలం వేస్తున్నారు. గ్రామా లు, మండలాల్లోని ముఖ్య నేతలు, క్రియాశీలక కార్యకర్తల జాబితా సిద్ధం చేసి సిట్టింగ్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి పద్మతో పాటు ఆమె భర్త దేవేందర్‌రెడ్డిలు ఫోన్లు చేస్తున్నట్లు సమాచారం. ‘అన్నా ..! మరో ఛాన్స్ మాకు ఇవ్వండి. తెలిసో.. తెలియకో మావల్ల ఏదైనా తప్పులు జరిగి ఉంటే అలాంటివి మనసులో పెట్టుకోవద్దన్నా. ప్లీజ్ అన్నా.. ఈసారి మాకు సహకరించండి. మీ మేలు ఎప్పటికీ మరచిపోము. మీరు మా పార్టీలోకి వస్తే సంతోషం.. లేదంటే కాంగ్రెస్‌లోనే ఉంటూ మాకు సహకరించండి అన్నా..’ అంటూ కాంగ్రెస్ పార్టీలకు చెందిన నేతలను మచ్చిక చేసుకునే పనిలో ఎమ్మెల్యే పద్మ దంపతులు నిమగ్నమయ్యారు. బీఆర్ఎస్లోకి కాంగ్రెస్ నేతలు.. మెదక్ నుంచి మూడోసారి బీఆర్ఎస్ టిక్కెట్ దక్కించుకున్న సిట్టింగ్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి ఈ ఎన్నికలలో కూడా గెలిచి హ్యాట్రిక్ సాధించాలని చూస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలు తనను గెలిపిస్తాయనే ధీమాతో ఉన్నారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న అసంతృప్తులను బీఆర్ఎస్లో చేర్చుకుంటున్నారు. ఇప్పటికే మెదక్ కాంగ్రెస్ టిక్కెట్ ఆశించి భంగపడిన డీసీసీ అధ్యక్షుడు కంఠారెడ్డి తిరుపతిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ చిన్నశంకరంపేట మండల అధ్యక్షుడు పోతరాజు రమణ, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు శ్యాంసుందర్ తదితర నేతలు గులాబీ కండువా కప్పుకున్న విషయం తెలిసిందే. పట్టణానికి చెందిన మరో నేత మామిళ్ల ఆంజనేయులు కూడా కాంగ్రెస్‌కు రాజీనామా చేశారు. త్వరలోనే ఆయన బీఆర్ఎస్లో చేరతానని ప్రకటించారు. మంత్రి హరీశ్‌రావు కూడా కాంగ్రెస్ రెబల్స్‌తో మాట్లాడుతున్నారు. పద్మను గెలిపించడానికి సహకరించాలని కోరుతున్నారు. కొందరు బీఆర్ఎస్ నేతలకు ఎమ్మెల్యేతో ఏర్పడిన విభేదాలను తొలగించడానికి హైకమాండ్ చేసిన ప్రయత్నం ఫలించ లేదని తెలుస్తోంది. -
మెదక్ నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారు..!
మెదక్ నియోజకవర్గం మెదక్ నియోజకవర్గం నుంచి టిఆర్ఎస్ నేత పద్మాదేవేందర్ రెడ్డి మూడోసారి గెలుపొందారు.ఆమె గతంలో ఒకసారి రామాయంపేట(2009లో రద్దయింది) నుంచి , రెండుసార్లు మెదక్ నుంచి గెలుపొందారు. 2018లో ఆమె తన సమీప ప్రత్యర్ది, కాంగ్రెస్ అభ్యర్ది ఉపేందర్ రెడ్డిపై 44609 ఓట్ల ఆదిక్యతతో విజయం సాధించారు. 2014లో గెలిచిన తర్వాత ఆమె డిప్యూటి స్పీకర్ పదవి పొందారు. కాని 2018లో గెలిచాక పదవి దక్కలేదు. పద్మా దేవేందర్ రెడ్డికి 92176ఓట్లు రాగా, ఉపేందర్ రెడ్డికి 47567 ఓట్లు వచ్చాయి. రెడ్డి సామాజికవర్గానికి చెందిన పద్మ మొదటి నుంచి తెలంగాణ ఉద్యమ నేతగా గుర్తింపు పొందారు.కాగా ఇక్కడ నుంచి ఎస్.ఎఫ్ బి అభ్యర్ది గా పోటీచేసిన వినయ్ సాగర్ సుమారు ఏడువేల ఓట్లు తెచ్చుకున్నారు. ప్రముఖ నటి, మెదక్ నుంచి 2009లో టిఆర్ఎస్ తరపున ఎమ్.పిగా గెలిచిన విజయశాంతి 2014లో మెదక్ అసెంబ్లీ స్థానానికి పోటీచేసి ఓడిపోయారు. టిఆర్ఎస్ తో వచ్చిన విభేదాల కారణంగా ఆమె కాంగ్రెస్ ఐలో చేరి పోటీచేసి పరాజయం పాలయ్యారు. టిఆర్ఎస్ నేత పద్మ దేవేందర్ రెడ్డి మెదక్ లో విజయశాంతిని 39600 ఓట్ల ఆధిక్యతతో ఓడిరచారు. పద్మ 2004లో రామాయంపేట నుంచి గెలుపొందారు. తెలంగాణ ఉద్యమంలో భాగంగా 2008లో తన పదవికి రాజీనామా చేసి,ఉప ఎన్నికలో పోటీచేసి ఓడిపోయారు. ఆ తర్వాత 2009లో సాధారణ ఎన్నికలో టిడిపి,టిఆర్ఎస్ , సిపిఐ,సిపిఎం లు మహాకూటమి ఏర్పాటు కారణంగా ఆమెకు టిక్క్ ట్ రాలేదు.దాంతో ఆమె తిరుగుబాటు అభ్యర్ధిగా రంగంలో దిగి ఓడిపోయారు. కాని ఆ తర్వాత కొద్ది కాలానికి పార్టీలో తిరిగి చేరి మళ్లీ 2014లో మెదక్ నుంచి పోటీచేసి గెలిచారు. .మెదక్ లో ఇంతవరకు ఆరుసార్లు రెడ్డి సామాజికవర్గం నేతలు ఎమ్మెల్యేలుగా ఎన్నిక కాగా, ఒకసారి వెలమ, ఆరుసార్లు బ్రాహ్మణ , మూడు సార్లు ఇతర వర్గాల నేతలు ఎన్నికయ్యారు. 2008లో రామాయంపేటకు జరిగిన ఉప ఎన్నిక ద్వారా శాసనసభలో ప్రవేశించిన మైనంపాటి హనుమంతరావు 2009 ఎన్నికలో మెదక్ నుంచి టిడిపి పక్షన పోటీ చేసి విజయం సాధించారు. 2008లో రామాయంపేట నుంచి పోటీ చేసి డీలిమిటేషన్ తరువాత ఆ నియోజకవర్గం రద్దు కావడంతో 2009లో మెదక్ నుంచి రంగంలో దిగారు. సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన పి. శశిధర్‌రెడ్డిని ఈయన ఓడిరచారు.తదుపరి 2014లో ఎన్నికలలో ఆయన టిఆర్ఎస్ లో చేరి మల్కాజిగిరినుంచి లోక్ సభకు పోటీచేసి ఓడిపోయారు. 1952లో ఏర్పడిన మెదక్ అసెంబ్లీ స్థానానికి ఒక ఉప ఎన్నికతో సహా 16 సార్లు ఎన్నికలు జరిగితే ఐదుసార్లు కాంగ్రెస్, కాంగ్రెస్ ఐలు, ఆరుసార్లు టిడిపి, రెండుసార్లు టిఆర్ఎస్, ఒకసారి సిపిఐ, ఒకసారి జనతా (కాంగ్రెస్ టికెట్ రాకపోతే తిరుగుబాటు చేసి జనతాటిక్కెట్పై శశిధర్‌రెడ్డి గెలిచారు) పార్టీ గెలుపొందాయి. ఒకసారి ఇండిపెండెంటు కూడా నెగ్గారు. టిడిపి నేత కరణం రామచంద్రరావు ఇక్కడ నుంచి నాలుగుసార్లు టిడిపి పక్షాన గెలిచారు. ఒకసారి ఇండిపెండెంటుగా నెగ్గారు. కరణం మరణం తరువాత జరిగిన ఉప ఎన్నికలో ఆయన భార్య కరణం ఉమాదేవి గెలుపొందారు. కరణం రామచంద్రరావు గతంలో ఎన్టిఆర్ క్యాబినెట్‌లోను, చంద్రబాబు క్యాబినెట్‌లోను పనిచేసారు. 1989లో గెలిచిన పి.నారాయణరెడ్డి 2004లో గెలుపొందిన శశిధర్‌రెడ్డి తండ్రి, కొడుకులు. 2009లో రద్దు అయిపోయిన రామాయంపేట నియోజకవర్గానికి 14సార్లు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్, కాంగ్రెస్ ఐలు కలిసి ఎనిమిదిసార్లు, టిడిపి రెండుసార్లు బిజిపి, పిడిఎఫ్, టిఆర్ఎస్లు ఒక్కోసారి గెలుపొందగా, ఒక ఇండిపెండెంట్ కూడా నెగ్గారు. 1953లో జరిగిన ఉప ఎన్నికలో ప్రముఖ సిపిఐ నాయకుడు ఆరుట్ల రామచంద్రారెడ్డి గెలుపొందారు. ఇదే సమయంలో ఈయన భార్య కమలాదేవి ఆలేరు నుంచి గెలుపొందారు. 1962లో సైతం వీరిద్దరూ ఒకరు భువనగిరి నుంచి మరొకరు ఆలేరు నుంచి గెలుపొందారు. కాంగ్రెస్ ప్రముఖుడు టి.అంజయ్య 1981లో రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యాక రామాయంపేట నుంచి ఏకగ్రీవంగా ఎన్నికవడం విశేషం. ఈయన కోసం అప్పటి ఎమ్మెల్యే ఆర్.ముత్యంరెడ్డి తన పదవికి రాజీనామా చేసారు. 2004లోటిఆర్ఎస్ పక్షాన గెలిచిన పద్మాదేవేందర్‌రెడ్డి, 2008లో టిఆర్ఎస్ తెలంగాణ వ్యూహంలో భాగంగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసారు. ఆ తరువాత జరిగిన ఉప ఎన్నికలో టిడిపి నేత హనుమంతరావు చేతిలో ఆమె ఓటమిపాలయ్యారు. ఇక్కడ పదకుండు సార్లు రెడ్లు గెలుపొందారు. ఒకసారి వెలమ గెలుపొందగా, ఇద్దరు ఇతర వర్గాలవారు విజయం సాధించారు. మెదక్ నియోజకవర్గంలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే.. -
శుభకార్యానికి వెళ్లి వస్తుండగా...
కొల్చారం(నర్సాపూర్): ఆర్టీసీ బస్సును కారు ఢీకొన్న ఘటనలో ఇద్దరు మృతి చెందగా, నలుగురికి తీవ్రగాయాలు అయ్యాయి. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. కొల్చారం ఎస్ఐ శ్రీనివాస్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం..పాపన్నపేట మండలం ఎల్లాపూర్ గ్రామంలోని ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు హత్నూర మండలం దౌల్తాబాద్‌లో శుభకార్యం ఉండగా, శుక్రవారం ఉదయం కారులో బయలుదేరారు. శుభకార్యం ముగిశాక అదే కారులో తిరుగు పయనమయ్యారు. అయితే వీరు ప్రయాణిస్తున్న కారు మెదక్– నర్సాపూర్ ప్రధాన రహదారిపై కొల్చారంలోని జైన్ మందిర్ సమీపంలోకి రాగానే మెదక్ నుంచి జేబీఎస్‌కు వెళుతున్న మెదక్ డిపోనకు చెందిన ఆర్డినరీ బస్సును ముందు నుంచి ఢీ కిట్టింది. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం పూర్తిగా దెబ్బతిన్నది. కారు నడుపుతున్న టేక్మాల్ నాగరాజుగౌడ్ (30) ఘటన స్థలంలోనే అక్కడిక్కడే మృతి చెందాడు. ఇదే కారు ప్రయాణిస్తున్న టేక్మాల్ దుర్గా గౌడ్ – లావణ్య దంపతుల కూతురు టేక్మాల్ హర్షిత (2)కు తీవ్ర గాయాలై రక్తస్రావం జరిగింది. కొన ఊపిరితో ఉన్న చిన్నారితో పాటు గాయపడిన వారిని 108లో నర్సాపూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా, మార్గమధ్యలో మృతి చెందింది. దంపతులు దుర్గాగౌడ్, లావణ్యలతోపాటు రామమ్మ, చంటికి గాయాలయ్యాయి. వీరిలో దుర్గాగౌడ్, లావణ్య రామమ్మ పరిస్థితి విషమంగా ఉంది. మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలించారు. మృతదేహాలకు మెదక్ ప్రభుత్వాస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించగా, బాధిత కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ తెలిపారు. కారు అతివేగంగా నడపడంతోనే ఈ ప్రమాదం చోటు చేసుకుందని, బస్సులో ప్రయాణిస్తున్న ప్రత్యక్ష సాక్ష్య ుఽులు తెలిపారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి ఆస్పత్రి వద్దకు చేరుకొని రాజు భార్యను ఓదార్చే క్రమంలో కంటతడి పెట్టారు. రూ. 20 వేలు బాధిత కుటుంబానికి అందజేశారు. -
మాకు ‘పోటీ’ లేదు
నేనూ రైతునే.. కాపుదనపు బిడ్డనే.. నా పొలంలోనూ మోటార్లు కాలిపోయాయి. కాంగ్రెస్, టీడీపీ పాలనలో కరెంటు కోసం తీవ్ర ఇబ్బందులు పడ్డం. వాళ్ల పాలనలో ప్రజలను ఏడిపించారు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో వ్యవసాయం, పరిశ్రమలతోపాటు అన్ని రంగాలకు 24 గంటల కరెంటు సరఫరా చేస్తున్నం. కరెంటు సరఫరాలో దేశంలోనే తెలంగాణ నంబర్‌వన్ స్థానంలో ఉంది. సాక్షి, మెదక్: మెదక్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీకి పోటీయేలేదని, లక్ష మెజార్టీతో పద్మాదేవేందర్‌రెడ్డిని గెలిపిస్తే ఉన్నతమైన స్థానం ఆమెకు లభిస్తుందని టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం మెదక్‌లో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు దేవేందర్‌రెడ్డి అధ్యక్షతన ప్రజా ఆశీర్వాద బహిరంగసభ జరిగింది. ఈ సభలో కేసీఆర్ మాట్లాడుతూ పద్మాదేవేందర్‌రెడ్డి చురుగ్గా పనిచేసే మహిళా నాయకురాలని, పద్మాదేవేందర్‌రెడ్డిని మళ్లీ గెలిపిస్తే మెదక్‌ను వరుసబెట్టి అభివృద్ధి చేసే బాధ్యత తాను తీసుకుంటానన్నారు. మెదక్‌లో ఇది వరకే కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు సాగుతున్నట్లు వివరించారు. నూతన కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాల నిర్మాణాల దశల్లో ఉన్నాయన్నారు. టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే మెదక్‌కు మెడికల్, ఇంజినీరింగ్ కాలేజీలు వస్తాయని హామీ ఇచ్చారు. ప్రత్యేక కార్యక్రమాలతో ముందుకు.. 2014 ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగానే తాను మెదక్ జిల్లాను ఏర్పాటు చేశానని గుర్తు చేశారు. కేసీఆర్ సీఎం కాకపోయుంటే జన్మలో మెదక్ జిల్లా ఏర్పాటు అయ్యేది కాదన్నారు. కాంగ్రెస్, టీడీపీ పార్టీలు ఘనపురం ప్రాజెక్టును నిర్లక్ష్యం చేశాయన్నారు. గతంలో తాను మంత్రిగా ఉన్న సమయంలో ఘనపురం కాల్వల దుస్థితిని కళ్లారా చూసి వాటిని అభివృద్ధి చేసే కొత్త ప్రయత్నం చేసినట్లు చెప్పారు. టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఘనపురం ప్రాజెక్టును, కాల్వలను అభివృద్ధి చేసినట్లు వివరించారు. త్వరలోనే కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తవుతుందన్నారు. వచ్చే ఏడాది జూన్ నెలలో కాళేశ్వరం నీళ్లు జిల్లాకు వస్తాయన్నారు. ఎమ్మెల్యే అభ్యర్థులు పద్మాదేవేందర్‌రెడ్డి, మదన్‌రెడ్డి, మైనింగ్ కార్పొరేషన్ చైర్మన్ శేరి సుభాష్‌రెడ్డి కోరిక మేరకు మంజీరా నదిపై 14 చెక్‌డ్యామ్‌లు మంజూరు చేసినట్లు చెప్పారు. రైతుబంధు పథకం ద్వారా రైతులకు పెట్టుబడి సాయం అందజేస్తున్నట్లు చెప్పారు. పింఛన్లు మొత్తాన్ని రూ.2016 కు పెంచనున్నట్లు వివరించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అన్నివర్గాల అభివృద్ధి, సంక్షేమం కోసం కృషి చేసిందన్నారు. బలహీనవర్గాలు దళితులు, గిరిజనుల కోసం ప్రత్యేక కార్యక్రమాలు రూపకల్పన చేస్తున్నామన్నారు. ముస్లిం పిల్లల కోసం రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటు చేసినట్లు వివరించారు. సమావేశంలో నీటిపారుల శాఖ మంత్రి హరీశ్‌రావు, జెడ్పీచైర్మన్ రాజమణి మురళీయాదవ్, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పద్మాదేవేందర్‌రెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే అభ్యర్థి మదన్‌రెడ్డి, మైనింగ్ కార్పొరేషన్ చైర్మన్ శేరి సుభాష్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కరణం ఉమాదేవి, ముత్యంరెడ్డి, టీఆర్ఎస్ నేతలు దేవేందర్‌రెడ్డి, మురళీయాదవ్, మున్సిపల్‌చైర్మన్ మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు. మళ్లీ వచ్చేది మన ప్రభుత్వమే: పద్మాదేవేందర్‌రెడ్డి గత ఎన్నికల్లో జిల్లా కేంద్రం ఏర్పాటు చేస్తానని హామీ నిచ్చిన కేసీఆర్ మాట నిలబెట్టుకున్నారని పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. అలాగే జిల్లా కేంద్రంతోపాటు కలెక్టరెట్‌ను మంజూరు చేశారని తెలిపారు. మహా కూటమి కుమ్ములాటలతోనే ఉందన్నారు. ఆ కూటమిలో నుంచి ఎవరు నిలబడ్డారో వారికే తెలియడం లేదన్నారు. అలాంటి కూటమికి అడ్రస్ లేకుండా తరిమి కొట్టాలన్నారు. అక్కా చెలెల్లు, అన్నా దమ్ములు ఆశీర్వదించి మరోసారి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్ శేరి సుభాష్‌రెడ్డి, జెడ్పీచైర్మన్ రాజమణి, మాజీ ఎమ్మెల్యేలు ముత్యంరెడ్డి, కరుణం ఉమాదేవి, మెదక్ మున్సిపల్‌చైర్మన్ మల్లికార్జున్‌గౌడ్, రాష్ట్ర నాయకులు దేవేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మెదక్ అర్బన్: సాయంత్రం 4 గంటలకు రావాల్సిన టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సాయంత్రం 5.49 గంటలకు వచ్చారు. కేసీఆర్ వస్తున్న హెలీక్యాప్టర్‌ను చూసి ప్రజలు, కార్యకర్తల నినాదాలు, చప్పట్లు, ఈలలతో కేరింతలు కొట్టారు సభావేదిక మీదకు కేసీఆర్ 5.56 గంటలకు చేరుకొని... 5.58 గంటలకు తన ప్రసంగాన్ని ప్రారంభించారు. కేసీఆర్ కేవలం 15 నిమిషాలు మాత్రమే ప్రసంగించారు. కేసీఆర్ సభా వేదిక వద్దకు చేరుకోగానే మెదక్ టీఆర్ఎస్ అభ్యర్థి పద్మా దేవేందర్‌రెడ్డి కేసీఆర్‌కు పాదాభివందనం చేశారు. కేసీఆర్ హెలీక్యాప్టర్ దిగగానే మాజీ మంత్రి హరీష్‌రావు, టీఆర్ఎస్ అభ్యర్థి పద్మా దేవేందర్‌రెడ్డి హెలీప్యాడ్ వద్దకు పరుగెత్తుకు వెళ్ళి వేదిక వద్దకు తీసుకువచ్చారు. కేసీఆర్ పద్మ నా బిడ్డ... 2014 ఎన్నికల్లో గెలిపించారు. మళ్లీ గెలిపించండి అని అనడంతో కార్యకర్తలు, అభిమానులు గట్టిగా నినాదాలు చేశారు. ప్రజా ఆశీర్వాద సభకు మహిళలు భారీ సంఖ్యలో హాజరయ్యారు. సభ ప్రారంభానికి ముందు వేదికపై కళాకారుల ఆటపాటలు సభికులను ఆకట్టుకున్నాయి. వీరు మెదక్ అభివృద్ధిపై పాటలు పాడి అలరించారు. టీఆర్ఎస్ పట్టణ శాఖ అధ్యక్షులు మందుగుల గంగాధర్ వేదికపై పాడిన పాటలు అలరించాయి. చిన్నశంకరంపేట మండలం రామాయిపల్లి నుంచి బోనంతో వచ్చిన మహిళ సభలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. పద్మాదేవేందర్‌రెడ్డి కోడలు దీపిక, తల్లిదండ్రులతో కలిసి టీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభకు వచ్చారు. మెదక్ టీఆర్ఎస్ అభ్యర్థి పద్మా దేవేందర్‌రెడ్డి మాజీ మంత్రి కరణం రామచంద్రారావు సతీమణి కరణం ఉమాదేవిని స్వయంగా వేదికపైకి తీసుకెళ్లారు. ‘‘కాళేశ్వరం నీళ్లు వస్తే హల్ధీ, మంజీరాలు ఎన్నటికీ ఎండిపోవు. ఆ నీళ్లతో తూర్పుగోదావరి, డెల్టా ప్రాంతలకంటే మెదక్ బ్రహ్మాండంగా అభివృద్ధి జరుగుతుంది. ఇది జరిగితే బంగారు తెలంగాణ వచ్చినట్లే.’’ ‘‘రైతులు, ప్రజలకు మేలు చేసే పార్టీని గెలిపించాలి. పొరపాటున కాంగ్రెస్ అ«ధికారంలోకి వస్తే కరెంటు ఆగమైతది. తాగు, సాగునీరులో ఇబ్బందులు వస్తయి. ఎన్నికల సమయంలో ఎవరో ఏదో చెబితే ప్రజలు నమ్మొద్దు. మెదక్ ప్రజలు టీఆర్ఎస్ అభ్యర్థి పద్మాదేవేందర్‌రెడ్డిని అధిక మెజార్టీతో గెలిపించాలి.’’ ‘‘ఎన్నికల్లో ఏం ఫలితం వస్తుందోనని మెదక్ నియోజకవర్గంలో సర్వే చేయించిన. పద్మాదేవేందర్‌రెడ్డికి 64 శాతం అనుకూలత ఉంటే, ఇతరులకు 20 నుంచి 30 శాతం ఉంది. మెదక్‌లో ప్రత్యక్షంగా పోటీ ఉన్నప్పుడే అలా ఉంటే.. ఇప్పుడే జోకర్, బ్రోకర్ కథ అయ్యింది. పద్మను లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపించాలి.’’ -
‘మెదక్’లో ఒక్కడు
సాక్షి, మెదక్: అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ సోమవారం విడుదలైంది. విడుదలైన వెంటనే మెదక్, నర్సాపూర్ నియోజకవర్గాల్లో ఎన్నికల రిటర్నింగ్ అధికారులు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభించారు. మొదటి రోజు జిల్లాలో ఒకే ఒక్క నామినేషన్ దాఖలయింది. మెదక్ అసెంబ్లీ నియోకజవర్గంనుంచి పోటీకి బీఎల్ఎఫ్ అభ్యర్థి దూడ యాదేశ్వర్ నామినేషన్ వేశారు. నర్సాపూర్ నియోజకవర్గంలో మొదటి రోజు ఎలాంటినామినేషన్లు దాఖలు కాలేదు. యాదేశ్వర్ మెదక్ పట్టణంలోని బీఎల్ఎఫ్ కార్యాలయం నుంచి ర్యాలీగా రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయానికి వచ్చారు. రిటర్నింగ్ ఆఫీసర్ వీరబ్రహ్మచారికి నామినేషన్ పత్రాలనుఅందజేశారు. ఆయన వెంట బీఎల్ఎఫ్ నాయకులు చుక్క రాములు తదితరులు ఉన్నారు. అయితే నామినేషన్లు వేసేందుకు ఎమ్మెల్యే అభ్యర్థులు మంచి ముహుర్తాలు వెతుక్కుంటున్నారు. సిద్ధాంతులనుసంప్రదించి తమ జాతకాలకు అనుగుణంగా మంచి రోజులను తెలుసుకుంటున్నారు. నామినేషన్లు వేసేందుకు ఈనెల 14, 18, 19 తేదీల్లో అనుకులంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఆయా తేదీల్లోనామినేషన్లు వేసేందుకు అభ్యర్థులు సిద్ధం అవుతున్నారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈనెల 14న గజ్వేల్‌లో నామినేషన్ వేయనున్నారు. 14న పద్మాదేవేందర్‌రెడ్డి తరఫున నాయకులు నామినేషన్ వేయనున్నారు. 19న పద్మాదేవేందర్‌రెడ్డి నామినేషన్ దాఖలు చేసేందుకు సిద్ధం అవుతున్నారు. నర్సాపూర్ ఎమ్మెల్యే అభ్యర్థి మదన్‌రెడ్డి సైతం 14, 19 తేదీల్లో నామినేషన్లు వేయనున్నట్లు తెలుస్తోంది. -
వ్యూహం ఏమిటో?
టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రక్రియలో అన్ని విషయాల్లో ఒక అడుగు ముందుగానే ఉంటోంది. ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించినట్లుగానే, నామినేషన్లు కూడా ముందుగానే వేసేందుకు అభ్యర్థులు ఏర్పాట్లు చేసుకుంటు న్నారు. టీఆర్ఎస్ భవన్లో జరిగే నేటి అభ్యర్థుల సమావేశంలోనే మెదక్ అభ్యర్థి పద్మాదేవేందర్‌రెడ్డి, నర్సాపూర్ అభ్యర్థి మదన్ రెడ్డికి బీఫామ్‌లు ఇస్తారని తెలుస్తోంది. నోటిఫికేషన్ వెలువడిన వెంటనే జిల్లాలో నామినేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది. అలాగే ఈ సమావేశంలో అభ్యర్థుల ప్రచారాలు, వ్యూహాలపై అభ్యర్థులతో చర్చించనున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ సమావేశం ఏలా సాగుతుందోనని అభ్యర్థుల్లో ఉత్కంఠ నెలకొంది. సాక్షి, మెదక్ : టీఆర్ఎస్ అధినేత, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎమ్మెల్యే అభ్యర్థులతో ఆదివారం టీఆర్ఎస్ భవన్లో భేటీ కానున్నారు. ఈ భేటీలో కేసీఆర్ ఎమ్మెల్యే అభ్యర్థులతో ముఖాముఖిగా మాట్లాడటంతోపాటు ఎన్నికల ప్రచారం, వ్యూహాలపై దిశానిర్దేశం చేయనున్నారు. అలాగే నియోజకవర్గాల వారీగా అభ్యర్థుల బలాబలాలు, ప్రచార తీరుతెన్నులపై ఇంటలిజెన్స్ నివేదికలను తెప్పించుకున్నట్లు తెలుస్తోంది. అలాగే పార్టీ వర్గాల ద్వారా వివరాలు తెప్పించుకున్నట్లు సమాచారం. దీంతో ఆదివారం టీఆర్ఎస్ అధినేత నిర్వహించబోయే సమావేశం ఎలా సాగుతోందనన్న ఉత్కంఠ ఎమ్మెల్యే అభ్యర్థుల్లో నెలకొంది. ఎన్నికల నోటిఫికేషన్ కూడా సోమవారం విడుదల కానుంది. టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులను ముందుగానే ప్రకటించిన కేసీఆర్ బీఫామ్‌ల అందజేతలో కూడా ముందుండాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీని దృష్ట్యా నోటిఫికేషన్ వెలువడటానికి ఒకరోజు ముందుగానే ఆదివారం అభ్యర్థులతో హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో సమావేశం కానున్నారు. ఈ సమావేశానికి మెదక్ ఎమ్మెల్యే అభ్యర్థి పద్మాదేవేందర్‌రెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే అభ్యర్థి మదన్‌రెడ్డి హాజరుకానున్నారు. ఈ సమావేశంలో ఈ ఇద్దరు అభ్యర్థులకు బీఫామ్‌లు అందజేయటంతోపాటు ఎన్నికల వ్యూహాంపై దిశానిర్ధేశం చేయనున్నట్లు సమాచారం. సలహాలు, సూచనలు.. ఉమ్మడి మెదక్ జిల్లా సీఎం కేసీఆర్ సొంత జిల్లా కావడంతో జిల్లా ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది. కేసీఆర్ పోటీ చేస్తున్న గజ్వేల్ నియోకవర్గంలోని రెండు మండలాలు మెదక్ జిల్లాలో ఉన్నాయి. దీంతో జిల్లాలో చోటు చేసుకుంటున్న రాజకీయాలు పరిణామాలు, టీఆర్ఎస్ అభ్యర్థుల ప్రచారం తీరుతెన్నులపై సీఎం కేసీఆర్ ఓ కన్నువేసి ఉంచినట్లు తెలుస్తోంది. మెదక్, నర్సాపూర్ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే అభ్యర్థులు పద్మాదేవేందర్‌రెడ్డి, మదన్‌రెడ్డిలు ఎన్నికల ప్రచారంపై ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుంటున్నట్లు కూడా తెలుస్తోంది. పార్టీ శ్రేణుల్లో అసంతృప్తులు, ప్రచారంలో ఎదురవుతున్న నిరసనలు, ఎమ్మెల్యే అభ్యర్థులు నిర్లక్ష్యం చేస్తున్న అంశాలపై కేసీఆర్ రహాస్య నివేదికలు తెప్పించుకున్నట్లు సమాచారం.ఆదివారం జరిగే సమావేశంలో కేసీఆర్ నివేదికలను అభ్యర్థుల ఎదుట ఉంచనున్నట్లు తెలుస్తోంది. మెదక్, నర్సాపూర్ నియోజకవర్గాల్లో అభ్యర్థుల బలాలు, బలహీనతలు ఎత్తిచూపుతూనే, ఎన్నికల్లో గెలుపుకోసం అనుసరించాల్సిన వ్యూహాలపై కేసీఆర్ సూచనలు చేయనున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు మెదక్, నర్సాపూర్ నియోజకవర్గాల్లో సీఎం కేసీఆర్ ప్రచార తేదీలపై చర్చించనున్నట్లు సమాచారం. సీఎం కేసీఆర్ మెదక్, నర్సాపూర్ నియోజకవర్గ కేంద్రాల్లో బహిరంగ సభల్లో పాల్గొనడంతోపాటు రోడ్‌షోలు నిర్వహించే అవకాశం కూడా ఉంది. సీఎం కేసీఆర్ ప్రచారానికి వస్తే ఎన్నికల్లో పార్టీకి మరింత ఊపు వస్తుందని ఎమ్మెల్యే అభ్యర్థులు భావిస్తున్నారు. దీంతో సీఎం కేసీఆర్ ప్రచార సభలపై చర్చించి తేదీలపై నిర్ణయం తీసుకోనున్నారు. -
ఇంకా అయోమయమే!
ఎన్నికల నోటిఫికేషన్ రెండు రోజుల్లో విడుదల కానుంది. టీఆర్ఎస్, బీఎల్ఎఫ్ మినహా ప్రధాన రాజకీయ పార్టీలు ఇంకా అభ్యర్థులను ప్రకటించలేదు. మెదక్, నర్సాపూర్ నియోజకవర్గాల నుంచి మహాకూటమి, బీజేపీ నుంచి ఎవరు ఎన్నికల బరిలో ఉంటారన్న ఉత్కంఠ ఇంకా కొనసాగుతూనే ఉంది. కాంగ్రెస్ పార్టీ శనివారం అభ్యర్థుల జాబితాను ప్రకటించనుంది. దీంతో అందరి దృష్టి పీసీసీ ప్రకటించబోయే జాబితాపైనే ఉంది. నర్సాపూర్ నియోజకవర్గం నుంచి పోటీ లేనందున తొలి అభ్యర్థుల జాబితాలో సునీతాలక్ష్మారెడ్డి పేరు ఉండనుంది. మెదక్ అసెంబ్లీ స్థానంపై ఇంకా ప్రతిష్టంభన కొనసాగుతోంది. మహాకూటమిలో భాగంగా మెదక్ అసెంబ్లీ స్థానాన్ని టీజేఎస్ కోరుతోంది. ఎట్టిపరిస్థితుల్లో టీజేఎస్‌కే దక్కుతుందని, వదులుకునేందుకు కాంగ్రెస్ అధిష్టానం అంగీకరించినట్లు ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి జనార్ధన్‌రెడ్డి అంటున్నారు. కాంగ్రెస్ నాయకులు మాత్రం మెదక్ అసెంబ్లీ స్థానం ఎట్టిపరిస్థితుల్లో వదులుకునేది లేదంటున్నారు. సాక్షి, మెదక్ : నేడు ప్రకటించనున్న కాంగ్రెస్ అభ్యర్థుల తొలి జాబితాతో జిల్లాలో కొంత క్లారిటీ వచ్చే అవశాశం ఉంది. అయితే అందరి దృష్టి మాత్రం మెదక్ టికెట్‌పై ఉంది. మాజీ ఎంపీ, స్టార్ క్యాంపెయినర్ విజయశాంతి శుక్రవారం సాయంత్రం హైదరాబాద్‌లో మెదక్ ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్న నాయకులతో సమావేశమయ్యారు. ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్న కాంగ్రెస్ నేతలు బట్టి జగపతి, సుప్రభాతరావు, మ్యాడం బాలకృష్ణతోపాటు నియోజకవర్గంలోని ముఖ్యనాయకులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఢిల్లీలో అధిష్టానం పెద్దలతో తాను జరిపిన చర్చల వివరాలను నేతలకు వివరించారు. మహాకూటమిలో భాగంగా టీజేఎస్‌కు మెదక్ స్థానం కేటాయించారని జరుగుతున్న ప్రచారాన్ని విశ్వసించొద్దని, కాంగ్రెస్ పోటీ చేయటం ఖాయమని విజయశాంతి చెప్పినట్లు సమాచారం. మెదక్ నుంచి తాను పోటీచేసే అవకాశం లేదని మెదక్ నియోకజవర్గ నాయకులకు సంకేతాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు మాజీ ఎమ్మెల్యే శశిధర్‌రెడ్డి ఢిల్లీలోనూ ఉంటూ టికెట్ కోసం ఇంకా ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నారు. శుక్రవారం కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సభ్యులు ముకుల్ వాస్నిక్, మాజీ కేంద్ర మంత్రి ఏకే ఆంటోనీలను కలిసి మెదక్ టికెట్ ఇప్పించాలని కోరారు. కాంగ్రెస్ టికెట్ దక్కని పక్షంలో రెబెల్‌గానే పోటీచేయాలనే అంశంపై శశిధర్‌రెడ్డి తన మద్దతుదారులతో చర్చిస్తున్నట్లు సమాచారం. 11న బీజేపీ అభ్యర్థుల ప్రకటన బీజేపీ పార్టీ సైతం ఇప్పటి వరకు మెదక్, నర్సాపూర్ ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించలేదు. మెదక్ టికెట్ కోసం నియోజకవర్గ నాయకులు రాంచరణ్‌యాదవ్, కటికె శ్రీనివాస్ తదితరులు ప్రయత్నిస్తున్నారు. రాష్ట్ర నాయకులు ఆకుల రాజయ్య సైతం మెదక్ నుంచి పోటీచేసేందుకు ఆసక్తితో ఉన్నారు. ఆకుల రాజయ్యకు టికెట్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. నర్సాపూర్ నుంచి బీజేపీ నాయకులు గోపీ, రఘువీర్‌రెడ్డి టికెట్ ఆశిస్తున్నారు. వీరిద్దరిలో ఒకరికి టికెట్ దక్కే అవకాశాలు ఉన్నాయి. 11వ తేదీన బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. నామినేషన్లు వేసేందుకు టీఆర్ఎస్.. రెండు రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుండటంతో టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులు నామినేషన్లు వేసేందుకు సిద్ధం అవుతున్నారు. ఈనెల 11వ తేదీన టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మెదక్ , నర్సాపూర్ ఎమ్మెల్యే అభ్యర్థులు పద్మాదేవేందర్‌రెడ్డి, మదన్‌రెడ్డిలకు బీఫామ్ అందజేయనున్నారు. బీఫామ్ అందుకున్న అనంతరం 17, 18, 19 తేదీల్లో వరుసగా మూడుసెట్ల నామినేషన్లు వేసేందుకు పద్మాదేవేందర్‌రెడ్డి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. నర్సాపూర్ ఎమ్మెల్యే అభ్యర్థి మదన్‌రెడ్డి నామినేషన్ ఎప్పుడు వేయాలన్న అంశంపై మద్దతుదారులతో చర్చిస్తున్నారు. 18, 19 తేదీల్లో మదన్‌రెడ్డి కూడా నామినేషన్ వేసే అవకాశాలు ఉన్నాయి -
మెతుకు సీమ ఘన చరిత్ర
మెతుకు సీమకు ఘన చరిత్ర ఉంది. ఇక్కడ శతాబ్దాల కాలం కాకతీయుల పాలన కొనసాగింది. ఇక్కడి నుంచే చారిత్రక ఖిల్లా నిర్మాణాలు ప్రారంభమయ్యాయి. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సీఎస్ఐ చర్చి కూడా ఇక్కడి చరిత్రకు ప్రత్యేక ఆనవాళ్లు. దేశానికి ప్రధాన మంత్రిని అందించి చరిత్రపుటల్లో రాజకీయంగా చెరగని ముద్ర వేసుకుంది మెదక్ నియోజకవర్గం. మెదక్‌లో 1952 నుంచి ఇప్పటివరకు శాసనసభకు 14 సార్లు ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో ఐదు సార్లు కాంగ్రెస్, ఐదు సార్లు టీడీపీలు గెలుపొందాయి. సీపీఐ, ఇండిపెండెంట్, జనతాపార్టీ, టీఆర్ఎస్లు ఒక్కోసారి గెలిచాయి. నియోజకవర్గాల పునర్వవ్యస్థీకరణ అనంతరం చోటుచేసుకున్న మార్పులతో ప్రస్తుతం మెదక్, రామాయంపేట మున్సిపాలిటీలతో పాటు మెదక్, హవేళిఘణాపూర్, నిజాంపేట, చిన్నశంకరంపేట, రామాయంపేట, పాపన్నపేట మండలాలుగా విస్తరించింది. 2004 ఎన్నికల ముఖ చిత్రం పన్నెండో శాసనసభ (2004–09)కు జరిగిన ఎన్నికల్లో మెదక్ జిల్లాలో తెలుగుదేశం పార్టీకి కోలుకోలేని షాక్ తగిలింది. వైఎస్ నేతృత్వంలోని కాంగ్రెస్, టీఆర్ఎస్, కమ్యూనిస్టు పార్టీల కూటమికి ఎదురు నిలిచి కుదేలైంది. ఒక్కటంటే ఒక్క చోట కూడా గెలవలేకపోయింది. పది అసెంబ్లీ స్థానాలకు గాను ఐదు కాంగ్రెస్, నాలుగు టీఆర్ఎస్, జనతా పార్టీ ఒకటి చొప్పున గెలుచుకున్నాయి. సిద్దిపేట నుంచి వరుసగా ఆరోసారి గెలిచి కేసీఆర్ డబుల్ హ్యాట్రిక్ సాధించారు. ఎమ్మెల్యేగా ఎన్నిక కాకుండానే హరీశ్‌రావు వైఎస్ మంత్రివర్గంలో చేరి ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థిగా సిద్దిపేటలో అరంగేట్రం చేసి గెలుపొందారు. మొత్తంగా ఏడు కొత్త ముఖాలు అసెంబ్లీలో అడుగుపెట్టాయి. వైఎస్ కేబినెట్లో జిల్లాకు పెద్దపీట వేశారు. తరువాత జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో సిద్దిపేట, దొమ్మాట, రామాయంపేట నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు జరిగాయి. – సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి మెదక్ నియోజకవర్గ ముఖచిత్రం ఘన చరితకు.. రాజకీయ చతురతకు నిలయం మెతుకుసీమ. కాకతీయుల పాలన నుంచి దేశానికి ప్రధానిని అందించడం వరకు చరగని ముద్ర వేసింది. ఇక్కడి సీఎస్ఐ చర్చి ప్రపంచానికే తలమానికం. 1952 నుంచి ఇప్పటివరకు శాసనసభకు 14 సార్లు ఎన్నికలు నిర్వహించగా ఐదుసార్లు కాంగ్రెస్, ఐదుసార్లు టీడీపీ, సీపీఐ, ఇండిపెండెంట్, జనతాపార్టీ, టీఆర్ఎస్ ఒక్కోసారి గెలుపొందాయి. 1980లో మెదక్ నుంచి ఎంపీగా పోటీ చేసి గెలిచిన ఇందిరాగాంధీ దేశ ప్రధానిగా పదవీబాధ్యతలు స్వీకరించారు. కరణం రామచంద్రారావు అసెంబ్లీకి ఐదుసార్లు ఎన్నికయ్యారు. రెండు పర్యాయాలు మంత్రిగా కొనసాగారు. 2014లో గెలుపొందిన పద్మాదేవేందర్‌రెడ్డి డిప్యూటీ స్పీకర్‌గా పదవీ బాధ్యతలు చేపట్టారు. మెదక్ భౌగోళిక చరిత్ర నియోజకవర్గాల పునర్వివిభజనకు ముందు మెదక్ నియోజకవర్గ రూపురేఖలు మరోలా ఉండేవి. అప్పట్లో మెదక్, పాపన్నపేట, టేక్మాల్, పెద్దశంకరంపేట, రేగోడు, అల్లాదుర్గ్ మండలాలు ఉండగా పునర్విభజన అనంతరం మెదక్ మున్సిపాలిటితో పాటు మెదక్, హవేళిఘణాపూర్, నిజాంపేట, రామాయంపేట, పాపన్నపేట, చిన్నశంకరంపేట మండలాలతోపాటు నూతనంగా ఏర్పాటు అయిన రామాయంపేట మున్సిపాలిటీ మెదక్ నియోజకవర్గంలోకి చేరాయి. మెదక్ నుంచి గెలిచి ప్రధానిగా.. 1980 సంవత్సరంలో మెదక్ నుంచి ఎంపీగా పోటీ చేసి గెలుపొందిన ఇందిరాగాంధీ దేశానికి ప్రధానమంత్రిగా పదవీబాధ్యతలు చేపట్టారు. స్వయంగా దేశనాయకత్వానికే నాయకత్వం అందించిన మెదక్ చరిత్ర రాజకీయ చరిత్రలో చెదరని ముద్రవేసుకుంది. వెంకటేశ్వరరావు రెండుసార్లు.. మెదక్ పట్టణానికి చెందిన వెంకటేశ్వరరావు వరుసగా రెండుసార్లు 1952, 1957 సంవత్సరంలో శాసనసభకు ఎంపికయ్యారు. రెండు సార్లు గెలుపొందిన వ్యక్తిగా మెదక్ చరిత్రలో నిలిచారు. మొదటిసారి గెలిచి డిప్యూటీ స్పీకర్‌గా.. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన అనంతరం మొదటి సారి 2014లో జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ తరఫున మెదక్ నియోజకవర్గం నుంచి పోటీచేసి పద్మాదేవేందర్‌రెడ్డి గెలుపొందారు. ఆమె డిప్యూటీ స్పీకర్‌గా పదవి బాధ్యతలను నిర్వహించారు. ఐదుసార్లు గెలిచిన కరణం.. కరణం రామచంద్రారావు నియోజకవర్గంలో అందరికీ తెలిసిన పేరు. ఆయన పాపన్నపేట మండలం కొత్తపల్లి గ్రామస్తుడు. సాధారణ వ్యవసాయ కుంటుంబంలో జన్మించిన ఆయన మెదక్ నుంచి శాసనసభకు ఐదు సార్లు ఎన్నికయ్యారు. రాష్ట్ర మంత్రిగా రెండు పర్యాయాలు కొనసాగారు. 1972లో స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందిన ఆయన 1983, 1985, 1994, 1999 సంవత్సరాల్లో టీడీపీ తరఫున గెలుపొందారు. రామాయంపేట మండలం మొత్తం ఓటర్లు 28,341 మహిళలు 14,474 పురుషులు 13,867 -
బోనమెత్తిన పద్మక్క
రామాయంపేట(మెదక్):డిప్యూటీ స్పీకర్ పద్మాదేవెందర్‌రెడ్డి ఆదివారం ఆమె స్వగ్రామమైన కోనాపూర్‌లో తన బందువుల వివాహా వేడుకల్లో పాల్గొని బోనం ఎత్తుకున్నారు. ఇతర మహిళలతో కలిసి గ్రామశివారులో ఉన్న ఆలయం వరకు బోనాలు ఎత్తుకొని వెళ్లిన ఆమె అక్కడ ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈసందర్బంగా ఆమె మూడు కిలోమీటర్ల మేర కాలినడకన గట్టు పోచమ్మ ఆలయం వద్దకు వెళ్లారు.