కొల్చారం(నర్సాపూర్): ఆర్టీసీ బస్సును కారు ఢీకొన్న ఘటనలో ఇద్దరు మృతి చెందగా, నలుగురికి తీవ్రగాయాలు అయ్యాయి. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. కొల్చారం ఎస్‌ఐ శ్రీనివాస్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం..పాపన్నపేట మండలం ఎల్లాపూర్ గ్రామంలోని ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు హత్నూర మండలం దౌల్తాబాద్‌లో శుభకార్యం ఉండగా, శుక్రవారం ఉదయం కారులో బయలుదేరారు. శుభకార్యం ముగిశాక అదే కారులో తిరుగు పయనమయ్యారు.
అయితే వీరు ప్రయాణిస్తున్న కారు మెదక్– నర్సాపూర్ ప్రధాన రహదారిపై కొల్చారంలోని జైన్ మందిర్ సమీపంలోకి రాగానే మెదక్ నుంచి జేబీఎస్‌కు వెళుతున్న మెదక్ డిపోనకు చెందిన ఆర్డినరీ బస్సును ముందు నుంచి ఢీ కిట్టింది. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం పూర్తిగా దెబ్బతిన్నది. కారు నడుపుతున్న టేక్మాల్ నాగరాజుగౌడ్ (30) ఘటన స్థలంలోనే అక్కడిక్కడే మృతి చెందాడు. ఇదే కారు ప్రయాణిస్తున్న టేక్మాల్ దుర్గా గౌడ్ – లావణ్య దంపతుల కూతురు టేక్మాల్ హర్షిత (2)కు తీవ్ర గాయాలై రక్తస్రావం జరిగింది.
కొన ఊపిరితో ఉన్న చిన్నారితో పాటు గాయపడిన వారిని 108లో నర్సాపూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా, మార్గమధ్యలో మృతి చెందింది. దంపతులు దుర్గాగౌడ్, లావణ్యలతోపాటు రామమ్మ, చంటికి గాయాలయ్యాయి. వీరిలో దుర్గాగౌడ్, లావణ్య రామమ్మ పరిస్థితి విషమంగా ఉంది. మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలించారు. మృతదేహాలకు మెదక్ ప్రభుత్వాస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించగా, బాధిత కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ తెలిపారు. కారు అతివేగంగా నడపడంతోనే ఈ ప్రమాదం చోటు చేసుకుందని, బస్సులో ప్రయాణిస్తున్న ప్రత్యక్ష సాక్ష్య ుఽులు తెలిపారు.
విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి ఆస్పత్రి వద్దకు చేరుకొని రాజు భార్యను ఓదార్చే క్రమంలో కంటతడి పెట్టారు. రూ. 20 వేలు బాధిత కుటుంబానికి అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment